Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/22/11733922/html/blog/index.php:2) in /home/content/22/11733922/html/blog/wp-content/plugins/bad-behavior/bad-behavior/screener.inc.php on line 8
అంతరంగం » Blog Archive » నటనైనా అవసరం

నటనైనా అవసరం

తేది: September 30, 2009 వర్గం: అనుభవాలు రచన: చరసాల 4,158 views

బ్లాగ్లోకానికి దూరమై ఏడాదిపైన అయింది. మొన్న జరిగిన ఓ ఘటన మదిలో తొలిచేస్తూ ఏదోవిధంగా బయటపడాలని చూస్తోంది. కనీసం బ్లాగితేనయినా ఆ బాధ తగ్గుతుందేమోనని ఇలా కీబోర్డు పట్టాను.

గత శుక్రవారం (సెప్టంబరు 25) ఇక్కడ గాయని సునీత కార్యక్రమం వుండింది. అందుకు సంబందించిన ప్రకటన ఇక్కడ చూడండి. అందులో “శ్రియ” కనిపిస్తుందని పెద్దగానే ప్రకటించారు.  

Sunitha

నాకు సునీత పాటలను వినాలనే ఆశ కొంతైంతే శ్రియనూ చూడాలన్నదీ కొంత. మా ఇంటినుండీ ఈ కార్యక్రమం జరిగే ప్రదేశం గంటకు పైనే దూరం. అయినా టైర్లీడ్చుకుంటూ అంతాదాకా వెళ్ళి గంటన్నర ఆలస్యంగా మొదలైన ప్రోగ్రాంని కళ్ళూ, చెవులూ అప్పగించి చూస్తే తీరా శ్రియ గురించిన వూసే లేదు.

కార్యక్రమం మధ్యలో విరామ సమయంలో ఆయనెవరో నిర్వాహకుడు గాయకులనీ, వాద్యకారులనీ పరిచయం చేస్తుంటే “శ్రియ” “శ్రియ” అని జనాలు కేకలేస్తుంటే, ఆ నిర్వాహకుడు పొరపాటున కూడా శ్రియ గురించి మాట్లాడలేదు. పైగా “మా మాట నమ్మి వచ్చిన మీరంతా వెర్రి వెధవాయిలు” అనుకుంటున్నట్లు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

శ్రియ వస్తుందని ప్రకటనలో చెప్పిన నేరానికి కనీసం ప్రేక్షకులకి క్షమాపణో, సంజాయిషీనో ఇవ్వాల్సిన అవసరం వున్నట్లు ఆ పెద్ద మనిషికి గానీ ఇతర పెద్ద మనుషులకుగానీ తోచలేదు. తోచే వుంటుంది, వచ్చిన వారు వాళ్ళకి వెధవల్లా కనపడ్డప్పుడు బాధ పడుతున్నట్లు నటించడం కూడా శుద్ద దండగ అనుకుని వుంటారు.

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 4.00)
Loading ... Loading ...

'నటనైనా అవసరం' పై 8 అభిప్రాయాలు

'నటనైనా అవసరం'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. Praveen అభిప్రాయం,

  తేది: September 30, 2009 సమయము: 10:22 pm

  http://vak50.wordpress.com లాగే మీరు కూడా దీర్ఘ కాలం విరామంలో ఉన్నారని నాకు తెలుసు ప్రసాద్ గారు.

 2. జ్యోతి అభిప్రాయం,

  తేది: October 1, 2009 సమయము: 1:21 am

  కనీసం ఇలాగైనా బ్లాగు గుర్తొచ్చింది నయం. మరి ఆ నిర్వాహకుడిని ఎందుకు నిలదీయలేదు. అదే ఇక్కడైతే శ్రేయ రాకుంటే తన్నేవాళ్లేమో జనాలు. అంత పిచ్చి . ఊరుకుంటుంటే ఇలాగే పిచ్చాళ్లను చేస్తారు.

 3. raajEMdra kumaar dEvarapalli అభిప్రాయం,

  తేది: October 1, 2009 సమయము: 2:40 am

  శ్రియను మీ నిర్వాహకులు రప్పించలేకపోయినా మిమ్మల్ని బ్లాగుల్లోకి రప్పించింది :)
  ఎలా ఉన్నారు ప్రసాద్ గారు?

 4. గిరీశం అభిప్రాయం,

  తేది: October 1, 2009 సమయము: 10:31 am

  @ PKMCT
  జయహో… మాస్టర్ ఆఫ్ ద ఆబ్వియస్ :)

 5. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: October 5, 2009 సమయము: 11:49 am

  జ్యోతక్కా,
  నా రాతలకున్నంత ఆక్రోషం నా మాటలకుండదు. నిండు సభలో అడగడానికి నాకూ సభ్యత/మొహమాటం ఏదో అడ్డొచ్చింది.

  అయితే కార్యక్రమం తర్వాత అడిగాను. ఇది పద్దతిగా లేదు అని చెప్పాను. దానికి ఏదో చెప్పారు గానీ అది కరక్టు కాదని వాళ్ళకూ తెలుసు.

  రాజేంద్రకుమార్ గారు,
  నిజం చెప్పాలంటే బ్లాగుల్లోకి మళ్ళీ రావాలని ఎప్పటికప్పుడు అనుకుంటూనే వున్నాను. కాకపోతే “శ్రియ” దాన్ని threshold levelకు చేర్చింది.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 6. varalakashmi అభిప్రాయం,

  తేది: November 7, 2009 సమయము: 6:57 am

  అమెరిక వెల్లిన అంధ్ర యైన సగటు భారథీయుడిలా స్పందించారు

 7. prakash అభిప్రాయం,

  తేది: March 4, 2010 సమయము: 3:03 am

  ఎవరబ్బీ నువ్వు .. భలె రాస్తున్నావె ఇసేశాలన్నీ.. మాది అనంతపురంలె. సాచ్చి పెత్రికలొ పని చేస్తా ఉండాను. పేరు సెప్పలేదు కదా.. ప్రకాషు.

 8. raju అభిప్రాయం,

  తేది: March 13, 2011 సమయము: 4:09 am

  నమస్కారం.. నేను కొత్తగా బ్లాగు మొదలుపెట్టాను… దయచేసి మీ విలువయిన సలహాలు ఇవ్వండి…..http://nijajivitham.blogspot.com/

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో