నా రైలు ప్రయాణం

తేది: November 13, 2012 వర్గం: అనుభవాలు రచన: చరసాల 1,941 views

ఇవాళ ఫేస్‌బుక్‌లో తెలుగు పుస్తకం గుంపులో ఓ చర్చ గత డిసెంబరులో ఇండియా వచ్చినపుడు జరిగిన ఓ సంగతిని గుర్తుచేసింది.

అదేంటంటే నేను, మా ఆవిడ మరియు మా పిల్లలూ అందరం రాయలసీమలో తిరుపతి నుండీ కడపకు వెళ్ళాలి. అంతకు ముందే మేము బెంగళూరు నుండీ తిరుపతికి రైలులో చేసిన ప్రయాణం మా పిల్లలు బాగా ఇష్టపడటంతో ఇప్పుడు కూడా రైలులోనే ప్రయాణించాలని నిర్ణయించుకొన్నాం. అయితే సమయం తక్కువగా వుండటం వల్ల మాకందరికీ శీతల పెట్టెలో(AC) టికెట్లు దొరకలేదు. అంతకు ముందు బెంగుళూరునుండి వచ్చినపుడు కూడా దొరకకపోతే మూడు AC టికెట్లు ఒక మొదటి తరగతి టికెట్టు కొన్నాం. TC వచ్చినపుడు ఆ విశయమే చెప్పి ఆ వ్యత్యాసాన్ని చెల్లింఛాం.

ఇప్పుడేం చేశాం అంటే దొరికిన మూడు AC టికెట్లు తీసుకొని, మా ప్రథంకు మాత్రం తీసుకోలేదు. పూర్వానుభవాన్ని బట్టీ నాకున్న ధైర్యం ఏమిటంటే TC వచ్చినపుడు విశయం చెప్పి ఆ నాలుగో టికెట్టు తీసుకోవచ్చని. మా ప్రథంకు అప్పుడు ఆరేళ్ళు. మాకు బెర్తులు కేటాయించిన చోట ఒకావిడ హైదరాబాదుకు వెళుతున్నది మిగతావన్నీ ఖాళీనే! మా పిల్లలిద్దరూ పైకీ కిందకీ ఎక్కీ దిగీ కాసేపట్లో అలసిపోయి పై బెర్తుల్లో నిద్రపోయారు. మా ఆవిడా ఓ కింది బెర్తులో నిద్ర పోయింది. నేను నాకెదురుగా వున్న ఆ హైదరాబాదెళ్ళే ఆవిడతో మాట్లాడుతున్నాను.

TC వచ్చాడు. టికెట్లు మూడూ చూపించాను. ఎవెరెవరన్నాడు. అక్కడ పడుకున్నావిడ, నేనూ, ఈ పైన పడుకున్నది మా అమ్మాయి, అక్కడ పైన వున్నది మా అబ్బాయి వాడికి టికెట్టు లేదన్నాను. టికెట్టు లేకుండా ఎలా ఎక్కారు అన్నాడు. దొరకలేదు, మీ దగ్గర కొనచ్చు కదా ఫైను కట్టి అన్నాను. అతను ఆశ్చ్యర్యంతో ఏదో తరగతి టికెట్టు వుంటే వ్యత్యాసం కడితే సరిపోతుంది కానీ టికెట్టే లేకుంటే ఫైను చాలా ఎక్కువ అన్నాడు. ఫరవాలేదు కడతా అన్నాను. మా వాడు చాలా చిన్నగా కనిపించడంతో అవసరం లేదు వాడికి ఎవరైనా అడిగితే నాలుగేళ్ళని చెప్పమన్నాడు. అమ్మో అది కానిపని, మా పిల్లల ఎదురుగా అలా అబద్దం చెప్పడం కుదరదన్నాను. అయితే ఓ పని చెయ్యి, కడపలో దిగాక ముఖ్య ద్వారంగుండా వెళ్ళకుండా ప్లాట్‌ఫాం చివరికెళ్ళి అట్నుంచి వెళ్ళిపొండి అన్నాడు. అదీ కుదరదు ఫైనే కడతాను అన్నాను.

ఇప్పుడు బహుశా అతను నేనేదో గ్రహాంతరజీవిని అనుకున్నట్టున్నాడు. సరే అయితే నీ నిజాయితీకి నాకు ఫైను రాయబుద్దేయట్లేదు. ఇంకోమాట చెబుతాను. అక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళకి పోన్ చేసి ఒక ప్లాట్‌ఫాం టికెట్టు అదనంగా కొనమనిచెప్పు అని చక్కా వెళ్ళి పోయాడు.

నేనున్న పరిస్థితిలో ఫైనూ వేసి లంచమూ అడుగుతాడేమో అనుకున్నా! ఉ హూ! ఏమీ అడగకుండా వెళ్ళి పోయాడు.

తరువాయి భాగం …

ఆయనెళ్ళి పోయాక మా ఆవిడ లేచింది. నా ఎదురుగ్గా వున్నావిడ విశయమంతా చెప్పింది. ఇంకో గంట నా లీల చెప్పుకొని నన్నో పరమానందయ్య శిష్యున్ని చేసి బాగా నవ్వుకున్నారు.

PS: పోన్ చేసి అదనపు ప్లాట్‌ఫాం టికెట్టు తెప్పించా! అవినీతిలో నాకూ భాగముంది.

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (5 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'నా రైలు ప్రయాణం' పై 5 అభిప్రాయాలు

'నా రైలు ప్రయాణం'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. కొత్తపాళీ అభిప్రాయం,

    తేది: November 13, 2012 సమయము: 3:41 pm

    మీ పాపానికి నిష్కృతి లేదు :)

  2. manju అభిప్రాయం,

    తేది: November 14, 2012 సమయము: 3:19 am

    :) nice experence andi

  3. చరసాల అభిప్రాయం,

    తేది: November 15, 2012 సమయము: 1:33 pm

    తప్పుడు పనులు అలవాటుగా చేసేవారు ఓ రకం. దొరకం అనుకుంటే మాత్రమే చేసేవారు ఇంకోరకం. అవకాశం దొరకక తప్పు చేయని వారు మరో రకం. అసలే తప్పు చేయని వారు అరుదైన రకం. ఈ అరుదైనర్రకం వారు గాంధీలవుతారు.

  4. రవి అభిప్రాయం,

    తేది: November 18, 2012 సమయము: 12:06 am

    బావుంది. రైల్వే అధికారిని ‘టచ్’ చేసేసి మీ పని కానిచ్చుకున్నారు.

  5. pavan అభిప్రాయం,

    తేది: November 29, 2012 సమయము: 4:29 am

    చాలా బాగా వ్రాశారు…

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో