- అంతరంగం - http://www.charasala.com/blog -

రామ రాజ్యం

Posted By చరసాల On July 16, 2007 @ 1:02 pm In చరిత్ర, నా ఏడుపు | 13 Comments

విజయ నగర సామ్యాజ్యంలో రత్నాలు రాశులు పోసి అమ్మారని, రాయల వారు కావ్యాలు రాసి కవులను, పండితులను ప్రోత్సహించారని…ఇలాంటివే చెబుతుంటారు ఎవరైనా ఆ రాజ్యం సుఖ శాంతులతో వర్ధిల్లిందని చెప్పటానికి. ఒక సామాన్య రైతు ఎలా బతికేవాడో, ఒక సామాన్య పనివాడి రోజువారీ జీవితమెట్లుండేదో ఎవ్వరూ ఎక్కడా చెప్పరు. యుద్దాలు, పెళ్ళిళ్ళు, కుట్రలు, సానివాడలు ఇవే కనిపిస్తాయి సాధారణంగా.
ఈ మద్య “విక్రమార్కుడు” అనుకుంటాను సినిమా చూస్తుంటే అందులో విలన్ ఇలా అంటాడు. “ఏమిరా, ఎక్కడా ఏ తగాదాలూ లేవు కదా? అందరూ మనం అడిగినట్లు మామూళ్ళు ఇస్తూనే వున్నారు కదా? మనమంటే భయభక్తులు చూపుతున్నారు కదా? కోరుకున్న ఆడది బెట్టు చేయకుండా లొంగుతున్నది కదా? అంతా ప్రశాంతంగానే వుంది కదా? నాకు గొడవలు నచ్చవు. రక్తపాతాలు నచ్చవు. అంతా ప్రశాంతంగా వుండాలి.”
ఈ మాటలు వింటుంటే ఇలాంటి ప్రశాంతతేనా మన రామ రాజ్యాలలో విలసిల్లింది కూడానూ అని వెంటనే మనసులో కలుక్కుమంది.

–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=183