ఇప్పుడు ప్రజా ప్రథినిధులనిపించారు!

తేది: December 12, 2009 వర్గం: వర్తమానం రచన: చరసాల 4,376 views

మొన్న రోశయ్య ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ నేను మన ప్రజాస్వామ్యానికి అర్థం వెతుకుతూనే వున్నాను. మెజారిటీ ప్రజల అభీష్టం, రాజ్యాంగ విలువలు వగైరా అన్నీ కూడా నేతిబీరకాయ లోని నెయ్యి చందమని పూర్తిగా అర్థమయ్యింది. ఇక్కడ నా అయిష్టం రోశయ్య ముఖ్యమంత్రి అవ్వడం మీద కాదు, అయిన విధానం మీద. ఈ తతంగం అంతటిలోనూ ప్రజల విశ్వాసాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. అప్పుడెప్పుడో రాజు చనిపోయి, తనకు వారసులెవ్వరూ లేకపోతే ఆస్థాన ఏనుగు ఎవరో ఒకరి మెడలో మాల వేసి రాజును చేసేదట! అది కథేనో లేక నిజమో తెలియదు గానీ, ఇప్పుడు జరిగింది అంతకంటే భిన్నంగా లేదు. కాకపోతే ఇక్కడ ఏనుగుకి బదులు సోనియా గాంధీ ఆ పని చేశారు.

ఈ పరిణామాలు, నాయకుల బహిరంగ వాఖ్యానాలూ ఎలా వున్నాయంటే ప్రజల ప్రాపు కోసం ఎవ్వరూ ప్రాకులాడక్కర లేదు, అధినేత్రి కరణ కురిస్తే చాలనుకుంటున్నారు. ఇది ఎంతవరకూ వెళుతోందంటే ప్రజాస్వామ్యపు మూలాన్నే కూలగొట్టేవరకు! నిజానికి తన నియోజక వర్గపు మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ఆ నియోజక వర్గ ప్రథినిధి మోయాలి. తన పార్టీ మెజారిటీ ప్రథినిధుల అభిప్రాయాన్ని ఆ పార్టీ అనుసరించాలి. కానీ అంతా తల్లకిందులు! చివరికి ఇప్పటి తరం ఈ తల్లకిందుల ఎవ్వారమే అసలైనదిగా భావించేటట్లు ఇది ముదిరిపోయింది.

ప్రజల అవసరాలు ఏ మంత్రికీ పట్టడం లేదు. రోశయ్య మాట మాటకీ తను ప్రజలకు బాద్యత వహిస్తున్నానే మాటే మరచిఫొయి, అమ్మ ఆజ్ఞ ఏదైయితే అది పాటిస్తా అంటూ పదే పదే వల్లె వేయడం ఏమాత్రం రుచికరంగా లేదు. ఇలా తను ఏదంటే అదే నోరెత్తకుండా వినే ఆంధ్ర ఎంపీలంటే ప్రధానికైనా, అమ్మకైనా ఎంతో ప్రేమ! వాళ్ళేం చెప్పినా చెల్లుతుందనే ధీమా జగన్ తిరుగుబాటును సమర్థంగా ఎదుర్కోవటంతో బాగా పెరిగినట్లుంది. అందువల్లనే కేవలం ఒకటి రెండు రోజుల కంటితుడుపు కసరత్తుతో తెలంగాణాకు అనుకూల ప్రకటన చేసేశారు. మనకు ఎదురేంటి అనే బలుపు కనిపిస్తోంది ఆ ప్రకటన వెనుకాల. కాకపోతే కేసీయార్ నెల ముందునుంచే ధీక్ష గురించి చెప్పినా చెవికెక్కలేదు. దీక్ష మొదలయ్యాకా చీమకుట్టినట్లు లేదు. తీరా అతని ఆరోగ్యం బాగా క్షీణించాక, విధ్యార్థుల ఆగ్రహం పెరిగాక అప్పుడు హడావుడిగా ఇక్కడో గంటా, అక్కడో గంటా చర్చించి ఆనక నిర్ణయం చెప్పడం! ఇందులో ఎక్కడా ప్రజల మాట గురించి పల్లెత్తు మాట లేదు.

హమ్మయ్య, ఇప్పుడు ఎమ్మెల్యేల రాజీనామాలు చూశాక నాకు కాస్తా తృప్తిగా వుంది. నా తృప్తి సమైఖ్యాంద్ర వుద్యమం గురించి, అది బలపడటం గురించి కాదు. కనీసం ఈ ఒక్క విశయంలోనైనా తమ రాజీనామా నిర్ణయం తమ పార్టీ నాయకుణ్ణి బట్టో లేక అధిష్టానాన్ని బట్టో గాక ప్రజల నాడిని బట్టి తీసుకున్నందుకు!

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (8 ఓట్లు, సగటు: 5 కు 4.50)
Loading ... Loading ...

'ఇప్పుడు ప్రజా ప్రథినిధులనిపించారు!' పై 11 అభిప్రాయాలు

'ఇప్పుడు ప్రజా ప్రథినిధులనిపించారు!'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. కిరణ్ అభిప్రాయం,

  తేది: December 12, 2009 సమయము: 5:09 pm

  కరెక్టుగా చెప్పారు :)

 2. అబ్రకదబ్ర అభిప్రాయం,

  తేది: December 12, 2009 సమయము: 5:38 pm

  >> “ఒకటి రెండు రోజుల కంటితుడుపు కసరత్తుతో”

  అది నిజం కాదు. రెండు నెలలుగా తెర వెనక జరిగిన కుట్రల ఫలితం ఈ నిర్ణయం. అది సోనియా పుట్టినరోజునే వెలువడటం కాకతాళీయం అనుకున్నారా? కేసీయార్ ఉత్తుత్తి దీక్ష దీనికో వంక మాత్రమే. కేసీయార్ ఇంతకు ముందూ ఇలాంటివెన్నో చేశాడు. అప్పుడెప్పుడూ దిగిరాని కేంద్రం ఇప్పుడు ముఖ్యమంత్రికి సైతం చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకోటం వెనక రెండ్రోజుల కసరత్తే ఉందంటే నమ్మలేం. ఇది జగన్‌ని దారిలో పెట్టటానికి, రాష్ట్రాన్ని పూర్తిగా హైకమాండ్ గుప్పిట్లోకి తెచ్చుకోటానికి, పనిలో పనిగా కర్నాటక, తమిళనాడు ప్రయోజనాలు (వాటితో పాటు వారివారి వ్యాపార ప్రయోజనాలు) కాపాడటానికి ప్రణబ్, అహ్మద్ పటేల్, మొయిలీ, చిదంబరం జనంలో వీసమెత్తు పలుకుబడి లేని కొందరు తెలంగాణ చెంచాగాళ్ల సాయంతో ఆడిన నాటకం. దీని వెనకున్నదంతా విభజించి పాలించటమనే కుటిల నీతే తప్ప తెలంగాణ ప్రజలపై ప్రేమ కాదు.

  రాష్ట్రంలో మెజారిటీ ప్రజలది సమైక్యవాదమేనన్నది నిర్వివాదాంశం. నలభై రెండు మంది ఎంపీల బలంతో కేంద్రంలో ఏ ప్రభుత్వ మనుగడకైనా కీలక మద్దతు అవసరమైన పెద్ద రాష్ట్రం విషయంలోనే మెజారిటీ ప్రజాభిప్రాయాన్ని పూచిక పుల్లలా తీసి పారేస్తే, రేపు ఒకవేళ తెలంగాణ వచ్చినా ఆ రాష్ట్రానికి ఉండే విలువేంటో ప్రత్యేకవాదులు గ్రహించాలి.

 3. మంచుపల్లకీ అభిప్రాయం,

  తేది: December 12, 2009 సమయము: 5:49 pm

  యా..లాజికల్ గా అలొచిస్తె ఆబ్రకదబ్ర గారు చెప్పిందే కరక్ట్ అనిపిస్తుంది.

 4. Sarath 'Kaalam' అభిప్రాయం,

  తేది: December 12, 2009 సమయము: 6:08 pm

  కాంగ్రెస్సుకి ఆసరా అయినా ఇంతమంది ఎం పిఈ లు ఒక్క రాష్ట్రంలోనే వుంటే ఎప్పటికయినా సమస్యే అని పనిలో పనిగా దూరాలోచన, దురాలోచనతో కూడిన విభజించు పాలించు ఎత్తుగడనేమో. మొన్నటిదాకా సోనియా వ్యవహార దక్షత మీద కాస్తో కూస్తో గౌరవం వుండేది. పొరపాట్లు అధిష్ఠానానికి కూడా సహజం పోనీ చేసిన పొరపాటు సవరించుకుంటారేమో S R C అంటూ కాలయాపన ఎత్తుగడ వేస్తారేమో అని ఆ గౌరవాన్ని కాస్త పెండింగులో పెట్టాను. కానీ తెలుస్తున్న వార్తలను బట్టి ఇతర సీనియర్ నాయకులు అది సూచించినా అమ్మగారు విండం లేదట. ఒకటి రెండు రోజుల్లో ఈ ఆగ్రహావేశాలని చల్లార్చిన ఘనకీర్తిని మూటగట్టుకొని తను తీసుకున్న నిర్ణయం అమలు చేయాల్సిందేనన్న మంకుపట్టుమీద వుందంట.

  ఎం ఎల్ ఏ ల రాజీనామాలకు అమ్మగారు భయపడరు – ఎంచక్కా రాష్ట్రపతి పాలన ద్వారా లాగించేస్తారు కాబట్టి ఎం పి లు, కేంద్ర మంత్రులు రాజీనామాచేసి అమ్మగారికి సెగ/పొగ పెట్టడమే చేయాల్సిన పని. అప్పుడు మాత్రమే తెలుస్తుంది (సమైక్య)ఆంధ్రుడి ఆత్మగౌరవం అంతటానూ.

 5. Sarath 'Kaalam' అభిప్రాయం,

  తేది: December 12, 2009 సమయము: 6:11 pm

  జై ఆబ్రకదబ్ర. నాకు మామూలుగా కాన్స్పిరసీ థియరీస్ అంటే చిరాకు గానీ ఈ తెలంగాణా నిర్ణయం..చిదంబరం, పిళ్ళైలు తొందరపడటం గమనిస్తుంటే సంథింగ్..సంథింగ్.. ఫిషీ గా అనిపిస్తోంది! మీకు?

 6. అబ్రకదబ్ర అభిప్రాయం,

  తేది: December 12, 2009 సమయము: 8:11 pm

  @శరత్:

  ఫిషీ యవ్వారం చాలా ఉంది.

  కేకే(శవరావు) బెంగాలుకి కాంగ్రెస్ ఇన్‌చార్జిగా వెళ్లాక అతనికి ప్రణబ్ ముఖర్జీతో పెరిగిన చనువు, ధర్మపురి శ్రీనివాస్‌కి పళనియప్పన్ చిదంబరంతో ఉన్న ఉమ్మడి వ్యాపార లావాదేవీలు .. తెలంగాణ వస్తే వారిద్దరికీ రాజకీయంగానూ, వ్యాపార పరంగానూ లాభించే అంశాలు .. ఈ కోణంలో ఆలోచించండి.

  అలాగే, ఈ యవ్వారంలో అసలు వినిపించని పేరు ఎస్.జైపాల్ రెడ్డిది. తెలంగాణకి తాను ముఖ్యమంత్రవుతానన్న ఆశతో కేంద్రంలో తన పలుకుబడి ఉపయోగించి చక్రం తిప్పాడని ఎమ్మెల్యేల గుసగుస. జగన్‌ని అణగదొక్కటం, చంద్రబాబు దిమ్మెరపోయేలా చెయ్యటం .. ఇవన్నీ బోనస్ కారణాలు.

  ఆంధ్రా/సీమల్లో ఒక్కుదుటన ఎగసిపడ్డ ప్రజాగ్రహానికి ప్రీ-ప్లానింగ్ చేసుకుని మరీ స్టేజ్ చేసే సమయం లేదన్నది కామన్ సెన్స్. హైదరాబాదులో కావలసినంత సమయం ఉంది .. అల్లర్లు ఏర్పాటు చేసుకోటానికి. రెండేళ్ల కిందట కేసీయార్ ఐదారు గంటల్లోనే దీక్ష ముగించినప్పుడు విద్యార్ధులెవరూ గొడవలు చెయ్యలేదేం? అప్పట్లో ఆయనపై అంతో ఇంతో జనాల్లో సానుభూతి, నమ్మకం ఉండేవి. ఇప్పుడు జీరోగా మిగిలిన కేసీయార్ దొంగ దీక్ష మొదటి రోజే విరమిస్తే ఆ స్థాయిలో ఎందుకు రెచ్చిపోయారు? దీని వెనక కాంగ్రెస్‌లో పైస్థాయిలో జరిగిన కుట్ర లేదంటే నమ్మలేం. హైదరాబాదులో జరిగిన విధ్వంసంలో ప్రతి సంఘటన వెనకా ఉన్నది వందా యాభైమందితో కూడిన ఒకే మూక .. గమనించారా?

 7. SRRao అభిప్రాయం,

  తేది: December 13, 2009 సమయము: 2:11 am

  చక్కటి రాజకీయ నాటకం ప్రదర్శితమవుతోంది. చూసి అనందించేవాళ్ళు ఆనందిస్తున్నారు. బాధపడేవాళ్ళు బాధపడుతున్నారు. సామాన్యుడు మాత్రం ఖర్మ అనుభవిస్తున్నాడు. తెలుగుతల్లి మాత్రం విలపిస్తోంది. రాజీనామాలన్నీ నిజాయితీకి కొలమానం కాదు.

 8. Raajugadu అభిప్రాయం,

  తేది: January 29, 2010 సమయము: 1:42 pm

  correct మాట చెప్పావుబ్బిఆసలు మనసులో మాట చెప్పావు అనుకో. తెలంగానా వస్తదో రాదోగానె, ఈ MLA, మంత్రులు కలిసి అమ్మగారిని యెదురించారుగా. ఈ జీవితంలో చూస్తాననుకోలదంటె నమ్ము

 9. prakash అభిప్రాయం,

  తేది: March 4, 2010 సమయము: 3:55 am

  అన్నయ్య.. ఏర్ పోర్ట్ అనుభవం సాచ్చిలో రాసుకుంటా.. ఒకసారి మీతో మాట్లాడాలి.. ఈ నెంబరుకు ఫోన్ కొట్టు.. 99482 99593

 10. లక్ష్యా అభిప్రాయం,

  తేది: May 4, 2010 సమయము: 1:18 pm

  ఓ రొజు కార్యలయంలొ పనిలెక ప్రొద్దుటూరు అని గూగులొ శొదిస్తె మీ బ్లాగ్ కనపడ్డాది. చాల చక్కగ వుంది. దానితొ చాలసార్లు బ్లాగ్ ను సందర్శిస్తె ఎలాంటి కొత్త సమచారం పొందపర్చులెదు. ఈ మద్య మల్లి సందర్శిస్తె చాల సంతొషం కల్గింది. చాల కస్టపడి తెలుగు లొ మీకు అభినందనలు తెలియచెస్తున్నను

  - లక్ష్యా

 11. Mani అభిప్రాయం,

  తేది: November 26, 2010 సమయము: 12:02 am

  నిన్న అలా తెలుగు బ్లాగుల కొసం గూగుల్ లో వెతుకుతూంటె ఈ బ్లాగు కనిపించింది. మీ బ్లాగు చాలా బాగున్నది.ఇది నెను తెలుగులొ మొదటిసారి వ్రాయడం.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో