వూరెళ్ళాక చేయాల్సిన పనులు

తేది: June 8, 2008 వర్గం: వర్తమానం రచన: చరసాల 2,602 views

1. చద్దన్నంలో గడ్డ పెరుగు (గేదె పెరుగు) వేసుకొని, వుల్లిపాయ నంజుకొని తినడం.
2. మధ్యాహ్నం మండుటెండలో చెట్టుకిందో, పందిరి కిందో నులక మంచంపైన కునుకు తీయడం.
3. కానబావిలోనో, గదగుండ్ల బావిలోనో ఈత కొట్టడం.
4. బావిలో అన్నం మెతుకులు వేస్తే అన్నివైపుల నుండీ పరుగెత్తుకు వచ్చే చేప పిల్లల్నీ మా పిల్లలకి చూపించడం.
5. అందరూ ఇళ్ళకెళ్ళాక పెద్ద గుండెక్కి గొంతు చించుకొని పాట పాడటం. (ఇందుకోసం ఏదైనా పాట నేర్చుకోవాలి.)
6. ఆరుబయట వెన్నెల్లో ఈతచాప పరుచుకొని అన్నం తినడం.
7. పచ్చి శెనక్కాయల సమయం కాదు గావున కాల్చిన పచ్చి శెనక్కాయలు తినే యోగం లేదు. వుందేమో కనుక్కోవడం.
8. వర్షాలు పడి దుక్కిళ్ళు చేసే అవకాశం వుంటే మేడి పట్టి కోండ్ర వేయడం.
9. నీళ్ళు తోడే మోటారు పంపుకు మూతి ఆన్చి నీళ్ళు తాగడం.
10. వీలయినన్ని మిగిలి వున్న జ్ఞాపకాలను కెమారాలో పట్టి బందించడం.

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'వూరెళ్ళాక చేయాల్సిన పనులు' పై 14 అభిప్రాయాలు

'వూరెళ్ళాక చేయాల్సిన పనులు'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. చదువరి అభిప్రాయం,

  తేది: June 8, 2008 సమయము: 1:05 pm

  సర్వసుఖప్రాప్తిరస్తు!
  కొత్తగా పాట నేర్చుకోవాలా ఏంటండీ.. చెల్లియో చెల్లకో పద్యమందుకోండి, భేషుగ్గా ఉంటది.
  అన్నీ బానే ఉన్నాయి గానీ, నులకమంచం విషయమే అలోచించండి.. మొన్న నేను ఇంటికెళ్ళి ఇలాగే పడుకుంటే మెడ పట్టేసింది -అలవాటు తప్పటాన! :)

 2. విహారి అభిప్రాయం,

  తేది: June 8, 2008 సమయము: 1:29 pm

  7. ఎండు చెనిక్కాయిలు నీళ్ళలో కొన్ని గంటలు నానబెట్టి గప్చీప్ కంపల్లొ కాల్చుకోని తినండి.

  కాదరయ్య పాట కన్నా మించింది వుంటుందా? దానిలో బ్లాగరయ్యను జత చేసి పాడుకోండి. రీమిక్సింగు బావుంటుంది.

  – విహారి

 3. విహారి అభిప్రాయం,

  తేది: June 8, 2008 సమయము: 1:29 pm

  7. ఎండు చెనిక్కాయిలు నీళ్ళలో కొన్ని గంటలు నానబెట్టి గప్చీప్ కంపల్లొ కాల్చుకోని తినండి.

  కాదరయ్య పాట కన్నా మించింది వుంటుందా? దానిలో బ్లాగరయ్యను జత చేసి పాడుకోండి. రీమిక్సింగు బావుంటుంది.

  – విహారి


 4. తేది: June 8, 2008 సమయము: 2:19 pm

  మీరు ఊరెళ్ళడానికి ఎంతగా ఎదురు చూస్తున్నారో మీ టపాలే చెబుతున్నాయి.
  ఉన్నన్ని రోజులలో అన్నిటినీ అనుభవించి సంతోషంగా వెనక్కి వెళ్ళగలరని ఆశిస్తున్నాను.

 5. kranti అభిప్రాయం,

  తేది: June 8, 2008 సమయము: 9:47 pm

  :-) బాగుందండి.మీ ట్రిప్ విజయవంతమవ్వాలని ఆశిస్తున్నాను.


 6. తేది: June 8, 2008 సమయము: 10:46 pm

  ముందుగా తెలుగు నేలకు మరోసారి స్వాగతం! మీరనుకున్న విధంగా మీ ఊర్లో ఆనందంగా గడిపి,కొన్నేళ్ళకి సరిపడా అనుభూతులని ప్రోదిచేసుకోండి. తర్వాత, వాటిని మాతో పంచుకోండి.

 7. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: June 9, 2008 సమయము: 12:13 am

  * వర్షం పడితే కాగితం పడవలు చేసి వీధుల వెంట పారే నీళ్ళలో ఎలా వాటిని నడిపించాలో పిల్లలకు నేర్పటం
  * మీ ఊరి యేరు అలుగు పారితే ఏండ్రకాయలు పట్టి ఏంచి తినటం
  * బంకమట్టితో బండ్లు చేసి వాటికి గాండ్లు తగిలించి ఆరే దాకా ఎండబెట్టి అసెంబులు చెయ్యటం
  * మోటరుకాడి నీళ్ళతొట్లో లైఫ్‌బాయ్ సబ్బురుద్దుకొని స్నానం చెయ్యటం
  * సంక్రాంతి దాటిపోయినా తెల్లార్జామునే లేచి దుగ్గు పోగేసి భోగిమంటలెయ్యటం (అందరూ ఎగాదిగా చూసినా అమెరికా బాపతులే అని కిసకిసా నవ్వుకున్నా నాకేంటి అనుకుంటే సరి)
  * మిద్దె మీద మంచమేసుకొని నక్షత్రాల్లెక్కబెట్టడం (ముత్యాలమంచం ముగ్గురు దొంగల్లాంటివి) పిల్లలకు చూపటం

 8. చదువరి అభిప్రాయం,

  తేది: June 9, 2008 సమయము: 1:39 am

  రవీ, బోలెడు చెబుతున్నారు; ఏదీ వదులుకోలేరు. పాపం ప్రసాదు గారికి రెండు వారాలు సరిపోతాయో లేదో! :)
  ప్రసాద్, “నేను బాల్యంలో గడిపిన వూరులా ఇప్పటి వూరు లేదు…” అనే మీ చింత చూస్తుంటే (గత జాబులో) నిన్నటి ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన ఒక వ్యాసం గుర్తొచ్చింది.. చూడండి. (http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2008/8-6/others5)

 9. గోపాలక్రిష్ణ అభిప్రాయం,

  తేది: June 9, 2008 సమయము: 2:06 am

  ఆహా.. మీరలా చెప్తూంటే నాక్కూడా ఒక్కపరుగున మళ్ళీ మాఊరు వెళ్ళాలని ఉంది.. చాలా బాగా రాశారు!

 10. Dileep అభిప్రాయం,

  తేది: June 9, 2008 సమయము: 2:45 am

  చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసారు… నిజంగా మన చిన్ననాటి జ్ఞాపకాలని అదే ఊరిలో అలానే నెమరువేసుకోవడం కష్టమేమో ఇప్పుడు.. ఇప్పుడు చాలా మారిపోయాయి.. అందుకేనేమొ అవి నాకెప్పటికీ కోల్పోయినట్టే అనిపిస్తుంది… తిండి తిందామంటే నాకు గుర్తున్న రుచులతో ఇప్పటివి పోల్చుకోలేను.. చిన్నప్పుడున్న మనుషులు ఇప్పుడు అక్కడ ఉండరు…

  మీరు చక్కగా, తీరికగా, భద్ర్రంగా,మనసారా,హాయిగా మీరనుకున్నవి అనుభవించాలని కోరుకుంటున్నాను.. :-)

 11. bollojubaba అభిప్రాయం,

  తేది: June 12, 2008 సమయము: 12:03 pm

  wish you a happy journy, and happy vacation. enjoy and bring back nice memories.
  bollojubaba

 12. చరసాల అభిప్రాయం,

  తేది: June 12, 2008 సమయము: 9:59 pm

  @చదువరి గారూ,
  చెల్లియో చెల్లకో కూడా రాదండి. విహారి చెప్పినట్లు కాదరయ్య పాట నేర్చుకుంటే చక్కగా పాడుకోవచ్చనుకుంటాను.

  మెడ పట్టడం ఏముందిలెండి. ఇక్కడ మెత్తటి పరుపుల మిద పడుకున్నా నాకిప్పుడు మెడ పట్టేసే వుంది. మీ హెచ్చరికమేరకు జాగ్రత్త పాటిస్తాను. ముందు నులక మంచం దొరుకుతుందో లేదో!

  @విహారీ,
  ఎండు చెనక్కాయలను నానబెట్టి కాలిస్తే అంత రుచి వస్తుందంటారా? ఆ రోజుల్లో అయితే చెనక్కాయ చేల దగ్గరికి రాత్రి పుట ఆదవిపందుల నుండీ కాపాడటానికి వెళ్ళినపుడు ఓ సందెడు చెట్లు పీకి, ఎండుతాఖులూ, గడ్డి గాదమూ వేసి మంట పెట్టి ఆ కాలిన కాయలను ఎన్ని తిన్నా ఇంకా బూడిద కెలికి కెలికి తినేవరకూ తృప్తి వుండేది కాదు.

  @ప్రవీణ్, క్రాంతి,
  కృతజ్ఞతలు.

  @సోమ శంకర్ గారూ,
  తప్పకుండా బ్లాగ్మిత్రులతో నా అనుభవాలు పంచుకుంటానండి.

  @రవీ,
  ంఇ చిట్టాను నా చిట్టాకు జత చేస్తున్నాను. కాగితపు పడవల అయిడియా బాగుంది. అయితే మా అమ్మాయితో ఓ చిక్కు. అయ్యో నా కాగితం వెళ్ళిపోతోందే అని ఏడుస్తుంది. ఇక నేను శాకాహారిగా మారిపోయాను గనుక ఎండ్రక్కాయలు తినే ప్రశ్నే లేదు.
  ఇక మిగిలినవి తప్పక చేస్తాను. బంకమట్టి బండయితే తప్పక చేయాలి.
  అట్లాగే నా చిన్నప్పుడు జొన్న బెండ్లతో కూడా బండ్లు చేసేవాళ్ళం. కానీ జొన్న పండే ఋతువు కాదే.

  @చదువరి గారూ,
  వ్యాసం చదివానండి. అంతే మన వూరు మన బాల్యంలోలా వుంటే బాగుండుననుకుంటాం. కానీ మనం మన బాల్యంలోలా లేనప్పుడు వూరూ వుండదు. ప్చ్ అదంతే.

  @గోపాల క్రిష్న గారూ,
  మరింకేం మీరూ మీ వూరెళ్ళిరండి.

  @దిలీప్ గారూ,
  దూరంగా వున్నప్పుడు ఈ కోరికలన్నీ, తీరా వూరెళ్ళాక నిరుత్సాహం వస్తుందో వుత్సాహం వస్తుందో! మీ ఆశీర్వాదానికి కృతజ్ఞతలు.

  @బాబా గారూ,
  నెనర్లు.

  –ప్రసాద్


 13. తేది: July 2, 2008 సమయము: 2:10 am

  [...] అంటూ వూరెళ్లాకా ఏమేం చేయాలనుకుంటున్నారో కూడా చెప్తున్నారు చరసాల [...]

 14. suryanarayana అభిప్రాయం,

  తేది: July 8, 2008 సమయము: 10:11 am

  ఈ క్రింది వస్తువులు కాల్చుకు తినదగ్గవి:
  చింత కాయలు, ఎర్రదుంపలు, కర్ర పెండలం దుంపలు, బొబ్బరి కాయలు, తేగలు, వగైరా. తేగల్ని కొబ్బరాకుల్లో చుట్టి నీళ్ళు పొసి ఉడకెయ్యడం ఇంకో పద్ధతి. ఈ పని రాత్రి చెయ్యాలి. ఇందుకు గాను మూడు రాళ్ళను పొయ్యిగా మార్చ వచ్చు. అది campfire గా కూడా పనికొస్తుంది.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో