అమ్మానాన్నలకు జైలు

తేది: December 4, 2012 వర్గం: వర్తమానం రచన: చరసాల 2,397 views

కొడుకును హింసించిన నేరంపై భారతీయదంపతులకు నార్వేలో జైలు శిక్ష పడింది. నేను గమనించిన మట్టుకు అటు ఇండియాలో పిల్లల హక్కులు గౌరవించేవారు గానీ, హింసించని వారు గానీ చాలా అరుదని చెప్పాలి. నేను పెరిగింది పల్లెటూరులోనే అయినా మా నాన్న ఎప్పుడూ కూడా భౌతికంగా గానీ, మానసికంగా గానీ మమ్మలని హింసించి ఎరుగము. కానీ పిల్లలనీ, చివరికీ బార్యనీ పల్లెటూళ్ళలో హింసించడమూ ఎవరైనా అడ్డుచెబితే నాబార్య నా యిష్టం, నా పిల్లలు నాయిష్టం అనడం సర్వసాధారణం.

ఇప్పుడిక పట్టణాల్లో అయినా, నగరాల్లో అయినా చివరికి అమెరికాలో అయినా చదువుల్లో పోటీ పేరుతో మానసికంగా హింసించడమో లేక అప్పుడప్పుడూ భౌతికంగా దాడిచేయడమూ పరిపాటి. దాన్ని సమర్థించుకోవడానికి “మొక్కై వంగనిది మానై వంగునా” అన్న సూక్తి వుండనే వుంది. మొక్కగా వుండగానే వంచాలన్నది నిజమే అయినా ఆ వంచడము భౌతికంగానే అనేది మనవారికి నరనరాల్లో పాతుకుపోయింది. పిల్లల పెంపకంలో అవగాహనాలోపం వల్లా, పిల్ల మానసిక స్థితిని అంచనా వేయడంలో విఫలమవడం వల్లా పిల్లలు హింసకు గురౌతున్నారు.

పిల్లల మానసిక పరిపక్వత, అనుభవం మనకంటే ఎంతో తక్కువ అనే విషయాన్ని తల్లిదండ్రులు తరచూ మరిచిపోతారు. ఉదాహరణకి పిల్లవాడు పాలుతాగుతూ పొఱపాటున కింద పోస్తే అదేదో ప్రళయం వచ్చినట్లుగా కొంతమంది వూగిపోతారు. గ్లాసు పడకుండా పట్టుకోవడమైనా అందులోని ద్రవం ఒలకకుండా చూడటంలో అయినా మనకున్న అనుభవం పిల్లవాడికుండదన్న ఇంగిత జ్ఞానం పెద్దలకుండదు. పొఱపాట్లు చేస్తూనే పిల్లలు నేర్చుకుంటారు.

ఈ నార్వే పిల్లాడి కేసుకు వస్తే వాడు పాంటులోనే ఉచ్చపోసుకోవడం తల్లిదండ్రులకు పెద్ద నేరమైంది. మావాడూ మొన్న 2nd gradeలో చేరాకా అలాగే పోసుకున్నాడు. ఎన్నో విధాలా చెప్పి చూశాను. ఇంట్లో వుంటే అలా చేయడు గానీ స్కూల్లో చేసేస్తాడు. వాన్ని అడగ్గా అడగ్గా నాకర్థమయింది ఏమిటంటే చివరి క్షణం వరకూ వాడికి ఆ అవసరం వున్నట్లు తెలియదు. తెలిసాక టీచర్‌ను అడిగి restroomకి వెళ్ళేసరికి ఆలస్యమవుతోంది, లేదా ఒక్కోసారి అక్కడదాకా వెళ్ళాక అక్కడ ఖాళీ వుండదు. మనలాగా ఉగ్గబట్టుకునే ఓపిక వాళ్ళలో రావాలంటే సమయం పడుతుంది. అది కొంతమందిలో త్వరగా రావచ్చు మా అమ్మాయికిలా, కొంతమందికి ఆలస్యంగ రావచ్చు మా అబ్బాయికిలా! అయితే ఇటువంటి కేసుల్లో భారతీయ తల్లిదండ్రులు భేషజాలకు పోతారు. పక్కవాళ్ళు ఏమనుకుంటారో అన్నదే మనకు ముఖ్యం, మన పిల్లవాడు ఏమయితేనేం! భయపెడితే మానేస్తాడనుకుంటాం, చాటు మాటుగా గుడ్లురుముతాం, భయటకు కనపడకుండా తొడపాశాలు పెడతాం. మన కోపాన్ని, చేతగాని తనాన్ని పసితనం మీద చూపిస్తాం. అర్థం చేసుకోవాల్సిన తల్లిదండ్రులే పిల్లవాన్ని అర్థం చేసుకోకుంటే ఆ పసి హృదయానికి దిక్కెవరిక?

మరో రకం హింస న్యూనతకి గురిచేయడం. నేను హైస్కూల్లో వున్నపుడు మా క్లాసులో ఓ అబ్బాయి కారునలుపు వుండేవాడు. మా హిందీ టీచరు ఏ ప్రశ్నకైనా వాడు సమాధానం చెబుదామని లేస్తే “కర్రి నాకొడకా కూర్చో, నీ మొహం చూడాలంటేనే అసహ్యం” అనేవాడు. నలుపు వాడుకోరుకొని తెచ్చుకున్నది కాదు. అది చదువున్నా, సంస్కారం లేని ఆ టిచరుకు తెలియదు. అలాంటి మాటలు పసి హృదయాల్లో ఎంతగా గాయాలు రేపుతాయో! “వాన్ని చూసి బుద్ది తెచ్చుకో” మనడం. సమాధానం చెప్పిన వాడితో చెప్పని వాడికి “ముక్కు చెంపలు” వేయించడం! గుంజీలు తీయంచడం… ఇవన్నీ చిన్నప్పట్నుండే పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని ఆణగదొక్కేస్తాయి.

గత కొన్నేళ్ళలోనే నేను వార్తా పత్రికల్లో బోలెడన్ని పిల్లలని హింసించిన కథనాలు చూశాను. మొన్నీమధ్యే ఓ ప్రధానోపాద్యాయుడు అయిదేళ్ళ పసికూనని వీపున వాతలు తేలేలా కొట్టాడు. ఓ టీచరమ్మ పెన్నుతో కన్నులో పొడిచింది ఒకన్ని. ఒక టీచరేమొ శిక్షగా అతిగా పరుగెత్తించి ఓ పిల్లవాడి మరణానికి కారణమయ్యాడు. ఇలాంటివి బయటకు వచ్చే అతి కొద్ది కేసులు. రానివి ఎన్నో! ప్రతి ఇంటిలోనూ దాన్ని నేరంగా తలచని, దాన్నో పెద్ద విషయంగా పట్టించుకోని తల్లిదండ్రులు పెట్టే హింసలెన్నో!

ఆలుమగలూ పోట్లాడుకున్నా నలిగిపోయేది పిల్లలే. బయట ప్రపంచపు వత్తిళ్ళలో నలిగిపోయే తల్లిదండ్రులు ఇంటికొచ్చి ఆ వత్తిడిలో చీటికీ మాటికీ కసరుకొనేది పిల్లలనే!

ఇలా అయిందానికీ కాని దానికీ పిల్లలని హింసించడం మాటలతో, చేతలతో భారతదేశంలో సర్వసాధారణం గనుక ఈ కేసు చూస్తున్నవారికి ఇది నార్వే పోలీసుల అత్యుత్సాహంగా అనిపించవచ్చు గానీ ఆ తల్లిదండ్రులు పిల్లవానికి వాతలు పెట్టినట్లు ఋజువైందిగనుక వారు శిక్ష అనుభవించడమే సరైంది. ఇలాంటి కేసు ఇండియాలో ఒక్కటంటే ఒక్కటీ వినం అంటే పిల్లలని తల్లిదండ్రులు హింసించనట్లా? హింసించని కూటుంబం వుండదంటే అతిశయోక్తి కాదేమొ! కానీ శిక్షలేవి?

ఈ కేసైనా కొద్దిమంది తల్లిదండ్రుల ప్రవర్తనలోనైనా మార్పు తెస్తే మేలు!

సత్యాన్వేషి బ్లాగు చూడండి.

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 ఓట్లు, సగటు: 5 కు 4.00)
Loading ... Loading ...

'అమ్మానాన్నలకు జైలు' పై 15 అభిప్రాయాలు

'అమ్మానాన్నలకు జైలు'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. Jai Gottimukkala అభిప్రాయం,

  తేది: December 5, 2012 సమయము: 1:16 am

  తాము పిల్లలను ఎలా కొట్టినా ఫరవా లెదనుకొనె తల్లి తండ్రులకు కనువిప్పు రావాలి. పిల్లలకు కూడా హక్కులు ఉంటాయని పెద్దలు గుర్తించాలి.

 2. chinni అభిప్రాయం,

  తేది: December 5, 2012 సమయము: 1:33 am

  పిల్ల్లల్ని మందలించే హక్కు,అధికారము వారిని సరైన మార్గంలొ పెట్టడానికి తల్లిదండ్రులకు లేవంటారా? ఒక్క దెబ్బ వేసినంత్ మాత్రాన వారి పైన ప్రేమ లేనట్టా?

 3. janaki అభిప్రాయం,

  తేది: December 5, 2012 సమయము: 9:18 am

  నార్వె చట్టాలను ఇక్కడ అమలు పరచడమంటె అక్కడి ఆర్దిక సామాజిక పరిస్తితుల్ని ఇక్కడ ప్రతిష్టించాలి. ఏదేశంలొనైనా సామాజిక ఆర్దిక స్తితినిబట్టి సట్టాలు రూపొందుతాయి. ఇక్కడ అత్యంత పేదతనంలొ వుండటం వలన పిల్లలనుకుడా పినికి పంపవలసిన పరిస్తితిని తల్లి తండ్రులకు కల్పిస్తున్నారు.

 4. చరసాల అభిప్రాయం,

  తేది: December 5, 2012 సమయము: 9:23 am

  చిన్ని గారు, పిల్లలని సరైన దారిలో పెట్టాల్సిన హక్కూ, ధర్మమూ తల్లిదండ్రులకు వున్నాయి. అయితే దానికీ హద్దుంది. ఆ పేరుతో వారిని చితకబాదడమూ, వాతలు పెట్టడమూ దుర్మార్గము. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల మానసిక దృక్కోణం నుండి ఆలోచించడం చేతగాక ఈపని చేస్తుంటారు, ప్రేమ లేక గాదు. అయితే ప్రేమ వుందిగదాని బాగా కొట్టి ఆనక వెన్న రాయడం కుదరదు.

  ఆ మధ్య జూనియర్ ఎన్టీయార్‌తో RK open heart చూశాను. తన చిన్నప్పుడు వాళ్ళమ్మ ఎలా కొట్టేదో అందులో వివరించారు ప్రేమగా, గోముగా! ఇప్పుడాయన పెద్ద హీరో గనుక ఆ దెబ్బలని సమర్థించుకోవచ్చు కానీ అలాంటి దెబ్బలకు తట్టుకోలేక ఇళ్ళు విడిచి పారిపోయి, ముఠాల బారిన పడుతున్న పిల్లలెంతమంది? స్కూల్లో టీచర్ కొడతాడని స్కూలు ఎగ్గొడుతున్న పిల్లలెంతమంది.

  సరదాగా సాగాల్సిన పిల్లల జీవితం ఎన్ని ఇళ్ళలో పసిపిల్లల ఏడుపులతో ముగుస్తోంది. కనీసం ఇలాంటి ఒక కేసైనా కొంతమందిలోనైనా కనువిప్పు కలిగిస్తుందని ఆశ!

 5. చరసాల అభిప్రాయం,

  తేది: December 5, 2012 సమయము: 10:14 am

  జానకి గారూ,
  మీరన్నది నిజమే! నార్వే చాట్టాలను ఇండియాలో అమలుపరచాలని ఎవరూ అనరు. కానీ ఇప్పుడు చట్టం అమలయ్యింది నార్వేలో!
  పోనీ ఆ దంపతులు చదువుకోని వారో అమాయకులో కాదు. వారికి చట్టం తెలుసు. నాకామధ్య ఒకాయన ఓ కథ ఇక్కడ అమెరికాలో చెప్పాడు. పిల్లలని కొట్టడం నేరమని తెలుసు గనుక ఆ తల్లిదండ్రులు “కొట్టడం” అనేపదానికి సంకేత నామం పెట్టుకున్నారట! ఆ సంకేతం పిల్లవాడికీ, వాని తల్లిదండ్రులకే తెలుసు. బయట ఎక్కడైనా ఆ పదం వాడితే అర్థం “ఇంటికెళ్ళాక వీపు చీరేస్తాను” అని.

  అయినా ఓ పసిపిల్లవాన్ని హింసించగూడదు అని చట్టం చెప్పాల్సి వచ్చిందా? మానవత్వాన్ని ఒకరు నేర్పాలా?

 6. Raja అభిప్రాయం,

  తేది: December 7, 2012 సమయము: 10:17 am

  ప్రసాద్, ఈ విషయం గురించి స్పందించిన నీకు నా అభినందనలు. తెలుగులొ వ్రాయటం నాకు అలవాటు తక్కువ. తప్పులుంతె సరిదిద్దుకొవటానికి ప్రయత్నిస్తాను.

  ఈ విషయంలొ నేను నీతో పూర్తిగా అంగీకరిస్తాను. కొద్దిసేపు ఈ చట్టాలు, న్యాయాలు ప్రక్కన పెడితే, ఈ విషయం మరీ అంత అర్ధంచెసుకోలేనిది ఏమీ కాదు. ఈ విషయంలో తల్లిదంద్రులు చిన్న ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. ఆది ఏమిటంటె, మన పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించాలనుకుంటామో, మనము కూడా ఇతరులపట్ల అదే ప్రవర్తన కలిగివుండాలనేది. ఇతరులు అంటే ఇక్కడ పిల్లలు కూడా. పిల్లలు తప్పుచెసారు అని తల్లిదండ్రులు అనుకున్న ప్రతిసారి, వారి మీదకి చెయ్యూ లేదా నొరో వారి మీద లేపుదామనుకున్న ప్రతిసారి ఒక్కసారి తల్లిదండ్రులు ఆగి ఆలొచించాలి. పిల్లలు చేసిన ప్రవర్తన మేమే చెసివుంటే దానిని సరిదిద్దడానికి వేరేవాల్లు మనసికంగా గాని లేద భౌతికంగా గాని హింసించే పద్దతిని అవలంభిస్తే మనకు ఎలావుంటుంది. నిజంగా మనపట్ల ఆ ఎదుటివాల్ల దురుసు ప్రవర్తన మన తప్పును సరిదిద్దుకునేటట్టు చేస్తుందా అని. మనకి జవాబు కాదు ఎప్పటికి కానేకాదు అని వస్తుంది. మనకే ఆ ప్రవర్తన నచ్హనప్పుడు, అది మనలొ ఏ మార్పునూ తీసుకురాదు అనుకున్నప్పుడు అదే ప్రవర్తనని మనము ఎంతొ ప్రేమిస్తాము అని చెప్పుకునే మన చిన్నారులమీద ఎందుకు చూపిస్తాము? పెద్ద వాల్లు హింసించిన దానికి సప్పొర్ట్ చెసుకొవటానికి, పిల్లలకి అర్ధం చేసుకునే వయస్సు లేదనో లెదా చెప్పినా వాల్లకి అర్ధం కాదనో వీల్ల సొంత వేదంతం వల్లించి వాల్లని వాల్లు సమధాన పరుచుకుంటారు. మరికొంచెము ఎదరకి వెల్లి పంక్కిటి వాల్లు అధ్రుష్టవంతులు,వాల్ల పిల్లలు చక్కగ వాల్ల తల్లిడంద్రుల మాటలు వింటారు, మనకా అద్రుష్టము లేదు, మనవాల్లు వినరు, మమ్మల్ని అర్ధంచేసుకొరు, ఈ జీవితం ఇంతే, మన కర్మ అనుకుంటూ బ్రతుకు వెల్లబెడుతూ వుంటారు. ఆంతేగాని వేరెవిధంగా ఏదైనా చేసి మన పిల్లలొ ఈ దుష్ప్రవర్తనని మర్చుదాము అని అస్సలు ఆలొచించరు. అదే ఏ పక్కింటివాడితొనో లెదా, సహొద్యొగితొనొ, లెద పక్క దేసస్తుడితొనొ మట్లాడవలసి వచ్హినప్పుడు మాత్రం ఒకతికి పదిసార్లు అలొచించి వాల్లకి నచినట్టుగా మట్లాడి ఆ పని సాధిస్తారు. నా ఆఖరి మాటేమిటంటె తల్లిదండ్రులకు పిల్లల్ని ఎల హేండ్లె చెయ్యలొ తెలీకకాదు ఈ ప్రొబ్లెం అంతా. ఫిల్లలు అనేటప్పతికి ఒక చిన్న చూపు. వాల్లు మనలాగ మనుషులే అని వప్పుకొవటనికి ఇగో అడ్డొస్తుంది. పిల్లలదగారికి వచ్హేటప్పటికి పెద్దలకి కొంచెము కూడా ఓపిక వుండదు. ఈ పెద్దల బలహీనతకి సొంతము, ప్రేమ, మీకొసమె మా జీవితము, మిమ్మల్ని కాకపొతె బయటవాల్లను విసుక్కోగలమా, మీ బాగుగురించెకదా ఇదంత అనె ముసుగు తగిలించి పెద్దలు వాల్లని వల్లు సమాధన పరుచుకుని త్రుప్తి పడుతుంటారు,పిల్లల్ని సమధాన పర్చటానికి ప్రయత్నిస్తుంటారు. ఇటువంటివాల్లు నూటికి తొంభైతొమ్మిది మంది వుంటారు కాబట్టి, వాల్లూ వీల్లని సప్పొర్ట్ చెసుకుంటూ అదే కరక్ట్ అని, ఇంకెమి చెయ్యలేమని బ్రతికేస్తుంటారు. ఈ విషయంలొ పెద్దవాల్లని ఎడ్యుకేట్ చెయ్యటం ఎంతొ అవసరం. ఆ పనికి నేను రెడి, ఇంకెవరైన రెడిన?

 7. చరసాల అభిప్రాయం,

  తేది: December 7, 2012 సమయము: 3:33 pm

  రాజా గారు, మీ అభిప్రాయముతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
  మీరు ఇక్కడ జోడించిన మరిన్ని అంశాలు నేను రాసిన అసలు అంశానికి మరింత వన్నె తెస్తున్నాయి. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

  yes మనకు చేయో, కాలో, నోరో లేయడానికి కారణం అవతలి వ్యక్తి, బిడ్డ కావచ్చు, గొడ్డు కావచ్చు, బార్య కావచ్చు, విధ్యార్థి కావచ్చు నిస్సహాయులన్నదే కారణం. మీరన్నట్లు ఎదురింటి వ్యక్తిమీద లేయనివి సొంత మనుషులమీద మాత్రం ఆలస్యంలేకుండా లేస్తాయి.

  అందుకే ఎక్కువ abuse స్వంత మనుషుల వల్లే, ఇంట్లోనే జరుగుతోందన్నది సర్వేల సమాచారం.

  మన తోటివాడిని ఎలా గౌరవిస్తామో, మన పిల్లలైనా అలా ఇవ్వాల్సిందే! మన ప్రవర్తనను బట్టీ, మన అలవాట్లను బట్టీ, ఇతరలు పట్ల మన గౌరవాన్ని బట్టే మన పిల్లలు మనకు గౌరవాన్ని ఇస్తారు. వాళ్ళకు మనం మోడల్‌గా వుండడం ద్వారా మాత్రమే వాళ్ళకి మంచితనాన్ని నేర్పగలం!

  ఇంట్లో లేచినప్పటినుండీ మనం సులబంగా అబద్దాలు చెప్పేస్తూ దానికి లౌక్యం అనే గొడుగు తగిలించుకొని బ్రతికేస్తాం. అదే అబద్దం పిల్లాడు మనతో ఆడేస్తే వీపు విరగ్గొడతాం. వాడు మనదగ్గరే నేర్చుకున్నాడు అన్నది మరచిపోతాం.

 8. Jai Gottimukkala అభిప్రాయం,

  తేది: December 7, 2012 సమయము: 5:19 pm

  చరసాల గారూ, తల్లి తండ్రుల వైఖరిలొ మార్పు రావాలి. పిల్లలు తమ ఆస్థి కాదనె అవగాహన రావాలి.

  Your children are not your children, they are the sons and daughters of life’s longing for itself: Kahlil Gibran

  ఇంత మంచి తపా రాసిన మీకు నా అభినందనలు.

 9. anrd అభిప్రాయం,

  తేది: December 9, 2012 సమయము: 8:01 am

  * టపా బాగుందండి.
  * పిల్లలు అలా చేయటానికి ఎన్నో కారణాలుండవచ్చు.

  * పిల్లలకు ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు కూడా టాయిలెట్ కు వెళ్ళేలోపు ఆపుకోలేకపోతారు. ఇలాంటప్పుడు వైద్యులను సంప్రదించి ట్రీట్మెంట్ చెయ్యించాలి. అంతేకానీ, పిల్లలను బెదిరించటం తప్పు.

  * స్కూల్లో కూడా , పిల్లలు బాత్రూం కు వెళ్ళాలని అడిగితే, కొందరు టీచర్లు పర్మిషన్ ఇవ్వరు. అర్జంట్ గా వెళ్ళాలి సార్ ! అని పిల్లలు ప్రాధేయపడినా పర్మిషన్ ఇవ్వని టీచర్లు నాకు తెలుసు. పాఠం పూర్తయిన తరువాత మాత్రమే వెళ్ళటానికి పర్మిషన్ ఇస్తారు. అంతవరకు ఆపుకోలేని పిల్లలు లాగు తడిపేసుకుంటారు. అప్పుడు మళ్ళీ పిల్లల్నే చితకబాదుతారు టీచర్లు.

  * ( కొందరు ఆకతాయి పిల్లలు టాయిలెట్ పేరు చెప్పి బయటకు వెళ్ళి కాలక్షేపం చేసే మాట నిజమే కానీ, అటువంటి పిల్లలను దృష్టిలో పెట్టుకుని , నిజంగా టాయిలెట్ కు వెళ్ళవలసిన అవసరం ఉన్న విద్యార్ధిని కూడా ఆపటం న్యాయం కాదు కదా ! )
  * పెద్దవాళ్ళు తమ హక్కులను గోల చేసి సాధించుకుంటారు. పిల్లలకూ హక్కులుంటాయి. అని అందరూ గుర్తించాలి.

  * కొన్ని సార్లు విపరీతమైన ట్రాఫిక్ వల్ల, స్కూల్ నుంచి ఇంటి కెళ్ళేవరకూ కాలకృత్యాలను ఆపుకోలేని పిల్లలకు కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. ఇలాంతప్పుడు తప్పు ఎవరిది ?

  * కొన్నిదేశాల్లో అయితే , విపరీతమైన ట్రాఫిక్ వల్ల పెద్దవాళ్ళు కూడా నాప్కిన్స్ వేసుకుంటారట. ( లోకల్ ట్రైన్స్ లో టాయిలెట్స్ ఉన్నా కూడా టాయిలెట్ కు వెళ్ళటానికి కూడా వీలులేనంత రష్ ఉంటుందట ట్రయిన్స్లో. )

  * ఈ అబ్బాయి కేసులో తల్లితండ్రులను జైల్లో పెడితే , మరి ఆ బాబును ఎవరు చూసుకుంటారు ? ఆ పిల్లవాడు తల్లితండ్రులు కావాలని ఏడిస్తే ? పిల్లవాడికి తల్లితండ్రులను దూరం చేయటం కూడా పిల్లల హక్కుకు భంగం కలిగించటమే కదా !

  * నిజంగా పిల్లలను శాడిజంగా హింసించే తల్లితండ్రులను జైల్లో పెట్టవలసిందే. కానీ, ఈ తల్లితండ్రులు తాత్కాలిక ఆవేశంలో పిల్లవాడిని శిక్షించారే కానీ, అబ్బాయి అంటే ప్రేమ ఉన్నవారిగానే కనిపిస్తున్నారు. మొదటి తప్పుగా భావించి, తల్లితండ్రులను విడిచిపెడితే బాగుంటుందనిపిస్తోంది.

 10. చరసాల అభిప్రాయం,

  తేది: December 10, 2012 సమయము: 2:22 pm

  anrd గారూ,
  మీరు చాలా మంచి పాయింట్లు చెప్పారు. పిల్లలు ప్రతి చేష్టనీ హేతుబద్దంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం వుండకపోదు.

  మీరన్నట్లు ఈ కేసు విషయంలో వీరు మన కొలతల్లో మరీ అంత తప్పు చేసుండకపోవచ్చు. కానీ చేసింది నార్వేలో కనుక అక్కడి తప్పుకు అక్కడి కొలతలే వాడతారు గానీ మనవి కాదు. ఈ విషయంలో మనం నార్వేని నిందించి లాభం లేదు. మన దేశంలో నైనా మరే దేశంలోనైనా అందుకు మినహయింపు వుండదు. అయితే ట్వ్ల్లో చర్చించేవారు, బ్లాగుల్లో గుండెలు బాదుకునేవారికి మన దేశం ఓ గొప్ప సంస్కృతి గల దేశమని ఎక్కడలేని గర్వం. ఆ గర్వంలో మాకే సుద్దులు చెప్పే దేశమా నార్వే అని ఈ చిందులు.

  ఇక మీతో పాటు చాలా మంది వేసే ప్రశ్న, ఈ శిక్ష వల్ల పిల్లలకు తల్లిదండ్రులు దూరమవుతున్నారు గదా అని. అవ్వా, బువ్వా రెండూ కావాలంటే ఎలా? రెండింటిలో ఒకటే కావాలనుకున్నపుడు అదేంటో తేల్చుకోవాలి. ప్రాధామ్యాలను బట్టి అది వుంటుంది. మొన్న యండమూరి రఘునందన్ కేసు తీసుకుంటే అతన్ని జైలులో పెట్టడం వల్ల, అతని తల్లికి బిడ్డ దూరమవుతుంది. అతని బార్య గర్భిణి అట. రేపు అతనికి మరణశిక్ష పడితే ఆ గర్భంలో వున్న బిడ్డకు తండ్రి కరవు! ఆ బిడ్డని చూసి ఈ తండ్రి తప్పు ఒగ్గేద్దామా?

  ఇలా ఏ తప్పుకైనా ఓ వ్యక్తిని శిక్షించడం ద్వారా అతన్ని ఆశ్రయించివున్న అందరికీ అంతో ఇంతో శిక్ష తప్పదు. ఇప్పుడు ఈ బిడ్డలకైనా అంతే! అది అనివార్యం!

 11. Jai Gottimukkala అభిప్రాయం,

  తేది: December 14, 2012 సమయము: 2:54 am

  @anrd, @చరసాల,

  “ఇక మీతో పాటు చాలా మంది వేసే ప్రశ్న, ఈ శిక్ష వల్ల పిల్లలకు తల్లిదండ్రులు దూరమవుతున్నారు గదా అని. అవ్వా, బువ్వా రెండూ కావాలంటే ఎలా? రెండింటిలో ఒకటే కావాలనుకున్నపుడు అదేంటో తేల్చుకోవాలి”

  (ప్రస్తుతానికి తీర్పులొ తప్పెమి లెదనుకుంటె) తల్లి తండ్రులు పిల్లవాడి పట్ల దారుణంగా ప్రవర్తించారనె విషయం తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళ నుంచి బిడ్డలు దూరంగా ఉంటెనె వారికి మంచి.

 12. Jai Gottimukkala అభిప్రాయం,

  తేది: December 14, 2012 సమయము: 3:00 am

  @anrd:

  “ఆవేశంలో పిల్లవాడిని శిక్షించారే కానీ, అబ్బాయి అంటే ప్రేమ ఉన్నవారిగానే కనిపిస్తున్నారు. మొదటి తప్పుగా భావించి, తల్లితండ్రులను విడిచిపెడితే బాగుంటుందనిపిస్తోంది”

  మీరు కెసు గమనించలెదనుకుంటా. ఇది మొదటి తప్పు కాదు.
  ఇటీవలి గతంలొ ఒకసారి బాబుని నార్వె ప్రభుత్వం తమ ఆధీనంలొ తీసుకుంది. ఒక నెల తరువాత తిరిగి తల్లి తండ్రులకు అప్పగించింది. వెంటనె తన బెదిరింపు ప్రకారం బాబుని ఇండియాలొ వదిలెసాడు సదరు పెద్ద మనిషి. ఇది ఖచ్చితంగా రెండొ తప్పె.

 13. Srikar A అభిప్రాయం,

  తేది: December 17, 2012 సమయము: 12:07 pm

  What about those children who leave their parents in their country and go settle somewhere else and don’t even have time to attend their parents when they are sick or dead. What law should be implied to them.

 14. Srikar A అభిప్రాయం,

  తేది: December 17, 2012 సమయము: 12:27 pm

  -In Norway if they are following strict rules in bringing up the children then why do some of them turn into thief or rapist,

 15. చరసాల అభిప్రాయం,

  తేది: December 19, 2012 సమయము: 9:09 am

  శ్రీకర్ గారూ,
  బుద్దిరాని పిల్లలని ప్రేమగా చూసుకోవడం బాద్యతగా పెంచడం ఎంత తల్లిదండ్రుల బాధ్యతో శరీరకంగా మానసికంగా అలసిపోయి, కుంగిపోయిన తల్లిదండ్రులను ప్రేమగా చూడాల్సిన బిడ్డల బాధ్యతా అంతే!

  ఎంత గొప్పగా పంట పెంచినా అందులో కలుపూ పెరుగుతూనే వుంటుంది. అది నార్వే అయినా ఇండియా అయినా. అయితే కలుపును ఎంత సమర్థంగా ఎదుర్కొంటున్నాము అనేది ముఖ్యం.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో