వీడింకో విలన్

తేది: August 15, 2007 వర్గం: వర్తమానం రచన: చరసాల 2,211 views

మొన్న తస్లీమా తమకు వ్యతిరేకంగా రాసిందని ఆమె మీద భౌతికంగా మజ్లిస్ రౌడీలు ప్రెస్ క్లబ్ సాక్షిగా దాడికి పాల్పడితే ఇప్పుడు “ధాకరే”ను విలన్ అన్నందుకు “అవుట్‌లుక్” మీద శివసైనికుల మూక దాడి చేసింది.
వీళ్ళు చేసే పనులన్నీ విలన్ పనులే కానీ ఆ మాట అంటే మాత్రం కోపం. థాకరే విలనో కాదో అతను లేదా అతని అనుచర మూక చేసే పనులే చెబుతున్నాయి. మళ్ళీ అదే మాట ఒక పత్రిక చెబితే అంత వులికిపాటు ఎందుకు? హిందువుల రక్షకులుగా అవతారం ఎత్తిన ఈ దుర్మదాందులే ఒకప్పుడు మదరాసీలను బొంబాయి నుండీ తరమడానికి హింసాకాండ లేపిన వారు. అయితే మతం లేదంటే స్థానికత్వం అనే అడ్డుగోడలు సృష్టించి, కలహాల నెగళ్ళు రాజేసి ఒళ్ళు వెచ్చజేసుకొనే రక్త పిపాసులు ఈ పుండాకోర్లు.
ప్రజాస్వామ్యాన్ని, ప్రజా సామాన్యాన్ని తమ ఆయుధాలుగా మలచుకొన్న ఆధునిక రాక్షసులు. వీళ్ళకు చరమ గీతం పాడాలంటే విష్ణువు శతావతారాలెత్తాలేమొ!

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'వీడింకో విలన్' పై 13 అభిప్రాయాలు

'వీడింకో విలన్'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. నవీన్ గార్ల అభిప్రాయం,

  తేది: August 15, 2007 సమయము: 8:10 am

  ఎందుకండీ ఆగ్రహం. వాళ్ళని విలన్ అని ఎందుకు అన్నారో ఇప్పుడు జనాలకు సరిగ్గా అర్థం అయ్యి ఉంటుంది.

 2. వికటకవి అభిప్రాయం,

  తేది: August 15, 2007 సమయము: 10:48 am

  ఈ వార్త విన్నాక నేను అవుట్ లుక్ చదివాను. అసలు అందులో అంతగా రెచ్చిపోయే విషయమేలేదు. వినాశకాలే విపరీతబుధ్ధీ అన్నట్లు, ఎలాగు మహారాష్ట్ర ప్రజలు శివసేనని చీకొడుతున్నారు కదా! వారి స్థితి కాంగ్రెస్ పార్టీతో రహస్యంగా అవగాహనకొచ్చే లెవెల్ కి దిగజారింది. అయినా బుధ్ధి మారలేదు.

 3. sekhar అభిప్రాయం,

  తేది: August 15, 2007 సమయము: 1:32 pm

  చిన్నగా మొదలై, బయటి శక్తుల సహాయంతో, విశ్రుంఖలంగా పెరిగిపోయింది ముంబై ముస్లిం మాఫియా.

  వారినుండి ప్రజల్ని రక్షించే బదులు, లంచాల వల్ల, వారికే కొమ్ము కాసింది అక్కడి రక్షణ వ్యవస్త.

  ఆ దుష్ట శక్తులకు చెక్ పెట్టేందుకు పుట్టిందే శివ సేన. ముల్లును ముల్లుతోనే తీయాలిగా మరి …

  అయితే, మొదట కొట్టిన వాడిని వేలెత్తి చూపే దమ్ములేక, భరించలేక తిరిగి కొట్టిన వాడినే ‘ విలన్ ‘ అంటోండి అక్కది ‘ సూడో సెక్యులర్ ‘ పత్రికా ప్రపంచం. వారిని నపుంసకులనడం నపుంసక జాతికే అవమానం.

 4. T. Bala Subrahamanyam అభిప్రాయం,

  తేది: August 16, 2007 సమయము: 3:44 am

  ఒక హిరణ్యకశిపుణ్ణో ఒక హిరణ్యాక్షుణ్ణో చంపితే లోకం బాగుపడుతుందనుకున్నప్పుడు విష్ణువు అవతారాలెత్తాడు. ప్రతివాడూ అలాగే తయారైతే ఆయన మాత్రం ఎంతమందినని చంపుతాడు ? వీళ్ళు ఒకరినొకరు చంపుకుంటూ పోయి లోకం నిర్మానుష్యమైతే అప్పుడు బాగుపడుతుందేమో ప్రపంచం !

  ఒక చదువరి అభిప్రాయంపై నా స్పందన :

  ప్రతివారి నుంచి అందినంత మామూళ్ళ రూపంలో బలవంతంగా దోచుకుతింటున్న శివసేనకు కితాబులివ్వడం తగదు. ఏ ఉద్దేశంతో మొదలైనా ఈరోజు మాత్రం అది నిష్కళంక సంస్థ కానేకాదు. ముంబాయిలో నేరస్థ ముఠాల దురాగతాలు పెచ్చరిల్లక ముందే శివసేన స్థాపించబడింది. ఏ ఉద్దేశంతో ? అనేది బాల ఠాకరేకే తెలియాలి.

 5. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: August 16, 2007 సమయము: 7:42 am

  ఎవడైనా సరే చట్టబద్దతను సవాల్ చేస్తే వాన్ని తలెత్తకుండా కోసెయ్యాలి. అధికారులు లంచగొండులై మాఫియాకే కొమ్ము కాస్తుంటే అధికారుల లంచగొండితనం మీద పోరాడాలి గానీ అలాంటి సమాంతర మాఫియాను మరొక్కటి సృష్టించడం సమస్యకు పరిష్కారమవబోదు.
  తాడేపల్లి గారన్నట్లు శివసేన సృష్టి మాఫియాలకంటే ముందే జరిగింది. పోనీ ఆ ఆశయంతోనే జరిగింది అనుకున్నా శివసేన ఏ మాఫియా ఆగడాలని నివారించ గలిగింది? ముంబయి పేలుళ్ళు ఆపగలిగిందా? హిందూ-ముస్లిం అల్లర్లు ఆపగలిగిందా? ఒక హిందువు ప్రాణానికి ఇద్దరు ముస్లిం ప్రాణాలను బలిగొందేమొ గానీ ఎవరి ప్రాణాలనూ అది రంక్షించలేదు. ముల్లును ముల్లుతోనే తీయాలి. నిజమే కానీ ఇప్పుడు జరుగుతున్నది అది కాదు. ఆ ముఠా ఒక ముల్లు గుచ్చితే ఈ ముఠా మరో ముల్లును గుచ్చుతోంది పోటీపడి. అన్ని ముల్లుల్నీ పంటిబిగువున భరిస్తోంది జాతి.

  ఏ వ్యక్తీ చట్టానికి అతీతుడవ్వకూడదు. వ్యక్తిపూజ ప్రమాదభరితం. “అవుట్‌లుక్” విలన్ అనగానే విలనవుతారా ఎవరైనా? “అవుట్‌లుక్” మీద దాడి చేసి ఆ పేరును నిలబెట్టుకుందెవరు?

  –ప్రసాద్

 6. వీవెన్ అభిప్రాయం,

  తేది: August 16, 2007 సమయము: 12:08 pm

  ఉన్నమాటంటే ఉలుకెక్కువ కదా.

 7. sekhar అభిప్రాయం,

  తేది: August 16, 2007 సమయము: 3:01 pm

  ఓ బలమైన రాక్షసుడు, మీ ఇంట్లో, మిమ్మల్ని కొట్టి, మీ సోదరిని బలాత్కరిస్తోంటే, మీరు ఓ పనికి మాలిన చవట దగ్గరికెల్లి సహాయమడుగుతారా లేక ధైర్యంగా పోరాడ డానికి ప్రయత్నిస్తారా?

  కిటికీల్లోంచి ఈ తతంగమంతా చోద్యంగా చూస్తూ, మీకు సహయం చేయక పోగా, మిమ్మల్నే విమర్శిస్త్తోన్న మా లాంటి పక్కింటి వారిని మీరు ఉత్తములు, ధైర్యవంతులంటారా లేక పిరికిపందలు, నపుంసకులంటారా?

 8. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: August 17, 2007 సమయము: 7:54 am

  శేకర్ గారూ,
  మీ వుదాహరణ ప్రస్తుత పరిస్థితిని ప్రతిభింభించడం లేదు. శివసేన చేస్తోంది తన చెల్లి మాన ప్రాణ రక్షణ కాదు ఆ పేరుతో మరో చెల్లి మానప్రాణ భక్షణ.
  మీరు శివసేనను సమర్థిస్తుంటే ఇప్పుడు ఇరాకులో జరుగుతున్న సున్నీ-షియాల పోరాటాన్నీ సమర్థిస్తారా? మరి అక్కడ కూడా షియాల పోరాటం సున్నీల పోరాటానికి ప్రతిస్పందనగా మొదలయ్యిందే గదా?
  స్పందనగా అయినా ప్రతిస్పందనగా అయినా అకృత్యాల దాష్టీకం ఒకటే. అందులో తేడా లేదు.

  –ప్రసాద్

 9. Aruna Gosukonda అభిప్రాయం,

  తేది: August 17, 2007 సమయము: 8:40 am

  ఈ వ్యాఖ్య ఆర్టికల్ కి సంబంధించింది కాదు. మన్నించాలి. ఇందాకే కధలు ఎలా రాయకూడదు అనే మీ వ్యాసము, అనుబంధిత కధ ఐన ఇద్దరు దుర్మార్గులు చదివాను. ఆ కధ కి మీరు రాసిన వ్యాఖ్య చదివాక అభినందించాలి అనే వుత్సుకత ఆపుకోలెక ఇక్కడ ప్రవేశించాను. కధ లో లోపాలని చక్కగ ఎండగట్టారు.

 10. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: August 17, 2007 సమయము: 9:08 am

  అరుణ గారు,
  మీరేదే పొరబడ్డారు. ఇంకోచోట రాయాల్సిన వాఖ్యను ఇక్కడ పొరబాటున రాసినట్లున్నారు. నేను “కథలు ఎలా రాయకూడదు” అన్న వ్యాసమెక్కడా రాయలేదు.

  –ప్రసాద్

 11. రానారె అభిప్రాయం,

  తేది: August 17, 2007 సమయము: 3:54 pm

  అది రాసింది కొత్తపాళి గారు. ఇదిగో దానికి లంకె. అనుసరించండి.
  http://vinnakanna.blogspot.com/2007/04/blog-post_04.html

 12. Aruna Gosukonda అభిప్రాయం,

  తేది: August 18, 2007 సమయము: 10:49 am

  అయ్యయ్యొ. పొరపాటు జరిగింది.
  ఆర్టికల్ రాసింది కొత్తపాళి గారు. వ్యాఖ్యానమ్ రాసింది JUBV Prasad గారు.
  ఒక రోజులో బోలెడన్ని బ్లాగులు చూసి confuse అయ్యాను. Sorry. :)

 13. Aruna Gosukonda అభిప్రాయం,

  తేది: August 19, 2007 సమయము: 11:53 pm

  ఇక్కడ మా అన్నయ్య నిన్న ఒక comment రాసాడు అండి.
  అది post అవ్వలేదు అని ఇన్కొ రెండు సార్లు submit చేసాడు. తీరా చూస్తే అవన్నీspam కింద consider చేసి, వాటి తో పాటు నా comments కూడా తీసేసింది మీ బ్లాగ్. :(

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో