- అంతరంగం - http://www.charasala.com/blog -

కొల్లాయి గట్టితేనేమి?

Posted By చరసాల On October 12, 2012 @ 3:20 pm In పుస్తకాలు, వర్గీకరింపబడనివి | 3 Comments

ఈ అద్భుతమైన నవలని ఇన్నాళ్ళూ చదవనందుకు చాలా సిగ్గేస్తోంది. ఇప్పుడైనా చదవగలిగానూ అంటే కినిగె [1] పుణ్యమే!

1920 – 21 నాటి జాతీయోడ్యమం, సామాన్యుల మీద గాంధీగారి ప్రభావం, అప్పట్లో వున్న సామాజిక దురాచారాల గాఢత… ఇంకా ఇంకా ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే కాలచక్రాన్ని వెనక్కు తిప్పి ఆనాటి ముంగండ గ్రామ సామాజిక, ఆర్థిక పరిస్థితులని చూడొచ్చు.

ఈ నవలలో అన్నిటికీ మించి నన్ను కదిలించిన సన్నివేశం, బారెడు దూరంలో నీరున్నా అంటరానితనంతో దానిని అందుకోవడానికి పైకులం వాడి దయాధర్మాలకు వేచివుండటం!

నవల చదవటం ప్రారంభించినపుడు ఆ బాష వల్లా, అప్పటి నైసర్గిక, సామాజిక చిత్రం మీద అవగాహన లేక పోవడం వల్లా అందులో తాదాత్మ్యం చెందడానికి సమయం పట్టింది. అయితే ఓసారి ఆ కాలువల గట్లూ, పడవ ప్రయాణాలూ, కేవు, సరంగు, కళాసీ లాంటి పదాలూ ఒంటబట్టాక ఇక నేను ఆ కాలంలోకి ప్రవేశించినట్లయింది.

ఏ పాత్రా రచయిత సృష్టించిన పాత్రలా వుండదు. ప్రతి పాత్రా తన స్వంత ముద్రతో ప్రత్యేకమై సహజాతిసహజంగా వుంటుంది.

కినిగె [2] వారు ప్రస్తుతం ఈ నవలని ఉచితంగా కూడా ఇస్తున్నారు.


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=246

URLs in this post:

[1] కినిగె: http://www.kinige.com

[2] కినిగె: http://kinige.com/kbook.php?id=1210&name=Kollayi+Gattitenemi