“రానారె” కథ తెచ్చిన స్మృతి

తేది: August 7, 2007 వర్గం: అనుభవాలు రచన: dileep 716 views

ఏమి చెప్పావుబ్బా భలే చెప్పావు. ఈ కథకు కథలోని పాత్రకు నా నిజ జీవితంలోని సంఘటనకు చాలా దగ్గరి సంబంధం వుండాది. ఇది చదివినంత సేపు నాకు మావాడే కళ్లల్లో కనిపించాడు. మాకు చాలా ఆవులు వుండేవి. వాటికి పుట్టిన వాటిని నాటు గిత్తలు అనేవారు. వాటికంటె దేశపు ఎద్దులు బాగా నాజుకుగా వుంటాయి. పనికూడా బాగ హుషారుగా చేస్తాయి. అందుకని మా నాన్న ఒక కాడి దేశపు ఎద్దులు, ఒక కాడి నాటు గిత్తలు(మా ఆవుల సంతానం) పెట్టేవాడు. దేశపు ఎద్దులు హోదాకు, అంతస్తుకు గుర్తు కూడా. అందుకే వీటి వ్యాపారము చేసే వాల్లు మా పక్క ఊరు నీలకంఠరావు పేటకు ఈ దేశపు దూడలను తెచ్చి అమ్మేవారు. మా అమ్మ, నాన్న కూడా ఉదయాన్నే కూరగాయలు అమ్మడానికో, పాలు పోయడానికో ఆ ఊరికి వెళ్ళేవారు. అక్కడ మావాడి అందం, చక్కటి కాళ్ళు, తీర్చి దిద్దినట్టున్న వాడైన కొమ్ములు, నిగనిగలాడే రంగు, ఈగవాలితే జారిపోయే నవనవ శరీరం చూసి నచ్చి తీసుకొచ్చారు. మావాడు అన్నిటితో పాటే చాలా తెలివైన వాడు మరియు చలాకీ గాడు. మా ఇంటికొచ్చిన కొన్ని రోజుల్లోనే మాతో బాగా కలిసి పోయాడు. వీడిని ఇంటిల్లిపాదీ చిన్న పిల్లవాడిలా చూసుకొనే వాళ్ళు, అన్ని ఆవులున్నా వాటితోపాటు మందలో తోలేవాళ్ళు కాదు. వీడిని ఒక్కడినే మా అమ్మ దూడలకు గడ్డి తేవడానికి మా గదగుండ్లబావి దగ్గరికి వెళ్ళేటపుడు వీడిని కుడా వెంట తీసుకెళ్ళి మేపుకొచ్చేది. అలా అల్లారు ముద్దుగా పెంచాం వీడిని. వీడిని మా గదగుండ్లబావి పొలం దగ్గరికి తీసుకొని పోవడానికి పగ్గము అవసరము కూడా లేదు. బుద్దిగా మా వెనకాలే వచ్చేవాడు. నాక్కూడా తెగ నచ్చాడు. నన్ను చూస్తే అలా మోర పైకి ఎత్తుకొని దగ్గరికి వచ్చేవాడు. ఎందుకంటె మెడ కింద గంగడోలు నిమిరించుకోవడము చాలా ఇష్టం వాడికి. అలా నాకు మంచి దోస్తు అయిపోయాడు.

నేను కూడా అల్లరే, చదువు అంతగా ఎక్కేది కాదు. పొలం దగ్గరకు వెళ్ళడము మహా ఇష్టంగా వుండేది. అందులోనూ ఆ మధ్యే మా లెక్కల టీచరును తిట్టానని మా నాన్న చెవిలో పడింది. నేను అసలు తిట్టలేదండి. మా టిచరు రెండు మూడు గైడులు ముందరేసుకొని బోర్డుపైన అన్ని విధాల సమాదానాలు వేసేవాడు. అందులో ఆ రోజు ఏదో తికమక పడ్డాడు. అందుకే మార్చి మార్చి సమాధానాలు చెప్పాడు. నేను నాకెందుకులే అని గమ్మునుండక, నా పక్క వాడితో “ఈ గుడ్డి సారుకు కనిపించి సావట్లేదు. అందుకే మార్చి మార్చి సమాధానాలు చెపుతున్నాడు.” అన్నా అంతే. ఇక వాడు బుద్దిమంతుడిలా చేతులు కట్టుకొని నేను అన్నమాటలు టీచరుకు చెప్పేశాడు. ఇంకేముంది నాకు వీపు విమానం మోత మోగింది. విషయం ఇంటిదాక పాకింది. ఇక లాభం లేదని చదువు మానిపించారు.

అప్పుడు మావాడు మంచి రంజుమీదున్నాడు. ఆ నడక, ఆ ధీమా, “సొగసు చూడ తరమా” అన్నట్లుండేవాడు. ఎకరం పొలం ఇరసాలు ఏమిటి నాలుగు సాల్లు ముల్లు కర్ర లేకుండానే దున్నెయ్యనా అన్నట్లుండేవాడు. ఇంకా అప్పటికే మాఇంట్లో ఒక పెద్ద బొజ్జతో ఓ పెద్దాయన, ఆ పెద్దాయనకు జతగా ఒక చీమిడాయన వుండేవారు. వీళ్ళను మా పెద్దవదిన వాల్లు మాకు ఇచ్చారు. ఆరోజు విత్తనాలు వేస్తా వున్నారు. ఈ చీమిడాయనకు కొంచం కంగారెక్కువ. ఆ కాంగారును సరిచేద్దామని మా పెద్దన్న ఒకదెబ్బ వేశాడు. ఆయనకు కంగారు ఇంకా పెరిగి పోయింది. అది ముందే రాళ్ళచేను. మడక(నాగలి) ఓ రాయికి గుచ్చుకొని విరిగిపోయింది. పని ఆగిపోయెనే అన్న బాధలో మా అమ్మ అన్నను కేకలేసింది. అన్నకు కోపం వచ్చి పని వదిలేసి వెళ్ళిపోయాడు.

పని ఎక్కువ అవడంతో మన కథానాయకుడికి తోడు ఒక తెల్లదొరగాడిని జతగా తెచ్చారు. వీడు కూడా మంచి ఆరు అడుగుల అందగాడే. ఒకరికి ఒకరు పోటీనా అన్నట్లుండేవారు. నాకు వీళ్ళంటే అలివిమాలిన యిష్టం. ఆ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి. మావాడికి, ఈతెల్లదొరగాడికి, నాకు బాగా షాడకేసే పని వచ్చి పడింది. మా నాన్న ఓ మాదిరి దుక్కి ఒప్పుకోడు. బాగా దుక్కి పట్టాలంటాడు. అందుకని ఒక నెల రోజులు రోజూ బుడదలో దున్నాల్సి వచ్చింది వరిమడికోసం. మొత్తానికి వరినాట్లు వేసే పని అయితే అయింది కానీ మా వాడికి మెత్తగాళ్ళు పడ్డాయి. మామూలుగా అలా బురదలో దున్నే పని వుంటే ముందే కాళ్ళకు లాలాలు(నాడాలు) కొట్టించాలి. అవి కొట్టించకపోవడంతో కాళ్ళు బురదలో నాని గిట్టలు కోసుకుపోయి చిగుర్లు బయట పడతాయి. ఇలా అయినప్పుడు అవి నడవలేవు. నా దోస్తులిద్దరికీ ఇలా కాళ్ళు మెత్తబడ్డాయి. ఇద్దరు నడవలేక పోతున్నారు. నాకు చాలా బాధేసింది. సరే అని ఎవరికి చెప్పకుండా నాదగ్గర వున్న డబ్బులతో మా వూరికొచ్చిన లాలాలు కొట్టే సాయిబు దగ్గరికి లాలాలు కొట్టించడానికి తీసుకెళ్ళాను. మా అమ్మ ఓవైపు చెబుతూనే వుంది, “వాటికి లాలాలు కొట్టాలంటే బలవంతంగా పడుకోబెట్టాలి, కింద పడేసేప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి. వద్దురా నాయనా” అని. కాని నాకు అప్పుడు మా అమ్మ చెప్పేదానికంటె, నాకు వాటిమీద ఉన్న ప్రేమతో, అవి నడవలేకపోతుండడాన్ని చూసి, లేదు ఎలాగయిన కొట్టించాలని తీసుకెళ్ళాను. మనవాడేమొ బుద్దిగా లాలాలు కొట్టించుకున్నాడు. కానీ తెల్లదొరగారికి కొంచం బెదురు ఎక్కువ. ఎంత నచ్చజెప్పినా పడుకోలేదు. లాలాల సాయిబు, మావూరి వేమయ్య ఇద్దరు కలిసి కాళ్ళకు వొడుపుగా తాడేసి లాగి బలవంతంగా పడుకోబెట్టారు. లాలాలు కొట్టారు. పైకి లేపితే లేచి మూడు కాళ్ళపైనే నిల్చున్నాడు. ఏమయిందో నాకు తెలియలేదు. ఏమయివుంటుందా అని విచారిస్తూనే ఇంటికి తీసుకొచ్చాను. అందరూ పైకి ఎగబెట్టుకొని వున్న కాలు చూసి “కాలు బెడిసింది” అన్నారు. మా రామయ్య పెదనాయన ఎవేవో పసుర్లు పూశాడు, ఎన్నెన్నో రకాల కట్లు కట్టారు. ఎన్ని చేసినా ఎత్తిన కాలు దించలేదు. ఇక లాభం లేదని ఎవరో చెప్పిన సలహాతో కాలిపై వాతలు పెట్టారు. అయినా ఆ కాలు మళ్ళీ భూమిపై ఆనించి నడవలేక పోయాడు. అందరూ వీడిని కుంటోడు అనడం మొదలు పెట్టారు. కాడికి పనికిరాలేదు. కాడిని విడదీశారు. మా వాడిని అమ్మేశారు ఎవరికో. నాకిప్పటికీ వాళ్ళు కళ్ళముందున్నట్లే వుంటుంది.

చాలా రోజులు నావల్లనే కదా వాడికి కాలు విరిగింది అన్న బాధ తొలిచేసేది. నాకిప్పటికి వచ్చిన కలల్లో ఇవే ఎక్కువగా కనిపించేవి. మళ్ళీ మీ కథ నా దోస్తులను జ్ఞప్తికి తెచ్చి, కళ్ళల్లో నీళ్ళు నింపింది.

–దిలీప్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'“రానారె” కథ తెచ్చిన స్మృతి' పై 6 అభిప్రాయాలు

'“రానారె” కథ తెచ్చిన స్మృతి'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. radhika అభిప్రాయం,

    తేది: August 7, 2007 సమయము: 10:12 am

    ప్రసాదు గారూ ఈ –దిలీప్ ఎవరండి?కధ చాలా బాగుంది.

  2. కొత్తపాళీ అభిప్రాయం,

    తేది: August 7, 2007 సమయము: 11:49 am

    touching!

  3. రానారె అభిప్రాయం,

    తేది: August 7, 2007 సమయము: 12:02 pm

    ఇది కథ కాదు రాధికగారూ!
    దిలీప్‌గారూ, ఈ గొడ్లు, పెంపుడుకుక్కలమీద మర్లు పెంచుకుంటే కడాకు మిగిలేది ఇట్లాంటి బాధలే. కానీ పెంచుకోకుండా ఉండలేము. నాలాలు కొట్టించేటప్పుడు ఎద్దుల కాళ్లకు పగ్గాలేసి దభీమని పక్కకు పడేయడం చూస్తే నేను ఇప్పటికీ తట్టుకోలేను. ఇంకోటేమంటే ఆ నాలాలు కొట్టేవానికి కొంచెం కనికరం లేకపోయినా అనుభవం లేకపోయినా చీలలు చిగుళ్లలోకి దిగ్గొట్టి పాపం ఆ మూగజీవాలకు నరకం చూపిస్తాడు. ఇంతకూ కాలు దెబ్బతిన్న ఎద్దును అమ్మింది కటిక్కేనా?

  4. ప్రసాద్ అభిప్రాయం,

    తేది: August 7, 2007 సమయము: 12:28 pm

    రాధిక గారూ,
    ఇది కథ కాదు. జరిగిన వాస్తవం.
    దిలీప్ నా తమ్ముడు. హైస్కూల్లో తను చదువుతుండిన రోజుల్లో మూడేళ్ళు బడి ఎగ్గొట్టి పగ్గం పట్టాడు. అప్పుడు జరిగిన కథ కాని కథ ఇది.

    రానారె,
    ఆ విషయం చెప్పలేక దాటవేశాడు దిలీపు. నాకు అంతే జరిగిందని సూచాయిగా తెలుసు. అదే కాదు మాకున్న ఆవులన్నీ చివరికి అదే బాట పట్టాయి. కడుపు తరుక్కుపోయే నిజమది.

    –ప్రసాద్

  5. దిలీప్ అభిప్రాయం,

    తేది: August 7, 2007 సమయము: 1:45 pm

    ఆ కాలు దెబ్బతిన్నదాన్ని మా రామయ్య పెదనాన్నకు ఇచ్హారు అయనకు జంతువులు అంటె చాలా ప్రెమ. ఇక కాలు బాగ అవకపొయె సరికి ఇంకా ప్రయత్నిద్దాం అని తనతొ పాటు తీసుకెల్లాడు పసుర్లు పుసి ఎమి ఎమొ తన విద్యలన్ని ప్రయత్నిచి చూసాడు లాభం లెకపొయింది.

    వ్యవసాయం ఎంత కస్టంతొ కుడుకున్న పనొ తెలెసింది ఆ చదువు మానిన ముడు సవస్తరాల్లొ, ఇంక మల్లి బడి బాట పట్టాను, తనని ఎవరికొ అమ్మెసారు అని తెలిసింది ఎక్కడికెల్లాయొ ఎమొ తెలియదు.. :(

    దిలీప్.

  6. prakash అభిప్రాయం,

    తేది: March 4, 2010 సమయము: 3:55 am

    అన్నయ్య.. ఏర్ పోర్ట్ అనుభవం సాచ్చిలో రాసుకుంటా.. ఒకసారి మీతో మాట్లాడాలి.. ఈ నెంబరుకు ఫోన్ కొట్టు.. 99482 99593

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో