పౌరసత్వ విధేయత

తేది: July 17, 2007 వర్గం: నా ఏడుపు రచన: చరసాల 3,989 views

2008 లో మాకు అమెరికా పౌరసత్వం పొందడానికి మాకు అర్హత వస్తుంది. మా ఇద్దరు పిల్లలూ జన్మతః అమెరికా పౌరులే. అయితే ఏంటి అంటారా? ఇది చెప్పినంత సులభం కాదు మానసికంగా ఎంతో ఘర్షణ జరుగుతుంది. పిల్లలకు పుట్టిన చోటును బట్టి పౌరసత్వం వస్తుందేమొ గానీ వారసత్వం వస్తుందా? తల్లిదండ్రులు మరొక సంస్కృతికి వారసులైతే పిల్లలనూ అదే సంస్కృతికి వారసులుగా చేయాలనుకుంటారు.

అసలు పిల్లలను కనక ముందు ఇక్కడ కనాలా అక్కడ కనాలా అని బోలెడంత సంఘర్షణ. ఇప్పుడు అమెరికా పౌరసత్వం తీసుకొనే అవకాశం వస్తే తీసుకోవాలా వద్దా అనేది మరో పెద్ద సంఘర్షణ. కాగితాల్లో సంతకాలు అయినంత మాత్రాన, బైబిల్ మీద ప్రమాణం చేసినంత మాత్రాన మనసులో నాటుకున్న విధేయతా బీజాలు ఎలా పెళ్ళగింపబడతాయి? అది అయ్యే పనేనా? రేపెప్పుడో ప్రమాణం చేసే రోజున “నేను అమెరికాకు విధేయుడనై వుంటాను” అని ప్రమాణం చేసినా రేపెప్పుడో భవిష్యత్తులో భారత్‌కు వ్యతిరేకంగా పని చేయాల్సిన అవసరం వస్తే ఆ పని చేయగలమా? ఒకే సమయంలో రెండింటికి విధేయులుగా వుండొచ్చు కానీ ఆ రెండింటి మద్యా స్నేహం వున్నప్పుడే కదా! ఆ రెండింటి మద్యా శతృత్వం వుంటే విధేయత కూడా ఏదో ఓ వైపుకే మొగ్గక తప్పదు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి ఎదురవ్వక పోవచ్చు కానీ సంభవమే కదా?

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 ఓట్లు, సగటు: 5 కు 3.50)
Loading ... Loading ...

'పౌరసత్వ విధేయత' పై 6 అభిప్రాయాలు

'పౌరసత్వ విధేయత'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. జ్యోతి అభిప్రాయం,

  తేది: July 17, 2007 సమయము: 9:48 am

  అమెరికా పౌరసత్వం అవసరమా?? ఏం మీ తెలివితేటలు భారత దేశానికి అవసరం లేదా? ఇక్కడ సంపాదన లేదా??

 2. నాగరాజా అభిప్రాయం,

  తేది: July 17, 2007 సమయము: 10:48 pm

  నా ఓటు పౌరసత్వం వైపే. త్వరగా తీసుకొని తీరిగ్గా ఆలోచించండి. అంత సంఘర్షణ అనిపిస్తే, భారతానికి+తెలుగుకు ఒక అమెరికా పౌరునిగా మీకు వీలైనంత చేయండి.

  చిట్ట చివరిగా… ఒక ఒక భారతీయుని ఉద్యోగానికి ఎసరు పెట్టకండి.. pleeaasseeee…

 3. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: July 18, 2007 సమయము: 6:50 am

  మనసులో విధేయత ఎలాగూ చెరిగిపోదు. జూలై 3 2008 రోజున భారతీయులుగా ఉన్నవారు జూలై 4 2008న అకస్మాత్తుగా అమెరికన్లు ఐపోరు కదా. పాస్‌పోర్టు కేవలం సౌకర్యార్ధమే. అమెరికా పాస్పోర్టుతో అమెరికన్ అయిపోతారో, భారతీయుడిగానే ఉంటారో నాగరాజా గారన్నట్టు తీరిగ్గా ఆలోచించుకోవచ్చు.

 4. చరసాల అభిప్రాయం,

  తేది: July 18, 2007 సమయము: 8:02 am

  పాస్పోర్టు కేవలం సౌకర్యార్థమే అంటే మన్సు ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు ఇక్కడ పని చేస్తూనే అమెరికాను తెగుడుతూ వుంటాం క్దా మరి తీరా పౌరసత్వం తీసుకొని ఇంకో దేశానికి విధేయులుగా వుండటం అపచారం కదా?

  –ప్రసాద్

 5. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: July 18, 2007 సమయము: 10:32 am

  మీరు మరీనండి, భారతదేశంలో భారత పాస్పోర్టు ఉండి, భారత్ ను తెగిడేవాళ్లు ఎంతమంది లేరు. ఇక అక్కడ అమెరికా విధేయులకు కొదవా? అలాగే అమెరికాలో పుట్టి కూడా మహాపాపము చేసినట్టు సిగ్గుపడి, దూరపుకొండలు నునుపన్నట్టు అవతలిగెట్టునున్న దేశాలను ఆరాధించేవాళ్లు మనకు తరచూ కనిపిస్తూనే ఉంటారుగా.

 6. విహారి అభిప్రాయం,

  తేది: July 19, 2007 సమయము: 2:02 pm

  నేను కూడా ఇప్పుడు పెద్ద డైలమాలొఎ వున్నా. పౌరసత్వము తీసుకోవాలంటే దేశ భక్తి అడ్డు వస్తొఅది. ఇండియా వెళ్ళిపోయినా ఇంతకుముందు వేరే దేశ పౌరసత్వమ్ తీసుకున్నామనే బాధ వుండిపొఎతుంది.

  విహారి

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో