వికీలీక్స్ చర్యలు ఆమోదనీయమేనా?

తేది: December 8, 2010 వర్గం: వర్గీకరింపబడనివి రచన: చరసాల 2,287 views

వారం పైగా ప్రతి నిత్యం వికీలీక్స్ మరియు దాని అధినేత అసాంజీ వార్తల్లో నానుతున్నారు. ప్రభుత్వాల మధ్య, ప్రభుత్వ విభాగాల మధ్య జరిగిన సున్నిత సమాచార మార్పిడిని ఈ సంస్థ అంతర్జాల మీడియా ద్వారా బహిరంగ పరుస్తోంది.

ఈ విశయం చిలికి చిలికి గాలి వాన కాగానే వికీలీక్స్ మద్దతుదారులకు, వ్యతిరేకులకు సైబర్‌వార్ నడుస్తోంది. మొదట వికిలీక్స్ వెబ్‌సైట్‌ను హోస్ట్ చేసిన EveryDNS.net చేతులెత్తేసి, తమమీద సైబర్ దాడులు జరిగే అవకాశముందంటూ వికీలీక్స్‌ను తమ సర్వర్ల నుండి తొలగించింది. అదే దారిలో నడుస్తూ Amazon, Paypal తమ సేవలు నిరాకరించాయి. ఇప్పుడు VISA మరియు Master Card కంపెనీలు విలీలీక్స్‌కు తమ సేవలను నిరాకరించాయి.

ఈ నిరాకరణతో మరింత రెచ్చిపోయిన వికీలీక్స్ మద్దతుదారులు ఆయా కంపెనీల మీద సైబర్ దాదులతో విరుచుకు పడ్డారు. వారి దెబ్బకు ఈ వుదయం Master Card కార్యకలాపాలు స్థంబించాయని వార్త!

ఈ తతంగమంతా చూస్తుంటే అసలు సమాచార స్వేచ్చ పేరుతో వికీలీక్స్ చేస్తున్న పనులు సమ్మతమేనా అన్న అనుమానం వచ్చింది. ఓ మనిషికి వ్యక్తిగతం వున్నట్లే దేశాలకీ, ప్రభుత్వాలకీ వుంటుంది. దేశాల మధ్య మితృత్వాలూ, శతృత్వాలూ, రహస్యాలు, ప్రణాళికలు, తంత్రాలు వుంటాయి. ఈ సున్నిత సమాచారం బహిర్గితం కావడమంటే దేశాల సార్వభౌమత్వ హక్కుకు భంగం కలగడమే కాకుండా, ఒకరి మీద ఒకరికి అనుమానాలు పెరిగి అవ్యవస్థ తయారుగావచ్చు. ఇలాంటి సమాచరం బయటకు తేవడం వల్ల సామాన్యుడికి కలిగే వుపయోగమేమిటో నాకెంతకూ తోచడం లేదు.

అలాగని వికీలీక్స్‌ను న్యాయబద్దంగా ఎదుర్కోకుండా, ఇలా ఈ సైబర్ యుగంలో అత్యవసరాలనదగ్గ సర్వీసులని నిరాకరించడం ప్రజాస్వమ్యబద్దంగా లేదు. ఈ వుదంతంతో ఈ కంపెనీలు చివరగా తమ విధేయతను ఎవరికి చూపిస్తాయో తెలిసిపోతోంది.

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 ఓట్లు, సగటు: 5 కు 4.50)
Loading ... Loading ...

'వికీలీక్స్ చర్యలు ఆమోదనీయమేనా?' పై 5 అభిప్రాయాలు

'వికీలీక్స్ చర్యలు ఆమోదనీయమేనా?'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. తాడేపల్లి అభిప్రాయం,

  తేది: December 9, 2010 సమయము: 3:15 am

  పౌరుల వ్యక్తిగత ఆంతరంగికతా (Privacy) భద్రతను ప్రభుత్వాలు ఉగ్రవాద నిఘా పేరిట అడుగడుగునా ఉల్లంఘిస్తున్నాయి. ప్రజల్ని బట్టలిప్పి శ్కానర్ల ముందు నిలబెట్టడానికి వెనుకాడడం లేదు. వారి ఫోను సంభాషణల్ని టా౨ప్/ మానిటర్ చేస్తున్నాయి. అటువంటప్పుడు ప్రభుత్వాల ప్రైవసీని ప్రజలు గౌరవించి అంగీకరించి కాపాడాల్సిన అవసరమేమీ లేదు. Let them give respect and take respect.

  అంగీకారయోగ్యం/ ఆమోదయోగ్యం/ ఆమోదనీయం

 2. Indian Minerva అభిప్రాయం,

  తేది: December 9, 2010 సమయము: 4:15 am

  తాడేపల్లిగారి అభిప్రాయంతో నేనేకీభవిస్తున్నాను.

  పక్కదేశాల కొంపలుగూల్చడానికి గూడుపుఠాణీలు నడపడం సార్వభౌమాధికార పరిధిలోకి రాదనుకుంటా :)

 3. చరసాల అభిప్రాయం,

  తేది: December 9, 2010 సమయము: 2:03 pm

  క్రిస్టమస్ నాడు తన లోబట్టలలో పేలుడు పదార్థాలు తెచ్చుకొని విమానాన్ని పేల్చే ప్రయత్నం తీవ్రవాదులు చేయకుండా వుండినట్లయితే, ప్రభుత్వం ఇలాంటి స్కానర్ల జోలికి వెళ్ళ సాహసించేది కాదు.

  ఇది తీవ్రవాదులకు, వాళ్ళ ప్రయత్నాలను వమ్ము చేయలనుకుంటున్న ప్రభుత్వాలకు మధ్య జరుగుతున్న పోరు. అందులో సామాన్యులు సమిధలు.

 4. తాడేపల్లి అభిప్రాయం,

  తేది: December 10, 2010 సమయము: 12:29 am

  తీవ్రవాదం నేరుగా ప్రభుత్వాల సృష్టి. తాము ఉద్దేశపూర్వకంగా రాజేసిన కుంఫటికి తామే బలవుతున్నారు. ప్రభుత్వాల్ని చూసి జాలిపడ్డానికి ఏముంది ? ముఖ్యంగా ఒక అగ్రరాజ్యాన్ని చూసి ! తాలిబాన్ లనేవాళ్ళు తమ సృష్టేనని ఈమధ్య హిల్లరీ క్లింటన్ చేసిన ఉద్ఘాటన వినే ఉంటారు. సామాన్యుల్ని కాపాడ్డానికే ఈ శ్కానర్‌లు అని కబుర్లు చెబుతున్నారు.అసలు విషయం – తమని అసాసినేట్ చేస్తారేమోననే భయమే. These dirty governments don’t deserve even an inch of respect from people, let alone their official secrets.

 5. bhashyanth అభిప్రాయం,

  తేది: May 25, 2011 సమయము: 4:51 pm

  భాష్యంత్
  వీకి లీక్స్ చెస్తొంది ముమ్మటికి తప్పే. దేశాల మధ్య అనవసర దూరాలను స్రుస్టిస్తొంది.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో