రామ రాజ్యం

తేది: July 16, 2007 వర్గం: చరిత్ర, నా ఏడుపు రచన: చరసాల 3,867 views

విజయ నగర సామ్యాజ్యంలో రత్నాలు రాశులు పోసి అమ్మారని, రాయల వారు కావ్యాలు రాసి కవులను, పండితులను ప్రోత్సహించారని…ఇలాంటివే చెబుతుంటారు ఎవరైనా ఆ రాజ్యం సుఖ శాంతులతో వర్ధిల్లిందని చెప్పటానికి. ఒక సామాన్య రైతు ఎలా బతికేవాడో, ఒక సామాన్య పనివాడి రోజువారీ జీవితమెట్లుండేదో ఎవ్వరూ ఎక్కడా చెప్పరు. యుద్దాలు, పెళ్ళిళ్ళు, కుట్రలు, సానివాడలు ఇవే కనిపిస్తాయి సాధారణంగా.
ఈ మద్య “విక్రమార్కుడు” అనుకుంటాను సినిమా చూస్తుంటే అందులో విలన్ ఇలా అంటాడు. “ఏమిరా, ఎక్కడా ఏ తగాదాలూ లేవు కదా? అందరూ మనం అడిగినట్లు మామూళ్ళు ఇస్తూనే వున్నారు కదా? మనమంటే భయభక్తులు చూపుతున్నారు కదా? కోరుకున్న ఆడది బెట్టు చేయకుండా లొంగుతున్నది కదా? అంతా ప్రశాంతంగానే వుంది కదా? నాకు గొడవలు నచ్చవు. రక్తపాతాలు నచ్చవు. అంతా ప్రశాంతంగా వుండాలి.”
ఈ మాటలు వింటుంటే ఇలాంటి ప్రశాంతతేనా మన రామ రాజ్యాలలో విలసిల్లింది కూడానూ అని వెంటనే మనసులో కలుక్కుమంది.

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 5.00)
Loading ... Loading ...

'రామ రాజ్యం' పై 13 అభిప్రాయాలు

'రామ రాజ్యం'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. radhika అభిప్రాయం,

  తేది: July 16, 2007 సమయము: 7:08 pm

  రామ రాజ్యం లో ధర్మం నాలుగు పాదాలా నడిచింది.చాకలివాడు బట్టలుతుకుతూ,మంగలి గెడ్డాలు గీస్తూ,కుమ్మరి,కమ్మరి అందరూ ఎవరి వృత్తులు వాళ్ళు చేస్తూ ఎదుగూ బొదుగులేకుండా,రిజర్వేషన్లు గట్రాల్లంటి గొడవలు లేకుండా సుఖం గా వుండేవారు.

 2. kolluri soma sankar అభిప్రాయం,

  తేది: July 16, 2007 సమయము: 11:01 pm

  చరిత్రని బాగా చదువుకున్న వాళ్ళు, రాజాశ్రయం పొందిన వాళ్ళు రాసేవారు. అలాంటప్పుడు చరిత్రలో వారి వారి జీవితంలోని సంఘటనలకే తప్ప, మీరన్నట్లు, సామాన్య రైతుల, కూలీల ప్రస్తావన వచ్చే అవకాశం తక్కువ.
  పాలించే రాజు మంచి వాడైతే, ధర్మ ప్రభువని పొగిడి, అతని పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉందని అనేవాళ్ళు.
  అదే రాజు చెడ్డవాడైతే, అరాచక పాలనని,రాజ్యం లో అక్కడక్కడా కరవు కాటకాలు ఉన్నయాని పేర్కొనేవారు.
  ఇక సామాన్య పౌరుల సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎందుకని ఊరుకొని ఉంటారు.

 3. రాజేష్ అభిప్రాయం,

  తేది: July 17, 2007 సమయము: 12:13 am

  నోటికీ బుర్రకీ తాళాలేస్తే “ఎదుగూ బొదుగూ” వుండదు, గొడవలూ వుండవు.

 4. cbrao అభిప్రాయం,

  తేది: July 17, 2007 సమయము: 12:16 am

  Reservations లేవు. వెనకబడిన వర్గాల వారికి చదివే హక్కు లేదు. దొంగతనంగా చదివితే ఏమి జరుగుతుందో మనకు శంబూక వధ కథ చెప్తుంది. ప్రజలు అన్నమో రామచంద్ర అని అలమటించటం అప్పుడే మొదలయ్యిందా? స్త్రీల హక్కులు శూన్యం. శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు కోయటం ఖండించవలసిన చర్య. విచారణ లేకుండా సీత, అవమానానికి, శిక్షకు గురై, అడవిలో వదిలి వేయబడింది. చివరకు రాముడు సరయూ నదిలో ఆత్మహత్య చేసుకోవటంతో, రామావతారం ముగిసింది.

 5. raju అభిప్రాయం,

  తేది: July 17, 2007 సమయము: 2:33 am

  పూర్వం…మీలాంటి అతి తెలివిగాడొకడు…ఇలా అనుకొన్నాడుట.
  ” మా అమ్మకు ఉరిలొ మంచి పేరేగాని, నా అనుమానం ఎంటంటే ఆవిడకూడా ఈకాలపు కాల్ గర్ల్స్ లాగా…ఎందరితో పడుకొందో…”

  మీరూ మీ కన్న తల్లిని ఇలాగె అనుమనిస్తారా ప్రసాద్ గారూ?

  మీ అతి తెలివితొ అందరి తల్లినీ అనుమనిస్తున్నారు.

  రంగుటద్దాల్లొ చూస్తె ప్రపంచం రంగులమయమయ్యినట్లు, కల్మష మనస్సుతో చూస్తే, పురానాల్లో బూతు, చరిత్రలో చెత్తా కనిపిస్తుంది…అవునా?

 6. రవి వైజాసత్య అభిప్రాయం,

  తేది: July 17, 2007 సమయము: 3:24 am

  హాలో సార్ రాజు గారూ, బూతద్దాలు, రంగుటద్దాలు ఎందుకుకానీ ఎదేదో అన్నారు? ఎంటి మీ ఉద్దేశ్యం? (వ్యక్తిగత వ్యాఖ్యలు ఎందుకు నాయనా)
  మీరు పై టపాలో దేనికి అభ్యంతరం చెబుతున్నారో స్పష్టంగా రాయవచ్చు కదా.. నాకు అంత సీను లేదు..నచ్చలేదంతే అంటానంటే మీ ఇష్టం.

 7. రాజేష్ అభిప్రాయం,

  తేది: July 17, 2007 సమయము: 3:29 am

  Raju గారూ,

  చరసాల గారన్నది, సామాన్యుల గురించి చరిత్రలో గానీ, పురాణాల్లో గానీ పెద్దగా చెప్పబడలేదని. చెప్పబడ్డ కొంచెం వాళ్ళకి against గానే వుండె! సామాన్యుల గురించి చెప్పనప్పుడు, చెప్పబడ్డ కొంచెం వాళ్ళకి against గా వున్నప్పుడు … వాళ్ళు బాగున్నారని ఎలా అనుకుంటాము చెప్పండి? ఆయన అతి తెలివి ఎమోగానీ, మీరు మాత్రం అతిగా react అయ్యారు.

 8. కొత్తపాళీ అభిప్రాయం,

  తేది: July 17, 2007 సమయము: 7:48 am

  ప్రసాదుకి – ఒక్క తానా చూసినందుకే ఇంత నిరాశా, నిర్వేదం? :-)
  సామాన్యపనివాడి రోజువారీ జీవితం ఎలాఉండేదో స్పష్టంగా చెప్పక పోయినా, తెలుగు ప్రబంధాల్లో, కావ్యాల్లో ఆనాటి సామాజిక స్థితుల గురించీ, జీవిన గతి గురించీ బాగా వివరంగానే చెప్పారు. దీన్ని పరిశోధించిన మహానుభావుల సాంకేతిక పత్రాలు అలా ఉండగా మనబోటి వాళ్ళకు అర్థమయ్యేలా రాసిన పుస్తకాలు కూడా చాలానే ఉన్నై – కొన్ని రిఫరెన్సులు తరవాత చెబుతాను.

  > రాధికా – మీ వ్యాఖ్య బాగుంది.

 9. చరసాల అభిప్రాయం,

  తేది: July 17, 2007 సమయము: 8:55 am

  వాఖ్యలు రాసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ బ్లాగు నామకరణం “రామ రాజ్యం” అని చేశానని రాముడీ రాజ్యాన్ని నేను కించ పరచటం లేదు. నిజానికి ఇది రాసే సమయంలో నాకు విజయనగర రాజ్యం మనసులో మెదిలిందే గానీ రాముడి రాజ్యం కాదు. సుఖ శాంతులతో సుభిక్షంగా వున్న రాజ్యాన్ని రామ రాజ్యం అంటారు గనుక ఆ టైటిల్ వాడానంతే. రామ భక్తులెవ్వరూ గుండెలు బాదుకో నక్కరలేదు.

  @రాధిక గారూ,
  కవితలో లాగే ఒక వాక్యంలో మొత్తం సారాంశాన్ని చెప్పేశారు.

  @కొల్లూరి గారూ,
  కవులని రాజులు పోషిస్తే తప్ప దారి లేదు. రాజు పోషణని తిరస్కరించిన వారు దైవ భక్తులు. ఇక సామాన్య జీవితాలనే చిత్రీకరించే అవసరం ఎవ్వరిది. కానీ నేననేది ఏమిటంటే ఒకవేళ సామాన్యుడి జీవితాన్ని చిత్రించి వున్నా అది ప్రశాంతంగా సుఖశాంతులతో వర్దిల్లింది అని రాసినా ఆ సుఖశాంతులు పైన నేను వుదహరించినట్లు వుండినవి కాదు కదా అని నా సందేహం.

  @రాజేశ్ గారూ,
  కానీ పనిలేని బుర్ర దయ్యాల ఖార్ఖానా అని ఈ బుర్ర వూరుకుండి చావదే!

  @రావు గారూ,
  వీర రామాభిమానుల మద్య మనం బతుకుతున్నాం అని మర్చిపోతున్నారు మీరు. జాగ్రత్తండీ.

  @రాజు గారూ,
  నేను నా కన్న తల్లిని అనుమానించడం కాదండి. ప్రేమిస్తాను. ఆమె పతివ్రత అయితేనే కాదు పతిత అయినా ప్రేమిస్తాను. కానీ మీ కామెంటు చూస్తే మీరలా కనిపించటం లేదు. మీకు మీ తల్లి పతివ్రతే అయివుండాలి. సర్వ సద్గుణ సంపన్నురాలై వుండాలి. అలా వుండదకపోవడం మీరు కలలో కూడా వూహించలేరు. వూహించి తట్టుకోలేరు.
  నేనలా కాదు నేనూ నా పూర్వీకుల జ్ఞాన సంపదను, పురాణాలనూ, చరిత్రనూ సమస్తాన్నీ ప్రేమిస్తాను. సౌందర్యాన్నీ ప్రేమిస్తాను అనాకారినీ ప్రేమిస్తాను. పురాణాలని/చరిత్రనీ ప్రేమిస్తే అందులోని బూతునీ/చెత్తనీ కూడా ప్రేమించాలి. మీరు అవి లేని వాటిని ఇష్టపడుతున్నారు. మీ ప్రేమ conditional.

  @రవీ/రాజేష్,
  ఎవరేం రాసినా ఎవరు రాసినదానికి వారే బాద్యులు. ఇది నాకైనా వర్తిస్తుంది. రాస్తే మనసు ఇక్కడ ఆవిష్కృతమవుతుంది. రాయకుంటే లోపలే దాగుంటుంది.

  @కొత్తపాళీ గారూ,
  నాకున్న పుస్తక/పురాణ జ్ఞానం/అనుభవం పరిమితం. నేనేమయినా మాట్లాడితే అది ఆ పరిమితికి లోబడే వుంటుంది. నా అనుభవం విస్తరించే కొద్దీ నా భావాలు మారొచ్చు. ఈనాటి నేను రేపటి నేనుకు విరుద్దమవచ్చు. అలాగని సంపూర్ణ అనుభవం మనిషికి ఎప్పుడూ అందదు కదా? అది అందేవరకూ మాట్లాడకుండా రాయకుండా ఎవరూ వుండలేరు కదా? కాబట్టి నేనిప్పుడు ఏమి రాసినా అది నా పరిమిత జ్ఞానం/అజ్ఞానం వల్ల రాసిందే. మన వ్యావహారిక తెలుగులో నాబోటి వాళ్ళకు అర్థమయ్యే విధంగా పుస్తకాలు వుంటే చెప్పండి. తప్పక చదువుతాను. చదివాక నా ఈ అభిప్రాయం మారనూ వచ్చు.

  –ప్రసాద్

 10. raju అభిప్రాయం,

  తేది: July 18, 2007 సమయము: 2:22 am

  ఆవేశంలొ నోరు జారినందుకు క్షమించండి ప్రసాద్ గారు.

  నోరుజారడం అవివేకమేగాని, ఆవేశానికి మాత్రం అర్ధముంది.

  మీరలా రాయదం పొరపాటే, మీ తరువాతి వివరణ కూడా సరిగా లేదు.

  Un Coditional ప్రెమలో అనుమానానికి తావుంటుందా?

  రామ రాజ్యంలొ సీతమ్మను అనుమనించిన చాకలి వాడి వలన
  ఆవిడకెన్ని కష్టాలో మనకు తెలుసు.

  ఈ సమస్య మనలొ చలామందికి వుంది.ఇది తెల్లవాడు కొట్టిన దెబ్బ. మన విద్యావ్యవస్తను తద్వారా మన ఆలోచనలను మార్చి మనల్ని ఆ చాకలివాడికన్నా అధ్వాన్నంగా తయారు చేసారు.

 11. చరసాల అభిప్రాయం,

  తేది: July 18, 2007 సమయము: 8:12 am

  రాజు గారూ,
  అవేశంలో నోరు జారడం నాకూ అలవాటే. ఫర్వాలేదు నొచ్చుకోకండి.
  గోపిచంద్ తత్వవేత్తలు చదువుతూ వుంటే అందులో జిడ్డు క్రిష్ణమూర్తి గారి తత్వం గురించి నాకు అర్థం అయ్యింది కొంచమే. అదేంటంటే ప్రతి దాన్నీ అనుమానించాలట! చివరికి నన్ను నేనే అనుమానించుకోవాలట. ప్రతిదాన్నీ పరిపూర్ణంగా అనుమానించి ప్రశ్నిస్తేనే “సత్యం” తెలుస్తుందట!
  అనుమానపడ్డ నిరక్షరకుక్షుడైన చాకలివాడిదే తప్పుగానీ నిరపరాధి, గర్బవతియైన సీతను అడవుల్లో ఏ దిక్కూ లేకుండా వదిలేయడం వేదవేదాంగాలనూ చదివిన రాముడి తప్పు కాదంటారు?
  అయినా ఈ విషయం మీద ఇంతకు ముందు పెద్ద వాగ్వివాదమే జరిగింది లెండి. ఆ తప్పొప్పులమీద ఇక చర్చించను.
  ఇంయతకీ మీరు చూపించే ప్రేమకీ నా ప్రేమకీ తేడా ఏమి చెబుతున్నానంటే మీకు మచ్చలేని మన చరిత్ర అంటే ప్రేమ. మచ్చ వుందన్నా అంగీకరించరు. నేనలా కాదు మచ్చ వుంటే వుందని అంగీకరిస్తాను అయితే అంగీకరిస్తున్నంత మాత్రాన దాన్ని నేను ప్రేమించనట్లు కాదు.
  “ఇది తెల్లవాడు కొట్టిన దెబ్బ” — ఇది మనకు RSS కొట్టిన దెబ్బ :)
  –ప్రసాద్

 12. raju అభిప్రాయం,

  తేది: July 19, 2007 సమయము: 6:44 pm

  అది RSS దెబ్బ కాదు, దాశరథి రంగాచార్య గారి ఆలోచనామ్రుతము.

  ” ఆ తెల్లవాడు మన విద్యా వ్యవస్తను మార్చి, మనల్ని వెధవల్ని చేసి, మనం వెధవలం అని కూడా తెలియకుండా చేసాడు ”

  హిందువుల అనైక్యతే బలహీనతకు, తద్వారా, శతాబ్దాల పర పీడన పాలనకు కారణమని గుర్తించి,
  హిందువుల ఐక్యతకు, తద్వారా సమాజ పరిరక్షనకు పాటుపడుతోన్న RSS పైనా,

  చరిత్రలో స్వర్నాక్షరాలతొ లిఖింపబడిన శ్రి క్రిష్న దేవరాయల రాజ్యం పైనా,

  ధర్మ పరిరక్షన కొరకు, సర్వం త్యాగం చేసిన శ్రీ రామచంద్రుడి పైనా,

  ఆరోపనలు చేయడం, దాశరథి గారి మాటల్ని నిరూపిస్తున్నాయి.

  తీవ్ర ఆరోపనలు చేస్తూనే, unconditional గా ప్రేమిస్తున్నానని అనుకోవడం ఆత్మ వంచన కాదా?

 13. mallikarjunareddy అభిప్రాయం,

  తేది: January 9, 2010 సమయము: 11:42 am

  hai sir,bagane undhi. sri krishnadevarayala kalam lo prajalu santhosamgane unnaru.
  chinna example:
  miku cumbum cheruvu telusa,aa cheruvuni sri krishnadevarayali barya(chinnadevi)varadarajamma garu thravvincharu. aa cheruvu desamlone peddadhi.
  aa cheruvulo water unte maaku motar dwara water vasthayi.
  maa ooru 50 km untundhi aa cheruvuki.
  ila enno chesaru.
  naaku devudu varamandhisthe srikrishnadevrayalu marala puttalani korukunta…

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో