సహనశీలతా? చేతగానితనమా?

తేది: August 28, 2007 వర్గం: నా ఏడుపు, వర్తమానం రచన: చరసాల 4,373 views

గుండెల మీద చెయ్యేసి చెప్పండి మనది సహనశీలతా? గుండె నిబ్బరమా? చేతగాని తనమా?

ఖచ్చితంగా చేతగాని తనమే. ఇందుకు బోలెడన్ని ఋజువులు. నీవు తన్నగలిగిన వాడివై వుండికుడా తన్నలేదంటే అది సహనం. తన్నలేక శాంతి గురించి మాట్లాడితే అది బలహీనత. అప్పుడెప్పుడో అశోకుడు పటించింది అసలుసిసలు శాంతి మంత్రం.

వాడెవ్వడో వచ్చి 18 సార్లు దండెత్తితే 17 సార్లు గెలిచామని చెప్పుకోవడం కాదు వాజమ్మల్లాగా, అసలు వాన్ని రెండోసారి మళ్ళి ఎలా తొంగిచూడనిచ్చామనేది అసలు ప్రశ్న. ఒక్కరా ఇద్దరా… రాజన్న ప్రతివాడికీ లోకువయ్యాం. అప్పుడూ అటువైపు నుండే దాడులు… ఇప్పుడు అటువైపు నుండే దాడులు. అప్పుడంటే నూటొన్నొక్క విడివిడి రాజ్యాలుగా వున్న భరత ఖండం ఒక్కటై ఎదుర్కోలేక పోయింది అనుకున్నా, మరిప్పుడు మనకు లోటేమిటి?

ఒకటే లోటు. నాకెందుకు అనే నిర్లిప్తత! రాసి పెట్టి వుంటే జరగకపోతుందా అనే బుద్దిమాలిన కర్మ సిద్దాంతం. పక్కిల్లు కాలుతుంటే మనంటిమీద నీళ్ళు చల్లుకునే స్వార్థ చింతన. ఇవే మన అద్బుతమైన బలాలు. ఒక్కోసారి నాకనిపిస్తుంది ఇవేనా మనలని ఒక్క భారతదేశంగా వుంచుతున్నది అని. లోపల్లోపల అరవోడు అంటే తెలుగోడికి గిట్టదు. తెలుగోడంటే కన్నడిగుడికి గిట్టదు. వీళ్ళంటే ఎవరో హిందీ వోడికి తెలవదు. ఆ హిందీవోడంటే అస్సామీయుడికి గిట్టదు. అయితే ఇన్ని భిన్నత్వాల మధ్యా మనం ఒకదేశంగా వున్నామంటే నిజంగానే మొన్న అరవై వసంతాల స్వాతంత్ర్యదినం నాడు అనుకొన్నట్లు ఏదో బ్రహ్మ పదార్థం అనే దారం మనలని కలిపి వుంచుతోందా? నాకయితే ఆ బ్రహ్మ పదార్థం పైన చెప్పిన నిర్లిప్తత, స్వార్థం, చేతగానితనం కాదుగదా అనిపిస్తుంది.

బాంబుదాడుల్లో యాబై మంది చచ్చినా అది వారి ప్రారబ్దం అనుకుంటాం. మన ఆత్మను తృప్తి పరచడానికి పూలగుచ్చాలు పెడతాం, క్రొవ్వొత్తులు వెలిగిస్తాం, సర్వ మత ప్రార్థనలు చేస్తాం. ఇవి చనిపోయిన వారి ఆత్మను ఏమోగాని బతికివున్న వారి ఆత్మను సంతోషపర్చడానికే. ఈ చేతగానిపనుల వల్ల ఒనగూడేదేమీ లేదు, ఆ దుర్ఘటనని మరిచిపోవడానికి వుపకరించడం తప్ప. మనకు కావలిసింది మరచిపోవడం కాదు. గుర్తుంచుకోవడం. మనం దీన్ని మరవకూడదు. ఆ బాంబులు మన గుండెల్లో రోజూ బ్రద్దలవ్వాలి. ఆ ఆక్రందనలు ప్రతి క్షణమూ మన చెవుల్లో మ్రోగుతూ మనలని నిరంతరం జాగృతులుగా వుంచుతూనే వుండాలి. మన ప్రజాస్వామ్య విలువల వలువలు ఎవరొలుస్తున్నారో వారి తోలు వలవాలి. అది నిర్లక్ష్యపు పౌరుడు కావచ్చు, అవినీతి అధికారి కావచ్చు, నిజాయితీలేని రాజకీయుడు కావచ్చు, ఒక మతం పేరుతో మరో మత వర్గీయుల మీదకి వేట కుక్కలని వుసిగొలిపే థాకరే గావచ్చు లేక మసీదు లోగిలి నుండీ మరణ శాసనాలు రాసే ఇమాం కావచ్చు.

మన ప్రభుత్వాలు చేతగానివైతే మనమైనా చేవవున్నవాళ్ళమని నిరూపించాలి.

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 ఓట్లు, సగటు: 5 కు 3.50)
Loading ... Loading ...

'సహనశీలతా? చేతగానితనమా?' పై 17 అభిప్రాయాలు

'సహనశీలతా? చేతగానితనమా?'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: August 28, 2007 సమయము: 11:30 am

  ఖచ్చితంగా చేతగాని తనమే!!! (సహనశీలత బలవంతుల లక్షణం…బలహీనుల లక్షణం కాదు)
  “లోపల్లోపల అరవోడు అంటే తెలుగోడికి గిట్టదు. తెలుగోడంటే కన్నడిగుడికి గిట్టదు. వీళ్ళంటే ఎవరో హిందీ వోడికి తెలవదు. ఆ హిందీవోడంటే అస్సామీయుడికి గిట్టదు.” – ఇలాంటివి అన్ని దేశాల్లోనూ ఉండేవే (మనం కొంచెం ఒవరు ప్లే చేస్తాం)
  “ఆ బ్రహ్మ పదార్థం పైన చెప్పిన నిర్లిప్తత, స్వార్థం, చేతగానితనం కాదుగదా?” – ముమ్మాటికీ కాదు..భారతదేశం బలవంతమైన దేశం కాకపోవచ్చు..కానీ గొప్పదేశం..ఇంత చిన్న బుద్దులు దాన్ని నిలబెట్టలేవు..అందుకే అది మాహా ప్రయోగం..ప్రపంచ దేశాలకు స్పూర్తిదాయకం

 2. చదువరి అభిప్రాయం,

  తేది: August 28, 2007 సమయము: 1:03 pm

  ఆ బ్రహ్మపదార్థం హైందవం. మన సంస్కృతి, సనాతన ఆచారాలు, మన ఇతిహాసాలు ఇవే మనల్ని కలిపి ఉంచుతున్నాయి. మాట్లాడే భాష వేరు, తినే తిండి వేరు, పండించే పంట వేరు. ఇన్ని భిన్నత్వాలున్నా.. మహాభారతం అందరికీ ఒకటే, వేదాలు అందరికీ అనుసరణీయమే. మాతృదేవోభవ, పితృదేవోభవ.. అనేది ఉత్తరం నుండి దక్షిణం దాకా అందరికీ ఒకటే! ద్వాదశ జ్యోతిర్లింగాలు అందరికీ ఒకటే. హైందవం ఒక మతమే కాదు, ఒక జీవన విధానం. అది ఉన్నన్నాళ్ళూ మనకే ఢోకా లేదు. బతుకు, బతకనివ్వు అనే మన సిద్ధాంతాన్ని భారతీయులు నమ్మినన్నాళ్ళూ ఎవరికీ దిగుల్లేదు.

 3. తెలుగు నేల అభిప్రాయం,

  తేది: August 28, 2007 సమయము: 4:17 pm

  నాగలోకం: డెమాక్రసి… బాంబులు… ధర్మం…

  పౌరుషం, పోరాటం వగైరాలను మగతనంతో – సహనం, ప్రేమ వగైరాలను ఆడతనంతో మన వాళ్ళు వెనకట్నుంచీ పోలుస్తూ …

 4. sekhar అభిప్రాయం,

  తేది: August 28, 2007 సమయము: 5:46 pm

  ఎన్నో దేశాల్లో ఉగ్రవాదం వుంది.

  ఈ ఉగ్రవాదులందరికీ కామన్ డినామినేటర్ గా శాంతి మతం (ఇస్లాం) వుంది.

  వారందరికీ స్పూర్థి నిచ్చేది పవిత్ర గ్రంధం (ఖురాన్) అని వారే అంటారు.

  అంటే…ఆ గ్రంధం, ఆ మతం, సామాన్య మానవున్ని కూడా దానవున్ని చేస్తున్నాయి.

  అటువంటప్పుదు …అది పవిత్ర గ్రంధం ఎలా అవుతుంది? అది శాంతి మతం ఎలా అవుతుంది?

  ఏంటండీ … మా చెవుల్లో గోబి పూలు కనిపిస్తున్నాయా?…

  పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్ మెంట్ లతో ఇంకా ఎంత కాలం ఇలా మమ్మల్ని వెర్రి వెంగళప్పల్ని (మోసం)చేస్తారు?

 5. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: August 28, 2007 సమయము: 9:20 pm

  శేఖరు గారు, మీరు పీ.సీ (పొలిటకల్లీ కరెక్టునెసు)ని సరిగా అర్ధం చేసుకున్నట్టులేదు. భగవద్గీత సృష్టించినదే కదా మహాభారతం మరి అంతమాత్రం చేత భగవద్గీత పవిత్ర గ్రంధము కాదా? శైవము, వైష్ణవమూ సృష్టించలేదా రక్తపాతము?

 6. sekhar అభిప్రాయం,

  తేది: August 29, 2007 సమయము: 3:29 pm

  గీత లో వున్నది ధర్మ్మాన్ని నిలబెట్టడానికి. అందులో మత ప్రసక్తేలేదు.
  అది హిందువులకే కాదు, సమస్త మానవాలికీనూ.

  అందుకే, గీతను చదివి ఎవరూ పరమతస్తులను చంపండానికి బయల్దేరడంలేదు.

  ‘ ఖురాన్ ‘ లో వున్నది పరమతస్తులందరినీ చంపమనే. ఇమాములు చెప్పేదీ అదే, ముస్లిం ఉగ్రవాదులు చేస్తోదీ అదే.

  అంటే, వారు చేస్తోన్న మారన కాండ ఆ గ్రంధాన్ని తప్పుగా అర్ధం చేసుకొని కాదు, సరిగ్గా అర్ధం చేసుకొనే. నిజానికి వారే అసలైన ముస్లిములు.

  రాజకీయాలకు, దేశం, దేశభక్తి, చివరకు స్వంత కుటుంబ సభ్యులకు కూడా అతీతంగా వుండాలి అని అదేశిస్తోంది ఖురాన్.

  పొలిటికల్లీ కరెక్త్ స్టేట్మెంట్లతో తప్పుగా అర్ధం చేసుకొనేది మనమే.

  ఇస్లాం ని మతంగా పరిగణించడమే సమస్యకు మూల కారణం. గొర్రె తోలు కప్పుకొన్న పులి ( మతం ముసుగేసుకొన్న కల్ట్ )అని గుర్తించే వరకు మనకీ సమస్యలు తప్పవు.

  -శేఖర్

  http://www.faithfreedom.org/oped/sina50218.htm

  http://books.google.com/books?id=_7RD2jwMU2wC&dq=&pg=PP1&ots=Q18g-sC2XQ&sig=9rnD3uaueiI1V4m-DLKkSPqovuM&prev=http://www.google.com/search%3Fhl%3Den%26q%3DPOLITICALLY%2BINCORRECT%2BGUIDE%2BTO%2BISLAAM%26btnG%3DGoogle%2BSearch&sa=X&oi=print&ct=title

 7. TADEPALLI అభిప్రాయం,

  తేది: August 30, 2007 సమయము: 1:16 pm

  చరసాలగారితో ఏకీభవిస్తున్నాను. ఇదే మాట ఒకసారి అంబానాథ్ గారు కూడా అన్నట్లు గుర్తు.

 8. rama అభిప్రాయం,

  తేది: August 31, 2007 సమయము: 1:59 am

  చరసాల ప్రసాద్ గారి బ్లాగులో అవేశం .. అలోచనలు ఒకే నిష్పత్తి లో వుంటాయి లలిత గారు అందుకని మీరు వాదించగలనేమొ అంటారు.. మీ బ్లాగు కూడా మంచి పదప్రయోగంతో వుంటుంది..ఒక్కొసారి నాకు భయమేస్తుంది … మీ లాంటి (మీరు, జ్యొతిగారు, రాధికగారు, కొత్తపాళిగారు, చరసాల ప్రసాద్ గరు, నాగరజుగారు, సిరిసిరిమువ్వ(వరుధినిగారు), అనిల్ గారు.. kkp గారు వికటకవి గారు ) ఇంకా ఇలా చాల మంది పెద్దవాళ్ళ బ్లాగులకి నేను కామెంటా… అని.. ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్నాను…అడుగులు నేర్చుకొంటే కాని..మీలాంటి మంచి రాసి వాసి కలిగిన బ్లాగులకి కామెంట్స్ ఇవ్వగలనేమొ .. అంతవరకు చదువరినే… ఎదో ఇలా రాయలనిపించి నా బ్లాగులో మీ “దేవుడు” కి ప్రతిస్పందించాను…

 9. జ్యోతి అభిప్రాయం,

  తేది: August 31, 2007 సమయము: 8:04 am

  రమ గారు,

  భయమెందుకండి. ఇక్కడ అందరు తమ ఆలోచనలు పంచుకుంటారు. చర్చిస్తారు తప్పితే ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు. మిమ్మల్ని మీరు ఎవ్వరితోను పోల్చుకోవద్దు. మీ ఆలోచనలు నిర్భయంగా చెప్పొచ్చు, మీ బ్లాగులో కాని, ఇతరుల బ్లాగులలో కాని. ఎవ్వరూ తప్పుగా అనుకోరు.ఒకప్పుడు మేము మీ స్థానంలో ఉన్నవాళ్ళమే..

 10. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: August 31, 2007 సమయము: 8:37 am

  రవి గారూ,
  మన ఆదర్షాలు గొప్పవే. కానీ ఆచరణ ఏమంత గొప్పది కాదు. అలాగని నాకు ఈ దేశ అఖండత్వం మీద చిన్నచూపు వుందని కాదు, కానీ అనుమానాలు వున్నాయి. ప్రశ్నలు పుడుతున్నాయి. నిన్న NPR రేడియోలో మదర్ థెరిసా రాసిన లేఖల సంకలనం గురించి చర్చ జరుగుతోంది. ఆమె దేవుడిమీద ఎంతో విశ్వాసమున్నదైనా ఆయన వునికి గురించి ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు వెలిబుచ్చారట లేఖల్లో.
  ఇకా అనుమానాలు రాకపోవడానికి, లేకపోవడానికి నేనెంత?

  చదువరి గారూ,
  ఆ బ్రహ్మ పదార్థం హైందవం అంటే నాకు నమ్మకం కలగటం లేదు. అసలు హైందవం అదే మన జీవన విధానం ఎంతో ప్రాచీనమైనది కదా? మరి అది ఇన్ని వేల ఏళ్ళ మన చరిత్రలో మనలని ఎప్పుడైనా ఒక ఛత్రం కిందికి తెచ్చిందా? ఇంకా ఎన్నో విభజనలు తెచ్చింది. భారాతావనిని ఎన్నో భిన్నత్వాలున్న ఓ చిన్న ప్రపంచంగా మార్చింది. ఇప్పుడు హైందవులందరూ జరుపుకొనే పండుగలు కుడా నిన్నా మొన్నటి వరకూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వున్నవే. అయితే గియితే మనలని ఒక్కతాటి మీద ఆంగ్లేయుల మీద వ్యతిరేకత తెచ్చింది. ఆ తర్వాత రకరకాల వుమ్మడి సమస్యలు (వుమ్మడి శతృవు అనొచ్చేమొ) మనలని ఒక్కమాట మీద వుంచుతున్నాయి. దానికితోడు నేనన్న నిర్లిప్తత. మనకు బయటినుండీ వచ్చిన ముస్లిం పాలకులు పాలించినా, ఆంగ్లేయులు పాలించినా మరొక్కరు పాలించినా మన యింటివరకూ రానంత వరకూ మనకెందుకు అని వూరుకున్నవారమే కదా? మన హైందవం మనిషిలోపల్లోపలికి తొంగిచూసి మనిషిలోపలే శాంతిని కనుగొందామని చూసిందేమొ గానీ మనిషి బయటి సమస్యలకు అది సమాధానం చెప్పలేదేమొ అనిపిస్తుంది.

  నాగరాజా గారూ,
  మీరు చెప్పేది అర్థమయ్యీ కాకా వుంటుందీ. ఎలా అర్థం చేసుకుంటావో నీ యిష్టం అని చదువరి ప్రజ్ఞకు ప్రశ్నాపత్రంలా అనిపిస్తుంది. :)

  శేకర్ గారూ,
  సరే ఖురాన్ హింసను ప్రోత్సహిస్తుందనే అనుకుందాం. అనుకోవడమేంటి, అవును. మరి భగవద్గీత చేస్తున్న పని అది కాదా? అసలు ఆయుధాలు పారవేసిన అర్జుణుడికి కృష్ణుడు బ్రెయిన్ వాష్ చేసింది యుద్దం చేయమనే కదా? గీత కంటే ఎక్కువగా హింసను ఇంకెవరూ ఎక్కువగా ప్రోత్సహించలేదేమొ? అయితే ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అన్నట్లు దానికి కాలానికి తగినట్లు భిన్న భాష్యాలు చెప్పడం వల్ల అది అహింసామూర్తి గాంధీకి అభిమాన గ్రంధమైంది. కాబట్టి గ్రందం ఏమి చెప్పినా సమాజ పరిస్థితులకు దాన్ని అన్వయించుకొనే, ఫలితాన్ని రాబట్టే గుణం గురువులకూ, ఇమాంలకు, ముల్లాలకు వుండాలి. అయితే దురదృష్టవశాత్తూ ముస్లిం మతంలో ఇదే కొరవడింది. అందుకనే అప్పుడెప్పుడో వందల ఏళ్ళ క్రితం అప్పటి పరిస్థితులకు ప్రతిస్పందనగా రాసిన గ్రంధాన్ని నేను తప్పు పట్టను. దానికి కాలానికి తగినట్లు పునర్వచనం ఇవ్వని పండితులనే తప్పుపడతాను.

  మీరే రవి గారికి సమాధానం చెబుతూ గీతలో వున్నది ధర్మాన్ని నిలబెట్టడానికి అన్నారు. ఏది ధర్మం? గీత చెప్పిందే ధర్మం అని మీరంటే ఇస్లాం చెప్పిందే ధర్మం అని నేనంటాను. ధర్మ పరిరక్షణకు ఆయుధం పట్టడం, దుర్మార్గులను శిక్షించడం క్షత్రియుల ధర్మం అని కృష్ణుడు చెప్పిందే కదా “జిహాద్” పేరుతో ముస్లిం చాందసులు చేస్తున్నది. ఆ విధంగా మనకంటే చక్కగా కృష్ణుడు చెప్పిన పని జిహాదీయులు చేస్తున్నారు. గీతను చదివి ఎవరూ పరమతస్తులను చంపడానికి వెళ్ళడం లేదూ అంటే దానికి మనం చెప్పుకున్న భాష్యం వేరు. గీతలో వున్నది వున్నట్లు చేయాలంటే హిందువులూ పరమతస్తులను చంపాల్సిందే. ఎందుకంటే మనం ధర్మం అనుకున్నది వారికి కాదు గనుక, వారు కృష్ణుడు చెప్పిన అధర్మ పక్షం అవుతారు గనుక. పొలిటికల్లీ కరక్టు చెప్పాలని గాదు గానీ ఏమతానికంటే కూడా ఇస్లాం భిన్నం కాదు అయితే అందులో విసయాలు వున్నవి వున్నట్లు మధ్యయుగాల తరహాలోనే అర్థం చెప్పుకొని ఆచరించాలని పట్టుబట్టే ఛాందసులతోనే సమస్య అంతా.

  తాడేపల్లి గారూ,
  కృతజ్ఞతలు.

  రమ గారూ,
  అభ్భే పెద్ద బ్లాగరు, చిన్న బ్లాగరు అనేం వుండరండి. “వినదగునెవ్వరు చెప్పిన” అన్న నీతిని నేను అంగీకరిస్తాను. నాకు ఆవేశం వస్తే తప్ప రాయలేను. రాయాలని కూర్చుంటే ఏదీ రాయలేను అందుకే వికీలో ఒక్క వ్యాసం కూడా రాయలేకున్నాను ఎందుకంటే అక్కడ మన అభిప్రాయాలకు తావులేదు. ప్రస్తుత పరిస్తితుల్లో ఏది నన్ను కదిలిస్తే దానిమీద రాసేస్తాను. పదాలకోసం తడుముకోను, ఏది మనసులో వుంటే దాన్నే అక్షరాల్లోనూ పెడతాను.

  ఆవేశం అనర్థదాయకం అనికూడా తెలుసుకున్నాను. అందుకే ఈనాటి నేను రేపటి నేను కాకపోవచ్చు. స్థలం, కాలం కోఆర్డినేట్స్ మీద నేను రోజూ మారుతున్న వాన్నే.

  నన్ను చాలా మంది పెద్దవాళ్ళలో ఒకరిని చేసిన మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  –ప్రసాద్

 11. నాగరాజా అభిప్రాయం,

  తేది: August 31, 2007 సమయము: 10:02 am

  @రమ గారూ,

  అందరం తప్పటడుగులు వేసే నేర్చుకుంటున్నాం. నేర్చేసుకున్నాం, అయిపోయింది అని ఎవరైనా అనుకుంటే, పప్పులో కాలు వేసారన్న మాటే! “ఒక్కొక్కరు ఒక్కో రకం” – ఇది గమనించి గౌరవిస్తే, అప్పుడు హెచ్చు తగ్గులు ఉండవు.

  తెలుగు బ్లాగర్లందరూ జిందాబాద్.

 12. sekhar అభిప్రాయం,

  తేది: August 31, 2007 సమయము: 7:12 pm

  ప్రసాద్ గారూ,
  ఎన్నో హత్యలు చేసి ఉరికబం ఎక్కుతోన్న నేరగాన్ని, వాడిని ఉరి తీసే తలారిని పోలుస్తూ…ఇద్దరూ తీసింది ప్రాణమే కాబట్టి నేను నేరగాన్ని సమర్థిస్తాను అని అంటామా చెప్పండి? రాముడూ, రావణుడూ ఇద్దరూ చేసింది యుద్ధమే కాబట్టి నేను రావణున్ని సమర్థిస్తాను అనగలమా చెప్పండి?
  అలాగే, గీత లోనూ, ఖురాన్ లోనూ హింస వుంది కాబట్టి నేను ఖురాన్ ను సమర్థిస్తాను అనడమూనూ. ధర్మం వైపు రాముడు, క్రిష్నుడూ వుంటే,అధర్మం వైపు రావణుడూ, కంసుడూ వున్నారు. మనమెవరి వైపువుండాలి అనేది మన విజ్ఞత మీత అధారపడి వుంటుంది.
  ఇక్కడ ధర్మం అంటే సనాతన ధర్మం. అది రాముడికి కంటే ముందు నుండి ఇప్పటివరకూ వుంది ముందు కూడా వుంటుంది.

  ” అప్పుడెప్పుడో వందల ఏళ్ళ క్రితం అప్పటి పరిస్థితులకు ప్రతిస్పందనగా రాసిన గ్రంధాన్ని నేను తప్పు పట్టను. దానికి కాలానికి తగినట్లు పునర్వచనం ఇవ్వని పండితులనే తప్పుపడతాను. ”

  ఇస్లాం ను పునర్నిర్వచించడం వీలవుతుందా? సమాధానం ఈ క్రింది లింకులో చూడండి.
  http://www.faithfreedom.org/oped/sina50116.htm

  “… ఏమతానికంటే కూడా ఇస్లాం భిన్నం కాదు… ”
  నిజానికి ఇస్లాం మిగతా ‘మతాల కన్నా ‘ భిన్నమైనదే. ఏమిటా భిన్నత్వం? … ఇది మతం కాదు ‘ కల్ట్’.
  ఆవేశపడకుండా ఓపికగ్గా ఆలోచించి పరీక్షిస్తే ఆ విషయం ఈ క్రింది వ్యాసం లో అర్ధమవుతుంది.

  Islam: Cult or Religion?
  By Ali Sina

  Islam is known as the second largest religion. The very fact that 1.2 billion people call themselves Muslims vests Islam with the mantel of legitimacy and confirms the claim that it is a religion. But is it?

  Can 1.2 billion people be wrong? Well, in logic we have something called “argumentum ad numerum”. It states that something is true if a lot of people believe in it. But argumentum ad numerum is a logical fallacy. Truth cannot be established by the consensus of the majority. In fact many arguments have been proven to be false, even though everyone in the world once accepted them as true. For example, not until a few centuries ago everyone believed that the Earth is flat and is at the centre of the universe. Despite that common belief both geocentricity and the idea of the flat Earth were false. A false belief does not become true even if everyone thinks they are true.

  …….. మిగతా …ఈ క్రింది లింకులో…
  http://www.faithfreedom.org/Articles/sina/cultorreligion.htm

  -శేఖర్

 13. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: September 1, 2007 సమయము: 8:36 am

  చరసాల గారు, మీరు భారతదేశాన్ని ఒక నేషన్ స్టేట్ గా చూస్తే దానికి 60 సంవత్సరాలే..నేషన్ స్టేట్ అనే పాశ్చాత్య భావన చట్రంలో భారతదేశాన్ని ఇరికించలేం. భారతదేశము ఎప్పుడూ ఒక ఛత్రము కింద లేదు మేమే దాన్ని సంఘటితం చేశాము అన్నది పాశ్చాత్యులు మనమీద రుద్దిన భావన (వారి పరిమిత జ్ఞానమనే కొలబద్దతో భారతదేశాన్ని బేరీజు వేయటానికి చేసిన ప్రయత్న ఫలితం) (ఇది రా.స.స భావజాలం కాదని గ్రహించాలి)

 14. vegfood అభిప్రాయం,

  తేది: September 1, 2007 సమయము: 1:56 pm

  I felt very hopeless and sad when I read your article. You want to take care of all the people who are the cause of all the violence in India. You want every Indian to be aggressive. You want everyone from every state to know each other and hopefully be friendly. Very nice thought!
  Japan is the country that wanted to own the earth and waged the World War II. She ended up being bombed upon. What did she do? Look at her now. She rose up from the ruins, just like a Phoenix. How? By waging a war? Yes! Not with weapons, but with technology and economical growth. Every Japanese wanted to prove that they can still win the world. And they did, following every single rule and working just for the country not for themselves.
  In your opinion we need to start waging wars and then what, get bombed?
  Why is it that we do not know about each other? Not only because we live in different states but because we speak different languages. Till a few years back “from south India” or “From Andhra” meant “Madrasi”. Now, every one knows about Hyderabad. Not just people in India but people form Silicon Valley too. Why? Not because people in Hyderabad started waging a war! It’s because of our intellectual abilities.
  The only thing we want to do in India is form multiple groups. We are just interested in others following our Ideas. We are not interested in grasping good from others. We are not interested in India. We are interested in “Telugu” or “Tamil” or “Patel” or “Reddy” or “Rich”. We are not interested in “Work” as much as we are interested in talking about “Work”. If we cannot fix our home how can we fix the state or country?
  How many times in our lives we have done some thing we shouldn’t have? Who has made those bombs? An Indian. Who has let those terrorist infiltrate? An Indian. It’s not the other countries that are a problem. It’s us. You and me. We are just good for blogging. We are against every thing that is good for our country. We are against one single language. We are against stopping any kind of political demonstration. We are against sharing our natural resources. We are against sharing our knowledge. We are against sharing our wealth. We are against every thing that is not good for us and our immediate family.
  It’s our patience and perseverance (so called “Chatakani thanam”!) that lasted us these many years. That philosophy has let us concentrate more on knowledge and eternal development rather than our social. Once we start moving away from our roots, our mind starts wavering and we start thinking of having every thing just for ourselves. And once we get used to being selfish there is nothing that can stop us. “Chatakani thanam” and “written in our fate” has been replaced by selfishness and greed. We no longer think it’s not in our fate; we want it and are willing to do any thing to get it.

 15. mohanraokotari అభిప్రాయం,

  తేది: September 9, 2007 సమయము: 6:45 am

  em cheyyali edo manasulo pettukoni chettantta raasthunnavem naxals laaga


 16. తేది: October 24, 2008 సమయము: 7:34 pm

  మన దేశంలో నాగరికత సంస్కృతులు మొదలు వికసించినప్పుడు మన ప్రక్కవాళ్ళు ఇంకా సాపేక్షంగా బార్బేరియన్ దశల్లోనే ఉండి ఆ మోటివ్స్ తోటే మనమీద దండయాత్రలు చేశారు. నాగరికత సంస్కృతులలో సహనం ఒక లక్షణం. అయితే ఎదుటివాడు తెగబడుతుంటే చూస్తూ కూర్చోవడం కూడా నాగరికత లక్షణం కాదు.

  మతమైనా సంస్కృతి అయినా కాలక్రమంలో పరిణమిస్తుండాలి. లేకుంటే అవే మానవ వినాశకాలు అవుతాయి. ఆ సంస్కరణ శీలత తక్కువగా ఉన్న మతాలవలననే మనం ఇక్కట్లు ఎదుర్కొంటున్నాము.

 17. nrahamthulla అభిప్రాయం,

  తేది: August 16, 2010 సమయము: 1:25 am

  రవి వైజాసత్య,ప్రసాద్ ,యన్.సీతారాంరెడ్డి మంచి విషయాలు చెప్పారు.
  “ఏమతానికంటే కూడా ఇస్లాం భిన్నం కాదు అయితే అందులో విసయాలు వున్నవి వున్నట్లు మధ్యయుగాల తరహాలోనే అర్థం చెప్పుకొని ఆచరించాలని పట్టుబట్టే ఛాందసులతోనే సమస్య అంతా. సహనశీలత బలవంతుల లక్షణం…బలహీనుల లక్షణం కాదు.నాగరికత సంస్కృఅతులలో సహనం ఒక లక్షణం.మతమైనా సంస్కృతి అయినా కాలక్రమంలో పరిణమిస్తుండాలి. లేకుంటే అవే మానవ వినాశకాలు అవుతాయి.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో