డేరా సఛ్ఛా సౌద్

తేది: May 24, 2007 వర్గం: వర్తమానం రచన: చరసాల 1,882 views

అసలేమి జరుగుతోందక్కడ? ఈ గుర్మీత్ రామ్ రహీం సింగ్ గానీ, డేరా గానీ అసలు అవేంటో ఈ అల్లర్లు జరిగేదాకా తెలియదు. తీరా ఏంటని కాస్తా చరిత్ర పరికిస్తే 1978లో జరిగిన ఇలాంటి అల్లర్లే ఖలిస్తాన్ వుద్యమానికి వూపిరులూదాయని తెలిసింది. కాకుంటే ఇప్పుడు డేరా అప్పుడు నిరంకారి. ఇప్పుడు గుర్మీత్ రామ్ రహీం సింగ్ అప్పుడు బలదేవ్ సింగ్.
అప్పుడు ఆయనా గురు గోబింద్ సింగ్ ను అనుకరించాడనీ సిక్కు మతాన్ని కించ పరిచాడనీ అల్లర్లు జరిగాయి. బలదేవ్ సింగ్‌ను పంజాబ్‌లో అడుగు పెట్టనీయకుండా ప్రభుత్వం నిషేధిస్తే సుప్రీమ్ కోర్టు చెల్లదని కొట్టేసింది. చివరికి సిక్కు తీవ్రవాదులు బలదేవ్ సింగ్‌ను అతని సప్త రత్నాలనీ చంపేశారు. అయితే అప్పుడు భారత ప్రభుత్వం మీదా, హిందువుల మనో భావాల మీదా మొదలైన అపనమ్మకమే వేర్పాటువాదానికి భీజం వేసిందని తెలిసింది.

ఇప్పుడు గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు సచ్చరిత్ర ఏమీ లేదు. ఆయన మీద హత్యారోపణ, అత్యాచారారోపణలున్నాయి. డేరా సిద్దాంతం ప్రకారం డేరా సభ్యులను ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రేరేపించకూడదు. అయితే గుర్మీత్ రామ్ రహీం సింగ్ గత పంజాబ్ ఎన్నికల్లో ఒక పార్టీని బహిరంగంగా సమర్థించాడట. అయితే ఆయన వేషధారణ గురు గోబింద్ సింగ్‌కు అనుకరణగా వుందని ఆయన తమ మతాన్ని కించపరచారనడం ఎందుకో నాకంత సరిగ్గా అనిపించడం లేదు. ఒక్క వేషధారణే అనుకరించాడా లేక తనే ఆ గురువు అవతారమని చెప్పుకున్నాడా తెలియదు. అయినా మన భారతీయ సంప్రదాయములో నేను ఫలానా గురువు అవతారమని చెప్పుకోవడం సర్వసాధారణం.ఒకవేళ ఆయన వేషధారణ లేదా చేష్టలు సిక్కుల మనోభావాలని గాయ పరచి వుంటే అందుకు ఆయన నుండి వివరణ రాబట్టి ఇంకోసారి అలా జరగకూడదని హెచ్చరిస్తే సరిపోయేదేమొ! అన్ని డేరా సత్సంగాలను మూసేయాలని అల్టిమేటం ఇవ్వాలనడం చాలా ఎక్కువయ్యింది. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా, ప్రచారం చేసుకొనే హక్కు వున్నపుడు ఇంకొకరి మనోభావాలను నొప్పింపనంతవరకూ ఏ గుర్మీత్ సింగ్‌నైనా అనుమతించాలి. అసలు గురు గోవింద్ సింగ్‌ది ఏ వేషమో నాకు తెలియదు ఆ వేషం గురు గోబింద్ సింగ్ వేషంలా కాకతాళీయం అని ఆయన వాదిస్తే నిరూపించడం ఎట్లా?

ఒకవేళ మెజారిటీ ఓటర్ల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వారికి అనుకూలంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే రేపు వాటిని కోర్టులు కొట్టేయకుండా వుంటాయా?

కొసమెరుపు: గత ఎన్నికల్లో గుర్మీత్ రామ్ రహీం సింగ్ కాంగ్రెసును బహిరంగంగా సమర్థించినందులకు ఇప్పటి ప్రభుత్వం కక్ష సాధిస్తోందని కొందరంటున్నారు. డేరా అనుయూయులు ఎక్కువగా నిమ్న కులాలు, తక్కువ వృత్తుల వారు అట. వీరిని వేధించడానికి అగ్ర వర్ణాలు ఈ సందర్భాన్ని వుపయోగించుకుంటున్నాయట!
 
–ప్రసాద్
 

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో