విధ్యార్థి వీరా లేవర ఓసారి

తేది: October 23, 2007 వర్గం: కవితలు రచన: చరసాల 2,160 views

ఇది నేను ఫిబ్రవరి 10, 1991 లో బొబ్బిలి రాజా సినిమాలో “కన్యా కుమారీ కనపడదా దారి..” పాటకు రాసిన అనుకరణ. ఈ మధ్య దిలీప్ ఇండియా వెళ్ళినపుడు చెదలు పడుతున్న అప్పటి నా రాతలని డిజిటీకరణ చేసి నాకు పంపాడు. ఇప్పటికి వీలు చిక్కింది ఈ ఒక్కదాన్ని బ్లాగులో పెట్టడానికి. ఇందులో నా పాత రాతలని దాయాలన్న తపన తప్ప ఈ పాటలో సారమేమీ లేదు.

******************************
విధ్యార్థి వీరా లేవర ఓసారి
కయ్యాలు మాని చూడర ఈదారి
అందరు నిను చూసేసాలా
తలిదండ్రులు మరి మెచ్చేలా
చేరకే మరి పసలేని ఆ దరి
జిగ్ జిక్ జింగ్ జిక్ జామ్

విధ్యార్థులారా మానండి మీ గోల
ఈ మబ్బు ఏల దులపర కావ్యాల
డిజిటల్‌లో లాజిక్కు చూడు
సిఎస్‌లో రాడారు చూడు
లాగరా మరి ఈ సరదాల బండిని ||విధ్యార్థి||

టెస్టులో మార్కులే చిందులేసే తగదిణతోం
చార్జింగులూ లోడింగులూ తెలియజెప్పే కథ విందాం

లెక్కల్ని చిక్కులిప్పుదాం
బొమ్మల్ని ప్రింటు చెక్కుదాం

కంప్యూటరు అంతు తేల్చుదాం
పండుగలా టెస్ట్లు రాసేద్దాం

చూడండోయ్ ఈ పాఠం
మదిలోనే నిలిపేద్దాం

సాగించేయ్ వెరైటీ జాబ్
చేతి నిండుగా మన సారు మెచ్చగా ||విధ్యార్థి||

క్లాసులో పాఠమే చెప్పిరాసే వరవడిలో
ల్యాబులో జాబునే చేసివేసే గడబిడలో

రిజల్ట్లే తప్పు వచ్చునో, ఏమూల ఏమి జరిగెనో

సారుతోటి చెప్పించుకో, తప్పుంటే సర్ది పెట్టుకో

ఓలమ్మీ మాయబ్బీ
బుక్కుందీ చదవాలంటే
చదవోయి కలకాలం
కళ్ళు చూడగా
లెక్చరర్లు మెచ్చగా
జింగ్ జిక్ జింగ్ జిక్ జామ్

***********************************************

–ప్రసాద్

విధ్యార్థి వీరా-1విధ్యార్థి వీరా-2విధ్యార్థి వీరా-3

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 ఓట్లు, సగటు: 5 కు 2.67)
Loading ... Loading ...

'విధ్యార్థి వీరా లేవర ఓసారి' పై 8 అభిప్రాయాలు

'విధ్యార్థి వీరా లేవర ఓసారి'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. నల్లమోతు శ్రీధర్ అభిప్రాయం,

  తేది: October 24, 2007 సమయము: 1:07 am

  ప్రసాద్ గారూ.. చాలా బాగుంది మీ పేరడీ, సరదాగా!
  - నల్లమోతు శ్రీధర్

 2. కొత్తపాళీ అభిప్రాయం,

  తేది: October 24, 2007 సమయము: 5:41 am

  బొత్తిగా నల్లపూసైపోయారు. ఒరిజినల్ నాకు తెలీదు కాబట్టి పేరడీ సంగతి చెప్పలేను. కానీ పాటలో భావనలూ, వాటిని వెలువరించిన తీరూ చాలా బావున్నై. మీ దస్తూరి ఇంకా ముచ్చటగా ఉంది. మళ్ళీ రాయండి.

 3. వికటకవి అభిప్రాయం,

  తేది: October 24, 2007 సమయము: 9:09 am

  చరసాల గారు,

  బాగుంది మీ పేరడీ. మీ పాత పుస్తకం తాలూకు పేజీలు పురావస్తుశాఖ మ్యూజియంలో చూసిన వాటికి మల్లే భలే బాగున్నాయి.(antique)

 4. రానారె అభిప్రాయం,

  తేది: October 24, 2007 సమయము: 3:12 pm

  ముందుగా దిలీప్‌ను అభినందించాలి. నిజంగా మ్యూజియంలో పేపర్లలాగానే ఉన్నాయి. ఒక పాపకు పదహారేళ్లు పాట స్టైల్లో …

  ఈ పాటకు పద్దెందేళ్లు!
  ఎట దాగెనొ మరి ఇన్నాళ్లు!
  డిజిటల్లో దాగిన ఫైళ్లు!
  నిలిచేనులె ఇక చాన్నాళ్లు!

 5. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: October 24, 2007 సమయము: 7:23 pm

  శ్రీధర్ గారూ,
  కృతజ్ఞతలు.

  కొత్తపాళీ గారూ,
  ఈ కొత్త కంపెనీలో (Morgan Stanley) పనిమోత అండి. పైగా బ్లాగులు, వుత్తరాలూ చూడటం నిషేధం! :(
  ఇప్పుడూ కనీసం హోటల్లో వున్నా గనుక రూమొ కొచ్చాక ఈ మాత్రమైనా చేయహలిగాను. రేపు ఇంటికెళ్ళాక బయట ఆఫీసు పని, ఇంట్లో పిల్లల పని. ఇక బ్లాగులకు నామం పీకినట్టే!
  ఇంతకీ అది మీకు పాటలా అనిపించినందులకు కృతజ్ఞతలు. మానేసి పదేళ్ళ పైగా అయింది. మళ్ళీ రాయడమా! అమ్మో!

  వికట కవి గారూ,
  హ్హ హ్హ నచ్చినందుకు నెనర్లు! అలా పురావస్తు రూపం తెప్పించడం మా పూర్వపు ఇంటిలో చాలా సుళువు.

  రానారె,
  అప్పటి పాటలను/కవితలను ఇప్పుడూ చదువుతూ వుంటే నవ్వు వస్తుంది.
  నా పాటకే పద్దెనిమిదా అమ్మో నేను ముసలోన్నయిపోయాను బాబోయ్! :)

  –ప్రసాద్

 6. నేనుసైతం అభిప్రాయం,

  తేది: October 24, 2007 సమయము: 7:46 pm

  ప్రసాద్ గారూ,
  మీ పునరాగమనం మాకెంతో సంతోషం…:)అప్పుడప్పుడైనా కొన్ని టపాలు రాస్తుండండి.
  -నేనుసైతం

 7. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: October 24, 2007 సమయము: 9:12 pm

  నేను సైతం గారూ,
  నా నిష్క్రమణ నాకూ బాధాకరంగానే వుంది కానీ తప్పేలా లేదు.
  మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  –ప్రసాద్

 8. Joseph Raju అభిప్రాయం,

  తేది: October 24, 2007 సమయము: 10:49 pm

  చాలా భాగుంధి. రాస్తునె ఉందంది.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో