నేను మోసపోయానా?
మొన్నటి తానా సభలకు మూడొందలై డెభ్భై అయిదు డాలర్లు పోసి టికెట్లు కొన్నానా? తీరా అక్కడ ఒక్క భోజనానికి తప్ప ఇక దేనికీ టికెట్టు చూపించమని అడగలేదు. కొన్న వారు, కొనని వారు సమాన హోదాను హక్కును అనుభవించారు. సరే! ఈ రెండు రోజుల భోజనపు ఖర్చు 375 అని సరిపెట్టుకొని ఆత్మను తృప్తి పరచుకుంటుంటే, నిన్న గుండె చెరువయ్యే విశయం తెలిసింది.
నాకు బాగా తెలిసిన ఒకాయన “ఏమండీ, మీరు తానాలో భోజనలకు ఎటువైపు కూర్చున్నారు?” అని అడిగారు.
నేను:”ఏం? మీరొచ్చారా?”
ఆయన:”అవును. నేను అటు కుడి వైపు VIP sectionలో కూర్చొన్నాను.”
నేను:”అయితే మరి. మీరు కూడా తానాకు వస్తున్నట్లు, టికెట్లు కొన్నట్లు మాటవరుసకైనా నాతో అనలేదే?”
ఆయన:”టికెట్లెందుకండి. నాకక్కడ బోలెడు మంది తెలుసు.”
నేను:”తెలిసినా.. భోజనాలకు మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా టికెట్లు చూసే లోనికి పంపుతున్నారే!”
ఆయన:”అటు పంపుతున్నారు నిజమే. ఇటు బయటకు వచ్చే ద్తలం వుంది చూశారూ. తాడు కట్టారు. అక్కడ నిలబడి వున్నవారు నా స్నేహితులే. అక్కడ నుండి లోనికి దూరిపోయాను.”
ఇదండి మా మధ్య జరిగిన సంభాషణ. అది విన్నాక నేనలా దూరలేక పోయానే అనో, లేక నేను డబ్బులు ఖర్చు చేస్తే వీడు ఉత్తినే తిన్నాడే అనో, లేక అడ్డంగా దూరినోడు VIP sectionలో డబ్బులు పోసిన నేను మామూలు చోటనా అనో గనీ నా మొహం కందగడ్డలా అయిపోయినా మామూలుగా మాట్లాడటానికి చాలా కష్టపడ్డాను.
అవినీతి ఇలా సర్వవ్యాప్తం అయినప్పుడు ఒక రాజకీయనాయకులనో, ప్రభుత్వ వుద్యోగులనో అని లాభమేంది. అవినీతి ఒక ఫ్యాషన్. ఒక హోదా. బ్రతక నేర్చిన తెలివికి నిదర్శనం. అది గొప్ప.
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








తేది: July 11, 2007 సమయము: 1:41 pm
hahaha..chala bavundi sir..ilantivi nenu kooda exp chesa..kaani, maree 375 ante kuncham aragadam kashtame!
తేది: July 11, 2007 సమయము: 5:57 pm
I stayed away from TANA because of high admission prices. A neighbor then came back to me about ‘how easy it was to get many people in with a single pass’ etc; You’re right about దొడ్డి దారులు our folks seem to find here; Do you think folks reading this would be willing to shell out any money on admission price for the next TANA meet? I doubt it..
తేది: July 12, 2007 సమయము: 12:40 am
“దొంగ తిండి” అందరికి అరగదండి.నేను దర్జాగా డబ్బులు పెట్టి నా భోజనం నేనే కొనుక్కున్నాను అని చెప్పండి అందరికి.