మా వూరి బస్సు = మార్క్(MARC) ట్రైను

తేది: May 9, 2008 వర్గం: వర్తమానం రచన: చరసాల 2,072 views

నేను ఏడవ తరగతిలోనో ఎనిమిదిలోనో వున్నప్పుడు మా వూరి మీదుగా కడప నుండీ వేంపల్లెకు వయా లక్కిరెడ్డిపల్లె బస్సును వేశారు. పిల్లలకూ పెద్దలకూ బస్సు వస్తోందంటే అదేదో ఓ వుబలాటం, ఆనందం కలిగేవి. స్కూలుకు వెళుతున్నపుడో, తిరిగి వస్తున్నప్పుడో బస్సు ఎదురుపడితే బస్సు డ్రైవర్‌కు టాటా చెప్పకుండా వుండేవాళ్ళం కాదు. తిరిగి డ్రైవర్ చెయ్యి వూపితే కొండెక్కినంత సంతోషం.
ఈ బస్సు మధ్యాహ్నం 11గం. సమయంలో కడపలో బయలుదేరి, వేంపల్లె వెళ్ళి వచ్చి, మళ్ళీ సాయంత్రం ఆరుగంటలప్పుడు రెండో సారి కడప నుంచి బయలు దేరేది.
నేను కడపలో చదువుతున్నప్పుడు, ఆ తర్వాత ప్రొద్దుటూరు, భీమవరంలో చదువుతున్నప్పుడూ, హైదరాబాదులో పనిచేస్తున్నప్పుడూ మా వూరికెళ్ళాలంటే కడపదాకా వచ్చాక ఈ ఆరు గంటల బస్సే దిక్కు.
దేవుడా ఈ పూటకి బస్సు మిస్సు కాకుండా చూడు అని మనస్సులో మొక్కుకుంటూనే కడపలో బస్సు దిగాక లక్ష్మీరంగా థియేటరు ఎదురుగా పూలమ్మే ఆయన్ని “అయ్యా, వేంపల్లె బస్సు వెళ్ళిందా?” అని అడిగి “వెళ్ళలేదు” అంటే హమ్మయ్య అనుకొని ఇక అది వచ్చేవరకూ అక్కడ తచ్చాడటం. అది వచ్చాక ఇక ఎప్పటికైనా వూరు చేరుస్తుందన్న ధీమాతో ఓ సీటు చూసుకొని కూర్చోవడం. బస్సు దొరికిందన్న ఆనందంలో అది ఎంత ఆలస్యంగా వచ్చిందన్న స్పృహే వుండేది కాదు. వచ్చిందా లేదా న్నదే ముఖ్యం గానీ ఆలస్యం అన్నది ఎవరికీ పట్టింపు గానే గాదు. బస్సు దొరికి బస్సులో కూర్చున్నపుడే ఇల్లు చేరినంత తీయగా వుండేది ఆ అనుభూతి.

ఇప్పుడు ఇక్కడ నాకలాంటి అనుభూతిని వాషింగ్టన్ డీసి యూనియన్ స్టేషన్, బాల్టిమోర్ పెన్ స్టేషన్ మద్య తిరిగే మార్క్ రైలు ఇవ్వడమే గాక మావూరి ఎర్ర బస్సుని గుర్తు చేస్తుంది. నేను కాపిటల్ దగ్గరనుండీ మెట్రోలో ప్రయాణం చేసి, న్యూ కరాల్టన్ దగ్గర మార్క్ రైలు కోసం ఎదురు చూస్తాను. మెట్రో ఏ కారణం చేతొ కొద్దిగా ఆలస్యమయితే ఆ పూటకి మార్క్ మిస్సు. మళ్ళీ తర్వాతి ట్రైను గంట తర్వాతే! ఎనబై నుంచీ తొంబై శాతం ట్రైను ఖచ్చితమైన సమయానికే వస్తుంది కానీ అప్పుడప్పుడూ తెగ ఇబ్బంది పెడుతుంది.
మొన్నోరోజు పరుగెట్టి పరుగెట్టి మెట్రో రైలందుకొని, డోరు దగ్గర అందరికంటే ముందు నిలుచుని, తెరవగానే తుపాకీ నుండీ వెలువడ్డ తూటాలా పరుగెత్తి మార్క్ స్టేటస్ చూస్తే అది రద్దయిందట! తర్వాతి రైలు గంట తర్వాత. అయితే ఆ తర్వాతి రైలు కూడా 40నిమిషాల ఆలస్యం! అంటే వెరసి ఆరుగంటలకి ఆఫీసులో బయలుదేరితే ఇంటికి తొమ్మిదింటికి చేరాను.
అయినా ట్రైను దొరికి అందులో కూర్చున్నాక ఇల్లు చేరినంత అనుభూతి. మావూరి బస్సెక్కిన ఆనందం.
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 ఓట్లు, సగటు: 5 కు 4.50)
Loading ... Loading ...

'మా వూరి బస్సు = మార్క్(MARC) ట్రైను' పై 2 అభిప్రాయాలు

'మా వూరి బస్సు = మార్క్(MARC) ట్రైను'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. marchipoya అభిప్రాయం,

    తేది: May 9, 2008 సమయము: 2:00 pm

    chaala bagundi. inka konnallu aagandi eekamgaa railu bandi ekki kadapa nundi lakki reddy palli ki vellochu vempalli dwara :)

  2. R3! అభిప్రాయం,

    తేది: May 22, 2008 సమయము: 11:59 am

    చా లా బాగు న ధి

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో