వూరెళ్ళి చేసిన పనులు
చేయాల్సిన పనులంటూ లిస్టు రాసుకున్నా చేసినవి చూసుకుంటే పదింటిలో రెండే చేయగలిగాను.
1) బావిలో పిల్లలతో కలిసి ఈత కొట్టాను.
2) అన్నం మెతుకులు వేసి దగ్గరికి వచ్చే చేప పిల్లలను కాదు గానీ, వేయకుండానే దగ్గరికి వచ్చిన చేప పిల్లలని చూపించాను. అయితే ఆనందిస్తుందేమో అనుకుంటే ఇక ఈదనే ఈదనని మంకు పట్టి కూర్చింది మా అమ్మాయి!
3)వెళ్ళింది వెన్నెల కురిసే సమయం కాదు కాబట్టి అంత వెన్నెలా లేదు, ఈత చాప అసలే లేదు. అయితే డాబా మీద చుక్కల పందిరి కింద పడుకుని నిద్రించే అదృష్టం మాత్రం దక్కింది. (దోమలకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి పడుకోనిచ్చినందులకు)
4) పచ్చి శనక్కాయలు దొరకలేదు గానీ వుడకబెట్టిన పచ్చి అలసంద కాయలు (ఇతర ప్రాంతాల్లో వీటిని మరోలా పిలుస్తారనుకుంటా) తిన్నా.
5) వూరినీ, శివాలయాన్నీ, వూరిలో కడగొడుతున్న దీపాలనీ ఫోటోలయితే తీశాను గానీ వెంట తెచ్చుకోవడం మరిచాను.
6) పెద్ద గుండయితే ఎక్కాను గానీ, పాట పాడలేదు.
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








తేది: July 10, 2008 సమయము: 10:22 am
“ఫోటోలయితే తీసాను గానీ వెంట తెచ్చుకోవడం మరిచాను.” – ఇదెలా జరిగింది? మీ కెమరా మీతోనే ఉంటుందిగా?
మీరు చేయని పనులలో ఇంకోటి చేర్చాలి. జులై 5 న హైదరాబాదు వచ్చి ఇక్కడి మిత్రులను కలుస్తామన్నారు. మీరు మమ్ము కలవకనే తిరిగి అమెరికా వెళ్లటం కొంత అసంతృప్తిని మిగిల్చింది. మీ భారత దేశ పర్యటన ఛాయా చిత్రాలు తెప్పించి ప్రచురించగలరు.
తేది: July 10, 2008 సమయము: 10:26 am
వెల్కం బాక్
బొల్లోజు బాబా
తేది: July 11, 2008 సమయము: 12:11 am
బ్రహ్మాండం. గుండెక్కి పాట పాడకపోవడమొక్కటే బాలేదు.
అలసందలను ఇంకేమంటారు?
తేది: July 11, 2008 సమయము: 12:26 am
ఇంకా రాయండి. ఏం రాసినా విశేషమే కదా.
తేది: July 11, 2008 సమయము: 1:51 am
ఒకె నెను అన్ని చాయాచిత్రాలను సొమవరము మాయాజాలము లొ చెర్చగలను.
దిలీప్.
తేది: July 11, 2008 సమయము: 9:20 am
అలసందలను తెలంగాణాలో బొబ్బెర్లు అంటారు.
తేది: July 12, 2008 సమయము: 9:00 am
@రావు గారూ,
ఫోటోలు తీసిన నా కెమరా మా ఆవిడ దగ్గరా మరియు ఇంకోటి మా తమ్ముడు దిలీప్ దగ్గరా వుండిపోయింది. ఏదైనా ఓ memory stickలో తెచ్చుకుంటే పోయేది. అన్నిటిలాగే ఇదీ మరిచా.
@రానారె,
పాట పాడటానికి నన్ను ఒంటరిగా వుండనిస్తేనా? చూశారా ఫణి సమాధానం. అలాగే మన “అనపకాయల”ను తీరాంద్రలో మరో పేరుతో పిలుస్తారు.
@ఫణి గారూ,
తెలంగాణాలో ఏమంటారో తెలిపినందులకు నెనర్లు.
–ప్రసాద్