సమాచార హక్కు చట్టము (RTI Act)
ఈ పేరు ఇప్పుడు చాలా మంది నోటిలో నాటుతున్న పదం. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటె ప్రజల చేతిలో ఇది బ్రంహ్మాస్త్రం కాగలదని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి నిత్యం మనం జవాబుదారీ లేని ఎన్నో ప్రభుత్వ లేదా ప్రభుత్వోద్యుగుల చర్యలను చూస్తున్నాం. ఏదో చేస్తారు లేదా ఏమీ చేయరు. ఎందుకని అడిగితే సమాధానం రాదు. కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటారు, ఏ విశయమూ చెప్పరు. అనుమతిస్తున్నారో, నిరాకరిస్తున్నారో నిరాకరిస్తుంటే ఎందుకు నిరాకరిస్తున్నారు? అనుమతిస్తుంటే ఎందుకు అనుమతిస్తున్నారు? ఇవన్నీ సామాన్యుడికి కొరుకుడు పడవు. ప్రశ్నించే హక్కు మనకున్నా ఏదో వంకతో దాచే హక్కు వారికుండేది. మాట్లాడితే అధికార రహస్యాల చట్టం అంటారు.
వీటన్నిటి నుండీ సామాన్య పౌరుణ్ణి రక్షించేది “సమాచార హక్కు చట్టము” లేదా RTI (Right To Information) Act. ఇది ఏ భారత పౌరుడైనా ఏ సమాచార మైనా (ఏవో కొన్ని మినహాయింపులు తప్పించి) ప్రభుత్వం నుంచీ కోరవచ్చు. అయితే ఈ చట్టం గురించి ఇంకా ప్రజల్లో పూర్తి అవగాహన లేదు. వివిధ స్వచ్చంద సంస్థలు ఈ విషయమై కృషి చేస్తున్నాయి. అందులో 5th pillar ఒకటి.
హైదరాబాదులో To make a difference ఇలాంటి ఒక RTI అవగాహన సదస్సును ఈ ఆదివారం (సెప్టంబరు 23న) నిర్వహిస్తున్నది. ఇందులో సమాచార హక్కు చట్టం గురించి అద్యయనం చేసి విజయాలు సాధించిన వారు మాట్లాడబోతున్నారు. అలాగే కొద్దిమంది ప్రభుత్వ వున్నతోద్యోగులు కూడా పాలుపంచుకొని మన ప్రశ్నలకు సమాధానాలిస్తారు.
అభిరుచి వున్నవారు హాజరు కావచ్చని ప్రశాంతి (To Make A Difference) విజ్ఞప్తి చేస్తున్నారు.
వివరాలు:
తేది: ఆదివారం, సెప్టంబరు 23
వేదిక: మొదటి అంతస్తు (సమావేశ మందిరం), అనుపమ టిఫ్ఫిన్స్, శ్రీ క్రిష్న మిఠాయిల పక్క సందు, అమీర్‌పేట.
స్థల చిహ్నాలు: పక్క భవనమే సరదా అపార్ట్‌మెంట్స్. అమీర్‌పేట చర్మాస్‌కు ఎదురుగా శ్రీ క్రిష్ణ మిఠాయీల అంగడి వుంటుంది. దాని పక్క సందులో మీకు AP Dental hospital అని బోర్డు కనిపిస్తుంది. ఆ సందులోకి వెళితే ఎడమచేతి వైపు రెండవ భవనమే.
సమయము: మధ్యాహ్నం 2 నుండి 5 వరకు.
వక్తలు: రాకేష్ మరియు రామక్రిష్ణ
గమనిక: ఇది ఇంచుమించు రెండు వందల మంది పట్టగల మందిరం.
– ప్రసాద్ (ప్రశాంతి తరపున)
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








(2 ఓట్లు, సగటు: 5 కు 4.00)
తేది: September 22, 2007 సమయము: 12:32 am
‘విశయం’ కాదు…అది విషయం.
మీరెక్కడ్నుంచీ ఈ విశయాన్ని తెచ్చారో గానీ, ఆ పదం చూడగానే మొత్తం టపా మీదే చిరాకేసింది!
తేది: September 22, 2007 సమయము: 1:35 am
మంచి సంగతి చెప్పారు ప్రసాదు గారు.
సిరి గారు – ఒక అచ్చు తప్పుని పట్టుకొని – అసలు విషయాన్ని విస్మరిస్తేలా
తేది: September 22, 2007 సమయము: 3:13 am
మంచిది. ఇలా అవగాహన కలిగించడం ఎంతో మంచి విషయం.
TMAD కి అభినందనలు.
తేది: September 22, 2007 సమయము: 5:13 am
ఇప్పుడే ప్రశాంతి గారికి మైల్ పంపాను.. మీటింగ్ వివరాలు చెప్పమని.. మే మైల్ వచ్చింది.. బ్లాగ్ లో డెటైల్స్ ఇస్తానని.. చూసాను వివరాలు చాల థాంక్స్.. నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను.. మాకు చాల దగ్గర…will go with my frnd.
తేది: September 22, 2007 సమయము: 5:20 am
సారి ఆఫిస్ పని హడావిడి లో వచ్చిన అచ్చు తప్పులవి.. కావాలని కాదు.. సరి చేసుకొని చదువుకో మనవి..
తేది: September 22, 2007 సమయము: 9:49 am
అచ్చు తప్పులు అస్సలు లేకుండా అన్ని సార్లు వ్రాయతరమా?! అప్పుడప్పుడు హడావిడిలో కీబోర్డు మీద వ్రేళ్ళు తడబడటం సహజం.
అచ్చు తప్పు గురించిన కామెంటు నేను వ్రాసినట్లు గుర్తు రావడం లేదు. కానీ నా పేరు మీదే ఉంది. ఒకవేళ వ్రాసి మర్చిపోయానా? ఇంత చిన్న ‘విశయం’ మీద నేనైతే సాధారణంగా కామెంటు వ్రాసి మరీ తప్పని చూపను.
ఏమో! ఏవో ఒకటి రెండు బ్లాగుల్లో మాత్రం ఎక్కువగా ‘విషయం’ పదాన్ని ‘విశయం’ ల్లోవాడగా చదివిన గుర్తు(ఆ బ్లాగుల్లోని చాలా టపాల్లో). ఆ బ్లాగుల్లో – ఈ బ్లాగు ఒక్కటైతే – కామెంటు నేను వ్రాసి ఉండొచ్చు.
ఏదేమైనా, టపా సారాంశం బాగుంది.
అచ్చు తప్పులమీద కామెంటు వ్రాసి మరీ విసుక్కోవాల్సిన అగత్యం లేదు(ఇంతకు మునుపు వ్యాఖ్య నేను వ్రాసిందే అయినా).
తేది: September 22, 2007 సమయము: 1:25 pm
Prasad garu, thank you for your post.
Govt. official ayite prastutaaniki okkare vastunnaaru.
Rakesh ni forum vaallani pilavamani cheppaanu. tanu naaku inkaa update ivvaledu.
I will definitely ask the questions you raised.
తేది: September 24, 2007 సమయము: 9:03 am
సిరి గారూ,
సాధారణంగా అచ్చు తప్పులు లేకుండా రాయడానికే ప్రయత్నిస్తాను. కానీ ఈ “శ” “ష” లు మాత్రం నన్ను తెగ బాధిస్తున్నాయి. నా అలవాటును మార్చుకోవడానికి శతధా ప్రయత్నిస్తూనే వున్నాను.
ఈ పోస్టు మాత్రం ఇక ఆలస్యమయితే దాని వుద్దేశ్యం నెరవేరదనే సదుద్దేశ్యంతో వడివడిగా టైపు చేసి పోస్టు చేశాను. మిమ్మలని విసిగించినందులకు క్షంతవ్యుడను.
–ప్రసాద్
తేది: September 29, 2007 సమయము: 1:04 pm
చాలా బాగుది……
తేది: February 21, 2010 సమయము: 8:01 pm
గూద్ ఇన్ఫరమతిఒన్ థన్క్ యౌ సిర