Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/22/11733922/html/blog/index.php:2) in /home/content/22/11733922/html/blog/wp-content/plugins/bad-behavior/bad-behavior/screener.inc.php on line 8
అంతరంగం » నా బ్లాగుకు ఏడాది! » Print

- అంతరంగం - http://www.charasala.com/blog -

నా బ్లాగుకు ఏడాది!

Posted By చరసాల On June 4, 2007 @ 10:14 am In వర్గీకరింపబడనివి | 19 Comments

చూస్తూ చూస్తుండగానే ఓ ఏడు దొర్లి పోయింది. బ్లాగు మొదలెట్టి సంవత్సరం అయింది. అసలు మొదట బ్లాగు మొదలు పెట్టాలని అనుకోలేదు. మా పిల్లలకు తెలుగు నేర్పించాలంటే తెలుగులో ఏమైనా మంచి ఆటాపాటలు వున్నాయా అని గూగుల్ చేయడం మొదలెట్టాను. ఆ ప్రయత్నంలో చావాగారి బ్లాగు [1] తగలడం, ఆయన బ్లాగు తీగ పట్టుకు లాగితే బ్లాగురుల గుంపు [2] డొంక తగలడం జరిగింది. అప్పటికే మనసులో పేరుకుపోతున్న, మాయమవుతున్న రకరకాల భావనలను బ్లాగుపెట్టెలో పేరిస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. ఇంచుమించు నా డిగ్రీ పూర్తయ్యేదాకా నాకు డైరీ రాసే అలవాటుకూడా వుండేది. అయితే ఆ తర్వాత గోప్యంగా వుంచడంలో సమస్యలవల్ల అది రాయడం మానేసా. అయితే ఆన్‌లైన్‌లో డైరీ వ్రాసి దాచుకొనే సదుపాయం వుంటే ఎలా వుంటుంది అని బ్లాగు పుట్టకముందునుంచే అనుకొనేవాన్ని. తీరా బ్లాగు పుట్టాక ఆంగ్ల బ్లాగులను చూసాక నా కోరిక కొంత తీరినట్టనిపించినా ఆగ్లంపై నాకు పట్టులేని కారణాన బ్లాగు మొదలెట్టాలనే ఆసక్తి రాలేదు. ఇక చావా గారి బ్లాగు చూశాక నాక్కావలిసిందేదో దొరికినట్టయింది. దానికి తోడు అదే సమయంలో Verizon [3]లో మానేసి DOT [4]లో చేరడంతో నాకు సమయసౌలభ్యమూ ఏర్పడింది. ఇంకేముంది మూసుకుపోతున్న మనసు ద్వారాలు తెరుచుకొని భావాల లావా చిమ్మడం మొదలయ్యింది. ఆరోజు జూన్ 2, 2006. నా మొదటి పోస్టు “గాంధి గారి సత్యంతో ప్రయోగాలు — నా సందేహాలు: [5]“. ఇది blogspotలో “స్పందన” పేరుతో రాయడం జరిగింది. మొదట అనామక పేరుతో అదృశ్యంగా వుండి రాయాలనుకున్నా గానీ ఎందుకో ఆ తర్వాత అవసరం లేదు అనిపించింది. ముఖ్యమైన కారణం అనామకంగా వుండటంలోని శ్రమ.
blogspotలో బ్లాగు మొదలెట్టిన వారంలోపలే అందులో కొన్ని సమస్యలు రావడంతో wordpress [6]కు నా బ్లాగును మార్చేశాను. అందులో ఐదు నెలలు మకాం పెట్టాక సొంత డొమైన్ కొనుక్కోవడం అందులో సొంత బ్లాగు ఏర్పాటు చేసుకోవడం జరిగాయి.

బ్లాగు మొదలు పెట్టిన కొత్త రోజుల్లో ఎడాపెడా రాసేశాను. బహుశా కొత్త బిచ్చగాడు పొద్దెరగడనేమొ! లేక మనసులో గూడుకట్టుకున్న భావాల వెల్లువ వురకడం వల్లనేమొ! లేక సమయం దొరకడం వల్లనేమొ! ఎందువల్లైతేనేం మొత్తం మీద ఇప్పటికి 170 దాకా బ్లాగాను. అవీ ఇవీ అని గాకుండా ఏది తోస్తే అది బ్లాగాను. అశ్రువులూ, ఆనంద బాష్పాలూ, నవ్వులూ, ఏడుపులూ, తిట్లూ, పొగడ్తలూ అన్నీ బ్లాగాను. కొన్ని కొందరిని అలరిస్తే, కొన్ని కొందరిని భాదిస్తే, మరికొన్ని వివాదాస్పదం అయ్యాయి. ఏవి ఎవరికి నచ్చినా, కోపం తెప్పించినా అవన్నీ కూడా నేనే! నా గురించి నా బ్లాగులు చెప్పినంతగా నా శ్రీమతి కూడా చెప్పలేదేమొ! నేను ఛాదస్తున్నో, కోపిష్టినో, ఆస్తికున్నో, నాస్తికున్నో, దయగలవాన్నో, దుష్టున్నో నా బ్లాగులే చెబుతాయి. నన్నింతగా వ్యక్తం చేసుకొనే అవకాశం కల్పించిన బ్లాగంటే నాకెంతో ఇష్టం కాదు కాదు వ్యసనం అయిపోయింది.

ఈ ఏడాదిలో నాకు నచ్చిన నా బ్లాగులు కొన్ని

ఆద్యాత్మికం [7]

నేనెందుకు మాంసాహారము మానేశాను? [8]

భిన్న ధృవాలు — BinnaDRvAlu [9]

రిజర్వేషాలు [10]

అన్నయ్యకో లేఖ – a letter to my brother [11]

పరమాత్మ [12]

ఇదీ మన భారతీయం! [13]

దేవుడి పుట్టుక [14]

భక్తి అంతా మూర్ఖత్వమేనా? [15]

సద్వినియోగము [16]

ఉత్తమ జీవితమా X వ్యర్థ జీవితమా? [17]

దేవుడు అని ఎవరిని చూపించాలి? (Who is God?) [18]

నమ్మకం [19]

దేవుడు రాశాడా? [20]

రిజర్వేషన్ హక్కు – దేశం తుక్కు తుక్కు [21]

పుచ్చకాయ (watermelon) [22]

వేరు పడటం [23]

ఆడబాప [24]

బళ్ళు X గుళ్ళు [25]

అభిమానం అమ్మకానికి [26]

అక్రమంలో క్రమం [27]

అంతరాత్మ [28]

ఉత్తరాలు [29]

తలసేమియా (జన్యు పరమైన జబ్బు):Thalassemia [30]

To Make a Difference (MAD) ఏం చేస్తోంది? [31]

“నేను” అనగా… [32]

ఇది మన జాతి లక్షణమా? [33]

అన్నీ వేదాల్లో వున్నాయిష [34]

తల్లుల్ని తయారుచెయ్యాలి [35]
నా బ్లాగుపై వచ్చిన సమీక్షలు

సూటిగా, వాడిగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా – చరసాల ప్రసాద్ [36]

నా బ్లాగును రావుగారు సమీక్షించారు. [37]
నా పాత బ్లాగులు చూద్దామని ఒకసారి వెళితే charasala.wordpress.comలో సందర్శకుల సంఖ్య నన్నాకర్షించింది. అందులోంచి నేను అక్టోబరు 2006లో నిష్క్రమించాను. ఇప్పటికి అక్కడికి వచ్చిన సందర్షకుల సంఖ్య 7160.

నా బ్లాగుకు ఏడాదినుండీ వస్తూ మీ అమూల్యమయిన అభిప్రాయాలను ఇస్తూ వస్తున్న పాఠకులందరికీ నా వందనాలు. మీ విమర్షలే నన్ను నేను మార్చుకోవడానికి, మలచుకోవడానికి పనికి వస్తాయి. అన్నిటినీ మించి ఎందరినీ మితృలను చూపించాయి.

–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=174

URLs in this post:

[1] చావాగారి బ్లాగు: http://oremuna.com/blog/

[2] బ్లాగురుల గుంపు: http://groups.google.com/group/telugublog?hl=en

[3] Verizon: http://www.verizon.com

[4] DOT: http://www.dot.gov

[5] గాంధి గారి సత్యంతో ప్రయోగాలు — నా సందేహాలు:: http://naapaluku.blogspot.com/2006/06/blog-post_02.html

[6] wordpress: http://charasala.wordpress.com

[7] ఆద్యాత్మికం: http://naapaluku.blogspot.com/2006/08/blog-post.html

[8] నేనెందుకు మాంసాహారము మానేశాను?: http://www.charasala.com/blog/?p=15

[9] భిన్న ధృవాలు — BinnaDRvAlu: http://www.charasala.com/blog/?p=23

[10] రిజర్వేషాలు: http://www.charasala.com/blog/?p=22

[11] అన్నయ్యకో లేఖ – a letter to my brother: http://www.charasala.com/blog/?p=40

[12] పరమాత్మ: http://www.charasala.com/blog/?p=56

[13] ఇదీ మన భారతీయం!: http://www.charasala.com/blog/?p=44

[14] దేవుడి పుట్టుక: http://www.charasala.com/blog/?p=86

[15] భక్తి అంతా మూర్ఖత్వమేనా?: http://www.charasala.com/blog/?p=85

[16] సద్వినియోగము: http://www.charasala.com/blog/?p=83

[17] ఉత్తమ జీవితమా X వ్యర్థ జీవితమా?: http://www.charasala.com/blog/?p=81

[18] దేవుడు అని ఎవరిని చూపించాలి? (Who is God?): http://www.charasala.com/blog/?p=76

[19] నమ్మకం: http://www.charasala.com/blog/?p=71

[20] దేవుడు రాశాడా?: http://www.charasala.com/blog/?p=69

[21] రిజర్వేషన్ హక్కు – దేశం తుక్కు తుక్కు: http://www.charasala.com/blog/?p=95

[22] పుచ్చకాయ (watermelon): http://www.charasala.com/blog/?p=89

[23] వేరు పడటం: http://www.charasala.com/blog/?p=111

[24] ఆడబాప: http://www.charasala.com/blog/?p=110

[25] బళ్ళు X గుళ్ళు: http://www.charasala.com/blog/?p=99

[26] అభిమానం అమ్మకానికి: http://www.charasala.com/blog/?p=98

[27] అక్రమంలో క్రమం: http://www.charasala.com/blog/?p=116

[28] అంతరాత్మ: http://www.charasala.com/blog/?p=124

[29] ఉత్తరాలు: http://www.charasala.com/blog/?p=125

[30] తలసేమియా (జన్యు పరమైన జబ్బు):Thalassemia: http://www.charasala.com/blog/?p=144

[31] To Make a Difference (MAD) ఏం చేస్తోంది?: http://www.charasala.com/blog/?p=137

[32] “నేను” అనగా…: http://www.charasala.com/blog/?p=150

[33] ఇది మన జాతి లక్షణమా?: http://www.charasala.com/blog/?p=159

[34] అన్నీ వేదాల్లో వున్నాయిష: http://www.charasala.com/blog/?p=154

[35] తల్లుల్ని తయారుచెయ్యాలి: http://www.charasala.com/blog/?p=167

[36] సూటిగా, వాడిగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా – చరసాల ప్రసాద్: http://poddu.net/?p=30

[37] నా బ్లాగును రావుగారు సమీక్షించారు.: http://tinyurl.com/2r7ygd