కొల్లాయి గట్టితేనేమి?

తేది: October 12, 2012 వర్గం: పుస్తకాలు, వర్గీకరింపబడనివి రచన: చరసాల 2,853 views

ఈ అద్భుతమైన నవలని ఇన్నాళ్ళూ చదవనందుకు చాలా సిగ్గేస్తోంది. ఇప్పుడైనా చదవగలిగానూ అంటే కినిగె పుణ్యమే!

1920 – 21 నాటి జాతీయోడ్యమం, సామాన్యుల మీద గాంధీగారి ప్రభావం, అప్పట్లో వున్న సామాజిక దురాచారాల గాఢత… ఇంకా ఇంకా ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే కాలచక్రాన్ని వెనక్కు తిప్పి ఆనాటి ముంగండ గ్రామ సామాజిక, ఆర్థిక పరిస్థితులని చూడొచ్చు.

ఈ నవలలో అన్నిటికీ మించి నన్ను కదిలించిన సన్నివేశం, బారెడు దూరంలో నీరున్నా అంటరానితనంతో దానిని అందుకోవడానికి పైకులం వాడి దయాధర్మాలకు వేచివుండటం!

నవల చదవటం ప్రారంభించినపుడు ఆ బాష వల్లా, అప్పటి నైసర్గిక, సామాజిక చిత్రం మీద అవగాహన లేక పోవడం వల్లా అందులో తాదాత్మ్యం చెందడానికి సమయం పట్టింది. అయితే ఓసారి ఆ కాలువల గట్లూ, పడవ ప్రయాణాలూ, కేవు, సరంగు, కళాసీ లాంటి పదాలూ ఒంటబట్టాక ఇక నేను ఆ కాలంలోకి ప్రవేశించినట్లయింది.

ఏ పాత్రా రచయిత సృష్టించిన పాత్రలా వుండదు. ప్రతి పాత్రా తన స్వంత ముద్రతో ప్రత్యేకమై సహజాతిసహజంగా వుంటుంది.

కినిగె వారు ప్రస్తుతం ఈ నవలని ఉచితంగా కూడా ఇస్తున్నారు.

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'కొల్లాయి గట్టితేనేమి?' పై 3 అభిప్రాయాలు

'కొల్లాయి గట్టితేనేమి?'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. Sowmya అభిప్రాయం,

  తేది: October 15, 2012 సమయము: 9:13 am

  ఈ పుస్తకం ప్రాజెక్టు గుటెంబర్గ్ లో ఉచితంగా లభ్యం. ఇదే కాదు, రామమోహనరావు గారి మరి రెండు పుస్తకాలు కూడా ప్రస్తుతం్ అక్కడ ఉచితంగానే లభిస్తున్నాయి.
  http://www.gutenberg.org/cache/epub/40687/pg40687.html

 2. చరసాల అభిప్రాయం,

  తేది: October 26, 2012 సమయము: 9:21 am

  కృతజ్ఞతలు సౌమ్య గారూ.

  ఆ మిగిలిన రెండు పుస్తకాలూ వాటి లంకెలూ:
  శుభలేఖ: http://www.gutenberg.org/files/39004/39004-0.txt
  అగ్నిగుండం: http://www.gutenberg.org/files/39561/39561-0.txt

 3. Naresh అభిప్రాయం,

  తేది: December 13, 2012 సమయము: 1:51 pm

  దన్యవాదములు….

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో