నమ్మకం

తేది: August 20, 2007 వర్గం: ఆధ్యాత్మికం రచన: చరసాల 4,836 views

ఆ శక్తి దృష్టిలో మనందరమూ ఒకటే నిప్పు ఎవ్వరినైనా కాలుస్తుంది, నీరు ఎవ్వరినైనా తడుపుతుంది. ఇదీ అంతే ఆ శక్తి దృష్టిలో నమ్మేవాడు ఎంతో నమ్మని వాడూ అంతే. దానికి నా వాడు నీ వాడు అనే విచక్షణ లేదు.

ఇది చెప్పాక ఇక అసలు తేడా ఎక్కడ వుంది అంటే మనలోనే…
ఓ మానసిక సమస్యతో భాధపడే వాన్ని ఓ భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళితే నయం కాదు, కానీ అదే మరో భేతాళ మాంత్రికుడి దగ్గరకు తీసుకెళితే నయం అవ్వచ్చు. ఇందులో నయం కావడమనేది అబద్దం కాదు. అయితే ఆ భూత వైద్యుడి కంటే ఈ భేతాళ మాంత్రికుడు గొప్పనా అంటే అదీ కాదు. పోనీ నిజంగా ఆ మంత్రాలలో రుగ్మతను మాయం చేసే అతీంద్రియ శక్తులున్నాయా అంటే అదీ కాదు.

వున్నదల్లా ఆ ఇద్దరిపై మనకున్న నమ్మకం యొక్క తీవ్రతలో తేడా మాత్రమే. మనమెవ్వరిని గాఢంగా, పిచ్చిగా, మూఢంగా, మూర్ఖంగా, అనుమాన రహితంగా నమ్ముతామో ఆ నమ్మకంలో మాత్రమే శక్తి వుంది. నమ్మకంలో శక్తి వుందే గానీ దేనిమీద నమ్మకం వుంచామో దానిలో ఏమీ లేదు. అందువల్లనే గురువు స్థానంలో విగ్రహాన్నుంచి విలువిద్య నేర్వగలిగాడు ఏకలవ్యుడు.

ఈ నమ్మకం దానికది రావాలి. మనిషిలో ఆ మూర్ఖత్వం వుండాలి. ఆ అచంచల నమ్మకం నుండీ ఏదైనా ప్రయోజనం(?) సిద్దించాలంటే ప్రశ్నించే గుణం మటుమాయమవ్వాలి. సత్యసాయిబాబా గాలిలోంచే బంగారం సృష్టిస్తున్నాడని మనసు లోతులనుండీ నమ్మాలి. షిరిడి సాయిబాబా ఆ దేవుని అవతారమేనని నమ్మాలి. ఏసు ప్రభువు మూడవరోజున లేచాడనే నమ్మాలి. ఖురాను దివ్యసందేశమనే నమ్మాలి. ఇందులో ఏ మాత్రం అపనమ్మకమున్నా ఇక మీరు అనుకొన్న ప్రయోజనం నెరవేరలేదంటే అది మీ నమ్మకంలో లోపమే గానీ నమ్మకం వుంచిన వాటిలో లోపం గాదు.

ఒకడు హిందూ దేవతలతో విరక్తి చెంది ఏసు మతం స్వీకరించాక తనకు మంచి జరిగిందీ అంటే ఒకటి ఆ మతమార్పిడిని ప్రోత్సహించడానికి మిషనరీలు పనిగట్టుకొని అతని కార్యం దేవుని పేరుతో నెరవేర్చి అన్నా వుండాలి. లేదా అనుకోకండా జరిగిన కొన్ని సంఘటనల వల్ల అతనిలో ఆ మతం పట్ల, ఏసు పట్ల అచంచల విశ్వాసం, నమ్మకం ఏర్పడి వుండాలి. మతమార్పిడి వల్ల అతనికి మంచి జరిగింది కదాని మరొకరు మారాలనుకుంటే మాత్రం అది నిష్ప్రయోజనం. ఎందుకంటే మొదటి వ్యక్తిలో కలిగిన ఆ అచంచల నమ్మకం ఈ రెండవ వ్యక్తిలోనూ కలగగల అవకాశాలు స్వల్పం. ఇక పనిగట్టుకొని నమ్మకం ఏర్పరచుకోగల విద్యే వుంటే ఇక మతం మారడం ఎందుకు? సుబ్బరంగా వున్న మతంలోనే ఏదో ఓ దేవుడి మీద నమ్మకం పెంచుకుంటే సరిపోతుంది.

నమ్మకం కల్పించుకుంటే వచ్చేది కాదు. అభ్యాసం చేస్తే వచ్చేది కాదు. ఏదో ఓ చిరు ఘటన మనలో ప్రశ్నించరాని నమ్మకం బీజం వేసేస్తుంది. ఆ బీజం ఎవరివల్ల పడుతుందో అది చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు. పుస్తకం కావచ్చు, వ్యక్తి కావచ్చు లేదా కేవలం ఓ ఘటనా కావచ్చు.

(”ఒక అలౌకిక శక్తి” కి వాఖ్య రాయబోతే ఇలా బ్లాగయ్యింది.)

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'నమ్మకం' పై 10 అభిప్రాయాలు

'నమ్మకం'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. కొత్తపాళీ అభిప్రాయం,

  తేది: August 20, 2007 సమయము: 9:14 pm

  well said. That’s why it’s a matter of faith. Either one has it or one doesn’t.

 2. వికటకవి అభిప్రాయం,

  తేది: August 20, 2007 సమయము: 10:20 pm

  చరసాల గారు,

  నేను రెండు బ్లాగులు చదివాను. నా అభిప్రాయాలు ఇవి. ఏకలవ్యుడిది నూరు శాతం నమ్మకమే. మరో మాటకి తావు లేదు. కానీ, ఇక్కడ వీరి స్థితి నమ్మకానికి మాత్రమే సంబంధించింది కాదు. మనిషి విపరీతమయిన కష్టాల్లో ఉన్నప్పుడు, మరో దారి లేక తనను గట్టెక్కించే ఏ మార్గమైనా అనుసరిస్తాడు. ఇక్కడ నమ్మకం కన్నా “ట్రయల్ ఎండ్ ఎర్రర్” ముందుంటుందని నా అభిప్రాయం. ఏ మార్గం గట్టెక్కిస్తుందో అది అప్పుడు అతని “నమ్మకం” గా మారుతుంది. కష్టాల్లో ఒక గట్టి నమ్మకంతో ముందుకెళ్ళటం (ఏకలవ్యుడిలా) అన్నది అసాధారణం అని, ఏ పుట్టలో ఏ పాముందో అనుకుంటూ రకరకాల దారులు పట్టుకుని, తనకు వచ్చిన ఫలితాన్ని బట్టి నమ్మకం ఏర్పడటమనేది సాధారణమని నా అభిప్రాయము.

 3. రమ అభిప్రాయం,

  తేది: August 21, 2007 సమయము: 2:02 am

  నమ్మకం వేరు.. నమ్మించడం వేరు అండి ప్రసాద్ గారు… నేను ఏ దేవుడికి వ్యతిరేకిని కాదు…మీరన్నట్లే అందరిని నమ్ముదాము..

  ఒక చిన్న ప్రశ్న..

  నాదగ్గరికి వస్తే చాలు మీ బాధలన్ని తొలగిపొతాయి అంటారు సాయి బాబ.. అలాగే మా సమావేశాలకి వస్తే చాలు.. కుంటి వాళ్ళకి కాళ్ళు వచ్చేస్తాయి అంటారు.. ఎంతో మంది క్రైస్తవ ప్రముఖులు..మేము మంత్రం వేస్తే చాలు పిల్లలకి అన్ని జబ్బులు నయమైపొతాయి అంటారు కొంతమంది ముస్లిం సాధు ప్రముఖులు.. మరి ఇంతమంది ఇన్ని చేయడానికి వున్నప్పుడు… ఇన్ని కష్టాలు ఎందుకొస్తున్నాయండీ??

  చిన్న ఉదా: బాబ గారి పారయణం తీసుకొండి.. మొదట్లొనే… బాబ ఎక్కడో ఒక తల్లి తన బిడ్డ వొళ్ళో వున్నది చూసుకొకుండా భర్త పిలుస్తున్నాడు అని పక్కనే వున్న కొలిమి నుండి లేచి వెళ్తుందట… అప్పుదు బాబ గారు ఆ బాబు ని అక్కడ షిర్డి నుండి కొలిమి లో చేతులు పెట్టి కాపాడారు అని చెప్పారు…సరె అలాగే అనుకొందాము… మరి సునామి బాబ గారికి కనపడలేద…(వినపడలేద)?? అక్కడ ఎంత మంది పసి పిల్లలు తమ ప్రాణాలు కొల్పోయారు?? ఆ పసి మనసులకి తెలుసా తామెవరిని ప్రార్దించాలో?? వాళ్ళకి ఏ దేవుడిని కొలవమని చెప్పగలమండీ మనము?? సునామి నుండి ఏ మతం కాపాడింది?? ఎంతో మంది అనాధలయి పొయారు గుజరాత్ భుకంపంలో…. అప్పుడెందుకు రాలేకపొయారు ఈ బిన్న మతాలా ప్రముఖులు మేమున్నాము అంటూ?? అప్పుడెందుకు నమ్మించలేకపొయారు ఈ పిచ్చి జనాలని.. వారి మాటలతో … వారి మాయలతో?? అయినా మీరన్నట్లు ప్రతీది నమ్మేద్దాము … ఎందుకంటే బాధ్యతలనుండి పుట్టుకొచ్చిన భయం… అమ్మో నేను ఈ దేవుడిని ఏమన్నా అంటే నాకేమి జరుగుతుందో అనే భయం … అందుకే అన్నాను.. నమ్మకం వుండాలి కాని నమ్మించడం అనేది కష్టం ..

  “నమ్మాలి” అని నొక్కి వక్కాణించి చెప్పారు ..మీ బ్లాగ్ (అలౌకిక శక్తి ప్రేరణ బ్లాగ్) లో నాకు నిందా శ్తుతి కనపడుతొంది…

 4. Giri అభిప్రాయం,

  తేది: August 21, 2007 సమయము: 8:06 am

  నమ్మకానికి గుడ్డి నమ్మకానికీ తేడా ఉంది. గుడ్డి నమ్మకస్తుడికి పక్కవాడి నమ్మకం మీద నమ్మకము ఉండదు.
  ==
  చిన్న సవరణ – “వాన్ని”కాదు “వాణ్ణి” కదా?

 5. lalitha అభిప్రాయం,

  తేది: August 21, 2007 సమయము: 8:51 am

  గిరి గారు,
  ఇలాంటి అభిప్రాయమే నాదీను. నేను ఎన్నో మాటలలో ఆలోచిస్తుంటే మీరు ఇచ్చిన expression నా ఆలోచనలకు సరిగ్గా సరిపోయినట్టు అనిపించింది.

 6. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: August 21, 2007 సమయము: 1:20 pm

  కొత్తపాళీ గారు,
  ధన్యవాదములు.

  వికటకవి గారూ,
  Trial and error ముందుంటుంది అని నేను అంగీకరిస్తాను. దాన్నే మనం ఏ పుట్టలో ఏ పాముందో అంటాం. ఈ పాముపుట్ట సిద్దాంతం వల్లే మనం కనపడినా రాయినల్లా మొక్కుతాం, ఎదురయిన ప్రతి నీటి గుండంలో మునుగుతాం. అయితే అలా చేస్తున్నప్పుడు ఒక విషయం జరగడానికి వున్న సంభావ్యత ఎంతో జరగకపోవడానికి వున్న సంభావ్యతా అంతే. ఏదైనా ఈ సంభావ్యతను బట్టి జరిగినా దాన్ని ఆ రాయికో, రప్పకో, పుట్టకో, మనిషికో, దేవుడికో మహాత్యం వుందని నిర్దారించేసి దాని పట్ల విపరీత నమ్మకాన్ని పెంచేసుకుంటాం. ఇక అక్కడ నుండీ అసలు మేజిక్ మొదలవుతుంది. ఆ నమ్మకం నిప్పుల్లో నడిపిస్తుంది, కష్టాలను ధర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది. ఆ ధైర్యం సత్పలితాలను ఇవ్వ ఆరంబిస్తుంది.

  మీరన్న దానితో నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను.

  రమ గారూ,
  నా బ్లాగులో నిందాస్తుతి కనిపిస్తున్నది అన్నారంటే నేను నా భావాన్ని సరిగ్గా చెప్పలేకపోయాను అని. మీ బ్లాగు చదివాక దాన్నే మరింత పొడిగించి చెప్పాలనిపించింది. మీ బ్లాగును నేను ఎక్కడా ఖండించడం లేదు. మీరు చెప్పినదానికే నేను మరింత జోడిద్దామని ఈ ప్రయత్నం.
  “దేవుడు వొక్కడే…. రాముడా..అల్లా… జీసస్సా ? అని కాదు .. పేర్లు తేడా” — నేను చెప్పేదీ ఇదే.
  “ఇక్కడ దేవుడు అడిగింది తీర్చలేకపొతే అక్కడ తీరిపొవడమేమిటి” — దేవుడిలో తేడా లేదు. మన నమ్మకం లో తేడా.
  “ఇక్కడ కాలేదు అంటే దానికి కారణం వెతుక్కొగలగాలి.. అందుకు మనం అర్హులమా కాదా అని ఆలోచించగలగాలి” — నాకు కనపడిన ఆ కారణం విశ్వాసంతో, నమ్మకంతో దేవున్ని ప్రార్థించకపోవడం. అయితే చివరికి నేను చెప్పిందీ..ఇక్కడ నమ్మకం లేదూ అంటే అక్కడా నమ్మకం పెరగదు అని.
  “ఇక్కడ సంపాదించలేని అర్హత ఇంకెక్కడో దొరుకుతుంది అన్నది ఎంత హాస్యాస్పదమో కద”–ముమ్మాటికీ నిజం.
  “ఏ దేవుడు అన్నా పిల్లల్ని చదవద్దు అని అంటాడా??? మీరు చదివనా నేను వుద్యొగాలు ఇప్పించలేను అంటాడా?? నేను చాల అశక్తుడిని.. అని చెప్పడా?? మనమీద మనకు నమ్మకం వుండాలి”– నేను చెప్పిందీ ఇదే కదా? ఏ దేవుడూ “నన్ను ప్రార్థించిన వాడు నావాడు, నన్ను ప్రార్థించని వాడు కాదు” అని అనడు. అందుకే దేవుడి గుణాన్ని అన్నిటినీ కాల్చే అగ్నితోనూ, తడిపే నీటి తోనూ పోల్చాను. మీరన్నట్లే నేనూ నమ్మకం వుండాలి. ఆ నమ్మకం దేనిమీద అనేది అనవసరం. ఎవరికి వారిమీదే అవచ్చు, లేదా ఓ రాయి మిద వచ్చు లేదా దేవుడు అనబడే abstract వస్తువు మిదా అవ్వచ్చు.

  ఇంకా ఇలా ప్రతి విషయాన్నీ పోల్చవచ్చు. చివరిగా నేను చెప్పదల్చుకున్నది మీరు చెప్పినదానికి కొనసాగింపే గానీ విమర్ష కాదని గమనింపగలరు.

  గిరి మరియు లలిత గారూ,
  మీరన్నది నిజమే. అందుకే నేను “ఆ అచంచల నమ్మకం నుండీ ఏదైనా ప్రయోజనం(?) సిద్దించాలంటే” అని ప్రయోజనం పక్కన ప్రశ్నార్థకం చేర్చాను. గుడ్డి నమ్మకం నుండీ ఏదైనా ప్రయోజనమే కలుగుతుంది వుపయోగపడేదే జరుగుతుంది అని నేను అనడం లేదు. అతి సర్వత్ర వర్జయేత్ అనేది అన్ని చోట్లా ఆమోదమే. ఓ గుడ్డి నమ్మకమున్నవాడే విమానంతో భవనాలను డీకొట్టించ గలడు. ఓ గుడ్డి నమ్మకమున్నవాడే తన ప్రభువు కోసం ప్రాణాలను త్యజించ గలడు. ఇందులో ఏ మాత్రం హేతువుకు తావిచ్చినా వాడా పనిచేయలేడు.

  –ప్రసాద్

 7. తెలుగుఅభిమాని అభిప్రాయం,

  తేది: August 23, 2007 సమయము: 5:18 am

  ప్రసాదన్నా, బ్లాగులో scrolling చాల నెమ్మదిగా అవుతున్నది. ఓపాలి చూడండి.

 8. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: August 24, 2007 సమయము: 12:04 pm

  నిజమే తమ్ముడూ. ఇది నా పరిశీలనలోనే గత కొద్ది రోజులుగా వుంది.
  పని ఒత్తిడిలో ఎక్కువ దృష్టి పెట్టలేకున్నాను.

  సమస్యను గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.

  –ప్రసాద్

 9. chukka suresh అభిప్రాయం,

  తేది: July 16, 2008 సమయము: 9:38 pm

  nammakamu vuneti ediaaina saadincha vatchhu

 10. chukka suresh అభిప్రాయం,

  తేది: July 16, 2008 సమయము: 9:42 pm

  నమ్మకం ఉన్నంతవరకు ఎదియీనా సాదినంచవచ్హు.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో