తానానందకరం

తేది: July 13, 2007 వర్గం: నా ఏడుపు రచన: చరసాల 657 views

అన్నీ అవకతవకలేనా తానాలో అంటే కానేకాదు. నాకు భలే నచ్చిన విశయం నందమూరి బాలక్రిష్ణ స్వచ్చమైన తెలుగు పదాల్లో వుపన్యసించడం. అలాగే తనను సన్మానించిన తర్వాత గుమ్మడి తన గొంతు బాగోలేక పోయినా అచ్చ తెలుగులో మాట్లాడటం. దగ్గుబాటి పురంధరేశ్వరి పసందైన తెలుగులో మాట్లాడటం. (చివర్లో ఆగ్లం రాదనుకుంటారనో, తెలుగు రానివాళ్ళకోసమో గానీ ఆంగ్లంలోనూ మాట్లాడారు. కానీ తెలుగులో ఆగ్లం కలపలేదు.)
జంపాల చౌదరి వాఖ్యానాలు హాస్యభరితంగా వుండి ఆహ్లాదపరిచాయి.

పురంధరేశ్వరి విశయం ఇంకోటి చెప్పాలి. మైకు తీసుకున్న వెంటనే తనకిచ్చిన సమయం 10 నిమిశాలు అని ఆమే చెప్పారు. అయినా మొదలెట్టడం భారీగా ఐతరేయ బ్రాంహ్మణంలో ఆంద్రుల ప్రసక్తి నుంచీ మొదలెట్టారు. అలా ఆంద్రుల గుట్టంతా విప్పుకుంటూ వచ్చేసరికి పది నిమిశాలు ఎప్పుడో ఖర్చయ్యాయి. ఈమె వరుస చూసి కొంపదీసి తెలుగుకు ప్రాచీన హోదా కేంద్రం తరుపున ఇక్కడ ప్రకటించదలచిందా అని నాకు అనుమానమేసింది. ఉహు. ఆమె అనర్గళంగా తన వుపన్యాస ప్రతిభను చూపుతుంటే ఇక లాభం లేదని సభా నిర్వాహకులు వచ్చి సమయం గుర్తు చేశారు. అయినా సంకోచించకుండా, “మా బావ (మరిదా?) బాబుకు గంట పైనే ఇచ్చారు, నా సోదరుడు బాలయ్యకూ గంట పైనా ఇచ్చారు మరి నేనెందులో తక్కువని పది నిమిశాలు ఇచ్చారు” అనుకున్నారో ఏమో గానీ మైకు వదల్లేదు. నాకయితే ఈమె కొంపదీసి భారత పార్లమెంటులో ప్రసంగిస్తున్నానని భ్రమపడుతోందా అనిపించింది. ఇక ఇలా కాదని సభా నిర్వాహకుడు ఆమె పక్కనే వచ్చి నిలుచునే సరికి ఇక మర్యాద కాదనుకుందేమొ మైకు మీద పట్టు సడలించి వుపన్యాసాన్ని ముగించారు.

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 ఓట్లు, సగటు: 5 కు 4.50)
Loading ... Loading ...

'తానానందకరం' పై 5 అభిప్రాయాలు

'తానానందకరం'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. నేనుసైతం అభిప్రాయం,

    తేది: July 13, 2007 సమయము: 11:10 am

    తానా సమావేశాలలో ప్రముఖ పాత్రికేయులు, తెలుగు భాషా సంఘం అద్యక్షులు ఏ.బి.కె.ప్రసాద్ గారిని కలవటం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వాడుకం భాగం గా అన్ని మండల కేంద్రాలకు తెలుగు సాప్టువేర్ అందచేసినట్లు తెలిపారు. తెలుగు బ్లాగర్లు మరియు తెవికి లో వ్యాసాలు గురించి ఆయనకు వివరించగా ఆయన ఆసక్తి కనపరిచారు.

  2. Srinivas CH అభిప్రాయం,

    తేది: July 13, 2007 సమయము: 4:22 pm

    మీ టపా బాగుంది.ముఖ్యంగా ఇలా తెలుగులో వ్యాఖ్యానం రాయడము నాకు భలే నచ్చింది.

  3. radhika అభిప్రాయం,

    తేది: July 13, 2007 సమయము: 10:11 pm

    తానా తెలుగుదేశం పార్టీకి తందానా అంటున్నట్టుంది అని అంటున్నారు.మరి పురంధరేస్వరిని ఎందుకు తీసుకొచ్చినట్టో?

  4. jampa అభిప్రాయం,

    తేది: July 15, 2007 సమయము: 11:42 am

    తానా తెలుగు దేశం పార్టీకి తందానా అనదు. ఒక కులానికి అంటుంది. అదీ సంగతి.

  5. ప్రసాద్ అభిప్రాయం,

    తేది: July 16, 2007 సమయము: 8:32 am

    ABK, మేడసాని, వేల్చేరు లాంటి ప్రంఉఖులని కలిసే అవకాశం వచ్చినకావుపయోగించుకోలేకపోయాను.
    తానా ఓ కులాన్ని అటా ఓ కులాన్ని వెనుకేసుకుంటుందని జనాంతికం.
    –ప్రసాద్

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో