మా వూరి సంగతులు – ఎత్తుకు పోయే వాడొచ్చాడు!

తేది: July 11, 2008 వర్గం: అనుభవాలు రచన: చరసాల 2,352 views

మా వూరిలో జరిగిన ఓ తమాషా సంఘటన ఇది. అయితే ఇది పరస్పర మానవ నమ్మకాల్లో వున్న లోటును చెబుతుంది. ఓ అపరిచిత వ్యక్తి పల్లె పట్టుల్లో సంచరించడం ఎంత ప్రమాదకరమో కూడా చెబుతుంది.

మేము ఇండియా వెళ్ళాక మా తమ్ముడు దిలీపే కారు నడిపేవాడు. నాకు గేర్ల కారును నడిపిన అనుభవం లేదు. పైగా ఆ ట్రాఫిక్కును చూసి నడపాలన్న ఉత్సుకత నాకు లేకుండా పోయింది. అయితే ఓ వారం తర్వాత దిలీప్ చెన్నయ్ వెళ్ళిపోవడంతో కారును నడపడం నాకు తప్పలేదు. అసలు రోడ్లమీద నడిపే ముందు సంచారంలేని రోడ్డుమీద కాస్తా గేర్ల మీద పట్టు సాధిద్దామని కారు తీసుకొని మా పోలాల వైపు మట్టిరోడ్డు మీద వెళ్ళాను.

ఆ రోడ్డు తిన్నగా మా పొలాలని దాటి అడవివైపు దారితీసిందిగానీ, ఎక్కడా కారును సజావుగా వెనక్కి తిప్పుకోగలిగిన అనువైన స్థలం కనిపించలేదు. చివరికి ఓ చోట ఎలాగోలా వెనక్కు తిప్పుకొని వస్తుంటే, దారిలో భుజాన ఓ కర్ర పెట్టుకొని నడుస్తూ వస్తున్న మా వూరి పెద్ద సుబ్బరాయుడు కనబడ్డాడు. సరే ఎలాగూ వూరికే వెళ్తున్నాగదా అని కారు ఆపి, “అయ్యా, కూచో వెళదాం” అన్నా. ఆయన “నాకిక్కడ పనుంది, నేనిటు వెళ్ళాలి” అని చరచరా రోడ్డు దిగి మరోవైపుకి వెళ్ళిపోయాడు. “అబ్బీ నువ్వెవరు?” అనిగానీ, “ఎప్పుడొచ్చావు?” అనిగానీ ఏమీ అనకపోయినా, రాయలసీమ మాటా, మనసు తెలిసిన వాన్ని గనుక, చిన్నబుచ్చుకొన్న మనసును జోకొట్టి మామూలుగానే ఇంటికి వచ్చాను.

ఇంటికి వచ్చిన కాసేపట్లో వూర్లో పుకారు ఏమంటే “ఎవడో మనుషులను ఎత్తుకుపోవడానికి కారేసుకు తిరుగుతున్నాడనీ, పెద్ద సుబ్బరాయుడిని కారెక్కమంటే తనెలాగో తప్పించుకొని పొలాలమీద అడ్డదిడ్డంగా నడిచి వూరు చేరుకొన్నాడనీ.”

హతవిధీ! అది నేను పుట్టిపెరిగిన వూరు కాబట్టి సరిపోయింది. ఇంకా నన్నెరిగిన వాళ్ళు బ్రతికివున్నారు గనుక సరిపోయింది. ఈయన మాటలు విని నన్నెరగని వాళ్ళు నన్ను కిడ్నాపరని చితగ్గొట్టలేదు కాబట్టి బతికిపోయా!

బాబ్బాబూ, మీరెవరూ మీకు తెలియని పల్లెపట్టుల వైపు వెళ్ళకండి. పిల్లల కిడ్నాపర్లంటూ చితగ్గొట్టడమే కాదు చంపినా దిక్కులేదు. (కడప జిల్లా వార్తల్లో ఈ మధ్య ఇలాంటివి ఎక్కువయిపోయాయి.)

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 ఓట్లు, సగటు: 5 కు 3.50)
Loading ... Loading ...

'మా వూరి సంగతులు – ఎత్తుకు పోయే వాడొచ్చాడు!' పై 5 అభిప్రాయాలు

'మా వూరి సంగతులు – ఎత్తుకు పోయే వాడొచ్చాడు!'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. radhika అభిప్రాయం,

  తేది: July 12, 2008 సమయము: 7:42 am

  అయితే ఊరెళ్ళి వచ్చేసారన్న మాట.బోలెడన్ని సంగతులు చెపుతారన్నమాట. :)
  పల్లెటూర్లో ఇలాంటివి సర్వ సాధారణ0.మనకి నవ్వుకోడానికి బాగుంటాయికానీ పాప0్ ఆ జనాలు పడే భయ0్……….

 2. చరసాల అభిప్రాయం,

  తేది: July 12, 2008 సమయము: 8:51 am

  రాధిక గారు,
  తమాషా సంఘటన అన్నానే గానీ నాకెక్కడా నవ్వురాలేదు. కాకుంటే పల్లెలు ఎంత భయంగా బతుకుతున్నయో. ఓ అపరిచితుడు నిర్భయంగా పల్లెల్లో తిరిగడం ఎంత ప్రమాదకరమో చెప్పదల్చుకున్నానంతే!

  –ప్రసాద్

 3. రానారె అభిప్రాయం,

  తేది: July 12, 2008 సమయము: 6:29 pm

  నవ్వాల్నో యేడవాల్నో … :) )

 4. జయతి అభిప్రాయం,

  తేది: December 3, 2012 సమయము: 3:16 am

  మీ సొంత ఊరిలోనే మీకెదురైన అనుభవం తమాషాగా ఉంది. ఇలాంటి సంఘటనలు నేనూ చూసాను అక్కడ. ఆ సమయం లో మేమక్కడే ఉండేవాళ్ళము. అప్పుడు అక్కడ ఇదొక పెద్ద పుకారు. కొన్ని తమాషాగా ఉండేవి. పిల్లల్ని స్కూళ్ళకి పంపకపోవడం ఎదురైన ప్రతివాడిని అనుమానించడం కథలు కథలుగా చెప్పుకోవడం… అలా ఒకతన్ని’పిల్లల్ని ఎత్తుకుపోయేవాడని’ పొరబడి చచ్చేదాకా కొట్టారు. ప్రాణాలు పోయాక తెలిసుకున్నారు అతడు అమాయకుడని. మీ పోస్ట్ చదువుతుంటే నాకా రోజులు గుర్తోచ్చాయండి.

 5. narendra అభిప్రాయం,

  తేది: December 5, 2012 సమయము: 5:00 am

  పుర్వ కాలమ్ లొ మనుసులలొ అసుయలుఇలెవు. ఇప్ప్ధదు మనసులలొ అసుయలు వన్నఇ.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో