కొత్త కులాలు పుడుతున్నాయా?

తేది: August 8, 2014 వర్గం: వర్గీకరింపబడనివి రచన: చరసాల 2,756 views

గత నెల భారత సందర్శనలో నేను గమనించిన వాటిలో ఇదొకటి. వున్న కులాలు వాటి మధ్య సంబంధాలు వేల ఏళ్ళుగా స్థిరపడిపోయిన మన భారతంలో వున్నవి సమసిపోక పోగా కొత్తవి పుడుతున్నాయా అన్న అనుమానం ఆవేదనా కలిగింది.

ఆ వూరికీ, ఈ వూరికీ తిరగడానికి అవసరాన్ని బట్టి వాహనం కుదుర్చుకోవడం జరిగింది. గంటల తరబడి ఆ వాహన చోదకుడితో కలిసే ప్రయాణించినా, తోటి మనిషిగా మాటామంతీ ముచ్చటించినా భోజనాదుల దగ్గరికి వచ్చేటప్పటికి అతని పంక్తి వేరు, పళ్ళెం వేరు ఇంకా ఒక్కోసారి భోజనమూ వేరు అవడాన్ని గమనించాను.

ఒకప్పుడు కులాన్ని అడిగి తెలుసుకొని తమకంటే తక్కువ కులమయితే ఒకలా, తమతో సమానమో, ఎక్కువో అయితే ఒకలా చూసేవాళ్ళు. అయితే ఇప్పుడు డ్రైవరు కులమేదని ఎవ్వరూ అడగట్లేదు గానీ “డ్రైవరు” అన్నదే ఒక కులంగా చూస్తున్నారు. డ్రైవరుది ఏ కులమయినా కావచ్చు, అతనికి అందరిలో కాకుండా ప్రత్యేకంగా వడ్డిస్తున్నారు.

వేల ఏళ్ళ క్రితం ఇలాగే వృత్తిని బట్టి కులాలూ, వాటితో పాటే అంటరానితనం వగైరాలూ పుట్టివుంటాయా?

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'కొత్త కులాలు పుడుతున్నాయా?' పై 1 అభిప్రాయము

'కొత్త కులాలు పుడుతున్నాయా?'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. venkataramana అభిప్రాయం,

    తేది: August 11, 2014 సమయము: 11:54 am

    చాలా బాగా చెప్పావు. నీ విష్లేషన నిజమేననిపిస్తున్నది. మానవత్వ విలువలు అలా వున్నాయి. మనదేషంలో.నాకు గత సంవత్సరం షిర్డీ యాత్రలో జరిగిన ఇంకో సంఘటన. మమ్ములను తీసుకెళ్ళిన గురుస్వామి, మా తిరుగు ప్రయాణంలో ఇబ్బంది పడుతున్న ప్రయాణికుని ఖాళీ సీటులో కూర్చోవడానికి నిరాకరించడము చూసి ఆయన 20్ సార్లు షిర్డీకెళ్ళి ఏమినేర్చుకున్నాడో నాకు బోధపడింది. ఎంత చదివినా ఎంత ఎదిగినా ఎక్కడ్ తిరిగినా తమ పూట్టుకతో వచ్చీన బుద్ది మారదు. తెలివి పెరగొచ్చు గాక ! ఇది సత్యం ! ఇది నిజం! ఇది తిరుగులేనిది.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో