అణు రాజకీయం

తేది: July 11, 2008 వర్గం: వర్తమానం రచన: చరసాల 2,393 views

ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలనూ అందునా అణు ఒప్పందం పేరుతో నడుస్తున్న రాజకీయాలనూ చూస్తే మరింత ఏవగింపు కలుగుతుంది.

ఒప్పందం చేసుకు తీరాలంటున్న కాంగ్రెసునూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వమంటున్న వామ పక్షాలనూ మినహాయిస్తే, ఇక ఏ ఇతర రాజకీయ పక్షానికీ దేశహితం కాక స్వలాభం కోసం తహతహలాడుతున్నాయి.

అణు ఒప్పందం దేశానికి మంచిదా కాదా అన్న చర్చను పక్కన బెడితే రేపు జరగబోయే పాలక పక్షపు బలపరీక్షలో ఏ పక్షం ఎటు మొగ్గుతుందన్నది పూర్తిగా స్వలాభం బేరీజు మీదే అధారపడబోతున్నదని వింటే మనసునిండా ఆవేదన కలుగుతోంది.

అణు ఒప్పందం భాజపా తదితర ఎన్డీయే పక్షాలకు సమ్మతమే అయినా కాంగ్రెసు ప్రభుత్వ పతనాన్ని చూడాలని వువ్విళ్ళూరుతూ తమాషా చూస్తున్నాయి.

అణు ఒప్పందం చేసుకుంటున్నది తన జన్మ విరోధి అయిన కాంగ్రెసు గనుక తెలుగుదేశం వ్యతిరేకిస్తోంది గానీ (ఇంక రాబోయే ఎన్నికల్లో వామపక్షాల మైత్రిని ఆశించీ) మరో పార్టీ అయిటే దానికి అభ్యంతరం వుండి వుండకపోను.

నిన్న మొన్నటి దాకా కాంగ్రెసు మీద కక్ష గట్టిన సమాజవాదీకి ఇప్పుడు కలాం వుద్భోధ పనిచేసిందో, రాబోయే ఎన్నికల్లో మాయావతి మీద దాడికి కావల్సిన ఆయుధాలు అవసరమయ్యో గానీ అణుఒప్పందానికి అనుకూలంగా మారిపోయింది. అదీ తన స్నేహితులతో మాటమాత్రం చెప్పకుండా. అదే మాయావతి గనుక కాంగ్రెసు పంచన ముందే చేరివుంటే ఇదే ఒప్పందం ఈయనకు ముస్లిములకు వ్యతిరేకంగా కనపడి వుండేది.

ఇక తెరాసను చూస్తే సందట్లో సడేమియాగా తన పని అవుతుందేమో అని కాచుక్కూచున్నది. అణు ఒప్పందానికీ, తెలంగాణాకి అసలు సంభందం లేకపోయినా దానికి లంకె పెట్టి కూర్చున్నది. అయితే తెరాస సమస్యను సానుభూతితో అర్థం చేసుకోవచ్చు.

మాయావతి అయితే ములాయం బొమ్మయితే నేను బొరుసు అంటుంది. అతను ఆ పక్షం గనుక నేను ఈ పక్షం. సొంత తీరు, మార్గం అంటూ ఏమీ లేవు. “నువ్వన్నదానికి వ్యతిరేకంగా అనడమే నా సిద్దాంతం” అన్నది ఈమె సిద్దాంతం.

ఇలా ఏ పార్టీని చూసినా దేశ ప్రయోజనాలు గానీ, అణు ఒప్పందంలో ఏమున్నదని గానీ అవసరం లేదు. వారికి కావలిసింది ఎదుటి పక్షాన్ని ఇరకాటంలో పెట్టడం లేదా స్వలాభం చూసుకోవడం.

దేవుడా (వుంటే) కాపాడు నా దేశాన్ని.
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'అణు రాజకీయం' పై 4 అభిప్రాయాలు

'అణు రాజకీయం'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. bollojubaba అభిప్రాయం,

  తేది: July 11, 2008 సమయము: 12:38 pm

  గూడ్ అనాలిసిస్
  బొల్లోజు బాబా

 2. కె.మహేష్ కుమార్ అభిప్రాయం,

  తేది: July 11, 2008 సమయము: 10:59 pm

  మంచి విశ్లేషణ. ఇక ఉంటే దేవుడే కాపాడాలి. ఇంతకాలం అసలు ఈ దేశం ఇలా ఉండటమే (ఉంటే)దేవుడి మహిమలాగా అనిపిస్తుంది.

 3. చరసాల అభిప్రాయం,

  తేది: July 12, 2008 సమయము: 8:54 am

  బాబా గారూ, మహేశ్ గారూ, మీ వాఖ్యలకు నెనర్లు.

  నాకయితే ఈ దేశాన్ని కాపాడుతున్నది, స్వార్థం, ఉదాసీనత మరియు కర్మ సిద్దాంతం అని చాలా నమ్మకం.

  –ప్రసాద్

 4. nivas అభిప్రాయం,

  తేది: July 13, 2008 సమయము: 2:44 pm

  ఒప్పందం చేసుకు తీరాలంటున్న కాంగ్రెసునూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వమంటున్న వామ పక్షాలనూ మినహాయిస్తే,
  ..
  …..
  …….

  వారిని ఎందుకు మినహాయించాలి

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో