చివరకు మిగిలేది…

తేది: April 29, 2008 వర్గం: నా ఏడుపు రచన: చరసాల 3,561 views

ఎంత సంపాదించినా, ఏమి చేసినా చివరకు నీకంటూ మిగిలేది ఏముంది అని అనడం తరచుగా వింటూ వుంటాం. అయితే మనం వెళుతూ వెళుతూ ఏమీ తీసుకుపోము గానీ, వదిలి మాత్రం వెళతాం.

ఉదయం లేచింది మొదలు రాత్రి విశ్రమించేవరకూ చేసే ప్రతిపనిలో కొంత చెత్తను తయారు చేస్తున్నాం. అమెరికాలో రోజుకు ఒక్కో వ్యక్తి నాలుగు పౌండ్ల చెత్తను తయారుచేస్తున్నాడట! అంటే అమెరికా ఒక్కటే రోజుకు ఆరు లక్షల తన్నుల చెత్తను తయారు చేస్తోంది.బహుశా అధిక చెత్తను తయౄ చేయడం అభివృద్దికి కొలబద్దగా చెప్పుకోవచ్చేమొ! పళ్ళుతోముకునేందుకు, పళ్ళు కుట్టుకునేందుకు, ముడ్డి తుడుచుకునేందుకు చెత్త తయారుచేయడంతో మొదలెట్టి, కాగితం కప్పులో కాఫీ, పేపరులో చుట్టిన బ్రెద్దూ, ప్లాస్తిక్ డబ్బాలో నీళ్ళు లేదా అల్యూమినియం క్యాన్‌లో కోక్ …  ఇలా చెప్పుకుంటూ పోతే ఉపయోగించేది పాతిక, చెత్తగా మార్చేది ముప్పాతికా అనిపిస్తుంది.

ఈ దృక్కోణంలో చూడటం మొదలెట్టాక ఏ దుకాణం కెళ్ళినా నాకు చెత్తే కనిపిస్తోంది. బాటిల్‌లో నీళ్ళకు బదులు బాటిల్ చెత్తరూపం కనిపిస్తోంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్ వెనుకాల, దాని చెత్త స్వరూపం కనిపిస్తోంది.

పునర్వినియోగం చేయగలిగిన వస్తువులను కూడా బాధ్యతారహితంగా చెత్తలో వేయడం వల్ల, అవి చివరికి దిబ్బలకు(landfills) చేరిపోతున్నాయి. అలా దిబ్బలకు చేరిన చెత్త ఇక ఎప్పటికీ అలానే వుండి పోతుంది. ఈ వ్యర్థాలు మన బాధ్యతారాహిత్యాన్ని మన వారసులకు గుర్తు చేస్తూనే వుంటాయి.

చెత్త తయారు చేయడం తగ్గించడానికి ఎవరికి వీలయినంతలో వారు పాటు పడాలి. వీలయినంతవరకూ వాడివదిలించుకొనే (usethrow) పద్దతి మానుకోవాలి. ఇళ్ళల్లో పార్టీలకు కాగితపు కప్పులు, కంచాలూ, ప్లాస్టిక్ స్పూన్లు గట్రా వాడటం మానివేయాలి. చిన్న చిన్న వాటర్ బాటిళ్ళూ, కోక్ డబ్బాల స్తానంలో పెద్ద పెద్ద బాటిల్లూ లేదంటే పూర్తిగా మానివేయడమో చేయాలి. చేతులు తుడుచుకోవడానికి మన పద్దతిలోలా నీళ్ళు వుపయోగించి, పొడి టవల్‌తో తుడుచుకోవాలి.

మన భావి తరాలకు అందమైన భూగోళాన్ని ఇవ్వకపోయినా ఫర్వాలేది, చెత్త నింపిన, దుర్గంధ భూయిష్టం, ప్రమాదకారి అయిన భూగోళాన్ని వదిలిపెట్టక పోతే చాలు.

మీరే వాడే ప్రతి వస్తువు వెనకాలా చెత్తను గూర్చి ఆలోచించండి. మీరు వేసే ప్రతి అడుగు మీ పిల్లలకు మడుగు కాకుండా చూడండి.

శ్రీనివాస్ గారు ఇచ్చిన ఈ లంకెలోని వీడియో మీరు చూసి తీరాలి.
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (5 ఓట్లు, సగటు: 5 కు 4.00)
Loading ... Loading ...

'చివరకు మిగిలేది…' పై 7 అభిప్రాయాలు

'చివరకు మిగిలేది…'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. ashok అభిప్రాయం,

  తేది: April 30, 2008 సమయము: 4:19 am

  మీ అలొచన బగుంది నెను కుడా అచరించడానికి ప్రయాత్నిస్తాను.

 2. కొత్తపాళీ అభిప్రాయం,

  తేది: April 30, 2008 సమయము: 7:21 am

  చరసాల వారూ, తమ పునర్దర్శనం చాలా సంతోషం. మిమ్మల్ని టపారాసేందుకు ప్రేరేపించినందుకైనా చెత్తని మెచ్చుకోక తప్పదు. :-) మీ సహజమైన శైలిలో చక్కగా చెప్పారు. ఒక మంచి రేపు కోసం ఒక్క పని చెయ్య గలిగితే .. తక్షణం ప్లాస్టిక్ కవర్లు వాడటం మానెయ్యండి.

 3. radhika అభిప్రాయం,

  తేది: April 30, 2008 సమయము: 12:01 pm

  చాలా మంచి ఆలోచనలు.నాకు ఎప్పటి నుండో కొన్ని అనుమానాలు వున్నాయి. ఈ వాడిపడేసే చాలా వస్తువులు చాలావరకూ రీసైక్లింగ్ చేయగలిగేవేకదా.అలాగే తాగడానికే నీళ్ళు దొరకవు అనుకునే చోట్ల చేత్లు,కాళ్ళూ కడుక్కోడానికి నీళ్ళు ఉపయోగించడం ఎంతవరకు సమంజసం? ప్లాస్టిక్ కవర్లు మట్టిలో కలసిపోవని చెప్పి ఒక ఉద్యమంలా వాటిని నిషేధించాముగా.ఇప్పుడు వచ్చే కవర్లు అన్నీ రీసైక్లిక్ అనేగా అంటున్నారు.
  చెత్తని తయారు చేయడం ఎందుకు?మళ్ళా దాన్ని శుబ్రపరచడం ఎందుకు అనేదానిని నేనూ ఒప్పుకుంటాను.అందుకే మీరు చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవిస్తున్నాను.ఇలాంటి బాధతోనే మొన్నామధ్య రాసిన కవిత నా బ్లాగులో ప్రచురించాను.సందేహ నివృత్తికోసమే పై వాదన.

 4. తాడేపల్లి అభిప్రాయం,

  తేది: April 30, 2008 సమయము: 9:32 pm

  దీనికొక సైకిల్ ఉంది.

  1. విజ్ఞానాన్ని (సైన్సు) సాంకేతికత (టెక్నాలజీ) గా రూపాంతరించి వస్తూపయోగాన్ని ఆవిష్కరించడం
  2. కొత్త అవసరాల్ని కనుగొనడం
  3. వాటిని అందరూ మరగడం (అడిక్షన్)
  4. అవి చాలా అవసరమైనవనీ అవి లేకపోపే బతకలేమని ప్రచారం, వాటిని వాడనివాడు అనాగరికుడని ఊదరగొట్టడం
  5. వాడిపారేసినవాటిని ఏం చేసుకోవాలో తెలియకపోవడం
  6. మళ్ళీ వాటికి ఉపయోగాన్ని కనిపెట్టడం


 5. తేది: May 1, 2008 సమయము: 12:44 pm

  ప్రసాద్ గారు,
  చాలా బాగా చెప్పారు.
  మీకు వీలయినప్పుడు ఈ వెబ్ సైటు మెయిన్ పేజీ లోని వీడియో ఒకసారి చూడండి. కడుపు తరుక్కు పోతుంది.
  http://www.storyofstuff.com/

 6. చరసాల అభిప్రాయం,

  తేది: May 2, 2008 సమయము: 8:02 am

  @అశోక్,
  నెనరులు.

  @కొత్తపాళీ గారూ,
  ప్లాస్టిక్ ఎంతలా చొచ్చుకుపోయిందంటే దాన్ని వాడకుండా వుండటం అంత సులభంగా అలవాటయ్యేట్లు లేదు. మెల్ల మెల్లగా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.

  @రాధిక గారూ,
  సమస్య ఒక ప్లాస్టిక్‌దే కాదండీ. ఇక్కడి పట్టణాల నమూనాలను చూడండి. కారు లేకుండా కూరగాయలైనా కొని తెచ్చుకోగలమా? ఇంటికీ ఇంటికీ ఇంత ఎడం అవసరమా? ఇంటికీ ఆఫీసుకీ మధ్య గంట కారు ప్రయాణం అవసరమా? భయపెట్టో బతిమాలో తెచ్చుకొనే ఆయిల్‌ని ఇలా కారు పొవ్వుల్లో పోసి అయిన దానికీ కాని దానికీ తగలెట్టడం అవసరమా?
  ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! పైనుంచీ ఈ మనిషి చేసే పనుల్నీ మూడో కంటితో చూస్తే ఎంత హీనంగా, అనాగరికంగా, అవివేకంగా కనిపిస్తుందో!
  (మీ కవితలు ఈ మధ్య చదవలేదు. చాలా బాగున్నాయి.)

  @తాడేపల్లి గారూ,
  మీరు చెప్పింది అక్షరాలా నిజం. మనకు అవసరమా లేదా అనిగాక, ఈ సైకిల్‌లో పడి కొట్టుమిట్టాడుతున్నాం.

  @శ్రీనివాస్ గారూ,
  మంచి వీడియోని పరిచయం చేసినందుకు నెనరులు.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 7. జ్యోతి అభిప్రాయం,

  తేది: May 3, 2008 సమయము: 4:27 am

  హమ్మయ్యా ! ఎలాగైతేనేమి. ఈ చెత్త వల్లనైనా ఈ టపా రాసావు ప్రసాద్. అప్పుడప్పుడు బ్లాగ్లోకంవైపు ఓ చూపు చూస్తుండు..

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో