నేను మోసపోయానా?-2

తేది: July 11, 2007 వర్గం: నా ఏడుపు రచన: చరసాల 729 views

తానా సభల్లో భాగంగా ఏర్పాటయిన దుకాణాల్లో ఒక పుస్తక దుకాణం చూసి ఎక్కడలేని ఆనందంతో వుబ్బితబ్బిబ్బయ్యాను.
పిల్లల కొరకు మంచి రంగుల బొమ్మలతో వున్న కథల పుస్తకాలు కొన్నాను. అక్కడే కార్టూన్లతో “పిల్లల రామాయణం” CD మంచి అందమైన ముఖచిత్రం ఒకవైపు వివిధ రామాయణ ఘట్టాల చిన్న చిన్న చిత్రాలు మరో వైపు వుంటే అది తప్పక పిల్లలకు ఆసక్తికరంగా వుండి రామాయణం మీద పిల్లలకు ఆసక్తిని కలిగిస్తుందని ఆశపడ్డాను. పైగా “తెలుగులో వెలువడిన మొట్టమొదటి రామాయణ సిడి” అని తాటికాయలంత కాకపోయినా వక్కపలుకులంత అక్షరాలతో ముద్రిస్తే అది తప్పకుండా ఒక మంచి సిడి అయివుంటుందని అబ్బురపడి కొనేశాను.
ఇంటికొచ్చి “ప్రణతీ, ప్రణతీ నీకోసం ఏం తెచ్చానో చూడు” అని ఆమెకు ఇంకొంత ఆసక్తిని జోడించి డీవీడి ప్లేయర్‌లో పెట్టి చూద్దును గదా! రామాయణం దశరధుడికి పిల్లలు లేరు అనే దగ్గర మొదలయ్యింది. ఏదో ఓ బొమ్మ చూపించి తెర వెనుక గొంతొకటి కథ చెప్పడ మొదలు పెట్టింది. ఓహో ఇది రామాయణ కథకు పూర్వ పక్షాన్ని పరిచయం చేయడం గామోసు అని చెవులు రిక్కించి కళ్ళు అప్పగించి చూస్తూనే వున్నాము ఒక్కమాటా మాట్లాడకుండా నేనూ నా కూతురూ.
వుహూ .. ఎంతకీ ఆ తెరవెనుక కథ చెప్పడం మానలేదు.. అప్పుడో బొమ్మ ఇప్పుడో బొమ్మ చూపిస్తూ వున్నాడు. ఇక మా అమ్మాయికి విసుగొచ్చి ఇది నాకు వద్దు డాడీ… నాకు “My little Pony” యే కావాలి. అది పెట్టవా అని అడిగింది. ఇక ఏం చేయను? అయినా ఆశ చావక ఆమెకు ఇంకో చోట ఆమెకు కావలిసింది పెట్టి నేను చూస్తూ కూర్చున్నాను. రామాయణం మొత్తం పూర్తయినా ఎక్కడా కథ ఆగలేదు. మొత్తం మీద అక్కడ అటుతిప్పి ఇటుతిప్పి చూపించిన బొమ్మలు 12. అవే CD మీదున్నది. దాని వెల రూపాయల్లో 175. డాలర్లలో దాని ధర ఎంత వేశాడో తెలియదు ఎందుకంటే మిగతా పుస్తకాలతో కలిపి 55 డాలర్లు చెల్లించా.
తాటకి సంహారానికంతా ఓ బొమ్మ, సీతారాముల పెళ్ళికంతా ఓ బొమ్మ ఇలా ఓ పది బొమ్మలు చూపించి తెర వెనుక కథ చెబుతుంటే కథ వినే రోజులా ఇవి. అలా వుంటుందని తెలియక CD కొన్న నేను అమాయకుడినా? అజ్ఞానుణ్ణా? లేక మోసపోయానా?
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 ఓట్లు, సగటు: 5 కు 4.00)
Loading ... Loading ...

'నేను మోసపోయానా?-2' పై 9 అభిప్రాయాలు

'నేను మోసపోయానా?-2'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. సత్యసాయి అభిప్రాయం,

    తేది: July 11, 2007 సమయము: 8:03 pm

    అజ్ఞానం, అమాయకత్వం కాదు. పబ్లిసిటీ ట్రిక్ కి బలవడం. అమ్మేవాళ్ళు కొన్ని విలువలు పాటించకపోతే ఇలాగే ఉంటుంది.

  2. kranti అభిప్రాయం,

    తేది: July 12, 2007 సమయము: 12:51 am

    హాహా..ఇలాంటి సిడి ల దెబ్బలు నాకు కూడ చాలా తగిలాయి.

  3. jyothi అభిప్రాయం,

    తేది: July 12, 2007 సమయము: 6:19 am

    పాపం అమాయకంగా మోసపోయావు తమ్మూడూ…ప్చ..ఏమని చెప్పాలో కూడా తెలియలేదు….

  4. somasankar అభిప్రాయం,

    తేది: July 12, 2007 సమయము: 6:35 am

    మీరు చెప్పింది నిజమే. మనం నిజయితీగా ఉంటే, మనల్ని సత్తెకాలపు మనుషులనుకునే రోజులివి
    సోమ శంకర్

  5. kottapali అభిప్రాయం,

    తేది: July 12, 2007 సమయము: 6:57 am

    ఇదివరకు VHS కేసెట్లౌ, ఈ నాడు సీడీ డీవీడీలనూ కొండంలో ఉన్న అంతర్గత సమస్యే ఇది. అత్తెసరు జీతపు గ్రాడ్యువేట్ విద్యార్ధిదశలో ఇలాంటి ఒక పండగ స్టాల్లో ఒక పది పాత సినిమా కేసెట్లు కొన్నాను. అండులో మూడు చివరి పది నిమిషాలు ఎగిరిపోయాయి. ఆ అమ్మిన షాపువాడూ ఎక్కడో న్యూజెర్సీలో – పోస్టులో పంపాలన్నా, కొన్నదానికంటే ఎక్కువ ఖర్చు – దిగమింగి ఊరుకున్నా. అలాగే ఆ తరవాత ఎన్నో వీసీడీ డీవీడీలు .. పరిచయం లేని షాపులనుండి కొన్న ఫలితం.

  6. kottapali అభిప్రాయం,

    తేది: July 12, 2007 సమయము: 7:09 am

    ఒక సవరణ – “పూర్వపక్షం” అంటే ఒక సిద్ధాంతాన్ని గానీ ఆలోచనని గానీ తప్పు అని నిరూపించడం. ఇది తర్కశాస్త్రంలో వాడే పారిభాషిక పదం. మామూలు వాడుకలో ఒక ఆలోచనని వ్యతిరేకించడం అన్న దృష్టిలో ఇది వాడతారు.

  7. చరసాల అభిప్రాయం,

    తేది: July 12, 2007 సమయము: 7:37 am

    @సత్యసాయి గారూ,
    ఒకసారి మోసపోతే వాడిది తప్పట రెండోసారీ మోసపోతే మనది తప్పట! :)
    ఈ మధ్య నేనిలా మోసపోవడం కాస్తా ఎక్కువగానే వుంది.

    @క్రాంతి గారూ,
    మీకు నా సానుభూతి.

    @జ్యోతక్కా,
    అయితే నేను అమాయకున్నే కదూ?

    @సోమశంకర్ గారూ,
    సత్తెకాలపు మనుషులు అనుకుంటే ఫర్వాలేదు కానీ అసమర్థులు అనుకుంటేనే గుండె కలుక్కుమంటుంది.

    @కొత్తఫాళీ గారు,
    మీ సవరణకు కృతజ్ఞతలు. ఈ మధ్యనే గోపీచంద్ “తత్వవేత్తలు” కొద్దిగా చదివిన అనుభవం వల్ల ఆ పదం వాడానేమొ! తత్వవేత్తలు అర్థం గాక నిద్ర వచ్చేస్తోంది. పుస్తకం మనలని చదివించాలి గానీ మనం దాన్ని చదవాలంటే కష్టంలే అనుకొని మూసేశానండి.

    –ప్రసాద్

  8. nagaraja అభిప్రాయం,

    తేది: July 12, 2007 సమయము: 11:33 am

    మీరు http://www.youtube.com/watch?v=5zXlx1GStT8 వంటివి పిల్లలకు చూపించారా? ఎక్కడ తప్పుందో అర్థం కావడం లేదు!

  9. lalitha అభిప్రాయం,

    తేది: July 13, 2007 సమయము: 8:08 pm

    మోసపోవడమా అంటే ఇంకేదైనా విషయంలో ఒప్పుకుంటాను. కానీ ఈ విషయంలో మాత్రం మీది అమాయకత్వమే అనిపిస్తుంది. లేక పోతే మన వాళ్ళు తెలుగులో పిల్లల కోసం CD తయారు చేశారు అంటే కొన్నారు బాగానే ఉంది కాని, అన్ని ఆశలు దాని మీద పెంచుకోవడం బాగా లేదు. నా ఈ అభిప్రాయం ఎవరికైనా కష్టం కలిగిస్తే క్షమించండి. అంతకంటే మించి నిజంగా పిల్లల కోసం తయారు చెయ్యాలన్న సంకల్పం ఉంటే నా మాట కాస్త ఆలకించండి.

    తెలుగులో పిల్లల కోసం తయారు చెయ్యబడ్డ CDలు కొన్న వారిలో నేను ఒకర్తిని. మా వాళ్ళు కూడా పాపం ప్రేమగా కొని ఇచ్చారు కొన్ని. పిల్లలు ఇష్ట పడ్డారా, అవి చూసి నేర్చుకున్నారా అంటే YES. అందరూ ఏమో కాని, మా పిల్లలు బొమ్మా, పాటా, మాటా ఉంటే ఉత్సాహంగా కొత్తది ఏదైనా చూస్తారు. కానీ ఇలాంటివి ఇంకొన్ని కొని వీటిని నేను ప్రోత్సహిస్తానా అంటే NO.

    ఇంత market ఉంది. ఇంత మందికి ఆంగ్లంలో పిల్లల కోసం తయారు చేసిన free ఆటలు, పాటలు, చదువులు అందుబాటులో ఉన్నాయి. ఇంత technology ఉంది. కాస్త మనసు పెట్టి తయారు చెయ్యలేరా? పిల్లల మొహాలు కాస్త ఆకర్షణీయంగా ఉండేలా బొమ్మలు గియ్యలేరా. ఇంకొంచెం మంచి animation తయారు చెయ్యలేరా? ఆంగ్లంలో పిల్లల కోసమ్ ఉన్న ఆరోగ్యకరమైన వినోదం చూసి నేర్చుకోలేరా? ఇలా ఆశ పెట్టి తల్లి దండ్రులని దోచుకోవడమేనా?

    పంచ తంత్రం కథలు ఉన్నాయి. వెనకాల ఒకరో ఇద్దరు మనుషులు ఘోరంగా గొంతులు మార్చి మాట్లాడతారు. భాష ఏ మాత్రం మృదువుగా లేదు. ఇంకా చెప్తూ పోతే ఏమి బాలేవోనని ఒక పుస్తకమే రాయొచ్చు.

    http://www.telugu4kids.com వెనక ఉన్నది ఒక్క మా కుటుంబం మాత్రమే. చాలా తక్కువ technology మాత్రమే. సలహాలు ఇచ్చి ప్రోత్సహించే వారి పెద్ద మన్సులు, నా స్వంత అవసరం, ఆసక్తి పెట్టుబడి. నాది గర్వం అనుకున్నా పరవాలేదు. ఒక తల్లిగా పిల్లల కోసం తెలుగులో ఏమి ఆశిస్తున్నానో. చూపించడానికి నేను ప్రస్తావిస్తున్నాను.

    అయితే ఒక మాట తల్లి దండ్రులకు కూడా. పిల్లలకు కేవలమ్ ఆరోగ్య వంతమైన మాధ్యమంలోనే, ఆకర్షణీయంగా తెలుగు పరిచయం చేద్దామనుకునే ఆశతో సమయం చాలా పోగొట్టుకున్నాను నేను. ముఖ్యంగా ప్రవాసంలో ఉన్నప్పుడు దొరికినంత తెలుగుకు పిల్లలను expose చెయ్యడమే పనిగా పెట్టుకోవాలి. మాటలు నేర్చాక మనమ్ వారి భాషను దిద్దుకోవచ్చు కావాలంటే. ఉదాహరణకు ప్రసాద్ గారు, కూర్చోబెట్టి చిన్న చిన్న మాటలలో మీ పిల్లలకు కథలు చెప్తూ ఉండండి. కొన్నందుకు ఆ CD ని అవతల పారెయ్యక్కర లేదు. అప్పుడప్పుడూ అది అలా నడుస్తూ ఉంటే పిల్లలు ఏదో కొంత గ్రహిస్తూనే ఉంటారు ధ్యాస పెట్టనట్టు అనిపించినా.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో