రెంటాల కల్పన గారి “తన్హాయి”

తేది: October 3, 2012 వర్గం: వర్గీకరింపబడనివి రచన: చరసాల 3,068 views

ఎంచుకొన్న అంశమే సాహసోపేతమయింది. పెళ్ళి తర్వాత పెళ్ళికి బయట ప్రేమ అనేది సాధ్యమే, అది అన్నింటా వున్నదే అని బహిరంగంగా అంగీకరించలేని సమాజంలో కల్హార పాత్ర ద్వారా అది ఎంత సహజమో నిరూపించే ప్రయత్నం సఫలమయిందనే అనాలి. అలాంటి సందర్భాలలో ఎలాంటి భావ సంఘర్షణకు లోనవుతారో చక్కగా చూపించారు.
వ్యక్తి స్వేచ్చా, ఇచ్చా ముఖ్యమా సమాజ హితం ముఖ్యమా? అనేది అంత సులబంగా తేలే వ్యవహారం కాదు. కల్హార ఎంతగా వ్యక్తి స్వేచ్చను వెనుకేసుకొచ్చినా చివరికి సమాజ బంధానికే విలువ నివ్వడం, సమాజ హితమే ముఖ్యమన్న భావన ఎంతలా మనల్లో పాతుకు పోయిందో చెబుతోంది.
ఒక తల్లి ఇద్దరు పిల్లలని ప్రేమించగలిగినపుడు, చివరికి ఒక మగాడు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను ప్రేమించగలిగినపుడు, ఆడది మాత్రం ఒక మగాన్నే ఎందుకు ప్రేమించాలి? అది మాత్రమే సమాజ హితం ఎలా అవుతుంది అన్నదానికి ఎవరైనా సమాధానం చెప్పగలరా? బహుశా సమాజానికున్న అభ్యంతరం ప్రేమించడం కాదేమో! సంసారం చేయడమేమొ!
ఎందుకంటే ఈ సంఘర్షణలో కల్హార, కౌశిక్‌లు కలిసి బ్రతకాడినికి వారికి ముఖ్యంగా అడ్డుతగిలింది పిల్లలే! ఇందులో ఏ పాపం తెలియని పిల్లలు ఎందుకు బలవ్వాలన్న సాధారణ లాజిక్ వారిని వారి వారి వాంక్షలను చంపుకునేలా చేసింది.
హ్‌మ్ … అన్నీ ప్రశ్నలే చదువుతున్నంతసేపూ, చదివాకా…

నేను iTunes version చదివాను. బహుశా ప్రింటులో లేవేమో గానీ ఇందులో చాలా అక్షర దోశాలు వున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీషు పదాలని తెలుగులిపిలో చూపించినపుడు అది చదవలేని విధంగా అయింది. ఇందులోని ముఖ్య పాత్రలు నాలుగూ బహు మంచి పాత్రలు గావడం అంత సహజంగా వున్నట్లనిపించ లేదు. మధ్యలో రాజీవ్ ప్రస్తావన తెచ్చి అర్ధాంతరంగా ఆపేసినట్లు అనిపించింది. కాలేజీ రోజుల్లో రాజీవ్‌ను ప్రోత్సహించి (లేదా అతన్ని మొదట్లోనే అడ్డుకోకుండా) చివరలో అతన్ని తిరస్కరించింది అన్న కథనం కల్హార మీద అంతవరకూ వున్న గౌరవం పాఠకుడికి తగ్గేలా వుంది. ఇక నావరకూ కొన్ని చోట్ల కల్హార అంతఃసంఘర్షణ పునరుక్తిగా అనిపించి పేజీలూ గబగబా తిప్పేద్దామా అనిపించింది.

మొత్తం మీద ప్రేమను ఓ కొత్త కోణంలో చూపించిన ఈ రచన తప్పక చదవతగ్గది.

http://www.amazon.com/dp/0984576215/ref=rdr_ext_tmb

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 ఓట్లు, సగటు: 5 కు 3.50)
Loading ... Loading ...

'రెంటాల కల్పన గారి “తన్హాయి”' పై 5 అభిప్రాయాలు

'రెంటాల కల్పన గారి “తన్హాయి”'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. kalpana అభిప్రాయం,

  తేది: October 3, 2012 సమయము: 9:24 am

  ప్రసాద్ గారు,
  మొదట Itunes version లొ తన్హాయీ కొని చదివినందుకు ధన్యవాదాలు.
  నవల మీద మీ అభిప్రాయం కూడా సూటి గా రాశారు. అక్షర దోషాలు మాత్రం నాకు కొత్త విషయం. మీరు చెప్పారు కాబట్టి ఒక సారి చెక్ చేసి మళ్ళీ మీకు తెలియచేస్తాను. ఎందుకు అలా జరిగిందో? ఫాంట్ కన్వర్షన్ లో లోపం అయిఉండాలి. అయినా వాటిని కూడా చెక్ చేయించాము. ఎక్కడ పొరపాటు జరిగిందో చూసి సరి చేసే ప్రయత్నం చేయగలమెమో చూస్తాను.

  మరో సారి నవల చదివి మీ అభిప్రాయం రాసి నాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు.

 2. kalpana అభిప్రాయం,

  తేది: October 3, 2012 సమయము: 9:30 am

  మీరు ఐ ట్యూన్స్ లో బుక్ కొని చదివారు కదా. బహుశా ఐ ట్యూన్స్ నుంచి మీరు కొన్న మొదటి తెలుగు పుస్తకం ఇదే అయి ఉంటుంది. అవునా? మరి ఆ అనుభవం, అందులోని సాధక బాధకాలు కూడా తెలియచేస్తే మాకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏమంటారు?

 3. Vanaja Tatineni అభిప్రాయం,

  తేది: October 3, 2012 సమయము: 11:17 am

  మీ పఠనానుభూతి, మీ అభిప్రాయం చాలా బాగా చెప్పారు. మరొక కొత్తకోణం లొ ఈ నవలని చూసే అవకాశం కల్గించారు.ధన్యవాదములు.

 4. చరసాల అభిప్రాయం,

  తేది: October 3, 2012 సమయము: 11:29 am

  కల్పన గారు,
  మీరూహించినట్లే iTunesలో నేకొన్న మొదటి పుస్తకం “తన్హాయి”నే. Very simple!.
  ఏ ఇతర app కొన్నట్టుగానే బుక్ స్టోర్‌లో tanhayi అని వెతికి, price button మీద తడితే, associated apple id password అదుగుతుంది. అదివ్వగానే download button enable అవుతుంది.
  download చేసి వెంటనే చదివేసెయ్యడమే!

 5. Raj అభిప్రాయం,

  తేది: October 3, 2012 సమయము: 12:05 pm

  Prasad,

  Thanks for the review and most important, thanks for alerting on the errors in the iBook. I and Kalpana and Jyothi are seriously reviewing the iBooks again and we will fix these errors shortly.

  Raj

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో