వూరెళ్తున్నానోచ్!

తేది: June 6, 2008 వర్గం: వర్తమానం రచన: చరసాల 2,764 views

ఇదిగో అదిగో అంటూ రోజులూ, నెలలూ, ఏళ్ళూ గడిచి మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత పుట్టినింటి గడప తొక్కబోతున్నాను. అయితే నేనుండబోయేది కేవలం రెండు వారాలు. అయినా ఏదో ముప్పిరిగొనే ఆనందం.
వూరికి పాతిక కిలోమీటర్ల దూరంలోని కడపలో చదివేటప్పుడు వారానికోసారి వూరెళ్ళేవాన్ని. ప్రొద్దుటూరులో చదివేటప్పుడు నెలకో నెలన్నరకో ఓసారి వెళ్ళేవాన్ని. భీమవరంలో చదువుతున్నప్పుడు దసరా, సంక్రాంతి, వేసవి సెలవులకు తప్ప వెళ్ళడం కుదిరేది కాదు.

ఇక అమెరికాకు వచ్చాక నాలుగైదేళ్ళకు ఒకసారి గానీ కుదరడం లేదు. ఇక్కడికి వచ్చిన ఈ పదేళ్ళలో ఒకే ఒకసారి 2003లో వీలయ్యింది. మళ్ళీ ఇప్పుడు. అప్పుడైతే అయిదు వారాలున్నా. కానీ ఇప్పుడు రెండు వారాలకు మించి కుదరడం లేదు.

దూరాలు మారినా, కాలాలు మారినా, నేను మారినా, మా వూరు మారినా … వూరెళ్తున్నాను అంటే మనసు పడే ఆరాటంలో, వుద్వేగంలో, ఆనందంలో మాత్రం మార్పు రాలేదు. వూరెళ్ళే రోజు దగ్గరపడే కొద్దీ రోజులు భారంగా గడుస్తాయి. వూరు దగ్గరపడే కొద్దీ అడుగులు భారంగా పడతాయి. అదో రకమైన ఆనందంతో మనసుకు మాటలు రావు. ఇలాంటి ఆనందం వేసవి సెలవుల తర్వాత కొత్త తరగతికి వెళ్ళేటప్పుడు వుండేది. నాన్న కొత్త బట్టలు కొనుక్కొచ్చినప్పుడుండేది. కొత్త తరగతి పుస్తకాలు తిరగేస్తున్నప్పుడుండేది. అవన్నీ ఒక్కొటొక్కటే కనుమరుగైనా వూరుకెళ్తున్నాననే సంబరం మాత్రం ఇప్పటికీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే వుంది. తీరా వూరిలో ఏముందని ఇంత ఆశ, ఆతృత అంటే ఇదీ అని ఏ ఒక్కదాని మీదా ప్రత్యేకించి లేదు.

నేను బాల్యంలో గడిపిన వూరులా ఇప్పటి వూరు లేదు. వూరి బయట గడ్డి వాముల్లేవు. వూరిలోపల ఆవుల మందలు లేవు. చెరువు గట్టు మీద మామిడి చెట్టు లేదు. మొగలి పొదైనా వుందో లేదో! వెన్నెల్లో చెక్క భజనలూ, జక్కీకలూ లేవు.

అయినా వెళ్ళాలనే వుంది. నడిచిన నేల, పీల్చిన గాలి, తాగిన నీళ్ళూ మళ్ళీ చూడాలనే వుంది.

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 ఓట్లు, సగటు: 5 కు 4.50)
Loading ... Loading ...

'వూరెళ్తున్నానోచ్!' పై 10 అభిప్రాయాలు

'వూరెళ్తున్నానోచ్!'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. విహారి అభిప్రాయం,

  తేది: June 6, 2008 సమయము: 7:50 pm

  మీరు వెళ్తే వెళ్ళీ రండి కానీ వెళ్ళొచ్చిన తరువాత అక్కడ నేని ఇది తిన్న అది తిన్నా అని ఫోటోలు పెట్టకండి. ప్రత్యెకంగా ఆ సంగటి, చెనిగ్గింజల ఊరిమిండి తిన్నానని అసలు చెప్పకండి.

  క్షేమంగా వెళ్ళి లాభంగా రండి.

  – విహారి

 2. కె.మహేష్ కుమార్ అభిప్రాయం,

  తేది: June 6, 2008 సమయము: 10:00 pm

  మీది కడపా…! మాది చిత్తూరు లెండి అదీ మీపక్కనే కలకడ దగ్గరే మా సొంతూరు. క్షేమంగా వెళ్ళి సంతోషం గా గడిపి, ఆనందంగా తిరిగి వచ్చు అనుభవాల్ని పంచండి.

 3. vijayarouthu అభిప్రాయం,

  తేది: June 7, 2008 సమయము: 2:08 am

  మీ రాకకె కడప గడప ఎదురు చూపు

 4. జ్యోతి అభిప్రాయం,

  తేది: June 7, 2008 సమయము: 2:39 am

  చాలా సంతోషం ప్రసాద్. ఇన్నేళ్ళకు సొంత ఊరికి వస్తున్నందుకు. నిజంగా చాలా ఉద్వేగంగా ఉంటుంది. అందరిని కలుస్తున్నందుకు. వారం రోజులు యాత్రలకు వెళ్లి ,తిరిగి హై కి వస్తేనే అంతా కొత్త కొత్తగా ఉంటుంది. ఇక ఇన్నేళ్ళ తరవాత అంటే నిజంగా కొత్త లోకానికి వచ్చినట్టు ఉంటుంది. కదా… వెల్ కమ్. హై లో కలుస్తా..


 5. తేది: June 7, 2008 సమయము: 3:47 am

  ఏమిటీ… నాలుగేళ్ళ నుంచీ ఇంటికి వెళ్ళలేదా ?

  పోనీలెండి. సంతోషంగా గడిపి రండి ఊళ్ళో…
  వేరే దగ్గర లేనిది మనూళ్ళో ఉన్నది “మన” అనే భావన. ఆ భావన ఇంకెక్కడున్నా రాదుగా మరి.

 6. ramani అభిప్రాయం,

  తేది: June 7, 2008 సమయము: 4:53 am

  ఈ అనభూతి నాకు సరగ్గా ఓ 10రోజుల క్రితం కలిగింది ప్రసాదు గారు. నేను దాదాపుగా25సంవత్సారాల తరువాత, నేను పుట్టిన ఊరుకి వెళ్ళాను . ఊరు మారిపోతుందన్నది నిజమె, కానిమనం అక్కడ పుట్టామనన్న అనుభూతి మాత్రమ్ గొప్పది, అది మారదు.

  అందుకే చలం అన్నారు. “మన జ్ఞానాన్ని ఇతరులకి పంచగలము కాని, మన అనుభూతిని, అనుభవాలని ఇతరులకి పంచలేము” అని.

 7. వికటకవి అభిప్రాయం,

  తేది: June 7, 2008 సమయము: 6:36 am

  అమ్మో, పదేళ్ళలో రెండో సారా? అయితే మీరు ఊహించని భారతాన్ని చూడబోతున్నారు అన్ని విధాలుగా. సుఖ ప్రయాణం జరుగు గాక.


 8. తేది: July 2, 2008 సమయము: 12:57 am

  [...] వూరెళ్తున్నానోచ్! అంటూ వూరెళ్లాకా ఏమేం చేయాలనుకుంటున్నారో కూడా చెప్తున్నారు చరసాల ప్రసాద్. [...]

 9. రానారె అభిప్రాయం,

  తేది: July 11, 2008 సమయము: 12:25 am

  ఎంత బాగా రాశారు! పల్లె మారిపోయింది. మనుషుల్లోనూ మట్టిలోనూ చివరికి ఆ గాలిలో కూడా తడి అనేదే లేకుండా పోయింది. ఆవుల మంద అనేది ఇంక కళ్లబడదేమో కూడా. పల్లెనుంచి బయటపడినవాళ్లలో చాలామంది సుఖపడినా, అక్కడే వుంటున్నవాళ్ల జీవితాల్లో మాత్రం ఆనందం తగ్గిపోయిందనే చెప్పాలేమో.

 10. prasadrao అభిప్రాయం,

  తేది: April 13, 2011 సమయము: 6:41 am

  మనీ మనిషినీ ఎలుతుంది

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో