మనం పిల్లలకేమి నేర్పుతున్నాం?

తేది: August 17, 2007 వర్గం: నా ఏడుపు, వర్తమానం రచన: చరసాల 2,759 views

రోజూ హత్య వార్తలు, ఆత్మ హత్య వార్తలు, అత్యాచారాలు మామూలు విశయాలయిపోయి మనసు వాటికి స్పందించడం మానేసింది. అయితే ఇవాళ్టి ఈ వార్త “మితృణ్ని చంపిన పిల్లలు” చదివితే మన భవిష్యత్ సమాజం ఎలా వుండబోతోందో అన్న భయంకర వేదన మనసును మెలిపెడుతోంది.

వాళ్ళ వయసు ఇంచుమించు ఎనిమిదేళ్ళు! కోపాలూ, తాపాలూ, శతృవులూ, మితృలూ అన్న భావనలు చిగురించే వయసు. ఉదయాన జరిగిన పోట్లాట సాయంత్రానికి మరచిపొయ్యే వయసు. ఆడుతూ పాడుతూ బతకాల్సిన ఈ వయసులో ఓ చిన్న విషయానికి గొడవపడి (గొడవపడటం మామూలు విషయమే) ఆ తర్వాత కుట్ర ఆలోచనతో ఆ కుర్రాడిని స్నేహితుడి సహాయంతో గుట్ట మీదికి తీసుకెళ్ళి రాళ్ళతో మోది చంపడమంటే… ఇది ఆ పిల్లల తప్పని ఎలా అనుకోగలం? ఓ ఎనిమిదేళ్ళ కుర్రాడు ఓ చిన్న గొడవ విషయాన్ని గుర్తుంచుకొని పగబట్టి చంపడమనేది అసాధారణం.

అయితే ఇది ఆ పిల్లల బుద్దిలో పుట్టి పెరిగింది కాదు. ఇది పెద్దల చేష్టలకు పిల్లల అనుకరణ. పెద్దలు చేసే ప్రతిపనినీ పిల్లలు అనుకరించాలని చూస్తారు. ఇదీ అదే. ఇలాంటి విషయాల్లో పెద్దలు గొడవపడి ఆ తర్వాత పగబట్టి వారిని కాజేయడం నిత్యమూ చూస్తున్న పిల్లలు దాన్నే వాళ్ళూ ఆచరించారు.

దీనికి శిక్ష ఎవరికి వేయాలి? ఆ పాలబుగ్గల పసికందులకా? పచ్చిగడ్డి తినే ఆవుతోనైనా మాంసం తినిపించగల పెద్దలకా?
Pillalu
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'మనం పిల్లలకేమి నేర్పుతున్నాం?' పై 5 అభిప్రాయాలు

'మనం పిల్లలకేమి నేర్పుతున్నాం?'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. Balasubramanyam అభిప్రాయం,

  తేది: August 17, 2007 సమయము: 9:56 am

  చాలా చక్కని వ్యాసం. సమాజంలోని ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం.అహింసను బోధించిన గాంధి పుట్టిన దేశం మనది. పసిమనసులను కలుషితం చేయవద్దు.

 2. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: August 17, 2007 సమయము: 2:08 pm

  టపా శీర్షికలో ఏ అని పెట్టాల్సింది. చదవకుండా ఉండేవాన్ని కదా!

 3. రానారె అభిప్రాయం,

  తేది: August 17, 2007 సమయము: 3:27 pm

  ఇందులో కుట్ర ఉంటుందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. చంపడానికే గుట్టకు పిలిపించి ఉంటారని అనిపించడం లేదు. అక్కడి కెళ్లాక మాటమాటా పెరిగి ఏదో ఆవేశంలో బండతో మోది ఉంటారని అనుకుంటున్నాను.

 4. radhika అభిప్రాయం,

  తేది: August 17, 2007 సమయము: 4:56 pm

  పిల్లలు అలా అవ్వడానికి పెద్దల తప్పుంది అనొచ్చు. కానీ పెద్దలది మాత్రమే తప్పంటే అది సరికాదేమో?పరిసరాలు,పెరుగుతున్న వాతావాణం అన్నీ ప్రభావం చూపుతాయి కదా.నేడు లేచింది మొదలు టీవీలలో,సినిమాలలో హత్యలు ఎలా చేయాలో,కక్షలు ఎలా సాధించాలో,చిన్న వాటికే ఎలా గొడవలు పడాలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తూవుంటే వాటి ప్రభావం వాళ్ళ మీద వుండదంటారా?పిల్లల వరకూ ఎందుకు?టీవి 9 లో చూపించే హత్యోదంతాలను నేనే చాలా ఇంటరెస్ట్ గా చూస్తూవుండేదానిని.ఇలా చంపాడు,అలా చంపాడని ఆ విషయాన్ని వేరె నటీ నటులతో మంచి ఇంట్రెస్టింగ్ గా,సస్పెన్స్ స్టోరీలా చూపిస్తుంటే ఎవరు చూడకుండావుంటారు? అలా టీవీ లు చూడకుండా ఆపాలి పెద్దోళ్ళు అంటే …నిజం చెప్పండి మనం మన పిల్లలని టీవీ లు చూడ కుండా కంట్రోలు చెయ్యగలమా? నిత్యం చుట్టుపక్కల జరుగుతున్నవాటిని పరిశీలిస్తున్న పిల్లలను ఆపగలమా?ఒక తండ్రికి ఏ చెడు అలవాటూ లేదు.ఒక వేళ అతని కొడుకు పొగ తాగుతూ,మందు కొడుతూ వుంటే అది పెద్దవాళ్ళ్ను అనుకరించింది అనుకోవచ్చా? ఎంత జాగ్రత్త గా పెంచినా వాళ్లకి అవి ఎలా అలవాటయ్యాయో తెలుసుకోవడం చాలా కష్టమే. అక్కడ వాళ్లని తప్పుపట్టలేము కదా.

 5. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: August 20, 2007 సమయము: 3:59 pm

  తాడేపల్లి గారూ,
  ధన్యవాదములు.

  రవి గారూ,
  చిన్న పిల్లలు కూడా నా బ్లాగు చూస్తారని అనుకోలేదండి.

  రానారె,
  అలా క్షణికావేశంతో జరిగిన విషయమైతే అంతగా ఆలోచించాల్సిన పని లేదు. ఈనాడు కథనం అలా లేదు.

  రాధిక గారూ,
  నేననేదీ అదే. పెద్దవాళ్ళ కుట్రలూ, కుతంత్రాలూ, పగబట్టడాలు రోజూ పత్రికల్లో వస్తోంది, టీవీలో వస్తున్నాయి, ఇంట్లో పెద్దలు మాట్లాడుకుంటున్నారు. ఓ సినిమా చూసినా అదే, ఓ నవల చదివినా అదే, ఓ పత్రిక చూసినా అదే. పెద్దలంటే నా వుద్దేశ్యంలో ఇవన్నీ. మనమేం చేస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో ఇవన్నీ విని తెలుసుకోవడమే కాదు చూసి తెలుసుకుంటున్నారు. మన పిల్లలకు మన జీవితాలే వుదాహరణ. మనం రోజెంతా ఎక్కడ గడిపి వచ్చామో మనం దాచినా దాగవిప్పుడు. పైగ మన సినిమాలు ఇవన్నిటినీ హీరోయిజం కింద మార్చేసిన రోజులు గనుక పిల్లలూ ఆ బాటలో నడవాలనుకుంటే వాళ్ళ తప్పేముంది?

  మీరన్నట్లు తండ్రి ఎంత సన్మార్గుడైనా పిల్లలు చెడిపోయిన వుదాహరణలూ వున్నయి అలాగే తండ్రి ఎంత నీచుడైనా సంతానం సన్మార్గంలో నడిచిన వుదంతాలూ వున్నాయి. వాళ్ళు అనుకరించ ప్రయత్నించింది వాళ్ళ యింటిలోని పెద్దవాళ్ళనూ కావచ్చు లేదా పక్కింటి పెద్దవాళ్ళనూ కావచ్చు. లెదా సినిమాల్లోని తమ అభిమాన హీరోని కావచ్చు.

  –ప్రసాద్

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో