నార్త్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్సా?

తేది: July 17, 2007 వర్గం: నా ఏడుపు రచన: చరసాల 1,968 views

నేను “The Indian Express” North Amrican Edition తెప్పిస్తాను. ఆఫీసులో కూర్చొని అన్నీ చూడటం కుదరదు కదా అందులోనూ ఇది అమెరికాలో భారతీయుల విషయాలను బాగా చూపిస్తుంది అనే వుద్దేశ్యంతో రైలులో చదువుకోవచ్చు కదా అని దీనిని రెండేళ్ళుగా తెప్పిస్తున్నా. దేసీలకే ప్రత్యేకమైన బోలెడన్ని వ్యాసాలు వుంటాయి. మొన్న తానా సమావేశాలు జరిగాక వాటిమీద తప్పక ఓ వ్యాసం లేదా వార్తా విశేషం వస్తుందని ఆశించాను. కానీ ఇప్పటికి రెండు వారాల పత్రిక వచ్చింది కానీ ఎక్కడా తానా అన్న నాలుగక్షరాలు కనపడలేదు. ఫోటోల విభాగంలో ఓ చోట క్లింటన్, బాబు ప్రసంగిస్తున్న ఫోటో ఇంకా మరికొన్ని ఫోటోలయితే వున్నాయి గానీ కనీసం ఆ సందర్బంగా ఓ చిన్న వ్యాసమైనా లేక పోవడం నన్ను భలే ఆశ్చర్యపరిచింది.
తెలుగు వాళ్ళకు సంబందించిన ఇంత పెద్ద విశేషాన్ని పట్టించుకోలేదంటే ఇది ఇండియన్ ఎక్స్‌ప్రెస్సా లేక నార్త్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్సా? ఒక నార్త్ ఇండియా విశేషాలే చెప్పే పక్షమైతే దీన్ని నేనెందుకు తెప్పించాలి. దానికి ఈ సంవత్సరంతో వీడ్కోలు చెబుతున్నా. తెలుగు వాడి గురించి చెప్పని పత్రికకు తెలుగు వాడి చందా మాత్రం ఎందుకు?

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'నార్త్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్సా?' పై 6 అభిప్రాయాలు

'నార్త్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్సా?'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. వెంకట రమణ అభిప్రాయం,

  తేది: July 17, 2007 సమయము: 11:10 pm

  మంచి నిర్ణయం. మానేసేటప్పుడు మీరు ఎందుకు మానేస్తున్నారో ఆ పత్రిక వాడికి చెప్పిమరీ మానేయండి, దానివల్లనయినా వాడికి కొంచం బుద్ది రావచ్చు.

 2. chavakiran అభిప్రాయం,

  తేది: July 18, 2007 సమయము: 4:33 am

  అవును
  ఇక్కడ మా పరిస్తితీ లాగే ఉన్నది
  ఒక పేపరేమో తమిళ వాసన, మరొకటేమో నార్త్ సొల్లు

 3. చరసాల అభిప్రాయం,

  తేది: July 18, 2007 సమయము: 7:59 am

  తప్పకుండా చెప్పే మానేస్తా!

  –ప్రసాద్


 4. తేది: July 18, 2007 సమయము: 10:30 am

  అక్కడ ఈనాడు రాదా ?

  అయినా ఇప్పుడు అన్ని పేపర్లూ అంతో ఇంతో అలాగే ఏడ్చాయి లేండి.

 5. రాకేశ్వర అభిప్రాయం,

  తేది: July 18, 2007 సమయము: 12:21 pm

  అవును చెప్పి మానండి.

 6. చందు సాంబశివరావు అభిప్రాయం,

  తేది: July 18, 2007 సమయము: 7:59 pm

  మీ నిర్ణయం అభినందనీయం.
  ఈ పత్రికే కాదు, ఉత్తర అమెరికాలో మనకు దొరికే మన ప్రచురణలు చాలావరకు ఇలానే ఉండటం దురదృష్ట కరం. ఎక్కువ ప్రచురనలలో ‘మూవీ’ ల గొడవ తప్ప వేరే విషయాలకే మాత్రం ప్రాధన్యత ఇవ్వరు.
  ఈ నేపధ్యంలో, పనికిరాని అచ్చు ప్రచురణలకు తెలిసిరావాలి అంటే, బ్లాగు ల్లాంటి క్రొత్త మాధ్యామాల్ని ఉపయోగించుకోవలసిన అవుసరం ఎంతయినా ఉందని నా అభిప్రాయము.

  -చందు

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో