న్యూయార్కులో నెల రోజులు

తేది: November 20, 2007 వర్గం: వర్తమానం రచన: చరసాల 2,403 views

మోర్గాన్ స్టాన్లీలో వుద్యోగం పుణ్యమాని నెలరోజులు న్యూయార్క్ నగరం నడిబొడ్డున నెలరోజులు నివాసం వుండే అవకాశం కలిగింది.

న్యూయార్క్ గురించి విన్నాను మరియు ఇంతకు మునుపు వెళ్ళి వచ్చాను గానీ ఇన్ని రోజులు ఎప్పుడు గడపలేదు. న్యూయార్క్ జీవనం మిగతా అమెరికాతో పోలిస్తే చాలా భిన్నం.

అమెరికాలో ఎక్కడయినా ఒకరికొకరు ఎదుపడినప్పుడు అపరిచితులైనా “హాయ్” లేదా “హలో” చెప్పుకుంటారు. జీవం వున్నదో లేనిదో ఓ చిరునవ్వు విసిరేస్తారు. మరీ పక్క పక్కన నడవాల్సి వస్తేనో, ప్రయాణించాల్సి వస్తేనో ఆరోజు వాతావరణంతో మొదలు పెట్టి ఫుట్బాల్ వరకు వివిధ విషయాల మీద ముచ్చటిస్తారు. మనుషులు వుంటే ఇళ్ళల్లో లేదా కార్లల్లో వుంటారుగానీ రోడ్డు మీద నడిచే వారు చాలా అరుదు. కొండకచో ఎక్కడైనా ఒకరు రోడ్డు దాటాలని నిలుచునివుంటే కార్లు ఆగి ఆ వ్యక్తి రోడ్డు దాటాకే వెళతాయి. ఎరుపు సిగ్నల్ వున్నప్పుడు రోడ్డు దాటడం గానీ లేదా పచ్చ సిగ్నల్ పడకముందే ముందుకు ముందుకు చొచ్చుకుపోవడం గానీ మచ్చుకు కూడా కనపడవు.

ఇవన్నీ అమెరికా వచ్చిన కొత్తలో చూసి, ఆహా అమెరికా ప్రజలు ఎంత క్రమశిక్షణాపరులు అని ముక్కుమీద వేలు వేసుకోని రోజు లేదు.

అయితే న్యూయార్కు ఆ భ్రమలని ఫటపంచలు చేసేసింది. మనకు ఇండియాలో వున్న అన్ని రకాల అవలక్షణాలూ న్యూయార్కులోనూ వున్నాయి (బస్సు ఫుట్బోర్డుపై ప్రయాణం చేయడం తప్ప). వాక్ సిగ్నల్ పడేవరకు పాదచారులు ఆగరు. పాదచారులు ఆగేవరకు కార్లు ముఖ్యంగా టాక్సీలు ఆగరు. గ్రీన్ పడేలోపలే ముందుకు ముందుకు చొచ్చుకుపోతారు. ఎదురెదురుపడ్డా చూపులు తిప్పుకుంటారేగానీ హలో చెప్పరు. అన్ని వేలమంది ఒకనగర ద్వీపంలో పని చేస్తున్నా అందరూ మళ్ళీ ఎవరికివారు స్వతంత్ర ద్వీపాలే!

తేడా ఎక్కడుందీ అని ఆలోచిస్తే మంది,అవకాశాల నిష్పత్తిలోనేమొ అనిపించింది. ఎక్కడైతే మంది ఎక్కువా అవకాశాలు తక్కువా వుంటాయో అక్కడంతా పరిస్థితి ఒకేలా వుంటుంది అనిపించింది. ఒకే రొట్టె ఇద్దరు తినాల్సి వచ్చినపుడు ఎంతనాగరీకులైనా “నువ్వు తిను, నువ్వు తిను” అనడానికి బదులు “నేను తింటా, నేను తింటా” అనే అంటారనుకుంటా!

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 ఓట్లు, సగటు: 5 కు 4.00)
Loading ... Loading ...

'న్యూయార్కులో నెల రోజులు' పై 4 అభిప్రాయాలు

'న్యూయార్కులో నెల రోజులు'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. ఆకాశరామన్న అభిప్రాయం,

  తేది: November 21, 2007 సమయము: 3:41 am

  లండన్ Shame to shame

 2. radhika అభిప్రాయం,

  తేది: November 22, 2007 సమయము: 12:11 am

  నిజమే.అక్కడ లోకల్ లో రోడ్డ్లు కూడా బాగోవు.చెత్త అంతా రోడ్లమీదే వుంటుంది.న్యూయార్క అంత కాదుగానీ చికాగో జీవన0్ కూడా ఇంచు మించు అలాగే వుంటుంది.

 3. చదువరి అభిప్రాయం,

  తేది: November 23, 2007 సమయము: 11:49 am

  అవునండి, మీరు చెప్పిన తేడా నాక్కూడా కొట్టొచ్చినట్టు కనబడింది. న్యూయార్కులో అచ్చం హై. లో ఉన్నట్టే ఉండింది నాకు.

  పరిస్థితులను బట్టే ప్రజల ప్రవర్తన, ఎక్కడైనా! అమెరికాలోనే అక్కడెక్కడో తుపానొచ్చినపుడు జనం దుకాణాల మీదకెగబడి తలుపులు బద్దలు కొట్టి మరీ దోచుకెళ్ళిన వార్తలు విన్నాం కదా!

 4. రాకేశ్వర రావు అభిప్రాయం,

  తేది: November 23, 2007 సమయము: 3:45 pm

  మిగతా అమెరికాలాగా న్యూయార్కులో కారు అవసరం ఉండదు.
  ఇంకో విషయం న్యూయార్కులో అచ్చమైన తెల్లవాళ్లు నలభై శాతమేనని విన్నా. ఇతర దేశాలనుండి వచ్చినవారు చాలా ఎక్కువ. దాని ప్రభావం కూడా వుంటుంది.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో