Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/22/11733922/html/blog/index.php:2) in /home/content/22/11733922/html/blog/wp-content/plugins/bad-behavior/bad-behavior/screener.inc.php on line 8
అంతరంగం » Blog Archive » Dr. Seuss’ Horton Hears a Who – అనగా అనగా ఓ సినిమా

Dr. Seuss’ Horton Hears a Who – అనగా అనగా ఓ సినిమా

తేది: April 19, 2008 వర్గం: అనుభవాలు రచన: చరసాల 3,180 views

ఈస్టర్ ఆదివారం మాల్‌కు తీసికెళ్ళి ఈస్టర్ బన్నీ చూపెడతానని మా పిల్లలకు వాగ్దానం చేసివున్నా. ఆయితే తీరా మాల్‌కు వెళితే అది ఈస్టర్ సందర్భంగా మూసి వుంది. ఇకా మా అమ్మాయి గోల ఆపడం కోసం అయితే నేను మిమ్మలని ఓ మూవీకి తీసుకెళతా అన్నా, ఏదో ఒక పిల్లల సినిమా వుండక పోతుందా అని.

తీరా అక్కడికి వెళితే చిన్నపిల్లలు చూడగల సినిమా ఇది (Dr. Seuss’ Horton Hears a Who) ఒక్కటే.

చిన్న విషయాలకు వాగ్దానభంగం చేయటం నాకిష్టం వుండదు. ఆ సినిమా గురించి నాకేమీ తెలియక పోయినా ‘G’ rating చూసి వెళ్ళాం.

సినిమా మా పిల్లలకు అర్థమవకపోయినా ఆ ఏనుగు మాత్రం చాలా నచ్చింది. నాకు మాత్రం అది పిల్లలకంటే గూడా పెద్దలకు ప్రత్యేకించి నాలాంటి అవిశ్వాసకుల కొరకు తీశారా అన్న అనుమానం వచ్చింది.

ఎందుకంటే…
 నాకు ఆ ఏనుగు క్రీస్తులా, ఆ కనిపించని బుల్లి జీవులు మానవుల్లా, ఆ బుల్లి ప్రపంచం మేయరు భగవంతుని వునికిని తెలుసుకొన్నవాడిలా … అలా కనిపించారు.
ఈ సినిమాలో విలన్, కంగారూ “కంటికి కనిపించని, చెవులకు వినిపించని జీవి వుండి వుండటం అసంభవం” అంటుంది. ఈ వాదన “దేవుడు లేడనే” అవిశ్వాసుల వాదనను పోలివుంటుంది.

నిజంగా ఆ సినిమా వుద్దేశ్యం అదో కాదో తెలియదు కానీ నాకు మాత్రం ఆ సినిమా అలా క్రైస్తవ ప్రచారంలా అనిపించింది. లేక నేను గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుము కొన్నానో.

చివరి మాట: నిజానికి ఈ సినిమా ఈస్టర్ రోజున చూసిన వెంటనే నాలో రేగిన భావాల మూటనంతటినీ జారిపోకుండా బ్లాగులో సర్దుదామనుకున్నా… అదేమిటో ఇంట్లో గానీ బయట గానీ ఓ క్షణం తీరిక దొరకటం లేదు. ఏదో అరా కొరా సమయం చిక్కుతుంది కానీ నా మట్టుకు నాకు బ్లాగులో నా హృదయాన్ని ఆవిష్కరించాలంటే ఆ సమయం సరిపోదు. మనసులోని భావానికీ, కీబోర్డు మీది వేళ్లకీ మధ్య ఎలాంటి అడ్డంకి లేని ధార కుదిరినప్పుడే రాయగలుగుతాను. ఇదెందుకో ఈ మద్య కరువయ్యింది.

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 4.00)
Loading ... Loading ...

'Dr. Seuss’ Horton Hears a Who – అనగా అనగా ఓ సినిమా' పై 5 అభిప్రాయాలు

'Dr. Seuss’ Horton Hears a Who – అనగా అనగా ఓ సినిమా'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. చదువరి అభిప్రాయం,

  తేది: April 20, 2008 సమయము: 1:43 pm

  ఏంటో.. మీరు మరీ నల్లపూసైపోయారు.

 2. lalitha అభిప్రాయం,

  తేది: April 21, 2008 సమయము: 9:24 am

  ప్రసాద్ గారు,
  చాలా రోజుల తర్వాత రాస్తున్నారు.
  ఈ మధ్యే నేను ఒకటి చదివాను, నా బ్లాగులో రాసుకుని ఉంచుకున్నాను,
  “Spiritual growth is “allowing that which is unconscious to become conscious.””
  మీలో ఉన్న ఆలోచనలు, అంతర్మథనం మీరు ఏదైనా చదివినప్పుడూ, చూసినప్పుడూ కొంచెం కొంచెంగా పైకి వస్తూ ఉంటాయనిపిస్తుంటుంది. మనం ఎన్ని చెప్పినా మన లోలోపల ఏముందో అదే మనం నమ్ముతాము, చూస్తాము. ఇది మీకు తప్పుగా నిపిస్తే క్షమించంది. కానీ ఈ టపా చూస్తే నాకనిపించింది రాస్తున్నాను. ఇప్పుడు మీకు అనిపించినదే మీ నమ్మకం అని కూడా నా భావం కాదు. దాని ఆధారంగా మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండై అని అనుకుంటా నేను చెప్పదల్చుకున్నది.
  ఈ మధ్య కొత్తపాళీ గారితో మొదలయ్యి “జీవిత పరమార్థం” గురించి బ్లాగ్లోకంలో ఆలోచనలు సాగుతున్నాయి. నాకు గుర్తుకొచ్చిన విషయలను నేను చెప్తున్నాను.
  మీకు ఇంతకు ముందు కూడా ఒకసారి నాగరాజా గరి బ్లాగులో అనుకుంటా చెప్పాను. మీకు subconcious లో ఒక నమ్మకం ఉంది. దానిని మీరు అర్థం చేసుకునే ప్రయత్నంలో మీ అన్వేషణ, సంభాషణా సాగుతోంది. చివరకు మీరు తెలుసుకునేది మీలో నిగూఢంగా ఉండి మీ ఆలోచనలను నడిపిస్తున్న దానినే అని.
  ఈ మధ్య ఓప్రా కూడా ఆధ్యాత్మికత గురించి పాఠాలు ప్రారంభించారు. Anew Earth అనుకుంటా పుపుస్తకం పేరు. అందులో ఒక లైను, “నీలో ఉన్న దాన్నే నువ్వు చూస్తావు” అని (నాకు అలా గుర్తుంది). మా స్నేహితురాలి స్నేహితురాలి ఆధ్యాత్మిక గురువు కూడా ఆమెకు ఇదే చెప్పారుట, “నీకు అర్థం అయ్యింది అంటే నీకు ఈ ఆలోచన ఉందన్న మాట. నీలో ఉన్నదాన్నే నువ్వు చూస్తున్నావు, నేర్చుకుంటున్నావు” అని.
  ఆసక్తి ఉంటే ఇక్కడా ఆధ్యాత్మికత గురించి (మతంతో సంబంధం లేకుండా) తెలుసుకోవచ్చు.
  http://www.oprah.com/obc_classic/webcast/archive/anewearth_archive_main.jsp?promocode=HP11

 3. rakee అభిప్రాయం,

  తేది: April 29, 2008 సమయము: 5:17 am

  Hi mee blog ni andhrajothi book lo choosi open chesa chala bagundi.memu meelanti

  Bloggers ki free ga websites create chesi isthunnamu.meeru kooda mee blog ni .com

  ga marchuko vacchu.poorti vivaralaku maa wesite choodandi
  http://www.hyperwebenable.com/

 4. చరసాల అభిప్రాయం,

  తేది: April 29, 2008 సమయము: 8:05 am

  చదువరి గారూ,
  తీరికలేని పనితో బ్లాగు ముఖహం చూడటమే కష్టమవుతోంది. మిమ్మలందరినీ చాలా మిస్సవుతున్నాను.

  లలిత గారూ,
  నా ఏ అభిప్రాయమైనా మార్చుకోలేనంత స్థిరమైంది కాదు. నా అభిప్రాయాన్ని మార్చుకొనేందుకు నేనెప్పుడూ సిద్దంగానే వుంటాను.

  ఈ సినిమా చూసి బయటకు వచ్చాక చాలా ఆలోచనలు వచ్చాయి. అయితే తీరా బ్లాగు మొదలెట్టేటప్పటికి అందులో చాలా ఆవిరయిపోయాయి.

  వీలయినప్పుడు మీరు ఇచ్చిన లంకెలోని విషయం చూస్తాను.

  కృతజ్ఞతలు.
  –ప్రసాద్

 5. నవీన్ గార్ల అభిప్రాయం,

  తేది: April 30, 2008 సమయము: 3:22 am

  అసలు హాలీవుడ్డు వాడు నా కథను కాపీ కొట్టాడు :)
  నాలుగో తరగతిలో నేను చెప్పిన కథ ఇది. కాకుంటే అందులో ఏనుగుండదు.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో