మొసలి కన్నీరు

తేది: August 1, 2008 వర్గం: నా ఏడుపు రచన: చరసాల 5,101 views

మనది కర్మ భూమి. “ఇది మన కర్మ, ఎవరిని నిందించి ఏమి ప్రయోజనం?”, “ఎప్పుడో చేసుకున్న పాప ఫలం ఇప్పుడు ఇలా అనుభవించాడు(రు).” ఇలా అనుకునే జనాలు, ఇలాంటి తలాతోకా లేని వాజమ్మ సిద్దాంతాలూ నమ్మే వారూ, వాటిని పకడ్బందీగా ప్రచారం చేసే ఉద్దండ పండితులూ వున్నంత కాలం, కాకతీయ ఎక్స్‌ప్రెస్ కాలుతుంది, గౌతమి మండుతుంది, బెంగుళూరు పేలుతుంది, అహ్మదాబాదు హాహాకారాలు చేస్తుంది.

ఎన్ని జరిగినా మనకు కానీ మన నాయకులక్కానీ చీమకుట్టినట్లుండదు. ఇవన్నీ కంటి తుడుపు మాటలు. నోట్లోంచీ వూడిపడేవే, గుండెలోతుల్లోంచీ వచ్చేవి కావు. తన ప్రాణం తప్ప ఏ ఇతర ప్రాణమూ మనకు తీపి కాదు. ఏ అమ్మకూ తన బిడ్డల ప్రాణం తప్ప మరే బిడ్డ ప్రాణమూ ముఖ్యం కాదు. అదేమంటే ఇలా ప్రమాదం జరిగీ జరగ్గానే అలా “చింతిస్తారు” లేదా “ప్రాణాలకు వెల కడతారు.” ఎంత సిగ్గులేని బ్రతుకులు!

బస్సులూ, రైల్లూ ఈ రోజే కొత్తగా పుట్టలేదు. వాటిల్లో క్షేమంగా ప్రయాణించడమెలాగో ఈరోజు మనమే ఓ కమిటీ వేసి తేల్చాల్సిన పని లేదు. ఈ పాట్లు అన్నీ పడి, అనుభవంతో సమస్య పరిష్కారాలు కనుక్కున్న వారిని చూసి మనం నేర్చుకుంటే చాలు. అది చూసి వస్తాం, ఇది చూసి వస్తాం అంటూ పెద్ద దేశాలకు ప్రయాణాలు కట్టే ఈ వంచకులు నిజంగా ఏమైనా చూసి నేర్చుకుంటారో లేక యాత్రా విహారాలు చేస్తారో గానీ… రైలు బోగీ నిర్మాణం ఎలా వుండాలో వీరికి తెలియదనుకోవాలా?

ఉదాహరణకు ఇక్కడి మార్క్ రైలులో వున్న సదుపాయాలు చూద్దాం. ప్రతి బోగీలోనూ ఆ చివరా ఈ చివరా ఓ గొడ్డలి, ఱంపమూ కనిపించేలా ఓ గ్లాస్ డోర్ వెనుకాల వుంటాయి. మామూలుగా ఆ తలుపుకు తాళం వేసి వుంటుంది. అయితే ఆ అద్దం మీద “అత్యవసర సమయాలలో పగుల గొట్టండి.” అని వ్రాసి వుంటుంది. అలాగే ఆ చివరా, ఈ చివరా మంటల నార్పడానికి వుపయోగించే అగ్ని నిరోధక సాధనం వుంటుంది. దానిని క్రితం సారి ఎప్పుడు తనిఖీ చేశారో, మళ్ళీ తనిఖీ ఎప్పటిలోగా చేయాలో వ్రాసి వుంటుంది. ఇక అన్నిటినీ మించి ఇంచుమించు ప్రతి కిటికీ అత్యవసర సమయాలలో నిష్క్రమణ ద్వారంగా పనిచేసేలా రూపొందిస్తారు. అత్యవసర సమయాలలో ఆ కిటికీని ఎలా తెరవాలో స్పష్టంగా ప్రతి చోటా అక్షరాలలోనూ, బ్రెయిలీలోనూ వ్రాసి బొమ్మలతో సూచిస్తారు. భోగీ లోపల ఏ కిటికీ నిష్క్రమణ ద్వారంగా మార గలదో భోగీ వెలుపల కూడా సూచిస్తారు. (బహుశా బయటి వారు సహాయ పడలనుకునే సందర్భాలలో వుపయోగ పడుతుందనేమొ!)

వీటిల్లో ఏ ఒక్కటైనా గౌతమిలో వుండి వుంటే ఈ ప్రమాదంలో ఇంత మంది చనిపోయేవారా? ఖచ్చితంగా కాదు. మన అధికారులకు, నాయకులకు ఇలా ఒకన్ని చూసి నేర్చుకునే అలవాటు లేదు. తమకుగా తెలుసుకోరు.

ఇక ప్రజలా దున్నపోతులు. “మన కర్మ” అనే దళసరి చర్మం కప్పుకున్న స్పందన రహితులు. ఈ “కర్మ సిద్దాంతమే” మనకు బలం, బలహీనతా.

రోజూ ఇక్కడ లిప్ట్ ఎక్కినప్పుడల్లా హైదరాబాదులో ఎక్కిన లిప్టులు గుర్తుకు వచ్చి మనస్సు చివుక్కు మంటుంది. ఇక్కడి లిప్టులకు ఆటోమాటిక్‌గా మూసుకునే దళసరి ద్వారం వుంటే, అక్కడి వాటికి చాలా మట్టుకు “గ్రిల్” వుంటుంది. గ్రిల్ మూశాక చిన్న పిల్లలు పొరపాటున ఆ గ్రిల్‌లో చేతులు పెడితే ఏమవుతుంది? ఇలాంటి చిన్న ప్రమాదాలనీ నివారించలేని అశక్తులమా మనం? పోనీ అక్కడి లిప్టులు తయారుచేసే కంపెనీలకు ఈ విషయం తెలియదనుకోవాలా? కానే కాదు. అవి చేసే వారే ఇక్కడా చేస్తున్నారు.

అలాగే మా వూరిలో మా యింటితో సహా గమనించిందేమంటే, డాబా మీద పిట్ట గోడకు (రక్షణ గోడ) అమర్చిన గ్రిల్. ఇక్కడెక్కడా నిలువు వూచలే తప్ప అడ్డు వూచలున్న గ్రిల్ చూడలేదు. కానీ అక్కడ మా యింటితో సహా అడ్డమూ, నిలువూ వూచలున్నాయి. అడ్డంగా నిచ్చెనలా వుంటే పిల్లలకు ఎంత సులభం వాటిని ఎక్కి ఆడుకోవడం? అలా పైపైకి వెళ్ళి కిందికి చూసేటప్పుడు పొరబాటు జరిగితే ఎంత ప్రమాదం?

వుహు. మన దళసరి చర్మానికి ప్రమాదం జరిగాక ఏడవడమే గానీ ముందుగా అది జరగ్గుండా ఏమి చేయాలన్న ఆలోచనే రాదు. పోనీ పక్కవాన్ని చూసి నేర్చుకుంటామా అంటే అదీ లేదు.

మనం కర్మను నమ్ముకున్నన్నాళ్ళూ మన కర్మ ఇంతే!

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 ఓట్లు, సగటు: 5 కు 4.75)
Loading ... Loading ...

'మొసలి కన్నీరు' పై 14 అభిప్రాయాలు

'మొసలి కన్నీరు'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. tejashreyus అభిప్రాయం,

  తేది: August 1, 2008 సమయము: 9:57 pm

  మీరు చెప్పినవన్ని …నిజంగా మనకి తెలిసి నిర్లక్ష్యమ్ చెస్తున్నము…… బాగ రాసరు …..

 2. బుదరాజు అశ్విన్ అభిప్రాయం,

  తేది: August 1, 2008 సమయము: 10:54 pm

  ప్రసాద్ గారు మీరు లిఫ్ట్ గురించి: అప్పటిలో డోర్ మూసుకునే ఒక సదుపాయం ఉండేది ఇప్పటికీ ఉంది, కానీ 1999 లో అనుకుంటా ఆ క్లోసింగ్ సిస్టం లో ఇరుక్కుపోయి ఊపిరాడక ఒకతను చనిపోయాడని నేను చదివినట్టు గుర్తు. వాటి కన్నా ఈ గ్రిల్ ఉన్నవి కొంచం పర్లేదు కదా కానీ మీరన్నదీ వాస్తవమే పిల్లల విషయములో,

 3. నాగరాజా అభిప్రాయం,

  తేది: August 1, 2008 సమయము: 10:57 pm

  మీ ఆవేదన అర్థం అయ్యింది, టపా చదివిన తరువాత లోక్‌సత్తా అజెండా చదివేంత వరకూ మనసు అల్లకల్లోలం అయ్యింది.
  ఇక్కడ చూడండి! – http://www.loksatta.org/agenda.htm

 4. రాజు అభిప్రాయం,

  తేది: August 2, 2008 సమయము: 6:43 am

  మీరు చెప్పినట్లు ఇక్కడి వాహనాలలో ఉన్న ఏర్పాట్లు ప్రమాద సమయంలో చాలా సహాయపడతాయి. అన్ని కిటికీలను ప్రమాద సమయంలో తేలిగ్గా పీకి పారెయొచ్చు. కిటికీలు కూడా బాగా పెద్దగా ఉండి, ఒకేసారి ఇద్దరు బయటకు వచ్చే వీలు కల్పిస్తుంది. మన రైలు కిటికీలు చూస్తే ప్రాణం ఉసూరుమంటుంది. మన దేశంలో ప్రాణం ఖరీదు కేవలం లక్షలే. చార్జీలు పెంచలేదని గొప్పలు చెప్పుకుంటూ రైళ్ళను ఆధునీకరించకుండా ఉండే రైల్వే శాఖ తేలిగ్గానే చెల్లించగలదు, రైళ్ళను మృత్యు శకటాలుగా మార్చనూగలదు. ఖర్మ.

 5. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: August 2, 2008 సమయము: 6:48 am

  నివారించలేకేం..ఖర్చవుతుంది..కానీ సగటు భారతీయ ప్రాణం విలువ అంత ఖర్చుకు ఇంకా నోచుకోలేదు. ఇవన్నీ సమకూరుస్తాం కానీ టికెట్టు ధర రెండింతలు చేస్తాం అంటే ఒప్పుకుంటారా?? ధరలు తగ్గించండి అని సమ్మెలు, ధర్నాలు చెయ్యరూ??
  అమెరికాలో అయితే ఇలాంటివన్నీ భద్రతా సూచనలు పాటించకపోతే ఏ చిన్న ప్రమాదం జరిగినా దావా వేస్తారని అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తారు. దానితో పాటు కంపెనీలు ప్రతిదానికి పెద్దమెత్తంలో ఇన్సూరెన్సు తీసుకొని మొత్తం ఖర్చును టిక్కెట్టు ధరలో కలిపేస్తాయి.
  చవక ధరలు..చవకబారు సౌకర్యాలు..what do you expect? ISO-9000 service with pennies?

 6. చరసాల అభిప్రాయం,

  తేది: August 2, 2008 సమయము: 10:34 am

  రవి గారూ,
  మీ అభిప్రాయంతో ఏకీభవించలేను. నేను చెబుతున్న వాటిని అమలు చేయడానికి బుద్ది ఖర్చవుతుందేగానీ, డబ్బు ఖర్చవదు. ఎలాగూ కిటికీలు పెడుతున్నపుడు అవు ప్రమాద సమయాల్లో సులభంగా వచ్చేటట్లు చేయడానికి ఎంత ఖర్చవుతుంది. ఈ బ్లాగు చదివాక వార్తల్లో చదివిందేమంటే అత్యవసర నిష్క్రమణ ద్వారాలు వున్నాయట! కానీ అవి వున్నాయని ఎంతమందికి తెలుసు? తెలిస్తే అందులో ప్రయత్నిస్తే తెరుచుకునేవెన్ని? పైగా ఆ అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేయడానికి కాకతీయలో కాలిపోయిన ప్రాణాలు కారణమట! అంటే కొంతమంది ఛస్తే గానీ మనకు తెలియదు!
  అలాగే నాకూ బాగా గుర్తు. బస్సుల్లో కూడా అత్యవసర ద్వారాలు వుండేవి కాదు. ఆనక ఒకసారి ఒకడెవడో చేతి సంచీలో బాంబులు తెస్తూ బస్సు దిగుతున్నపుడు పొరపాటున జారవిడిచాడు. వాటివల్ల రాజుకొన్న మంటలు బస్టాండులోనే అందరికళ్ళముండే లోపలి వాళ్ళను బుగ్గి చేశాయి. (ఇది కడప బస్టాండు లోనో, తిరుపతి బస్టాండులోనో జరిగినట్లు గుర్తు.) అలా జరిగిన ప్రాణ త్యాగాలు బస్సుల్లో అత్యవసర ద్వారాలకి ప్రాణం పోశాయి.
  అంతెండుకు మొన్న సూరత్‌లో ప్రాణ నష్టం నివారించగలగటానికి అహ్మదాబాదులో పోయిన ప్రాణాలు కారణం. (అదీ వాళ్ళు కొంచం తెలివి తక్కువగా ఇంకా మరిన్ని పేలుళ్ళు సృష్టిస్తాం అని ఈమెయిల్ చేసి మరీ చెప్పారు గనుక ఆ మేలుకొలుపు.)

  ఇక ప్రజల మాట కొస్తే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రోడ్డు పక్కన లారీ నిలబెట్టేవాడికి సగం రోడ్డులోకి పెట్టకుండా ఇంకాస్తా పక్కకి పెడితే ఎంత ఖర్చవుతుంది. రోడ్డు వంకరలు తిరిగే చోట, చాటు ప్రదేశాల్లో నిలపకుండా కాస్తా రోడ్డు తిన్నగా వుండేచోట నిలిపితే ఎంత ఖర్చవుతుంది? ఆగి వున్న లారీలను డీకొట్టి ఎన్ని ప్రాణాలు ఖర్చవుతున్నాయి?

  రోడ్డు పునులు చేయడానికి తవ్విన గుంతను సూచించడానికి పెట్టే సూచికకు ఎంత ఖర్చవుతుంది? ఆ మధ్య ఓ ప్రమాదంలో అరవై అడుగుల లోతు గోతిలోకి కారు దూసుకుపోయి కుటుంబం మొత్తం హరీమంది.

  108 చేసే సేవ చూడండి. సత్యంకు ఆలోచన వచ్చిందాకా ప్రభుత్వానికి వచ్చిందా? ఇప్పుడు దానికవుతున్న ఖర్చు ప్రభుత్వం భరించలేనిదా? పోనీ అదే సత్యం మాత్రమే కనుక్కున్న కొత్త ఆలోచనా? ఈ దేశాలల్లో ఏళ్ళ తరబడి అమలవుతున్నదేగా?

  మనకు పట్టదు అంతే. ఎంతమంది చచ్చినా వాళ్ళ కర్మ కొద్దీ చచ్చారు అంతే!

  –ప్రసాద్

 7. చరసాల అభిప్రాయం,

  తేది: August 2, 2008 సమయము: 11:20 am

  @తేజ గారూ,
  కృతజ్ఞతలు.

  @అశ్విన్ గారూ,
  ఒకవేళ వూపిరి ఆడటం కోసం గ్రిల్ పెట్టి వుంటే, అదే గ్రిల్ వూపిరి మాత్రమే అందేలా, చిన్న పిల్లల చేతులు పట్టని విధంగా చేయలేరా? లేదా అప్పటి డోర్లకే గాలి అందేలా చిన్న చిన్న రంధ్రాలు పెడితే సరిపోదా? కొద్దిగా ఆలోచిస్తే వీటి అన్నింటికీ పరిష్కారాలు దొరుకుతాయి. ప్రాణాలు పోయేదాకా చేయం అంతే!

  @ నాగారాజా గారూ,
  లోక్‌సత్తా రాజకీయాన్ని మారుస్తానంటోంది. కానీ ముందు ప్రజలని మార్చాలి. “నమ్మాల్సింది కర్మను కాదు మన భవిష్యత్తు మన చేతుల్లోనే వుంది. మన దేశాన్ని మనమే మార్చుకోవాలి.” అనేది నేర్పించాలి. కానీ మన వేల ఏళ్ళ జడత్వాన్ని, నిస్పృహనీ, నిష్క్రియనీ, నిరాసక్తతనీ మార్చడం ఎవ్వరి తరం? “కళ్ళతో చూసేదంతా భ్రమ. కళ్ళు మూసుకొని దర్షించేదంతా బ్రహ్మ.” అంటూ వల్లె వేసుకునే సిద్దంతాలు మారడానికి మరో ఆది శంకరుడు పుట్టాల్సిందే!

  @రాజు గారూ,
  మనకూ ఇండియాలో వున్నంత వరకూ బురదలో వున్న పందికి మల్లే అది బురద అనే తెలియదు. తీరా ఈ దేశాలను చూశాక “అయ్యో మనం ఎప్పుడు ఇలా మారేది” అని అనిపిస్తుంది. ఆ ఆవేదనే ఇదంతా. వీళ్ళ కంపునంతా మనం నేర్చుకుంటున్నాం గానీ వీళ్ళ నుంచీ మంచి మాత్రం నేర్చుకోవట్లేదు.

  –ప్రసాద్

 8. నరేంద్ర భాస్కర్ S.P అభిప్రాయం,

  తేది: August 3, 2008 సమయము: 6:44 am

  నిజమే సార్! నేనూ ప్రభుత్వం ఇవన్నీ చేయాలంటే బాగా డబ్బు ఖర్చు అవుతుంది కదా అనిపించింది, కానీ మీర్రాసాక తెలుస్తోంది ఖర్చయ్యేది డబ్బు కాదు, మెడడని, రెండోది కూడా నిజమే మన కరమ్ మనమే రాసుకోవాలి.

 9. తాడేపల్లి అభిప్రాయం,

  తేది: August 3, 2008 సమయము: 7:31 am

  ఎవరి ఏర్పాట్లు వారు చేసుకోవచ్చు. దానికి దేవుణ్ణీ కర్మసిద్ధాంతాన్నీ నిందించ నక్కరలేదు. కాని మనిషి ఎన్ని చేసినా తన కర్మఫలాన్ని తప్పించుకోలేడు. కర్మ పరిధి చాలా విస్తృతమైనది. కర్మసూత్రం లేకపోతే ఈ ప్రపంచంలో అంతా అన్యాయమే అనాల్సి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మన ప్రభుత్వాలూ, చట్టాలూ, నేరాలూ శిక్షలూ, ప్రమోషన్లూ, డిమోషన్లూ అన్నీ కర్మసిద్ధాంతమే.

 10. నాగన్న అభిప్రాయం,

  తేది: August 3, 2008 సమయము: 9:21 pm

  అజెండాలో నాకు నచ్చిన వాటిల్లో Utilizing public resources fully and properly ఒకటి. మరే ఇతర పార్టీ అజెండాల్లో ఇటువంటిది ఒకటి ఉందో లేదో నాకు తెలియదు. ఒక తప్పు జరిగినప్పుడు మంత్రుల బిచ్చం స్వీకరించే బదులు రైల్వే స్టాండర్డ్స్ లేమి మీద కోర్టులో కేసు వేసి ఓ యాభై కోట్లు లాగితే, అప్పుడు తిక్క తిరుగుతుంది. రవి గారన్నట్లు ఇప్పటి టికెట్టు ధర చెల్లదు.

  తాడేపల్లి వారితో కూడా దాదాపు ఏకీభవిస్తాను. కొన్ని కర్మలను మాత్రం తప్పించుకోవచ్చు, భగవద్గీతలో కృష్ణుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం అన్నట్లు.


 11. తేది: September 4, 2008 సమయము: 11:55 pm

  [...] తీసుకోవాల్సింది పోయి, జరిగాక మొసలికన్నీరు కారుస్తారంటూ చరసాల ప్రసాద్ ఆవేదన [...]

 12. telugufriends అభిప్రాయం,

  తేది: December 20, 2008 సమయము: 11:20 am

  Let’s come together on http://www.apjunction.com to bring all the Telugu people unite on one platform and find Telugu friends worldwide to share our thoughts and create a common bond.

  Let’s also show the Mightiness of Telugus by coming together on http://www.apjunction.com

 13. leo అభిప్రాయం,

  తేది: March 15, 2009 సమయము: 8:06 am

  My two cents –

  Affordability

  When the majority of population can look beyond the basic necessities and there is a commercial viability innovation/improvisation happens without any external factors having to force it. We do learn from our mistakes and I think India is not prosperous enough to design with foresight. Getting by for now. Innovate if we must not can.

  Law/Regulation

  This is a double edged sword. Do it right and hope it works. Overdo it and it results in a loss of freedom.

  Bottomline

  Change happens in India at its own sweet pace.

 14. prasadrao అభిప్రాయం,

  తేది: July 11, 2010 సమయము: 8:08 am

  మన ఫోలిటీకల్ లీడర్స్ స్వ్ ర్ద్ ప రు లు, అది చె0 జి వ్వ్ లి . ప్ర తీ దా 0 త్లొ వె లు పె డతా రు.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో