కాలేజీ రోజుల్లో…

తేది: July 26, 2007 వర్గం: అనుభవాలు రచన: చరసాల 2,645 views

భీమవరంలో డిగ్రీ చదువుతున్న రోజులు. కాలేజీకి కొద్ది దూరంలోనే మా హాస్టలు వుండేది. ఆరోజు బహుశా సెలవు రోజో లేక కాలేజి ఎగ్గొట్టి రూములో బజ్జున్నానో తెలియదు కానీ ఓ అబ్బాయి వచ్చి “ఎవరో కడప వాళ్ళంట… మీ కోసం వచ్చారు” అని చెప్పాడు. నా కోసం ఎవరబ్బా అని కాస్తా ఆశ్చర్యంతో కిందికి వచ్చాను. అక్కడ నడివయసులో వున్న ఓ పెద్దాయన, ఆయన భార్య, ఓ పది పన్నెండేళ్ళ కూతురు వున్నారు.

వాళ్ళను ఎక్కాడా చూసిన గుర్తు లేదు. అయినా ప్రయత్నించాను గుర్తు తెచ్చుకుందామని. వుహూ. జ్ఞప్తికి రాలేదు. చూసివుంటే కదా వచ్చేది. ఎవరికోసం చూస్తున్నారని అడిగితే ఏదో రెడ్డి పేరు చెప్పారు. అలాంటి పేరున్న కడప వ్యక్తి ఎవరూ నాకు తెలిసి మా హాస్టల్లో గానీ మా కాలేజీలో గానీ లేరు. చూస్తూ వుంటే మంచీ మర్యాదా తెలిసిన వాళ్ళలా వున్నారు. వాళ్ళది కడప అన్నారు, నాదీ కడపే అని తెలుసును గావున ఇక వాళ్ళ భాద్యత నీదే అన్నట్లు అక్కడ గుమికూడిన వాళ్ళంతా వాళ్ళవాళ్ళ గదులకు వెళ్ళిపోయారు. సరే ఇక అక్కడే నించోబెట్టి మాట్లాడటం సభ్యత కాదని, “సరే రండి నా రూముకు వెళదాం” అని వాళ్ళను నా గదికి తీసుకొచ్చి కూర్చోబెట్టాను.

ఏమిటి కథ అని విచారిస్తే ఆమె చెప్పబోతోంది, ఆయన “వద్దు వద్దు చెప్పకు” అని అడ్డుపడుతున్నాడు. “ఫర్వాలేదు చెప్పండి. నేను చేయగలిగే సహాయం వుంటే చేస్తాను” అన్నాను. ఆప్పుడు ఆమె ఇలా చెప్పింది. “మేముండేది తిరుపతిలో. మా అమ్మగారి వూరు కడప. మేము అన్నవరానికి మొక్కు తీర్చుకుందామని బయలు దేరాం. రాత్రి నిద్రపోతుంటే మా బ్యాగులు ఎవరో దొంగిలించారు. మా దగ్గర ఇక నయాపైసా లేదు. ఇక అన్నవరం వెళ్ళడం ఎందుకని మాకు తెలిసిన అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు కదా అతన్ని ప్రయాణ చార్జీలకు డబ్బులడిగి ఇంటికెళదాం అని ఇక్కడ దిగాము.” అని కొద్దిగా ముక్కు చీదుతూ చెప్పింది. ఆయన మాత్రం ఆ మాటలు నేను చెప్పలేను అన్నట్లు ఎంతో అవమానపడుతున్నట్లు చూపులు నేలమీదికి చేర్చి కూర్చున్నాడు.

అదీ సంగతి. ఇక నేను చేయాల్సింది ఎలాగోలా వాళ్ళకు తిరుపతి వరకూ అయ్యే ప్రయాణ చార్జీలు ఇవ్వడం. ఇచ్చేముందు వాళ్ళు చెప్పేది నిజమో కాదో ఎలా తేల్చుకోవడం అనిపించి మరీ వాళ్ళను అనుమానపడుతున్నట్లుగా వుండకుండా కడపలో వాళ్ళు ఏ వీధిలో వుండేవాళ్ళు లాంటి ప్రశ్నలు కొన్ని వేశాను. అన్నిటికీ ఆమె సంతృప్తిగా జవాబులు చెప్పింది. వాళ్ళతో పాటు తెచ్చుకున్న మిగతా సామాను ఎక్కడ పెట్టారని అడిగాను. సామాను రల్వే స్టేషను దగ్గరలో ఓ టీ కొట్టు దగ్గర పెట్టి వచ్చాం అన్నారు. వాళ్ళ మానాన వాళ్ళని వదిలి పెడదామా అంటే వాల్లతోబాటు ఓ పిల్ల కూడా వుందే! వాళ్ళకు తెలిసిన ఆ అబ్బాయి ఏమి చదువుతున్నాడో కూడా తెలియదు. వాళ్ళకు తను ఏ కాలేజీలో వున్నాడో కూడా స్పష్టంగా తెలియదు. సరే ఇక బాద్యత నా భుజాన్నే వేసుకుందామనుకున్నాను. అయితే వాళ్ళిద్దరికీ మరియు ఆ అమ్మాయికి ముగ్గురికీ కలిసి కనీసం 700 రూపాయలు కావాలని లెక్క తేలింది. కానీ నా దగ్గర అంతా కలిపి నాలుగు వందల లోపే వున్నాయి. ఇక మిగిలిన డబ్బు సర్దడానికి మితృలవద్దకు బయలు దేరాను. నా రూమ్‌మేట్స్ ఇద్దరు చెరి వందా ఇచ్చారు. ఇంకో చోట యాబై మరో చోట మరికొంత అలా మొత్తం 700 రూపాయలు మధ్యాహ్నానికల్లా పోగు చేశాను.

ఆ సమయంలో రైలేదీ లేదు గనుక బస్సులో పంపాలని పథకం. హాస్టలు నుండీ బస్టాండు కనీసం నాలుగు మైళ్ళు వుంటుందేమొ! మద్యలో ఓ మెస్సులో భోజనం చేపించి ఆటో తీసుకొని బయలుదేరాం. తీరా ఆటోని మద్యలో ఓ లాడ్జి దగ్గర ఆపమన్నారు. ఎందుకంటే అక్కడ తమ సామను వుందన్నారు. వాళ్ళకు సహాయం చేయడానికి (సామాను మోయడానికి) నేనూ లోనికెల్లాను. తీరా సామాను కౌంటరు దగ్గర లేదు. డబుల్ బెడ్ రూములో వుంది. అంటే వాళ్ళు అక్కడ లాడ్జిలో డబుల్ బెడ్ రూము అద్దెకు తీసుకున్నారు. రూమును అద్దెకు తీసుకోగలిగిన వాళ్ళ దగ్గర 700 రూపాయలు తిరిగి వెళ్ళడానికి లేవా?!!! అని సందేహమొచ్చింది. అయినా నా సందేహాన్ని బయట పెట్టడానికి అసమర్థతో, సభ్యతో, మొహమాటమో అడ్డం వచ్చింది. ఏమీ మాట్లాడకుండా ఆటోలో సామాను సర్దుకొని బస్టాండుకు వెళ్ళాం. అక్కడ తిరుపతికి బస్సు సిద్దంగా వుంది. మొదటినుండీ వాళ్ళు నా డబ్బును నాకు తిరిగి పంపిస్తామని చెబుతూనే వున్నారు. వాళ్ళ అడ్రసు నా ఆటోగ్రాఫ్ పుస్తకంలో రాసి నా అడ్రసు రాసుకున్నారు. ఇంటికి వెళ్ళగానే నా డబ్బు నాకు పంపిస్తామని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి సెలవు తీసుకొని బస్సెక్కారు.

బస్సు కదిలాక జేబులు చూస్తే కనీసం ఓ సోడా తాగడానికి కూడా డబ్బులు లేవు. ఆ ఎండలో నాలుగు మైళ్ళూ కాళ్ళీడ్చుకుంటూ నడిచి వచ్చాను. వస్తూ వస్తూ ఎంత ఆలోచించినా వాళ్ళు లాడ్జిలో రూము తీసుకొని దిగడాన్ని జీర్ణించుకోలేక పోయాను. ఇందులో మోసం వుండొచ్చేమొ అనుకున్నాను. వాళ్ళు తిరిగి డబ్బు పంపిస్తే నా అనుమానం తీరిపోతుంది కదా అనుకున్నాను. నాకు డబ్బు ఎన్ని రోజులు ఎదురు చూసినా తిరిగి రాలేదు. చివరికి తిరుపతిలో వున్న నా స్నేహితున్ని వాళ్ళిచ్చిన అడ్రసుకు వెళ్ళి రమ్మన్నాను. అక్కడ ఆ అడ్రసు లేదని చెప్పాడు. నాకు డబ్బులు తిరిగి రాలేదు కదా అని నాకు అప్పిచ్చిన నా రూమ్‌మేట్స్ వాళ్ళ డబ్బు తిరిగి ఇవ్వబోతే తీసుకోలేదు.

నా ఆటోగ్రాఫ్ పుస్తకం ఎప్పుడు చూసినా వాళ్ళ మోసం(?) గుర్తుకు వచ్చేది.

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 ఓట్లు, సగటు: 5 కు 3.67)
Loading ... Loading ...

'కాలేజీ రోజుల్లో…' పై 11 అభిప్రాయాలు

'కాలేజీ రోజుల్లో…'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. Phani అభిప్రాయం,

  తేది: July 26, 2007 సమయము: 9:13 am

  ఈమధ్య ఇలాంటివాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎవరు నిజం చెబుతున్నారో ఎవరిది అబద్ధమో తెలుసుకోలేని దుస్థితి.

 2. Phani అభిప్రాయం,

  తేది: July 26, 2007 సమయము: 9:22 am

  మా పూనాలో అయితే ఒక ఆడ, ఒక మగ చంకలో ఒక పిల్ల/పిల్లాడితో జట్లు జట్లు గా వీధులు తిరుగుతూ కాస్త మెతగ్గా కనబడ్డవాళ్ళకు టెండరు పెట్టటానికి ప్రయత్నిస్తూ వుంటారు. బండి మీద వెళ్ళేవాళ్ళని కూడా ఏదొ పని వున్నట్టు ఆపిమరీ సోది మొదలెడతారు. మొదట్లో నేనుకూడా పొరబడ్డప్పటికీ, ఒకేవ్యక్తి రెండు మూడుసార్లు వేరువేరుచోట్ల కనబడేటప్పటికి విషయం అర్థమయ్యింది.

 3. radhika అభిప్రాయం,

  తేది: July 26, 2007 సమయము: 4:59 pm

  నేను మోసపోయానా?-3 అని పెట్టి వుండాల్సింది.మాకూ ఇలాంటి అనుభవమే జరిగింది.మా కాలేజీ వాళ్ళ అందరి ఎంసెట్ అప్లికేషన్లు ఏవో కారణాల వల్ల తిరిగొచ్చేస్తే కాకినాడవెల్లి మేమే దగ్గరుండి సబ్మిట్ చేసి బస్స్టాండ్ లో కూర్చున్న మా దగ్గరకి ఒక అమ్మాయి వచ్చింది.తనది రావుల పాలెమని కాకినాడలో బేంక్ లో పనిచేస్తున్నానని బస్తండ్ కి వచ్చాకా ఆమె హేండ్ బేగ్ ఎవరో దొంగిలించారని చెప్పి పని ఒత్తిడిలో మధ్యాహ్నం నుండి భోజనం కూడా చెయ్యలేదని మాదగ్గర 250 రూపాయలు[ఇంటర్ లో మాకది చాలా పెద్ద అమౌంట్] తీసుకుని డబ్బులు వడ్డీ తో సహా పంపేస్తానని మా అడ్రస్సులు రాసుకుని సఖి సినిమా స్టోరీని తన నిజ జీవిత కధలాగా చెప్పి[అంతకు 3 రోజుల క్రితమే ఆ సినిమా రిలీజ్ అయింది] మమ్మలిని ఎదవల్ని చేసి పోయింది.ఆ డబ్బులగురించి ఇంట్లో వాళ్లకి మేము ఒక్కొక్కళ్ళం ఒక్కో సినిమా స్టోరి చెప్పి నమ్మించేసరికి తల ప్రాణం తోక కి వచ్చింది.

 4. రానారె అభిప్రాయం,

  తేది: July 29, 2007 సమయము: 5:37 pm

  “వాళ్ళది కడప అన్నారు, నాదీ కడపే అని తెలుసును గావున ఇక వాళ్ళ భాద్యత నీదే అన్నట్లు అక్కడ గుమికూడిన వాళ్ళంతా వాళ్ళవాళ్ళ గదులకు వెళ్ళిపోయారు.” పరిస్థితిని కళ్లక్కట్టే మాటలు. చెబితే మీకు కోపం వస్తుందేమోగానీ, రాధికగారి వ్యాఖ్యచూసి నాకు నవ్వాగలేదు. ఆత్మాభిమానం, అవమానం, దుఃఖం లాంటి రసాలను అద్భుతంగా పలికించిన ఆ నటీనటులకు భగవంతుడు ఏదైనా మంచిదారి చూపించాలని కోరుకోవడం తప్ప ఇంకేం చెయ్యలేం. మంచితనాన్ని తెలివిమాలినతనమేమో అని మనకే అనుమానం కలిగేలాచేసే చేసే ఇలాంటి అనుభవాలు ఏదోఒక సందర్భంలో అందరికీ ఎదురయే ఉంటాయేమో.

 5. రానారె అభిప్రాయం,

  తేది: July 29, 2007 సమయము: 5:39 pm

  మీ బ్లాగు RSS ఫీడు కావాలి. ఎలా?

 6. రానారె అభిప్రాయం,

  తేది: July 29, 2007 సమయము: 5:43 pm

  తెలిసింది తెలిసింది. RSS feed URL దొరికింది.

 7. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: July 30, 2007 సమయము: 1:48 pm

  మీ వాఖ్యలకు కృతజ్ఞతలు.
  రాధిక గారూ, మీకొచ్చినఆలోచనే నాకూ వచ్చింది. మోసపోయానా-3 అని పెడదామనే అనుకున్నా. ఎందుకో ఇదొక కాలేజీ జ్నాపకం అనిపించి, మరియు ఇలా సీరియల్లా మోసపోయిన కథనాలు చదివి నన్నెక్కడ చవట దద్దమ్మ అనుకుంటారో అని కూడా భయపడి అలా పేరు పెట్టా! :)

  రానారె,
  మీక్కావలిసిన ఫీడు లంకె దొర్కినందులకు సంతోషం. ఇంకొకరికి ఇలాంటి కష్టం లేకుండా RSS లంకెను చేరుస్తా!
  –ప్రసాద్

 8. రానారె అభిప్రాయం,

  తేది: July 31, 2007 సమయము: 4:40 am

  వ్యాఖ్యల ఫీడుకు లంకె?

 9. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: August 1, 2007 సమయము: 10:11 am

  రానారె,
  ఫీడు ఎక్కడుంది అనే వెతికే బాధ లేకుండా అన్నిరాకాల ఫీడు లంకెలని సైడుబారుకి చేర్చా!

  అన్ని పోస్టుల మీదా కామెంట్సుకి ఫీడు http://www.charasala.com/blog/?feed=comments-rss2
  ఏదైనా ఒక పోస్టుకి ఫీడు http://www.charasala.com/blog/?feed=rss2&p=xxx, “xxx” పోస్టు సంఖ్య.

  –ప్రసాద్

 10. నవీన్ గార్ల అభిప్రాయం,

  తేది: August 2, 2007 సమయము: 2:07 am

  ప్రసాద్ గారు …ఇంతకు ముందు “ఏదో ఉండబట్టలేక వ్రాస్తున్నా” టపాలో నేనిలాంటి వాళ్ళ గురించే చెప్పింది. నా వద్ద ఇలాంటి వాళ్ళు వస్తే…మొదట వాళ్ళను పోలీసు స్టేషనుకు తీసుకెడతా. వాళ్ళ చేత కంప్లయింటు ఇప్పించి….అనక సహాయం సంగతి ఆలోచిస్తా. ఈ పద్దతి నాకు భలే పని చేస్తోంది. పదండి పోలీసు దగ్గరకెడదాం అంటే….జనాలు పరుగో పరుగు.

 11. sravankumar అభిప్రాయం,

  తేది: November 3, 2008 సమయము: 12:58 am

  HA HA HA HA SAME HAPPEND TO ME BUT STILL M UNHAPPY BCOZ INSTEAD OF GIVING MONEY TO THESE PEOPLE WE CAN GIVE IT TO REALLY POOR PEOPLE ANYWAYS HATSOFF TO THEIR INTELLIGENCE AND CHEERS TO OUR KIND HEART…MR.prasad nice to see you in tomakeadifference group …..u r blog is really rocking….sorry for typing in english

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో