మా వూరి సంగతులు – కస్టమ్స్ కష్టాలు

తేది: July 13, 2008 వర్గం: అనుభవాలు రచన: చరసాల 2,921 views

అమెరికానుండీ ముడి బంగారం తీసుకెళ్ళేవాళ్ళు ఇది తప్పక చదవాలి. గత నాలుగేళ్ళుగా అప్పుడొకటీ ఇప్పుడొకటీ కొన్న ఆరు బంగారం బిళ్ళలు (ఒక్కోటి ఇంచుమించు 31 గ్రాములు) పట్టుకెళ్ళాం ఇండియా వెళ్తూ. ఇక్కడ బంగారం చవక అనీ కాదు అక్కడ ఖరీదు అనీ కాదు గానీ ఒక్కసారే కొనాలంటే కష్టం గనుక అవి అప్పుడొకటీ ఇప్పుడొకటీ కొన్నవి. అన్నిటినీ తీసుకెళ్ళి ఇండియాలో ఏదైనా పాపకు చేయించాలనే వుద్దేశ్యం మా ఆవిడది.

అయితే కస్టమ్స్ వాళ్ళ నింబంధనలేంటో నాకంతగా తెలియదు. పది కిలోల వరకు తీసుకెళ్ళవచ్చు అని మాత్రమే ఎక్కడో చదివాను. వాటిని గాజుల్లా మార్పించుకొని వెళ్ళండి, లేదా అక్కడ దాయండి, ఇక్కడ దాయండి అన్నమాటలన్నీ పెడ చెవిన బెట్టి మామూలుగా మా చేసంచీలోనే (cabin luggage) వుంచుకొని వెళ్ళాం. ఈనాడు వార్తల మాటకేం గానీ శంశాబాద్ విమానాశ్రయపు వుద్యోగుల డేగ కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. నాకూ స్కానింగ్ చేస్తున్నాయనకూ మధ్య సంభాషణ ఇది.

ఆయన:ఈ బ్యాగు ఎవరిది?
నేను: నాదే
(దగ్గరికి పిలిచి చిన్న గొంతుతో)
ఆయన: ఇందులో బంగారు బిస్కెట్స్ వున్నాయా?
నేను: (అదే చిన్న గొంతుతో) వున్నాయి.
ఆ: ఎన్ని?
నే: ఆరు.
ఆ: కస్టమ్స్ కట్టాలే!
నే: అవునా! పది కేజీల వరకు తెచ్చుకోవచ్చని విన్నానే!
ఆ: తెచ్చుకోవచ్చు. కానీ కస్టమ్స్ కట్టాలి.
నే: అలాగా. అయితే సరే కడతాను.

అప్పుడు తను ఏదో స్లిప్పు రాసి నా చేతికిచ్చాడు. ఆ తర్వాత కస్టమ్స్ వాళ్ళు నన్ను తమ బల్ల దగ్గరికి పిలిచారు.

మళ్ళీ పై కుశల ప్రశ్నలన్నీ అయ్యాక బంగారం బిళ్ళలన్నీ బయట పెట్టించి వాటి మీదున్న బరువు వగైరా వివరాలు చూసి ఆ తర్వాత తిరిగిచ్చేశారు. ఒకరికి ముగ్గురు కూడి లెక్కలేసి చివరికి ఇంచుమించు అయిదువేల రూపాయలు అవుతుందని తేల్చారు.

ఇంతవరకూ అంతా బాగానే వుంది. అసలు విషయం ఏమిటంటే ఆ అయిదువేల రూపాయలనీ దానికి సమాన మొత్తాన్ని విదేశీ ద్రవ్యంలో చెల్లించాలట!!! నిజం చెప్పొద్దూ… నా దగ్గర పది డాలర్లకు మించి లేవు. మా ఆవిణ్ణడిగితే ఆమె బ్యాగులో అన్నిమూలలా తడిమి అరవై డాలర్లు వున్నాయంది. నా స్వతంత్ర భారతదేశంలో నాకు రూపాయలతోనే పని గానీ డాలర్లతో పని వుంటుందని నేను కలగన్నానా? డాలర్లలో ఎంతవుతుందీ అంటే ఇంచుమించు $125 అని తేల్చారు. మరి మిగతా డాలర్లు ఎక్కడ పట్టుకురావాలి? ATM రూపాయలే ఇస్తుందాయె. సరే forexలో అడిగితే ఇది విదేశీ ద్రవ్యాన్ని మార్చుకొనెందుకే గానీ స్వదేశీ ద్రవ్యాన్ని మార్చుకొనేందుకు కాదన్నారు.

అన్ని నా ప్రయత్నాలూ విఫలమయ్యాక తిరిగొచ్చి, “అయ్యా, నా దగ్గర డాలర్లు లేవు. నేను రూపాయల్లో మాత్రమే రుసుము కట్టగలను. ఇక మీరు చేసుకోగలిగింది చేసుకోవచ్చును.”  అని చెప్పా. అప్పుడాయన కాస్తంత సౌమ్యంగానే “అలాంటప్పుడు మాకున్న ఒకే ఒక ఆప్షన్ మిమ్మలనీ డిటైన్ చేయడమే!” అన్నాడు. “బాబ్బాబు మీకు పుణ్యం వుంటుంది ఆ పని చేయండి.” అన్నా. వాళ్ళు మాత్రం ఏమి చేయగలరు? వాళ్ళ నిభందనల పత్రం తెచ్చి చూపించారు. వాన్నీ వీన్నీ డాలర్లు వున్నాయా అని నా తరపున అడిగారు. చివరికి ఒకరిదగ్గర 500 దీనార్లు దొరికాయి. “అయ్యా ఇది పట్టుకెళ్ళి మీ రుసుము కట్టేసి మిగిలిన చిల్లరా, మీరు కట్టాల్సిన మొత్తం మాకు రూపాయల్లో ఇచ్చేయండి.” అన్నారు. చివరికి అలా దీనార్లు వచ్చి ఆదుకున్నాయి.

ఈ తతంగం అంతా ముగియడానికి ముప్పావు గంట పైనే పట్టింది. మాకోసం బయట ఎదురు చూస్తున్న వాళ్ళకు లోపలేం జరుగుతున్నదో ఇంకా మేమెందుకు బయటకు రావటం లేదో తెలియక గింజుకుంటున్నారు.

“కస్టమ్స్ రుసుము విదేశీ ద్రవ్యంలోనే చెల్లించాలన్న” నింభందనలో బ్రహ్మ పదార్థం మీకేమన్నా తెలుసా? (బహుశా విదేశీ ద్రవ్యానికి ఇక్కట్లు పడే రోజుల్లో చంద్రశేఖర్ ఏమైనా ఈ రూల్ పెట్టి వుంటాడా?)

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'మా వూరి సంగతులు – కస్టమ్స్ కష్టాలు' పై 10 అభిప్రాయాలు

'మా వూరి సంగతులు – కస్టమ్స్ కష్టాలు'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. sudhakar అభిప్రాయం,

  తేది: July 13, 2008 సమయము: 11:37 am

  అరే మీరు మరీను. శుభ్రంగా ఐదు వందల “రూపాయల” లంచంతో పోయేది ఇలా సమర్పించుకున్నారా. మేము కేవలం లంచములు మాత్రమే దేశ ద్రవ్యములో స్వీకరించెదము.

 2. nivas అభిప్రాయం,

  తేది: July 13, 2008 సమయము: 2:32 pm

  అమెరికాలో ఉండి మీరు బొత్తిగా మన కస్టమ్స్ మరిచిపోయినట్లున్నారు.

 3. Srinivas Ivaturi అభిప్రాయం,

  తేది: July 13, 2008 సమయము: 8:30 pm

  It is good you are asked for custom while coming back. When i was coming to America in January, Immigration guy asked me to give something to make him happy. I was shocked initially and couldn’t understand. Conversation went like this.

  Imm Guy: Sir, you are happily traveling to America. Give me something to make myself happy.
  Me: What do you want?
  Imm Guy: Anything… You all go and earn. I have to verify lot of things for you and I am not doing.
  Me: I dont have anything to give you right now, but I will remember you when I am coming back I can give something.
  Imm Guy: Make me happy sir…
  Me: What is your name, I will sure do something for your when I am coming back to India.

  Immigration guy quietly closed his name plate on his coat and stamped on my passport and sent me.

  I dint tell this to anyone because I feel ashamed to share this. But now after reading your post, I thought I should share with you.

 4. sujata అభిప్రాయం,

  తేది: July 14, 2008 సమయము: 11:26 am

  నిజమే! ఎంత అమేరికా అయితే మాత్రమ్ మన ఆచారాలు మర్చిపొయేరు. నిజంగానే టిప్ తో పొయేది! ఇవటూరి గారు చెప్పింది నమ్మశక్యమ్ గా లేదు. కానీ ఇట్ హాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా.. అనుకోవాలేమో !

 5. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: July 14, 2008 సమయము: 10:59 pm

  ఐదు వేలే కదా బతికిపోయారు..యాభై వేలు అడిగినా అడిగి ఉండేవాళ్లు
  ఇదో చెండాలమైన attitude..మీకు స్తోమత ఉంది కదా..దోచుకుంటాం అనేది

 6. Dileep అభిప్రాయం,

  తేది: July 15, 2008 సమయము: 4:31 am

  వారినుడె అయీదొందల మంచి ఆఫర్ గురుంచి రావాలె రలెదంటె పరవాల మంచి వాళ్లె.

 7. సుధాకర్ అభిప్రాయం,

  తేది: July 15, 2008 సమయము: 5:29 am

  cusotoms వాడికి tip ఇమ్మన్నవాళ్ళని చూస్తే జాలి వేస్తుంది. చదువుకున్నాక కాకరకాయ కాస్తా కీకరకాయ అయ్యింది అట. దేశం తగలడడానికి లంచం ఇవ్వచ్చు అనడం అన్యాయం. If you want your country (India) to be better, do your duties properly. If the person has to pay the duty, he has to. Nothing wrong in it.

 8. చరసాల అభిప్రాయం,

  తేది: July 15, 2008 సమయము: 8:21 am

  సుధాకర్ అభిప్రాయమే నాది. అవినీతి గురించి వుపన్యాసాలు ఇచ్చే మనమే మనం నమ్మిన వాదాన్ని అయిదువేలకు అమ్మలేకే నేను “టిప్పు” ఇవ్వలేదు.

  – ప్రసాద్

 9. Suresh అభిప్రాయం,

  తేది: March 2, 2009 సమయము: 1:17 pm

  ento chakkaga vrasaru. Telugu ippudu adhikara bhasha kooda ayyindi. kaani mana esp. responsible people manasullo eemaarpoo raanatha varaku telugu forms possible kaavu.
  Deeniki manamandaram eemaina cheyyali. meeremantaru?

 10. leo అభిప్రాయం,

  తేది: March 15, 2009 సమయము: 8:23 am

  When asked a desi jewellery store guy said that the customs is just 1%. Is that true?
  I had a different experience when coming back from India. The airlines lady asked me to pay $50 for excess baggage and sent me to a different counter. The guy at the counter insisted that payment has to be made in rupees!!! The currency exchange guy in the next cubicle was looking at me eagerly.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో