ఇది కాంగ్రెస్ స్వంత వ్యవహారమా?

తేది: September 30, 2009 వర్గం: వర్తమానం రచన: చరసాల 2,613 views

 ఒక నల్లవాడు అమెరికా అధ్యక్షుడైనా, అకస్మాత్తుగా వైస్సార్ గల్లంతైనా చలించని నేను ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ తంతు చూస్తుంటే మాత్రం స్పందించకుండా అదే నా ఏడుపు ఏడవకుండా వుండలేకున్నాను.

నేను కాంగ్రెసు పక్షపాతినసలే కాదు. అయితే మాత్రం ఈ రాజ్యాంగభంగాన్ని సహించాల్సిందేనా? తెలుగువాడికి జరిగే అవమానాన్ని భరించాల్సిందేనా? ఎవరెన్ని చెప్పినా రాజశేఖర రెడ్డి లేనిదే కేవలం సోనియా బొమ్మ చూసి రాష్ట్ర ఓటర్లు కాంగ్రెసును మళ్ళీ అధికారంలోకి తెచ్చారంటే నేను నమ్మను. తను ఒంటిచేత్తో అటు మూకుమ్మడిగా కట్టగట్టిన మహాకూటమిని ఇటు స్వంత పక్షంలోని అస్మదీయులనీ ఎదుర్కొని విజయం సాధించాడు. అలాగని ఆయన కొడుకు ముఖ్యమంత్రి పదవికి అర్హుడని నేననను. ఇందిరా గాంధీ చనిపోతే రాజీవ్‌కున్న అర్హతే జగన్‌కూ వుంది. అందుకో, ఇందుకో ఎందుకో అధిక శాసనసభ్యుల మద్దతూ వుంది. అది చాలు కదా రాంజ్యాంగ నిభందనలను సంతృప్తి పరచడానికి.

మన ప్రజాస్వామ్యంలో మెజారిటీ భావన నేతిబీరకాయలో నెయ్యి లాంటిదేనని అందరికీ తెలిసిందే. ఇక కాంగ్రెసులోనయితే మరీను. అక్కడ పైవాడి ఒక్క ఓటు ప్రజలందరి ఓటుతో సమానం. మన్మోహన్ సింగ్ ఆ ఒక్క ఓటుతోనే ప్రధాని అయ్యుండవచ్చు. రాజసేఖర రెడ్డీ అలానే అయ్యుండవచ్చు. అయితే కనీసం రాజ్యాంగ బద్దం అనిపించడానికి “మమ” అనే తంతు జరగాలిగా, మనందరికీ అది తంతేనని తెలిసినా! రాష్ట్రపతికి సోనియా మద్దతు లేఖ ఒకటే సరిపోతుందా మన్మోహన్ ప్రధాని కావడానికి? మెజారిటీ MPల మద్దతు వుందని చూపక్కరలేదా? అలానే ఎంత రోశయ్యను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నా, శంఖంలో పోసిందే తీర్థమయినట్లు మెజారిటీ ఎమ్మెల్యేలతో చెప్పిస్తేనేగదా ముఖ్యమంత్రి అయ్యేది.

 ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం చూస్తే “ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు?” అన్న ప్రశ్నకి “సోనియా గాంధీ” అని విధ్యార్థులు సమాధానం రాసినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఎందుకంటే మన కాంగ్రెసోళ్ళు ఉపాద్యాయులైతే అదే సత్యమంటారు.

ఇంతకు ముందు అధిష్టానం నుండి ఓ దూత రహస్య సందేశం తెచ్చేవాడు. ఆ సందేశం ప్రకారం ఇక్కడ ఎమ్మెల్యేలు తమ నాయకున్ని ఎన్నుకునేవారు. ఛ ఛ అంత రహస్యం ఎందుకనుకున్నారో ఏమో గానీ ఇప్పుడదే సంప్రదాయమయిపోయింది. ముంఖ్యమంత్రి చనిపోయి నెలవుతున్నా CLP సమావేశం గానీ దాని వూసు గానీ లేకుండా రోశయ్యే CLP నాయకుడని చెప్పేవాళ్ళకి బుర్రలో గుజ్జు వుందా? లేకుంటే మనమేం చెప్పినా వినే తెగులున్నవాళ్ళే తెలుగువాళ్ళు అన్న నిశ్చయానికి డిల్లీ పెద్దలు వచ్చారా?

ఏదేమయినా ఇది కాంగ్రెసు స్వంత వ్యవహారం కాదు. రాజ్యాంగ సూత్రాలకు అవమానం. పదవిలో వుండి మరణించిన తెలుగు నాయకుడికీ, ప్రజలకూ అవమానం.

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'ఇది కాంగ్రెస్ స్వంత వ్యవహారమా?' పై 9 అభిప్రాయాలు

'ఇది కాంగ్రెస్ స్వంత వ్యవహారమా?'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. తాడేపల్లి అభిప్రాయం,

  తేది: October 1, 2009 సమయము: 6:19 am

  బ్లాగావరణానికి పునఃస్వాగతం చరసాల ప్రసాద్ గారూ !

  ఈ శాసనసభ్యులూ, మంత్రులూ నిజంగా తెలుగు ప్రజల ప్రతినిధులే అయితే మీ ఆవేదనలో అర్థముంది. కానీ దురదృష్టవశాత్తు మనసా, వాచా కర్మణా వీళ్ళు ప్రజాప్రతినిధులు కారు. వీళ్ళు తమ గుఱించి తాము అలా భావించుకోవడం లేదు. వీళ్ళు సాంకేతికం (technical) గా మాత్రమే ప్రజాప్రతినిధులు వాస్తవానికి వీళ్ళంతా చనిపోయిన రాజశేఖరరెడ్డికి ప్రతినిధులు. అతని ద్వారా టిక్కెట్ సంపాదించుకున్నవాళ్లూ, అతనికి పనులు చేసిపెట్టినవాళ్ళు, అతని చేత పనులు చేయించుకొన్నవాళ్ళు, అతని ద్వారా బాగా తినమరిగినవాళ్ళు. రెడ్డి కుటుంబీకులు అధికారంలో లేకపోతే పూర్వంలా తినడం కుదరదని భయపడుతున్నవాళ్ళు. తాము గతంలో తిన్న వివరాలు బయటికొస్తాయేమోనని ఏడుస్తున్నవాళ్ళు. ఇదీ వీళ్ళ అసలురంగు.

  రాజ్యాంగమంటారా ? అసలు రాజ్యాంగంలో పార్టీల ప్రసక్తే లేదు. లేకపోయినా ఫిరాయింపుల నిరోధ చట్టం తెచ్చారుగా ?

  కాంగ్రెస్ అధిష్ఠానం కోణంలో వారికున్న పరిమితుల గుఱించి వేఱే బ్లాగులో వ్యాఖ్యరాశాను.

 2. జ్యోతి అభిప్రాయం,

  తేది: October 1, 2009 సమయము: 8:20 am

  అదన్నమాట సంగతి ప్రసాద్ ..తాడేపల్లి గారు చెప్పింది నిజం. ఎవరి భయం వారిది. ఇది చూసి పార్టీలోని పెద్దలకు మండుతుంది. మనం ఈ తోలుబొమ్మలాట చూస్తుండాల్సిందే ప్రస్తుతానికి..

 3. రవికిరణ్ అభిప్రాయం,

  తేది: October 3, 2009 సమయము: 8:23 pm

  ప్రసాద్ సంవత్సరం రోజులు నిద్రపొయ్యావా? ఇండియాకెల్లిపొయావనుకున్నా. సంతోషం మళ్ళా బ్లాగు మొదలుపెట్టినందుకు.

  తాడేపల్లి గారు రెడ్లయినా, కమ్మోళ్ళయినా, దళితులైనా, బీసీలైనా, కనా కష్టం బాపనోళ్ళయినా ఎవరైనా రాజకీయ నాయకులు అందరూ ఒకటే. వాళ్ళ వల్ల సామాన్య జనాలకి అరోకొరో నష్టం తప్ప లాభవేవీ లేదు. ఐతే మనది ప్రజాస్వామ్యం కాబట్టి, వున్న స్వామ్యాల్లో అదే కొంచం నయం కాబట్టి, దానికో పద్దతంటూ వుంది కాబట్టి అధికార పక్షనాయకుడ్ని అధిష్టానం ఆదేశంతోనో, మరోరకంగానో కనీసం కంటితుడుపుగా ఎన్నిక అంటూ జరగాలి కదా. ఎంత సోనియమ్మ అధిష్టానం ఐతే మాత్రం, రారాణీ కాదుకదా. అందుకని ప్రసాదే రైటు.

  రవికిరణ్ తిమ్మిరెడ్డి.

 4. తాడేపల్లి అభిప్రాయం,

  తేది: October 3, 2009 సమయము: 11:24 pm

  రవికిరణ్ గారూ ! తొలిచూపులో మీ వ్యాఖ్య అర్థం కాలేదు. ఎందుకంటే నా వ్యాఖ్యలో కులప్రసక్తి లేదు. అయునా మీరు నన్ను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించినందుకు నెనరులు. ఇక్కడ రెడ్డికుటుంబీకులంటే రాజశేఖరరెడ్డి కుటుంబీకులని. (ఆ కుల లాబీ కూడా పనిచేస్తున్నమాట వాస్తవమేననుకోండి.)

 5. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: October 5, 2009 సమయము: 11:37 am

  తాడేపల్లి గారూ,
  మీ వాఖ్యలకు నెనర్లు.
  ఇప్పటి ఈ నాయకుల గురించి మీరన్న ప్రతి దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అయితే నేను మాట్లాడుతున్నది కేవలం ఇందులో దాగిన నియమాల గురించి.

  అమ్మాయీ అబ్బాయీ ఎంతగా ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నా చివరికి ఒకే గూడులో నివసిస్తున్నా “పెళ్ళి” అనే తంతు జరగందే దంపతులవ్వరు. ఇదీ అలాగే!

  రోశయ్య సమర్థుడనీ, జగన్ అవినీతిపరుడనీ ఇవ్వాళ మనం రాంజ్యాంగ ఉల్లంఘనలని చూసీ చూడనట్లు వుంటే అవే రేపు మనకు గుదిబండలవుతాయి. అత్యధిక కాంగ్రెసు ఎమ్మెల్యేలు గొంతెంత్తి మా నాయకుడు జగనే అంటుంటే (ఎందుకైనా గానీ) ఆయన్ను కాదని రోశయ్యను ముఖ్యమంత్రిని చేయదల్చుకుంటే అధిష్టానం అలాగే చేయొచ్చు. అయితే అది అనుమతించిన మార్గంలోనే జరగాలి. కనీసం జరుగుతున్నట్టు అనిపించాలి.

  అది జరగట్లేదనేదే నా బాధ!

  రవికిరణ్ గారూ,
  ఇండియాకు వెళ్ళడం ఇక చుట్టంగానే! మొన్న జూన్‌లో అమెరికాకు దత పుత్రుణ్ణయిపోయా!

  –ప్రసాద్
  http://blog.charasala.com

 6. తాడేపల్లి అభిప్రాయం,

  తేది: October 6, 2009 సమయము: 2:24 am

  ఈ నియమాల్లో ఇంకో నియమం కూడా ఉందండీ ! “మాకీ ముఖ్యమంత్రి నచ్చలేదు/ లేదా ఆ పోస్టుకి ఫలానా వ్యక్తి నచ్చాడు” అని ఏ శాసనసభ్యుడైనా రాష్ట్ర గవర్నరుకి లిఖితపూర్వకంగా వినతి చేస్తేనే బలనిరూపణకి ఆయన ఆదేశించాలట. లేకపోతే ఉన్నాయన్ని కొనసాగించడమే.మఱి మన శాసనసభ్యుల వైపునుంచి అలాంటిది ఇప్పటిదాకా జఱగలేదు. కనుక రోశయ్యగారి ముఖ్యమంత్రిత్వం ఇప్పటిదాకా వివాదరహితం అనే అనుకోవాలి.

 7. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: October 6, 2009 సమయము: 7:29 am

  కోర్టువారు అలాగే చెబుతున్నారు మరి! ఇక వినక చేసేదేముంది?
  – ప్రసాద్

 8. KOTESHWAR అభిప్రాయం,

  తేది: November 24, 2009 సమయము: 7:09 am

  రెడ్డి కుటుంబీకులు అధికారంలో లేకపోతే పూర్వంలా తినడం కుదరదని భయపడుతున్నవాళ్ళు. దీని కంటే రాజశేఖర రెడ్డి ని నమ్ముకున్నవాల్ల్ల్లూ ఆయన కొడుకుని నమ్ముకున్న వాల్ల్ల్లూ భాదపడు తున్నారు అంటె బాగుండెది అని అనుకుంటున్నాను

 9. Gopalnagar Plot Owners Welfare Association అభిప్రాయం,

  తేది: October 24, 2011 సమయము: 1:56 pm

  Dear Prasad,

  We started Gopalnagar Plot Owners Welfare Association in Gopalnagar Housing Colony, Hydernagar, Kukatpally.

  Please give wide publicity for our Gopalnagar plot owners in your media.

  Please visit the website for full information.

  http://gopalnagar.hpage.in

  The site which encourages the plot owners for constructing the individual houses and look after welfare of the plot owners.

  mail:- gopalnagar.hyd@gmail.com

  Thanking You Sir.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో