హిందుత్వంపై పోరాటం ఈనాటిదా?

తేది: September 21, 2017 వర్గం: నా ఏడుపు, వర్తమానం రచన: చరసాల 141 views

అధిపత్య హిందువుల నుండి సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న.. “మీరు హిందూమతాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? క్రైస్తవుల పాపాలు కనపడవా? ముస్లిముల దురాగతాలు కనపడవా?” అని.

కానీ లెఫ్టిస్టులు లేదా వామపక్షవాదులు అని పిలవబడేదేదే వారు మైనారిటీల గురించి, మైనారిటీల హక్కుల గురించి మాట్లాడతారని. వాళ్ళు మతాన్ని బట్టి మైనారిటీలు అవ్వవచ్చు, కులాన్ని బట్టి అవ్వవచ్చు లేదా జీవిస్తున్న ప్రదేశాన్ని బట్టీ అవ్వవచ్చు. హిందూ మెజారిటీ దేశంలో ముస్లిముల హక్కుల గురించి పోటాడేది వాళ్ళే, ముస్లిము మెజారిటీ దేశంలో హిందూ హక్కుల గురించి పోట్లాడేది వాళ్ళే! ఇక్కడ హిందూ మతం మెజారిటీ ప్రజల మతంగా వుంది గనుక అది వామపక్షాల నుండీ, లౌకికవాదుల నుండీ, రాజ్యాంగవాదుల నుండీ ఎక్కువ విమర్షను, పోరాటాన్ని ఎదుర్కోవడం వింత కాదు, సహజాతి సహజం. అలాగని మిగిలిన మతాలను నెత్తికెత్తుకున్నట్టు కాదు, మిగిలిన మతాలను సమర్థించినట్లు కాదు. ఓ మతం వల్లో, కులం వల్లో మైనారిటీలుగా వివక్షను ఎదుర్కొంటున్న ప్రజల పక్షాన మాట్లాడటం అంటే ఆ ప్రజల మతం పక్షాన మాట్లాడటం కాదు. ఇది ఎక్కువ మంది గ్రహించలేకపోతున్నారు.

హిందూ మతంలోని వివక్ష గురించీ, కుల మెట్ల గురించి మాట్లాడినప్పుడల్లా.. ఇదేదో మెకాలే చదువుల ఫలితమని..విదేశీ శక్తుల ప్రోద్భలమని..ఓ వైపు మాట్లాడేవాళ్ళను శత్రువుల్లా చిత్రించడమే గాకుండా..అసలు కులాలే హిందూ మతంలో లేవని, యివి ఆంగ్లేయులు భారత సమాజాన్ని చీల్చడానికి వేసిన ఎత్తులనీ కూడా అంటారు. ఈ మధ్యే ఒకాయన హిందూమతంపై విషం చిమ్మడం వందేళ్ళనుండే మొదలయింది అన్నాడు. నిజం కాదు. హిందూమతం ధర్మంగా స్థిరపడుతున్నప్పటినుండే దానిమీద నిరసనలూ, పోరాటాలూ కూడా ప్రారంబమయ్యాయి.

చార్వాకుడు లేదా లోకాయుత ధర్మం బహుశా వేదాలను, వేద ధర్మాన్ని వ్యతిరేకించిన తొలి నిరసన కావచ్చు.
రెండువేల సంవత్సరాల కంటే పూర్వమే బౌద్దాన్ని నెలకొల్పిన బుద్దుడిదీ హైందవం మీద నిరసనా, తిరుగుబాటే!
బుద్దిడి తర్వాత మరో వెయ్యేండ్లకు బసవ తత్వం నెలకొల్పిన బసవన్నదీ హైందవం మీది తిరుగుబాటే!
పధ్నాలుగు, పదిహేనో శతాబ్దాల్లో భక్తి వుద్యమాన్ని నడిపిన కబీరూ, తుకారాం, మీరా.. లాంటి కవులు హిందూమతంలోని అనాచారాల మీద గొంతెత్తినవారే!
పదిహేడో శతాబ్దపు మన వేమన చేసినదీ తిరుగుబాటే, నిరసనే!
యిక స్వాతంత్య్ర పోరాటం మొదలయ్యాక సామాజిక మార్పు కోసం, హిందూ కుల వివక్షల మీద పోరాటం చేసిన పూలే దంపతుల నుండీ..అంబేద్కర్ వరకూ ..

పోరాటం జరుగుతూనే వుంది. జరుగుతూనే వుంటుంది.

పోరాటం ఆగిపోవడం అనేది అన్యాయం ఆగిపోవడంతోనే సాధ్యం. ఒకరు చెబితేనో, ప్రోత్సహిస్తేనో జరిగే పోరాటం గుప్పున మండి ఆరిపోవచ్చేమో గానీ శతాబ్దాల తరబడి జరగదు. శతాబ్దాల తరబడీ పోరాటం జరుగుతోందంటే పోరాటం విఫలమయినట్లూ కాదు, అన్యాయం జరగనట్లూ కాదు.

పోరాటం జరుగుతుండటమే ఒక విజయం.

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'హిందుత్వంపై పోరాటం ఈనాటిదా?' పై 1 అభిప్రాయము

'హిందుత్వంపై పోరాటం ఈనాటిదా?'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. real indian అభిప్రాయం,

    తేది: October 31, 2017 సమయము: 10:50 am

    హరిబాబు యజమానైన యూజీ శ్రీరాం అనే సన్నాసిగురించేనా మీరు మాట్లేడేదీ?

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో