కోటేశ్వరవ్వ “నిర్జన వారధి”

తేది: October 8, 2012 వర్గం: వర్గీకరింపబడనివి రచన: చరసాల 4,169 views

అయింష్టంగానైనా కొండపల్లి కోటేశ్వరమ్మని కొండపల్లి సీతారామయ్య భార్యగా పరిచయం చేయాల్సి వస్తోంది. ఎందుకంటే నాలాంటి వారికి ఆమె తెలియదు. ఆమె స్వీయ కథ, నిర్జన వారధిని చదివే ఆసక్తి కలగడానికి ఆమె సీతారామయ్య భార్య కావడమే కారణం. కానీ చదవడం మొదలెట్టాకా చివరికంటా చదవడానికి కారణం మాత్రం కోటేశ్వరమ్మే కాదు కాదు కోటేశ్వరవ్వే! ఆమె నడుస్తున్న చరిత్ర. తనకు తాను దీపపు వత్తియై, తన్ను తాను వెలిగించు కొని, నమ్మిన సిద్దాంతం కొరకు జీవితాన్ని, పిల్లలనీ, తల్లినీ, తననూ, తన ఆస్తినీ సర్వస్వాన్నీ ధారపోసి, ధారపోసే వారుంటారా అన్న సందేహానికి కోటేశ్వరవ్వ ఒక నిలువెత్తు సాక్ష్యం.

ఆమె ఆమెగానే సర్వ స్వతంత్రంగా బ్రతికిన కోటేశ్వరవ్వని ఇంకొకరి భార్యగా పరిచయం చేయాల్సి రావడం దురదృష్టమనే వుద్దేశ్యంతో నేను అయిష్టమన్నాను. నిజానికి కమ్యూనిస్టు వుద్యమానికి పరిచయం చెయ్యడమే సీతారామయ్య ఈ అమ్మకు చేసిన ఉపకారం(?). కమ్యూనిస్టు వుద్యమంలో దిగిన రోజునుండి ఈమె తన సర్వస్వాన్నీ పార్టీకి, వుద్యమానికే అర్పించింది.

ఈ కథ రాసిన తీరు, అవ్వ మన పక్కన కూర్చుని తన కథ చెబుతున్నట్లే వుంటుంది. చివరి వరకూ ఎక్కడా ఆత్మస్తుతీ, పరనిందా కనిపించవు. అలా అని తనతో వుద్యమంలో కలిసి నడిచిన వారి త్యాగాలని ఎక్కడా మెచ్చకుండా వుండదు. అప్పట్లో ఇంత మంచివారు వుండేవారా అని ఆశ్చర్యమనిపిస్తుంది.

అజ్ఞాతంలో వున్నపుడు పార్టీ నిర్ణయానుసారం గర్భస్రావం చేయించుకోవడం, అదీ మోటుపద్దతుల్లో, సరైన వైద్యసౌకర్యం లేక ప్రాణాలమీదకి తెచ్చుకోవడం… గుండెని మెలిపెడుతుంది. ఒక ద్యేయాన్ని, ఆశయాన్ని ఇంత భయంకరంగా నమ్ముతారా అనిపిస్తుంది.

భర్త తన్ను విడిచి వెళ్ళడం, కొడుకు నక్సలైటు వుద్యమంలో చేరి చివరికి మాయమైపోవడం, వడదెబ్బతో అల్లుడు, ఆ భాధతో కూతురూ అంతకు మునుపే జీవితమంతా తోడుగా నిలిచిన తల్లీ చనిపోవడం చదువుతుంటే వంటిలో వున్న కన్నీరంతా ఆవిరౌతుంది.

కానీ అవ్వ చెప్పిందంతా తన మొత్తం కథలో పైపై విషయాలేనేమొ అనిపిస్తుంది. తను పాల్గొన్న ప్రతి వేదికా, పోరాటం గురించి చెబితే పెద్ద గ్రంధమౌతుందేమొ!

కోటేశ్వరవ్వ జీవితంలో అన్ని పాత్రలలోకీ నన్ను బాగా ఆకర్శించింది, కోటేశ్వరమ్మకి త్యాగంలో ధీటుగా నిలిచింది ఆమె అమ్మగారు. ఆమె కూడా తన జీవితాన్ని కర్పూరంలా వెలిగించింది. ఏ వుద్యమ ప్రభావం ఆమె మీద లేకున్నా అప్పట్లోనే తన కూతురికి వితంతు వివాహం చేయడానికి పోరాడుతుంది. ఆ తర్వాత కూతురివెంటే వుంటూ వుద్యమానికి తనదైన సహాయం చేస్తూ వచ్చింది. చివరికి తను చనిపోబోయేముందు తను దాచుకున్న రెండువేల రూపాయల్లో ఊభయ కమ్యూనిస్టుపార్టీలకీ చెరో వెయ్యి విరాళం ఇమ్మని చెప్పడం గుండెని కరిగించేస్తుంది. నాకైతే ఏడుపులో వెక్కిళ్ళు రాకుండా ఆపుకోవడం కష్టమయిపోయింది.

చివరిగా నాకు శిఖరసమానమైన కోటేశ్వరవ్వ వ్యక్తిత్వంలో పలుకురాయిల అనిపించింది, సీతారామయ్య చివరిరోజుల్లో అతన్ని చూడ నిరాకరించడం, చివరివరకూ తనని క్షమించకపోవడం. సీతారామయ్య ఒక భర్తగా తనకి తీరని అన్యాయం చేసి వుండవచ్చు అయినా గానీ తను కూడా ఈమె లాగానే పార్టీని దాని ఆదర్షాన్ని శ్వాసగా చేసుకున్నవాడే! ఒక సహాధ్యాయికి మల్లే తను చేయగలిగిన సేవలు చేయకుండా పార్టీకి మల్లేనే తనూ వదిలేసి వృద్దాశ్రమంలో చేరడం ఆయనమీద ఆమెకి తీరని కోపమేమొ!

ఓ వంద పైచిలుకు పుటల్లో రాసిన ఓ వండేళ్ళ చరిత్ర “నిర్జన వారధి”!

  చివరి మాట

కినిగె” ముందటిరోజుల్లో ఏదైనా ఓ పుస్తకాన్ని చదవాలంటే avkf.org లాంటి సైట్లమీదో మితృల మీదో ఆధారపడి పుస్తకాలని తెప్పించుకోవాల్సి వచ్చేది. లేదా ఇండియా వెళ్ళినపుడు లేని సమయంలో, దుకాణాల వెంట తిరిగి తీరా పెద్ద పెద్ద సంచుల్లో పచ్చడి జాడీలతో పోటీ పెట్టి తెచ్చుకోవాల్సివచ్చేది. అంటే ఓ పుస్తకం చదవాలి అనుకున్నప్పటినుండీ చదివే రోజుకు మధ్య వారాలు లేదా నెలలు వుండేది.
ఇప్పుడు ఏ పుస్తకమైనా కినిగేలో వుంటే మాత్రం అది మన వళ్ళో వున్నట్లే! iPad లాంటి tablets వుంటే అది అక్షరాలా నిజం!
పుస్తకాలు చదవడాన్ని ఇంత సులభతరం చేసిన కినిగె వారికి కృతజ్ఞతలు.

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'కోటేశ్వరవ్వ “నిర్జన వారధి”' పై 7 అభిప్రాయాలు

'కోటేశ్వరవ్వ “నిర్జన వారధి”'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. Narayanaswamy అభిప్రాయం,

  తేది: October 8, 2012 సమయము: 8:59 pm

  ప్రసాదు. ఎనాళ్ళకెన్నాళ్ళకు. చాలా సంతోషం

 2. చరసాల అభిప్రాయం,

  తేది: October 9, 2012 సమయము: 7:56 am

  కృతజ్ఞతలు కొత్తపాళి గారు.
  ఇప్పుడూ నిలకడగా రాస్తానో లేదో! కానీ బ్లాగ్లోకాన్ని బాగా మిస్సవ్వుతున్నానని మాత్రం చెప్పగలను.

 3. Sowmya అభిప్రాయం,

  తేది: October 10, 2012 సమయము: 12:55 am

  ఎన్నళ్ళాకి రాశారండీ మళ్ళీ! :-)

  నా మీద కూడా విపరీతంగా ప్రభావం చూపిందీ పుస్తకం. ఇప్పటికే ఒక ఐదు ప్రింటు కాపీలు కొనిపించా జనాల చేత. ఇంకా కొనిపించే ప్రయత్నాల్లో ఉన్నా ;)

  ఇకపోతే, మీకు నచ్చని ఆ జవాబు (సీతారామయ్య ను చూడ నిరాకరించడం, తదనంతర సంఘటనలు) – ఈ పుస్తకం చదువుతూ ఉండగా “నాకు ఆయన్ని చూడాలని ఉండొద్దా?” అని ఆవిడ వేసిన ప్రశ్నను నేను మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను. ఆ జవాబులోనే ఆవిడపై నాకు ఎనలేని గౌరవం కలిగింది. ఆవిడ కూడా తరువాత ఒక చోట అంటారు – “సీతారామయ్య మాత్రం ఏం సుఖపడ్డాడు” అని. అప్పుడు ఇంకా గౌరవం పెరిగింది..

 4. chavakiran అభిప్రాయం,

  తేది: October 10, 2012 సమయము: 1:53 am

  నాకు మాత్రం చివరలో ఆయనకు ఇష్టమైన కూరలు పంపుతానన్నప్పుడు నచ్చలేదు :-) మోటుగా చెప్పాలంటే, కూరలు కాదు కొరకాసు పంపాల్సింది.

 5. సిరిసిరిమువ్వ అభిప్రాయం,

  తేది: October 10, 2012 సమయము: 3:08 am

  ప్రసాద్ గారూ ఎన్ని రోజులకి!
  హైదరాబాదు వెళ్ళినప్పుడు అచ్చు పుస్తకం కొని చదువుదామని ఆగాను ..కానీ మీ అందరి రివ్యూలు చూస్తుంటే ఈ పుస్తకం ఇప్పుడే చదివేయాలనిపిస్తుంది.

 6. చరసాల అభిప్రాయం,

  తేది: October 10, 2012 సమయము: 9:45 am

  మీ వాఖ్యలు చదువుతుంటే మళ్ళీ మీ మధ్య తిరుగుతున్నట్లుంది. మీ అబిమానానికి కృతజ్ఞున్ని.

  సౌమ్య గారూ,
  “నాకు ఆయన్ని చూడాలని ఉండొద్దా?” అనడం ఆమె స్వతంత్ర వ్యక్తిత్వానికి సాక్ష్యం. ఆమె నిర్ణయాన్ని మనం ప్రశ్నించజాలం గానీ, అప్పటివరకు ఆమె మీద నేను ఏర్పరచుకున్న గౌరవానికి అది తగ్గట్టుగా అనిపించలేదు. మూడేళ్ళు కలిసి చదువుకున్న క్లాస్‌మేట్ కనిపిస్తేనే చూడాలనిపిస్తుంది కదా (రాగ ద్వేషాలు మనల్ని ప్రభావితం చెయ్యకపోతే)! అలాంటిది కలిసి ఒకే కప్పు కింద, ఒకే ఆదర్షం కిందా వున్నవాళ్ళకి 35 సంవత్సరాల తర్వాత చూడాలని వుండక పోవటమేంటా అని!! ఆమెకు చూడాలని లేదు అంటే ఆ నిర్ణయంలో అతను ఆమె పట్ల చూపిన నిర్దయ కారణమయ్యిందే అని నా బాధ.

  కిరణ్,
  “కొరకాసు” అంటే “కొరగాని కాసు” అనేనా అర్థం? నా నమ్మిక ఏమిటంటే ద్వేషం, కోపం ఒకరిమీద వుండవచ్చు అయితే అవి మన నిర్ణయాలకు కారణాలవకూడదు. ఆయనమీది కోపం తనని అయినా నిర్జన వారధిలో మనం కోటేశ్వరవ్వ కళ్ళతోనే సీతారామయ్యను కొలిచాం! మరి అటువైపునుండీ చూడకుండా తనని ద్వేషించలేము కదా!

  సిరిసిరిమువ్వ గారూ,
  ఆకలేసినపుడు తినెయ్యడమే! పైగా కినిగె ఆ రుచులని అంతర్జాలంలో చిటికె దూరంలో వుంచిందాయె!


 7. తేది: October 21, 2012 సమయము: 8:45 am

  [...] పుస్తకం.నెట్లో రాసిన వ్యాసాన్నీ, చరసాల ప్రసాద్ గారి బ్లాగులో రాసిన వ్యాసాన్నీ [...]

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో