అక్బర్ ది గ్రేట్!

తేది: January 8, 2013 వర్గం: వర్తమానం రచన: చరసాల 2,828 views

ఆహా ఏమి పోలీసుల ఔదార్యము! దేశ మూల శక్తులనే సమూలంగా పెకిలించాలనుకున్నవాన్ని, రాజ్యాంగపునాదులమీదనే బాంబు పేల్చినవాన్ని ఎంత అల్లుడిలా చూస్తున్నారు!!

నోటీసులట! ఆసుపత్రికి రమ్మని ఆహ్వానమట! వున్నఫళంగా అరెస్టు చేసి ఆనక ఆసుపత్రిలో కావాలంటే వైద్యపరీక్షలు చేయించక ఈ రాచమర్యాదలేమిటి? ఓ సామాన్యుడికి చట్టం ఇలానే చుట్టమవుతుందా? ఏదీ చట్టం ముందు అందరూ సమానులన్న ఆదర్షం? మంది బలం ముందు చట్టం తలవంచటం ప్రారంబిస్తే అది ఆగే దెక్కడ?

ప్రభుత్వానికి చట్టం పట్ల తన నిబద్దతను చాటుకొనే మంచి తరుణం! మరి దేనికోసమీ చేతులు ముడుచుకోవడం? తస్లీమా మీద దాడి చేసిన రోజే చట్టం తనపని తాను చేసివుంటే ఈ లెక్కలేనితనం ఇంతలా విరగబడేది కాదు.

వాడికి తెలుసు, ఈ రాజకీయపు ఆయువుపట్టు! మొన్న డిల్లీ గల్లీల్లో జరిగినంత వుద్యమం వస్తేనే గానీ ప్రభుత్వం చలించదా?

అంత వెకిలిగా దేశ లౌకికత్వం మీద దాడి చేసిన వాడు, కనీసం నోటితోనైనా ఓ క్షమాపణ చెప్పలేదు. మీడియా వక్రీకరణ అట, పార్టీలు కక్ష గట్టాయట! ఎంత సిగ్గులేని తనం! ఎంత తెంపరితనం?

ఏ పార్టీ వాడికెంత లాభం అనే భేరీజు వేసుకోవడమే గానీ, జాతికి జరిగే నష్టం మాటేమిటి? ఇప్పుడే సెక్యులరిస్టులు, అంతకు మించి ముస్లిములు వీన్ని కడిగి ఆరెయ్యాలి. జీవితంలో మళ్ళీ సభల్లో మాట్లాడకుండా, ఎన్నికల్లో పోటీచేయ్యనీకుండా నిషేదించాలి.

ఇప్పుడేమాత్రం నిర్లక్ష్యం చూపినా ఉదరవాద హిందువు కూడా అతివాద హిందువయ్యే ప్రమాదముంది. దీన్ని సాకుగా చూపి హిందువుల్లో ఆగ్రహాన్ని రగిలించేవారు దేశాన్ని ప్రమాద అంచులకు నెడతారు. అయితే కార్యాచరణ లేకుండా హిందూ అతివాదులని ఎన్నోనాళ్ళు ఆపడం సాధ్యం కాదు.

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (8 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'అక్బర్ ది గ్రేట్!' పై 2 అభిప్రాయాలు

'అక్బర్ ది గ్రేట్!'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. Srini అభిప్రాయం,

  తేది: January 8, 2013 సమయము: 7:00 am

  ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు, అలాంటి రాజకీయ నాయకులు ఉన్నంతకాలం మనం ఇలా ఉండాల్సిందేనేమో అనిపిస్తుంది.

 2. Indian Minerva అభిప్రాయం,

  తేది: January 23, 2013 సమయము: 5:36 am

  మీరన్నది నిజం. ఎవరైనా జేబుదొంగతనం నేరంలో అరెస్టవ్వాల్సి వచ్చి “నాకు నలతగా ఉంది. ముందు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళండి” అంటే నాలుగు తన్ని ఈడ్చుకెళతారు. అదేమాట ఇలాంటి పొగరుబోతులంటే మాత్రం “జీహుజూర్” అంటుంది గవర్నమెంటు. చివరికయ్యేది ప్రభుత్వానికీ, మజ్లిస్‌కీ మధ్య సంధి కుదరటం. ఇలాంటిమాటలు ఇంకే పాశ్చాత్య దేశంలోనైనా అంటే జైల్లోకూరి గోళ్ళూడగొడతారు. మనది లౌకికరాజ్యమాయె.

  ఈ సందర్భంగా ఇంకొక విషయం. అక్బరుడు అన్నేసిమాటలంటే తాటతీసిందేమీలేదుగానీ, ఆయన్ను విమర్శించినవారినిమాత్రం ఠంచనుగా అరెస్టుచేసేశారు. ఇలా ఉంటుందన్నమాట ఆచరణలో ప్రభుత్వాలు “భావవ్యక్తీకరణ హక్కు” ను గౌరవించడం.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో