మా వూరి సంగతులు – తెలుగు వాడి ఇక్కట్లు

తేది: July 12, 2008 వర్గం: అనుభవాలు రచన: చరసాల 3,066 views

అమెరికా నుండీ ఇండియాకు మా ప్రయాణం ఈసారి కువైట్ మీదుగా జరిగింది. ఈ ప్రయాణంలో మరియు తిరుగు ప్రయాణంలో నన్ను బాగా వ్యధకు గురిచేసిన అంశం ఒకటుంది.

వాషింగ్టన్ డల్లస్ విమానాశ్రయం నుండీ United Airlinesలో కువైట్‌కు ప్రయాణం. మామూలుగానే విమానంలో సూచనలన్నీ ఆంగ్లం మరియు అరబ్బీలలో చెప్పారు. అలాగే బయలుదేరే ప్రదేశలో మరియు వెళుతున్న ప్రదేశంలో స్థానిక సమయం, ఉష్ణోగ్రతా వివరాలు చెప్పారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిందీ చెప్పుకోదగ్గదీ ఏమీ లేదు.

అయితే అదే కువైట్ నుండీ హైదరాబాదు ప్రయాణం Kuwait Airlinesలో. సంప్రదాయం ప్రకారం అయితే బయలుదేరుతున్న ప్రదేశం మరియు గమ్యస్థానాల భాషలలో (అరబ్బీ మరియూ తెలుగులలో) సూచనలు ఇవ్వాలి. ఇంకో విధంగా చూసినా ఆ విమానంలో 80 శాతం మంది తెలుగు మాతృభాషగా వున్నవారే వున్నారు. ఆ విధంగా చూసినా తెలుగులో సూచనలు వుండాలి. వుహు, నా అంచనాలకు విరుద్దంగా ఆంగ్లం, అరబ్బీ మరియూ హిందీలలో సూచనలు ఇచ్చారు. సరే ఈ కువైటీలకు మన తెలుగు తెలిసి చావదులే అనుకొని సరిపెట్టుకున్నా.

ఇక నా తిరుగు ప్రయాణం కువైట్ మీదుగానే అయినా ఇది హైదరాబాదు నుండీ కువైట్‌కు  Air Indiaలో. ఇప్పుడు మాత్రం సూచనలు తెలుగు, అరబ్బీ, ఆంగ్లాలలో వుంటాయని ఆశించా. వుహు.. నేను పప్పులో కాలేశా. ఇప్పుడు కూడా ఆంగ్లం, హిందీ మరియూ అరబ్బీలలోనే వినిపించారు. నా పక్క సీట్లో ఓ ముసలాయన కూచున్నారు. కర్నూలు దగ్గర ఓ పల్లెట. కువైట్‌లో తన కూతురు దగ్గరకు వెళుతున్నానని చెప్పారు. ఆయనకు బహుశా ఈ విమాన ప్రయాణం మొదటిదిలా వుంది. ఈ మూడు బాషలూ ఆయనకు డబ్బాలో గుళకరాళ్ళ శబ్దంలా వుంది తప్ప ఏదీ అర్థం కావట్లేదు. నేను కాస్తా చొరవచేసి తెలుగులో మాట్లేడేసరికి ఆయన మహదానందపడిపోయి ఎడారిలో ఒయాసిస్సు దొరికినంత సంబరపడ్డాడు.

కువైట్ జనాభా ఇంచుమించు 30 లక్షలు. కువైట్ వైశాల్యం 17,818 sq km. మన రాష్ట్ర జనాభా 8 కోట్ల పైమాటేనా? మన రాష్ట్ర వైశాల్యం 2,76,754 sq km లట! అయినా తెలుగు మాత్రమే తెలిసిన మన తెలుగు వాడికీ దుర్గతి ఏమిటి?

అదేగాక హైదరాబులో దిగే ముందు కస్టమ్స్ వాళ్ళ declaration forms ఇచ్చారు. అవి ఆంగ్లం మరియు హిందీలలోనే వున్నాయి. ప్రయాణీకుల్లో తెలుగు రాయడం, చదవడం వచ్చినా అవి నింపడానికి నాలాంటి వాళ్ళను బ్రతిమాలుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళు నేర్చుకొనే పాఠమేమిటి? తమ పిల్లలకైనా హిందీనో, ఇంగ్లీషో నేర్పిస్తే ఈ యాచించే బాధ తప్పుతుందనేగా!

మరో అన్న మళ్ళీ రావాలి.

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 ఓట్లు, సగటు: 5 కు 4.67)
Loading ... Loading ...

'మా వూరి సంగతులు – తెలుగు వాడి ఇక్కట్లు' పై 10 అభిప్రాయాలు

'మా వూరి సంగతులు – తెలుగు వాడి ఇక్కట్లు'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. తెలుగు'వాడి'ని అభిప్రాయం,

  తేది: July 12, 2008 సమయము: 1:38 pm

  “మరో అన్న మళ్ళీ రావాలి.” …. చాలా బాగా చెప్పారు … కానీ రాడు సార్ ..

  ఇలాంటి సమస్యలనే గీతల పక్కన ఇంతకన్నా పెద్దవైన గీతలు గీసుకుంటూ పోతూ అసలు ఈ సమస్యలని చిన్నవి, పెద్దవి, ప్రమాదకరమైనవి గా చేయటంలో ప్రభుత్వాలు/రాజకీయనాయకులు కృతకుత్యులై ఇవి అసలు సమస్యలే కావని ఇంతకన్నా తొందరగా పరిష్కరించవలసినవి ఎన్నో ఉన్నాయనీ ప్రజలలో ఓ రకమైన ఆభిప్రాయాన్ని కలిగించగలగటంలో కూడా 90% పైన మార్కులు సాధించగలిగాయి.

  ఇవన్నీ రీప్రింట్ చేయించటం పెద్ద కష్టమైన పని కూడా కాదు కాకపోతే ఇది వేల కోట్ల వ్యాపారం కాదు .. దీనిలో పెద్దగా మిగిలేది ఏమీ లేదు .. లేదా మసిమూసి మారేడుకాయ చేసి దీనినే వేల కోట్ల టెండర్స్ లోకి మారిస్తే జనాలకి తెలిసే అవకాశం ఉంది(తెలిస్తే ఏమన్నా భయపడతారా అంటే అదీ లేదనుకోండి) … అందుకే ఇలాంటి వాటిల్లో వేలు పెట్టరు…

  చివరలో మీరన్నట్టు జనాలలో అలాంటి ఆలొచనను కలిగించగలిగితే (ఇప్పటికే చాలా విజయం సాధించారులేండి … ఇలాంటి చాలా విషయాల కలయిక ద్వారా), కనీసం Concept Schools, వీళ్ల పిండాకూడు, శ్రాధ్ధం schools అనే పేరుతో వందల కోట్లు వెనకేసుకోవచ్చు.ఇంకా రకరకాల మార్గాలు కూడా ఆలోచించే అమోఘమైన తెలివితేటలు వీళ్ల సొంతం.

  ఆశించటంలో తప్పులేదుగా … చూద్దాం మరో అన్న(య్య)!? వస్తాడేమో ;-)

 2. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: July 12, 2008 సమయము: 2:28 pm

  వెళ్ళటమూ..రావటామూ కూడా జరిగాయా..
  అలా ప్రయాణించిన ప్రతిసారీ కనీసం మనలాంటివాళ్ళు ఒక ఫిర్యాదు ఆతిధ్యపుభామలకందిస్తే పరిస్థితి ఏమన్నా మెరుగౌతుందేమో!! విమానంలో ఇలాంటి సూచనలివ్వటానికి kLM/nothwest ప్రతి భారత ఫ్లైట్లో ఒక హిందీ భామను ఎక్కించుకుంటారు. కానీ తెలుగు, హిందీ, కన్నడ, బెంగాళీలు తెల్సిన భామలను పెట్టుకోవటం అనవరమనుకున్నారనుకుంటా వీళ్ళు..కానీ ఎయిరిండియా కూడా ఇలా చేయటం “హిందీ” కేంద్ర ప్రభుత్వం ద్వారా నడపబడుతున్నామన్న పొగరనుకుంటా

 3. Vamsi అభిప్రాయం,

  తేది: July 12, 2008 సమయము: 11:17 pm

  :) …కిందటి సెప్టెంబరులో వెళ్ళినప్పుడు KLM వాడిని ఇదే మాట “బాబూ హైదరబాదు బండిలో తెలుగు కండక్టర్లు ఉంటే బాగుంటుంది కదా” అని అడిగా..వాడు నవ్వి may be in few years అన్నాడు వైజాసత్యగారూ..:)

 4. sujata అభిప్రాయం,

  తేది: July 13, 2008 సమయము: 12:21 am

  బాధ పడకండి. లుఫ్తాన్సా లొ తెలుగు లొ announcement ఇస్తునారు.. ఒక సంవత్సరంగా. లాండింగ్ కార్డు – ఎవరికి ఏ భాష లో కావాలొ ఆ భాష్ లొ (కనీసమ్ Destination కు / Origin కు చెందిన భాష) అడిగితె (Pl. Ask type lo) ఇచ్చే అవకాశము ఉండాలి. మీరన్న దాంట్లొ పాయింటు ఉంది. May be in few years.. అనేది కూడా, మనమ్ ఒక్కొక్కరమ్ వీళ్ళని అడుగుతూంటే సాధ్యమే!

 5. cbrao అభిప్రాయం,

  తేది: July 13, 2008 సమయము: 2:04 am

  మనము ప్రయాణించే ప్రతి ఐర్‌లైన్ లోను, తెలుగులో కూడా declaration form ఇవ్వాలన్న సూచన చేస్తూ ఉండాలి మనము. ఏనాటికైనా గ్రహించక పోరు. లుఫ్తాన్సా లో తెలుగులో ప్రకటనలు ఇవ్వటం ముదావహం.

 6. చరసాల అభిప్రాయం,

  తేది: July 13, 2008 సమయము: 8:25 am

  అయితే ఇక మీదట లుఫ్తాన్సాలోనే నా ప్రయాణం.

  –ప్రసాద్

 7. నాగరాజా అభిప్రాయం,

  తేది: July 14, 2008 సమయము: 12:37 am

  ఆటోల్లోనే వాడటం లేదు, ఆకాశం గురించి ఏమంటారు ప్రసాద్?

 8. తాడేపల్లి అభిప్రాయం,

  తేది: July 23, 2008 సమయము: 10:16 pm

  తెలుగు గత 400 ఏళ్ళుగా ఎవరికీ అధికారభాష కాదు. దీన్ని ఎవరైనా ఎందుకు పట్టించుకోవాలసలు అంట ?

 9. R k అభిప్రాయం,

  తేది: September 11, 2008 సమయము: 3:43 pm

  >> తమ పిల్లలకైనా హిందీనో, ఇంగ్లీషో నేర్పిస్తే ఈ యాచించే బాధ తప్పుతుందనేగా!

  Fwd a mail sent by someone.

  >ఉప్పరి సన్యాసం , ఉభయ బ్రష్టత్వం అంటే ఇదేగాబోలు.>

  #పాత కథే !
  ఇంగ్లీషు మీడియమా? తెలుగు మీడియమా?
  ³విశ్వ బాషలందు ఇంగ్లీషు లెస్స అని మెకాలే కల్లో కనిపించి చెప్పాడో ఏమో,
  గణమైన ఆంధ్రప్రదేస్^ ప్రభుత్వం వారు ప్రాథమిక స్థాయి నుండి ప్రభుత్వ
  పతసలల్లో ఇంగ్లీషు మీడియమా ప్రవేశ పెట్టబోతున్నారు . దిన్ని వ్యతిరేకించిన
  వారిని బడుగు వర్గాలనూ అణగదొక్కడానికి చేస్తున్న కుట్రదారులుగా వర్ణిస్తూ ,
  మెకాలే ను ముక్తిదతగా స్తుతిస్తున్నారు కొందరు :

  Read this here:

  http://www.andhrajyothy.com/archives/archive-2008-6-27/editshow.asp?qry=/2008/jun/23vividha2 Ðèþ*Mæü* JMæü ¿êçÙM>ÐéÍ& ™èþ$ÍÏÐèþ$ÍÏ ÑËÞ¯Œþ çÜ$«§éMæüÆŠÿ Andhra Jyothi Article

  ఇలాంటి పిచ్చి రాతలను ప్రచారం చేయడం నా ఉద్దేశం కాదుగాని , ఏమాటకామాటే
  చెప్పుకోవాలి , తాటాకులు తేరగా దొరికాయిగదా అని ఎడాపెడా బరికేస్తే ఎంత నష్టం
  జరగబోతోమ్దోనని బయం మాత్రం పట్టుకుంది . అయినా అది ఇంగ్లీషులో ఎందుకు
  అఘోరిమ్చలేదో జుట్టూడేలా బుర్ర గోక్కున్న అర్ధమయ్యి చావలేదు . క్రితం వారం ఆ
  కవిత చదివినప్పటినుండి ఎంత తన్నుకున్నా చిక్కువీడడం లేదు . ఇవాళ ప్రొద్దున్నే
  కాపీ తాగుతుండగా ఎదురుగ వున్న #American Educator# పత్రిక అట్టమీద టైటిల్ #Teaching English Language Learners# చూసి ఇదేవితని తిరగేసాను .

  చదువుతుంటే గత వారం చదివిన కవిత మళ్ళీ గుర్తొచ్చింది . మొత్తం క్షుణ్ణంగా
  చదివేసనని సెప్పనుగని , చదివినంతలో విషయం బోధపదిమ్డనే అనుకుంటాను .
  ఈ వ్యాసం మీరు ఇక్కడ చదవొచ్చు: #

  http://www.aft.org/pubs-reports/american_educator/issues/summer08/goldenberg.pdf

  గాలివాదాలు, సోల్లువాగుల్లు కట్టిపెట్టి , తల్లిడంద్రుల్నించి ఇంగ్లీషుతో
  పెరగనివాళ్ళు పూర్తిగా ఇంగ్లీషు మీడియం విద్యబోధనలోకి దూకితే , అటు చదువు
  బుర్రకెక్కదు , ఇటు భాషా రాదు అని పరిశోధనల్లో తెలిసిందహోయ్ ^ అన్నాడు
  పరిసోధన్లన్ని చదివిన వ్యాసకర్త . ఇది అమెరికాకు వలస వచ్చినవారి
  పిల్లల గురించి జరిపిన పరిసోదనే ఐన , ఇండియాలో , ముఖ్యమ్గా
  ఆంధ్రప్రదేస్ ^ లో విద్యావిధానంలో మార్పులు తెస్తున్న వారిచేత , ఇంగ్లీషు
  మీదియమ్ను ప్రభుత్వం పోషించ కూడదన్నవారిని వర్గ శత్రువులుగా
  పరిగానిమ్చేవారిచేత చదివించాల్సిన అవసరం ఎంతైనా ఉంది . నిత్యజీవనంలో
  ఇంగ్లీషు ఉపయోగించే సమాజంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే , అక్కడ ఇంగ్లీషు
  మిదియాన్ని రుద్దడం ఒక తరాన్ని అజ్ఞానంతో చావండని శాసించడం .
  >ఉప్పరి సన్యాసం , ఉభయ బ్రష్టత్వం అంటే ఇదేగాబోలు.>

 10. darla అభిప్రాయం,

  తేది: July 4, 2010 సమయము: 12:10 pm

  మాకూ ఒక భాషకావాలి” పేరుతో తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌ గారు ఆంధ్రజ్యోతి (http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2008/jun/23vividha2) లో ఒక కవిత రాశారు. దీన్ని ఇప్పటికే చాలా మంది చదివి ఉంటారు. అయ్యినా నాకు నచ్చడం వల్ల ఆ కవితను ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో ఇక్కడ పునర్ముద్రిసున్నాను..దార్ల )

  మ్లేచ్ఛితమన్నా సరే
  మమ్మల్ని మ్లేచ్ఛులన్నా సరే
  మెకాలేకు వందనాలు చెప్తాం
  పుట్టిన మా పసిపిల్లల చెవుల్లో
  ఏబిసిడిలే ఉచ్చరిస్తాం……

  అంగ్రేజీ దేవతకు వేనవేల వందనాలు
  లండన్‌ మాది కాదు
  ఇంగ్లీషు మాకు రాదు
  పౌండ్లకోసం ఇంగ్లండు వెళ్లిన
  జాతి మాదికానేకాదు
  మేమేమీ ఇవాంజిలికల్‌ క్రైస్తవులమూకాదు
  ఆంగ్లీకరించుకున్నంత మాత్రాన
  మేము మార్టిన్‌ లూథర్‌లమూ కాదు….

  సూపర్‌ కంప్యూటర్‌ నిర్మించిన
  నిరుపేదల దేశంలో
  బోధనాలయాల
  ఆంగ్లీకరణల కుంభమేళాలో
  ఐటి, ఐఐటి సాఫ్ట్‌వేర్లు
  దేశమంతా వేర్లొచ్చిన
  ఆదిశంకరుడి పీఠాలైతే
  ఆధిపత్య వర్ణాలు
  ఆనందంగా జరుపుకొనే
  డాలర్‌ కార్నివాల్‌లో
  ‘టామీ’ అని పిలిస్తే కుక్కలు
  కూడా ఇంగ్లీషు నేర్చుకుంటున్నాయి

  జీన్‌ ప్యాంట్లు వేసుకునేవాళ్ళ దగ్గర
  దేశాభిమానం మీద
  నిక్కర్లతో చక్కర్లు కొట్టే వాళ్ల దగ్గర
  సంస్కృతీ సంప్రదాయాలమీద
  లెక్చర్లే వినాల్సిన ఖర్మపడితే
  అమెరికా ఎంబసీల ముందు
  ఆనందంగా బారులు తీరిన
  భారతీయ సోదరుల సుందర
  వదనాల మీద
  దమ్ముంటే ఉమ్మేసే
  దేవ భాషల పేర్లేమిటో!

  నమ్మశక్యంకాని ఆర్యభట్టలూ……
  నమ్మశక్యంకాని పుష్పకవిమానాలూ…….
  నిజమైన భారతాన్నెప్పుడు చూశాం
  గాడిద పేడతో
  డిటర్జెంట్లు చేసే రజకుల మేధస్సుని
  గొడ్డుటావుల చర్మాన్ని
  గంటలో ఒలిచే చర్మకారుల నైపుణ్యాన్నీ
  వాంతి చేసుకోకుండా
  దేశీయుల మలాన్ని చేతులతో పట్టుకెళ్ళే
  దౌర్భాగ్యుల సహనాన్నీ
  గుర్తించని ఈ భాషాజాతులు
  ఎవరికి ట్రోజన్‌ హార్సులు!

  జాతిలో సమైక్యం కాలేనప్పుడూ
  నీతిలో సమతుల్యం లేనప్పుడూ
  వాచకాల్లో ఒక్క గౌరవ పదమూ
  దళితుల గౌరవం కోసం వ్రాయనప్పుడూ
  సగౌరవంగా వీధులూడ్చే వాళ్ల పిల్లల్ని
  సమానత్వం ఫ్లాట్‌పారాల మీద
  సివంగిలా తరిమికొట్టేదెవడిభాష!

  దేశమంటే కులమే
  దేశీయ భాషల Äౌగికమే
  ఒకడు చెండాలుడట…………
  మరొకడు ఆగ్నిహోత్రావధానుడట…..
  ఏం భాషలురా ఇవీ
  అంటరాని తల్లిని ఆమ్మన్నా తప్పు
  అష్టావధానంలో నీ యమ్మన్నా ఒప్పు
  ఆ రబ్బీలు
  అర్థంకాని అరబ్బీలు నేర్పినా
  సఖ్యతలు నేర్పే
  వాళ్ల మదరాసాలే నయంకదూ

  ఖర్మ!
  కపటం జాతీయ అజెండా అయింది
  అస్పృశ్యత సారూప్యతలో
  బానిసత్వం ఒక పిక్నిక్‌ అయింది
  పంచాయితీ బళ్ళు మాకై
  అంగ్రేజీ బళ్ళు వాళ్ళకై
  కార్పొరేట్లు దొంగసచ్చినోళ్ళకై
  సైనిక్‌ స్కూళ్ళూ సెంట్రల్‌ స్కూళ్ళూ
  కలగా పులగమై
  మాపై మీకు
  సానుభూతెప్పుడో చచ్చిందిగదా!

  ఈ నుడికారాల్నింక మ్యూజియంలోకీ
  ఈ భాషాదెయ్యాల్నింక గురుకులాల్లోకీ
  సర్కారు భాషా సౌందర్యపు గోడౌన్లలోకీ
  తరిమి పడెయ్యాలి…………..

  మాకిప్పుడొక కొత్త భాష కావాలి
  అది మా హృదయ ఘోషకావాలి
  కన్న బిడ్డల్నే అస్పృశ్యులంటూ
  చేతులతో మలాన్నెతించిన భాష
  సజీవ దహనం కావాలి……….
  మ్లేచ్ఛితమన్నా సరే!
  మమ్ముల్ని మ్లేచ్ఛులన్నా సరే!

  Labels: తుల్లిమల్లి విల్సన్ సుధాకర్

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో