భిక్షకుల బాల్టిమోర్

తేది: January 11, 2008 వర్గం: నా ఏడుపు రచన: చరసాల 3,804 views

ఈ పదేళ్ళ అమెరికా జీవితంలో తూర్పుతీరాన్ని ఈ కొసనుండీ ఆ కొసకు చూశాను, కానీ ఈ బాల్టిమోర్ నగరంలో కనిపించినంత మంది భిక్షకులు నాకు మరెక్కడా కానరాలేదు.

ఈ చలిని ఎముకలు కొరికే చలి అంటే చాలదు. ప్రాణాలు తీసే చలి. పైగా ఆఫీసు గడప దాటింది మొదలు సవాలక్ష పనులతో, కాలంతో పోటీపడుతూ కార్లను పరుగెత్తించే జనాల మధ్య “ఇల్లు లేదు. ఆకలిగా వుంది. దానం చెయ్యండి. దేవుడు మిమ్మలని దీవించు గాక!” అని భిక్షమెత్తుకునే అభాగ్య జీవులు బాల్టిమోర్‌లో బోలెడుమంది కనిపిస్తున్నారు.

ఇంట్లోంఛి పది అడుగుల దూరంలో వున్న కారును చేరాలంటేనే ఈ చలిలో నరాలు ఉగ్గబట్టుకోవాలే! అయ్యో వీళ్ళెలా వుంటారో గదా? ఈ దేశం అన్నిటికంటే సంపన్నమైనది. వీళ్ళు చేసే దానధర్మాలు ఇంకెవ్వరికంటే కూడా ఎక్కువే. వీళ్ళు యుద్దాల మీద చేసే వ్యయమూ ఎవ్వరికంటే కూడా ఎక్కువే. ఎన్ని పాలుపోసి ఎత్తుకోగలిగే రహదారులుంటే మాత్రమెందుకు? వాటి వెంబడి భిక్షమెత్తుకునే మనిషి ఒకడున్నంత వరకూ? ఇక్కడి వార్తా ఛానళ్ళకు ప్రపంచంలోని ఎక్కెడెక్కడి వివరాలూ కావాలి. లేదా బ్రిట్నీ స్పియర్స్ చేసుకున్న గుండు గురించి వివరాలు కావాలి. కానీ ఎక్కడా ఎప్పుడూ ఈ సంపన్న దేశంలో భిక్షగాళ్ళ గురించి వివరించిన ధాఖలా కనపడటం లేదు. లేక నాకు తెలియదో!

ప్రతిరోజూ ఎర్రలైటు దగ్గర ఆగాలంటే సిగ్గు. ఆకలిగొన్న వాని ఎదుట విదారగిస్తున్నవాడిలా, హృదయంలోపలి నుండీ తన్నుకొచ్చే లజ్జ.

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'భిక్షకుల బాల్టిమోర్' పై 9 అభిప్రాయాలు

'భిక్షకుల బాల్టిమోర్'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. chavakiran అభిప్రాయం,

  తేది: January 11, 2008 సమయము: 9:05 pm

  కొన్ని రోజులు అలాగే ఉంటుంది తరువాత తరువాత అలవాటు పడిపోతుంది

  ఇంతకీ అంత మంది ఉండటానికి కరణమేమిటి?

  నాకయితే సియాటెల్ లో ఒక్కడు మాత్రమే కన్పించినాడు ! అతను కూడా మన బిక్షగాళ్లతో పోలిస్తే మేలైన దుస్తులే వేసుకున్నాడు :(

 2. వికటకవి అభిప్రాయం,

  తేది: January 11, 2008 సమయము: 11:03 pm

  ఆశ్చర్యం లేదు. చాలా ఏళ్ళుగా అమెరికాలో నేరగ్రస్థ నగరంగా పేరు పొందిన ప్రదేశం గదా. మా కాండెన్ గతేడాది ఆ బిరుదు కొట్టిందని విన్నాను. అవిద్య, పేదరికం, నేరం ఇవన్నీ ఒకదానికొకటి లంకెలే కదా. ఆ మాటకొస్తే, అమెరికాలో దాదాపు చాలా నగరాల డౌన్ టౌన్లలో ఇదే స్థితి.

 3. rajendrakumar అభిప్రాయం,

  తేది: January 12, 2008 సమయము: 1:42 am

  పీపుల్స్ రిపోర్టర్ అనే పత్రికలో పదిహేను సంవత్శరాల క్రితం మొదటి సారిగా అమెరికాలోని బిచ్చగాళ్ళ గురించి చదివాను.మరీ పాలుతేనెలు పొరలిపొంగే దేశమని కాకపోయినా అక్కడ ఆ స్థాయిలో బిచ్చగాళ్ళు ఉంటారని నేను ఊహించలేదు.మీ రచన చూశాక ఒక్కసారి అదంతా గుర్తుకొచ్చింది.భిక్షాటన సామాజిక రుగ్మత అని సోషల్ పాథాలజీలో చదివాము.అమెరికా వంటి సంపన్న దేశం కూడా ఏమీ చికిత్సను కనుక్కోలేకపోయిందా?


 4. తేది: January 12, 2008 సమయము: 2:42 am

  అన్ని నగరాలూ ఒక్కలా ఉండవు కదా…
  ఈ బాల్టీమోర్ నగరం మాత్రమే ఇలా ఉంటుందేమో ?

 5. T.L.Bala Subrahmanyam అభిప్రాయం,

  తేది: January 12, 2008 సమయము: 3:55 am

  “భిక్షకులు” ఒక విధంగా సరైనదే. “భిక్షుకులు” ఇంకా ఎక్కువ సరైనది.

 6. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: January 12, 2008 సమయము: 4:16 am

  మీకు నిజంగా నిజాలు తెలుసుకోవాలంటే ఇది పూర్తిగా చదవి ఆలోచించండి. (ముఖ్యంగా Who the Panhandlers Are విభాగం).
  http://www.popcenter.org/problems/problem-panhandling.htm


 7. తేది: February 26, 2008 సమయము: 10:50 pm

  చరసాల గారు,

  చాలా బాగా వ్రాశారు, ఈస్ట్ కోస్ట్ లో బిక్షకులు ఎక్కువనుకుంటానండి. మీ బ్లాగ్ ని నా బ్లాగ్ లో (టూకీగా… పెట్టుకోవటానికి అనుమతించరూ…

  ~ సత్యసురేష్ దోనేపూడి.

 8. Badal అభిప్రాయం,

  తేది: March 2, 2008 సమయము: 1:24 am

  Nice blog, especially refreshing to see content that appeals to the Telugu audience. I would like to introduce you to a quick and easy method of typing Telugu on the Web.
  You can try it live on our website, in Telugu!

  http://www.lipikaar.com

  Download Lipikaar FREE for using it with your Blog.

  No learning required. Start typing complicated words a just a few seconds.

  > No keyboard stickers, no pop-up windows.
  > No clumsy key strokes, no struggling with English spellings.

  Supports 14 other languages!

 9. రానారె అభిప్రాయం,

  తేది: March 27, 2008 సమయము: 10:37 pm

  కొత్తల్లో నాకూ ఇదే సందేహం వచ్చింది – దానకర్ణులకూ, సామాజసేవకులకూ కొరత లేని ఇంత ధనికదేశంలో,భిక్షగాళ్లేమిటని. చాలా ఏళ్లుగా ఇక్కడుంటున్న ఒక మిత్రుణ్ణి అడిగాను. అతను చెప్పిన సమాచారం ఏమిటంటే – నిరుపేదవారికి ఆశ్రయాన్నిచ్చే నెలవులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతూ వున్నప్పటికీ, వీళ్లు కోరుకునేవి (మాదకాలు వగయిరా) అక్కడ దొరకవు గనుక ఇలా కూడళ్లలో దర్శనమిస్తూ వుంటారని. అప్పుడర్థమయింది – మానసిక దారిద్ర్యమే వీళ్లను భిక్షగాళ్లను చేసివుంటుందని. భయంకరమైన ఎండకూ, చలికీ తట్టుకోంటూ ట్రాఫిక్ లైట్లదగ్గర వీళ్లు నిలబడి వుండటం చూస్తే ఏమిరా వీళ్ల ఖర్మ అనిపిస్తుందిగానీ, ఎప్పుడూ ఒక్క పైసా కూడా రాల్చబుద్ధి కాదు నాకు.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో