ఎవర్రా బేవకూఫ్ మతాన్ని కించపరిచింది?
ఒరే ఒవైసీ, నీకు గానీ నీకు వంతపాడుతున్న ఆ వానరమూకకుగానీ అసలు బుద్దన్నది వుందా? ఓ మహిళ మీద అదీ విదేశీ మహిళ మీద భౌతికంగా దాడికి దిగి ఆ మతపు ప్రతినిధిగానో లేక ఆ మతావలంబుల ప్రతినిధిగానో చెప్పుకునే సిగ్గులేని XXX నీకు మతి అన్నది వుందా? మీరేమయినా తాలిబాను ప్రతినిధులమనుకుంటున్నారా? లేక లాడెను అనుచరులమనుకుంటున్నారా? ఇది భారతదేశమనుకుంటున్నారా లేక మీరుంటున్నది ఆఫ్ఘనిస్తాన్ పర్వత గుహల్లోనా? మీరు భారత ప్రజాస్వామ్యపు రాజ్యాంగం ప్రకారం ఎన్నికయిన ప్రతినిధులా లేక మీకంటూ మరో సమాంతర రాజ్యాంగం వుందా?
ముందే ఈ మతమంటే రకరకాల అపోహలతో, అర్ధసత్యాలతో వున్న ప్రపంచాన్ని మీ మంచి చూపి ప్రసన్నం చేసుకోవాల్సింది పోనిచ్చి ఇలా ఆటవికంగా ప్రవర్తిస్తే, ఈ మీ ప్రవర్తన మీ మతం ప్రతిష్ట పెంచుతుందా? ఎవర్రా మతాన్ని హేళన చేసింది? నీవు కాదా? నీ అనుచర మూక కాదా? ప్రజలన్నా, ప్రజాస్వామ్యమన్నా, మహిళన్నా నీకు గౌరవముందా? అసలు నీకు నీమతమంటే గౌరవముందా? ఎంత బరితెగింపు ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా వుంటే ఇలా జర్నలిస్టుల ముందూ, కెమెరాల ముందూ ఓ మహిళను అగౌరవపరుస్తావ్?
నీవు ఆమెను చంపడం కాదు ఏ పోలీసో నిన్ను ఎన్‌కౌంటర్ కింద చంపితే నేను సంతోషిస్తాను.
(హమ్మయ్య! ఎదురుగా నిలబడి తిట్టలేకపోయినా, ఇలా తిట్టగలిగిన అవకాశం ఇచ్చిన అంతర్జాల మాయాజాలానికి వందనాలు.)
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








(6 ఓట్లు, సగటు: 5 కు 4.50)
తేది: August 9, 2007 సమయము: 10:38 am
నా కడుపుమంట కాస్త చల్లారినట్టయ్యింది మీ టపా చదివాక. మీ భావాలతో, భాషతో కూడా ఏకీభవిస్తున్నాను.
తేది: August 9, 2007 సమయము: 11:04 am
నాకైతే బట్టలు విప్పి తిరుగుతున్నారనిపిస్తుంది మన నాయకులు.సిగ్గుచేటు
తేది: August 9, 2007 సమయము: 11:53 am
వీళ్ళూ మన లా మేకర్లు – వీళ్ళు రాసే శాసనాలు మనం పాటించాలి. శాసన సభలనించి వెలివేసే పద్ధతి ఏదన్నా ఉండాలి.
తేది: August 9, 2007 సమయము: 3:09 pm
నేను మీతో ఏకీభవిస్తున్నాను. నిజంగా ఇంత సిగ్గు మాలిన పని మన భారత దేసం తల దించుకో వలసిన విషయం.
తేది: August 9, 2007 సమయము: 4:46 pm
బాగా తిట్టారు.వాళ్ళని వీధుల్లో తన్నుకుంటూ తీసుకెళితే బాగుంటుంది.
తేది: August 9, 2007 సమయము: 7:17 pm
ప్రసాద్ గారు,
కూడలి వ్యాఖ్యలు టాబ్ నుండి మీ బ్లాగ్ కి వెళ్ళాలంటే రావటం లేదు. కేవలం బ్లాంక్ పేజి వస్తోంది. నా బ్రౌజర్ లోపమా లేక ఎదైనా పురుగు ఉందా?
తేది: August 10, 2007 సమయము: 1:28 am
మతమౌఢ్యపు నగ్న ప్రదర్శన. barbaric religious act. ప్రసాద్ గారు మీతో నేను గొంతు కలుపుతున్నాను.
తేది: August 10, 2007 సమయము: 5:16 am
ఎవ్రు ఎవరు ఎవరి పట్ల అమానుషంగా ప్రవర్తించినా ఖండించాల్సిందే. ఇందులో మహిళ మగవాడు అనే భేదం చూపించకూడదు.
నాకూ బాధ కలిగింది. కాని మైనారిటీల్ని ఏమీ అనకూడదు కదా ! అది మహాపాపం. వాళ్ళు తస్లీమాని నిజంగా చంపినా మనం వేలెత్తి చూపించడం చాలా తప్పు. రౌరవాది నరకాలకు పోతాం. వీలయితే మైనారిటీల చేతిలో దెబ్బలు తిన్నవాళ్ళని అరెస్టుచేసి జైల్లో పెట్టాలి.
తేది: August 10, 2007 సమయము: 8:42 am
వాఖ్యాతలందరికీ ధన్యవాదములు.
నిజానికి ఇంత కఠినంగా స్పందించడం మానెయ్యాలని హృదయం స్పందించిన వెంటనే టపా రాయకూడదని కొన్నినాళ్ళ క్రితం ప్రతిజ్ఞ చేశా! మ్మ్ కానీ అదే తప్పు(?) మళ్ళీ చేశా. కాలుతున్న వస్తువును అనాలోచితంగా ముట్టుకుంటే ఎలా మనకు తెలియకుండానే “అసంకల్పిత ప్రతీకార చర్య” జరుగుతుందో ఇలాంటి వార్తల విషయంలో అదే జరుగుతుంది.
నేను సైతం,
ఎందుకు పని చేయట్లేదో వీవెన్‌ను అడగాలండి. ఒక్క “అంతరంగం” వాఖ్యల లంకె మాత్రమే సరిగ్గా రావట్లేదు. మరి దాని ఫీడులో లోపముందేమొ కూడా చూడాలి.
తాడేపల్లి గారూ,
మహిళ ప్రకృతిరీత్యాగానీ సమాజ పరిస్థితుల వల్ల గానీ ఇంకా అబలగానే వుంది. అందువల్ల ఆమెకు మనం ఎక్కువ హక్కులు, ప్రత్యేక హోదా ఇవ్వాలనేది నా అభిమతం.
అలాగే మైనారిటీలు కూడానూ. మెజారిటీ తమకున్న అధికత్వంతో మైనారిటీల సమానహోదాను భంగపరిచే అవకాశం వుంది గనుక వాళ్లకు “మెజారిటీ అభీష్టం” ప్రాతిపదికన కాకుండా ప్రాధమిక హక్కులకు రాజ్యాంగ రక్షణ వుండాలి.
అయితే ఇప్పుడు జరుగుతున్నది వాళ్ళ వోటు బ్యాంకు కోసం తాపత్రయం. అదింకో రాజకీయ చర్చలెండి.
అయితే ఇప్పుడు జరిగింది ఓ వర్గపు స్వంత వ్యవహారమో, మత వ్యవహారమో కాదు. ఇది రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన, జీవించే హక్కుల మీద దాడి. ఇలాంటి సంఘటనలను హత్యా నేరం కంటే తీవ్రంగా పరిగణించి తీవ్రశిక్షను అమలు జరపాలి. ఇదే పని సామాన్యుడు చేస్తే క్షమించి వదిలేయవచ్చేమో గానీ రాజ్యాంగ విధివిధానాలు తెలిసి దాని ప్రకారం నడచుకుంటానని ప్రమాణం చేసే ప్రభుద్దులు దానికి విరుద్దంగా వుద్దేశ్యపూర్వకంగా చేసే పనులను ఎట్టి పరిస్థితుల్లో వుపేక్షించకూడదు. మైనారిటీ అయినా మెజారిటీ అయినా వుదాసీనత చూపకూడదు.
–ప్రసాద్
తేది: August 10, 2007 సమయము: 9:28 am
కరక్టుగా రాశారండి. కానీ, ఇలాంటి వాటి వల్లే వాళ్ళ వోట్లు వాళ్ళకు గ్యారంటీ అనుకుంటారు. వీళ్ళని మార్చటం చాలా కష్టసాధ్యమే. అలాగే, మీరు చెప్పిన ఎక్కడో కనపడలేదు.
తేది: August 10, 2007 సమయము: 9:29 am
mIru cheppina config option wordpresslo kanapadaledu.(spam related)
తేది: August 10, 2007 సమయము: 12:23 pm
ప్రసాద్ గారూ, మీ ఆక్రోశం గుండె లోతుల నుండి వెళ్లగక్కారు. నిజంగానే మత మౌఢ్యంతో సగటు మనిషి అని చూడకుండా పైశాశికంగా ప్రవర్తిస్తున్నవ్యక్తులను చూస్తే ఎవరికైనా ఆవేశం వస్తుంది.
-నల్లమోతు శ్రీధర్
తేది: August 11, 2007 సమయము: 12:16 am
ఇప్పుడు మనం అరవకపోతే తప్పవుతుంది, ఆ తరువాత బాధపడాల్సి వస్తుంది, నేరమవుతుంది. ఇది గత మానవ చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం.
తేది: August 11, 2007 సమయము: 12:30 am
నా వ్యాఖ్యలో రెండో గద్య-వాచ్యం కాదు వ్యంగ్యం. కాని దేవుడా ! ఆ వ్యంగ్యాన్నే నిజం చేసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు తస్లీమా మీదనే కేసుపెట్టారట. ఒవైసీ మీద పెట్టడానికి “ప్రయత్నం చేస్తున్నారట.” పేదల భూములు బలవంతంగా లాక్కుని ఆ భూముల యొక్క చట్టబద్ధ యజమానుల మీద కేసులుపెట్టిన చరిత్ర ఉన్న ఈ భస్మాసుర “హస్తం” నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం ఆశించగలం ?
తేది: August 11, 2007 సమయము: 5:31 am
“మహిళ ప్రకృతిరీత్యాగానీ సమాజ పరిస్థితుల వల్ల గానీ ఇంకా అబలగానే వుంది. అందువల్ల ఆమెకు మనం ఎక్కువ హక్కులు, ప్రత్యేక హోదా ఇవ్వాలనేది నా అభిమతం.”
…అలా మేంమీతో సమానం కాదు అని ఒప్పుకుంటే తప్పకుండా వాళ్ళను ప్రత్యేకంగా చూడవచ్చు. (ఎవరు గొప్ప అన్నది కాదు ప్రశ్న..) సమానము కాదు అని తస్లీమా నస్రీన్ లాంటి ఫెమినిష్టులు ఒప్పకుంటే బాగానే ఉంటుంది.. ఆడ, మగ .. ఆపిల్లు, బత్తాయిలని ఈ తలబిరుసు అమ్మలకి ఎప్పుడు అర్ధం అవుతుందో ఏంటో !!!
మైనార్టీలకి ప్రత్యేక అధికారాలివ్వాలనేది చాలా భయంకరమైన ఐడియాలజీ..
డబ్బున్న వాళ్ళు మైనారిటీనే..చట్టాలు చేసే రాజకీయ నాయకులూ మైనారిటీలే, భారత దేశములో బ్రాహ్మణులూ మైనారిటీలే..తోక ఎప్పుడూ కుక్కను ఆడించకూడదు.
తేది: August 11, 2007 సమయము: 7:10 am
మేరేనయం అక్కడ ఉండి వాళ్ళని తిట్టగలిగారు..
మీము తిడదామన్నా మాకు బయం..ఎందుకంటే ఎవడు ఏమీన్నా బరించాల్సిందే..ఈ రెండేళ్ళు..!
ఇక్కడ మీము ఎవడికి చెప్పుకొనె దిక్కులేదు!!
తేది: August 11, 2007 సమయము: 1:49 pm
వీళ్లందరిని వీలయితే దేశంనించి తరిమి కొట్తాలి. కాని ఈ దేశ దుశ్థితి ఏమిటంటే వాళ్లు ఈ రొజు బెయిలు లొ విడుదల అయ్యారు. ఎంత సిగ్గు చేటు కదా.
ప్రణతి
తేది: August 11, 2007 సమయము: 10:34 pm
[...] గారు తమ ట్రేడ్ మార్కు ఆవేశాన్ని ఎవర్రా బేవకూఫ్ మతాన్ని కించ పరిచింది అంటూ [...]
తేది: August 13, 2007 సమయము: 11:51 am
శ్రీధర్ గారూ,
ఈ ఆవేశం కొరగాని ఆవేశం. నాలో నేను ఏడ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ ఆక్రందన!
నాగరాజా గారూ,
నిజమే. మనం గత చరిత్ర నుండీ పాఠాలు నేర్వకపోవడం వల్లనే అదే చరిత్రను మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నాం.
తాడేపల్లి గారూ,
మీరన్న వ్యంగమే నిజమైంది. మన వ్యవస్థది ఎంత సిగ్గులేని బ్రతుకయ్యింది! జేబులో డబ్బు పెట్టుకొని తిరగిన వాడిదే తప్పు గానీ దొంగిలించినవాడిది కాదు. అసహాయంగా, రక్షణలేక వున్న వాడిదే తప్పుగానీ వాడిని హింసించిన వాడిది తప్పు గాదు. మన ప్రభుత్వపు తీరే వేరుగా వుంది.
రవి గారూ,
వాళ్ళు సమానం కాదు అని ఒప్పుకోవాలనడం ఏరకమైన న్యాయం? బలవంతుల మద్య బలహీనుల మద్య అసమతూకం చూపేది ప్రకృతి అయితే సమతూకం చూపేది మనిషి. అదే ప్రకృతితత్వానికీ, మనుషత్వానికీ తేడా!
మైనారిటీకి ప్రత్యేక రక్షణ కాదు అందరికీ వున్న రక్షణే తమకూ న్యాయబద్దంగా వుండేలా అది మెజారిటీ అభిప్రాయం మార్చ వీలు లేనిదిగా వుండాలనేదే నా అభిప్రాయం. ఇక్కడ ఎవరూ కుక్కా కాదు తోకా కాదు.
విజయ్ గారూ,
నిజమే! వాళ్ళ ఎదురుగా నిలబడే స్థైర్యం, ధైర్యం నాకున్నాయా అన్నది అనుమానమే! ఆ లెక్కన చూస్తే ఇంత భయోత్పాతాన్నీ కళ్ళ ముందు చూసికూడా నేను రాస్తూనే వుంటా అని చెప్పగలిగిన ఆమె ఎంత ధైర్యవంతురాలో!
ప్రణతి గారూ (మా నాలుగేళ్ళ అమ్మాయి పేరు ప్రణతి
)
అంతే చట్టం బలవంతుడికి ఇలాగే వూడిగం చేస్తే దాని పర్యవసానం ఎప్పుడో ఒకప్పుడు తీవ్రంగా వుంటుంది.
–ప్రసాద్
తేది: September 16, 2007 సమయము: 4:28 am
తిడితె తిట్టారుకానీ ఎ ఆంధ్రా లొనొ ఇంకా ఎ కడప లొనొ తిట్టమాకండి అలా చెశారొ తన్నులు కెసులు తప్పవు మరి, మొన్న ఆ మద్య కడప నగరాజు పెటలొవుండె మంగలి షపులొ ఎదొ చర్చా గొస్టిలొ ఆ మంగలి ఆ ఈ కాంగ్రెసు వాల్లు ఎమి చెసారులె అన్నడంట అంతె 1 గంట లొ షాపు మొత్తము ద్వంసం, వల్లు హునం , ఆ పైనా పొలిసు కెసు భారం. అది విస్యం సొ కొంచం చూసుకొని మాట్లాడండి.
పొని ఎమైనా పీకారా అంటె అది లెదు. ఎముంది అంటె దుమ్ము(గత ముడెల్లుగా ఒక్క పని 20% కుడా పుర్తి కాలెదు వున్నవాటిని కులగొట్టి జనాలను ఎడిపిస్తావున్నారు), డెంగి, గన్యా, ఇంకా కల్ల కలకా ఇలా పెద లిస్టె చెప్పొచ్హులె.
దిలీప్.
తేది: November 24, 2009 సమయము: 4:25 am
ఇంత చెసినా ఆ నా xxx లను మన చెతగాని ప్రబుత్వం ఎమి xxx లెక పొయింది