- అంతరంగం - http://www.charasala.com/blog -

సమాచార హక్కు చట్టము (RTI Act)

Posted By చరసాల On September 21, 2007 @ 6:45 pm In సేవ | 11 Comments

ఈ పేరు ఇప్పుడు చాలా మంది నోటిలో నాటుతున్న పదం. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటె ప్రజల చేతిలో ఇది బ్రంహ్మాస్త్రం కాగలదని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి నిత్యం మనం జవాబుదారీ లేని ఎన్నో ప్రభుత్వ లేదా ప్రభుత్వోద్యుగుల చర్యలను చూస్తున్నాం. ఏదో చేస్తారు లేదా ఏమీ చేయరు. ఎందుకని అడిగితే సమాధానం రాదు. కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటారు, ఏ విశయమూ చెప్పరు. అనుమతిస్తున్నారో, నిరాకరిస్తున్నారో నిరాకరిస్తుంటే ఎందుకు నిరాకరిస్తున్నారు? అనుమతిస్తుంటే ఎందుకు అనుమతిస్తున్నారు? ఇవన్నీ సామాన్యుడికి కొరుకుడు పడవు. ప్రశ్నించే హక్కు మనకున్నా ఏదో వంకతో దాచే హక్కు వారికుండేది. మాట్లాడితే అధికార రహస్యాల చట్టం అంటారు.

వీటన్నిటి నుండీ సామాన్య పౌరుణ్ణి రక్షించేది “సమాచార హక్కు చట్టము” లేదా RTI (Right To Information) Act. ఇది ఏ భారత పౌరుడైనా ఏ సమాచార మైనా (ఏవో కొన్ని మినహాయింపులు తప్పించి) ప్రభుత్వం నుంచీ కోరవచ్చు. అయితే ఈ చట్టం గురించి ఇంకా ప్రజల్లో పూర్తి అవగాహన లేదు. వివిధ స్వచ్చంద సంస్థలు ఈ విషయమై కృషి చేస్తున్నాయి. అందులో 5th pillar [1] ఒకటి.

హైదరాబాదులో To make a difference ఇలాంటి ఒక RTI అవగాహన సదస్సును ఈ ఆదివారం (సెప్టంబరు 23న) నిర్వహిస్తున్నది. ఇందులో సమాచార హక్కు చట్టం గురించి అద్యయనం చేసి విజయాలు సాధించిన వారు మాట్లాడబోతున్నారు. అలాగే కొద్దిమంది ప్రభుత్వ వున్నతోద్యోగులు కూడా పాలుపంచుకొని మన ప్రశ్నలకు సమాధానాలిస్తారు.

అభిరుచి వున్నవారు హాజరు కావచ్చని ప్రశాంతి (To Make A Difference) విజ్ఞప్తి చేస్తున్నారు.

వివరాలు:
తేది: ఆదివారం, సెప్టంబరు 23

వేదిక: మొదటి అంతస్తు (సమావేశ మందిరం), అనుపమ టిఫ్ఫిన్స్, శ్రీ క్రిష్న మిఠాయిల పక్క సందు, అమీర్‌పేట.

స్థల చిహ్నాలు: పక్క భవనమే సరదా అపార్ట్‌మెంట్స్. అమీర్‌పేట చర్మాస్‌కు ఎదురుగా శ్రీ క్రిష్ణ మిఠాయీల అంగడి వుంటుంది. దాని పక్క సందులో మీకు AP Dental hospital అని బోర్డు కనిపిస్తుంది. ఆ సందులోకి వెళితే ఎడమచేతి వైపు రెండవ భవనమే.

సమయము: మధ్యాహ్నం 2 నుండి 5 వరకు.

వక్తలు: రాకేష్ మరియు రామక్రిష్ణ

గమనిక: ఇది ఇంచుమించు రెండు వందల మంది పట్టగల మందిరం.

– ప్రసాద్ (ప్రశాంతి తరపున)


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=200

URLs in this post:

[1] 5th pillar: http://www.5thpillar.org/