నా చిన్ని సంబరం

తేది: December 24, 2012 వర్గం: అనుభవాలు రచన: చరసాల 1,598 views

మొన్న ఓ సెలవురోజు, రోజులా పరుగెత్తాల్సిన పనిలేదుకదా అని రాత్రెప్పుడో పడుకొని నిద్రలేచేప్పటికి ఎనిమిదిన్నర! మా అమ్మాయి నాకు మల్లే రాత్రి త్వరగా పడుకోదు పొద్దున త్వరగా లేయదు. కానీ మా అబ్బాయి కోడి, రాత్రి పడుకోవడం ఆలస్యమయినా సరే పొద్దున్నే మాత్రం లేచిపోతాడు. అయితే మంచం దిగని బద్దకం వాడిది.

నేను లేచిన తర్వాత ఎలాగూ వాడు లేచి వుంటాడు కదా అని వాడి గదికి వెళ్ళాను. తలుపు చప్పుడుకు ముసుగు మరింత తన్ని నిద్ర నటిస్తున్నాడు. కళ్ళు మూసి నిద్ర నటించగలిగాడు గానీ సంతోషం నిండిన మొహంలోని వెలుగును మూయలేకపోయాడు. అప్పుడు నాకు గాథా సప్తశతిలోని ఈ కవిత గుర్తుకు వచ్చింది.

వాణ్ణి చూసినపుడు
రెండు చేతుల్తో రెండు కళ్ళను
మూసికోగలను గానీ
ఒళ్ళంతా కడిమి చెట్టు పూచినట్లు
మొలకెత్తిన పులకరింతల్ని
ఎలా కప్పగలను?

ఓ పది క్షణాలు నేనేమీ అనకుండా మౌనంగా అలా నిలబడ్డా! నా వునికి వాడికి తెలుసు, ఆ కపట నిద్ర వాడెక్కువ సేపు పోలేడు.

కళ్ళు తెరిచి “what?” అన్నాడు.
లేపి పళ్ళు తోమమంటానేమొ అని వాడి దిగులు!
ఓ ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతానన్నాను.
నా మోటుగడ్డపు వెట్రుకలతో ముద్దంటే వాడికి చక్కిలిగింత! పెట్టనివ్వడు.
వద్దు వద్దంటూ దుప్పటి ముసుగేసుకొని దాక్కున్నాడు.
వదిలిపెట్టకుండా నేనూ దుప్పట్లోకి దూరి ముద్దు పెట్టే ప్రయత్నంలో నేను, గిలిగింతలతో నవ్వుతూ నన్ను తోసేసే ప్రయత్నంలో వాడు.
మొత్తంమీద నా శైలిలో వాడి పొట్టమీద ఓ ముద్దు పెట్టి దుప్పటిలోనుండి బయటకొచ్చాను.

వాడు నవ్వాపుకొని “Is your neck OK?” అన్నాడు.
బాగానే వుంది అని అటూ, ఇటూ తిప్పి చూపి, ఏం ఎందుకలా అడుగుతున్నావ్? అన్నా!

“నీవు ముద్దు పెడుతుంటే నీ తలను గట్టిగా తోసేశాను గదా, నీకు దెబ్బ తగిలిందేమొనని!” అన్నాడు.

పుత్రవాత్సల్యం మరింత పొంగి మళ్ళీ ముద్దు పెడదామన్న కోరికను బలవంతంగా ఆపుకొని, “ఫర్వాలేదు నా కొడుకు పెరిగాక మనిషే అవుతాడు, ఎదుటివాడి నొప్పి గురించి ఆలోచించాడంటే!” అని సంబరపడ్డా!

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 ఓట్లు, సగటు: 5 కు 4.67)
Loading ... Loading ...

'నా చిన్ని సంబరం' పై 3 అభిప్రాయాలు

'నా చిన్ని సంబరం'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. chavakiran అభిప్రాయం,

    తేది: December 24, 2012 సమయము: 11:46 am

    నాకు అర్జంటుగా బీవీవీ ప్రసాద్ గుర్తుకొచ్చాడు.
    మనమంతా అమాయకులం,
    కాని కష్టపడి దాన్ని తరిమేస్తాం.

  2. చరసాల అభిప్రాయం,

    తేది: December 24, 2012 సమయము: 12:08 pm

    బీవీవీ ప్రసాదా? ఆయనెందుకు గుర్తుకొచ్చారు? ఏమా కథ?

  3. murali అభిప్రాయం,

    తేది: December 25, 2012 సమయము: 8:12 am

    ఎదుటివాడి నొప్పి గురించి ఆలోచించాడంటే
    …………………
    సిని నటుడు avs వాళ్ళ అల్లుడిని పరిచయం చేస్తే .. (avs ఆపరేషన్ …. కూతురు అవయవ దానం గుర్తుకొచ్చి ) మీ అల్లుడు మనిషండి అని చెప్పను .. ఇది చదివాకా అదే మాట గుర్తుకొచ్చింది ..

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో