మాలల గోల దేనికి?
మాదిగల పోరాటం ఎందుకో తెలిసిందే. SC రిజర్వేషన్లలో అధిక భాగం మాలలే అనుభవిస్తున్నారని తమ వాటా తమకు దక్కటం లేదని వారి బాధ. నిజంగా అలా జరుగుతుంటే వాళ్ళ గోడు వినవలసిందే. ఒకవేళ జరగట్లేదని అనుకుంటే ఇప్పుడు వర్గీకరణ వల్ల పోయేదేమీ లేదు. జరుగుతూ వుంటే వర్గీకరణ ద్వారా మాదిగల వాటా మాదిగలకు ఇచ్చినట్లవుతుంది.
ఇది సరే మరి మాలల పోరాటం దేని మీద? ఏమి కావాలని? వర్గీకరణను ఎందుకని వ్యతిరేకిస్తున్నట్టు? ఇప్పుడు వీధి పోరాటాల ద్వారా జరగని SC ల మద్య వైషమ్యాలు వర్గీకరణ ద్వారా వస్తాయా? పోరాడి విడిపోవచ్చుగానీ పోరాడి కలసి వుండగలరా? రెండు పక్షాలకూ సమ్మతమైతేనే వుమ్మడి కుటుంబం కానీ ఒక పక్షం సొంత కుంపటి కావాలంటే ఆపటం ఎలా సాధ్యం? కొందరేమో మాలలు దోచుకుందేం లేదు కనీసం గంజైనా తాగగలుగుతున్నారు అంటారు. మాదిగలు కోరుతున్నదీ ఆ గంజిలో వాటానే కదా? ఇచ్చేస్తే పోలా?
మాదిగల పోరాటానికి కారణం కనిపిస్తోంది కానీ, మాలల పోరాటానికి హేతువేంటో బోధపడటం లేదు.
ఈ రాజకీయనాయకులు దీన్ని ఆసరాగా చేసుకొని ఒకరోజు మాదిగ మాట ఇంకో రోజు మాల మాట మాట్లాడుతున్నారు. ఎవ్వరికి ఎక్కువ ఓటు బలముందో తెలుసుకోలేక గింజుకుంటున్నారు.
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








తేది: May 30, 2007 సమయము: 6:15 pm
మీ ప్రశ్నకు ముందే జవాజు చెప్పాశారండి. వ్యతిరేకతకు ప్రధానకారణం మాలలకు రిజ్వర్వేషన్లు తగ్గుతాయనే. ఇక పైకి చెప్పేవి తూతూమంత్రం కబుర్లు
తేది: May 30, 2007 సమయము: 10:14 pm
“ఈ రాజకీయనాయకులు దీన్ని ఆసరాగా చేసుకొని ఒకరోజు మాదిగ మాట ఇంకో రోజు మాల మాట మాట్లాడుతున్నారు. ఎవ్వరికి ఎక్కువ ఓటు బలముందో తెలుసుకోలేక గింజుకుంటున్నారు.” వీళ్ళవల్లే కదా ఈ సమస్యలు. ప్రజలమంటారా- గొర్రెలమే. నిజంగా మాలవాళ్ళు కాని, మాదిగవాళ్ళుకానీ ఊళ్ళల్లో వాళ్ళ పాట్లు వాళ్ళు పడుతున్నారు. కడుపునిండిన నాయకులు మాత్రం వాళ్ళ వాళ్ళ ప్రాబల్యం కోసం తగూలు. రవిగారు చెప్పినది అక్షరాలా సరైన కారణం.
తేది: May 30, 2007 సమయము: 11:28 pm
ఎన్ని ముక్కలుగా చీల్చుతారండి సమాజాన్ని. యూరోప్ లాంటి చోట్ల దేశాల మధ్య గోడలే తీసేస్తుంటే, మన వారు ఇంకా ఇంకా చీలి చెండాలం చేస్తున్నారు. ప్చ్
తేది: May 31, 2007 సమయము: 7:04 am
వర్గీకరణ సౌలభ్యమే గానీ చీలడం అతుక్కోవడం ఏమిటండి. BCలు ఇన్ని వర్గాలుగా వున్నా ఈ తగాదా లేదే? ఇప్పుడు చీలే వున్నారు గదా మాల సంఘం/ మాదిగ దండోరా అని ఇక వర్గీకరిస్తే అంతకంటే చీలతారా అని.
మనం ఒక పోరాటం చేస్తున్నపుడు కనీసం న్యాయం పక్షాన పోరాడుతున్నట్లు నమ్మించనన్నా నమ్మించాలి. మాలల వుద్యమానికి ఈ కనీస మర్యాద కూడా తెలియట్లేదు.
–ప్రసాద్
http://blog.charasala.com
తేది: June 1, 2007 సమయము: 12:20 am
నిజమే…మాదిగల పోరాటానికి కనీసం ఒక కారణం అయినా ఉంది. MRPS వాళ్లు చాలా కాలంగా ఉద్యోగాల్లో, పదవుల్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయం గురించి అంకెలతో సహా నిరూపిస్తున్నారు. ఉమ్మడి రిజర్వేషన్ వల్ల మాదిగలకు అన్యాయం జరగలేదు అనేదే మాలల వాదన అయితే ఇప్పుడు వారి ఆందోళన అర్ధరహితం. వర్గీకరణ జరిగితే మాదిగలకు న్యాయం జరుగుతుందన్న దానికి ఇప్పుడు మాలలు వర్గీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటమే రుజువు.
తేది: July 11, 2007 సమయము: 4:32 am
మొదట ఈ కుల పోరాటాలు నాకు అస్సలు నచ్చలేదంది