Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/22/11733922/html/blog/index.php:2) in /home/content/22/11733922/html/blog/wp-content/plugins/bad-behavior/bad-behavior/screener.inc.php on line 8
అంతరంగం » Blog Archive » మన దారెటు

మన దారెటు

తేది: May 24, 2007 వర్గం: నా ఏడుపు, వర్తమానం రచన: చరసాల 3,184 views

మొన్న చంద్ర మోహన్ అన్న చిత్రకళను అభ్యసిస్తున్న తెలుగు విధ్యార్థిని గుజరాత్‌లో అరెస్టు చేసి నాలుగు రోజులు జైలులో పెట్టారట! కారణం అతను ఎవర్నో కొట్టాడనో, రాగింగ్ చేసి వేధించాడనో, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేశాడనో కాదు. అతను వేసిన చిత్రాలు హిందూ చాందసవాదులకు నచ్చక పోవడం వల్ల.

అప్పుడొకసారి హుస్సేను గారు సరస్వతీ దేవిని అసభ్యంగా గీశారని ఆయన బొమ్మలన్నీ తగులబెట్టి నానా రాద్దాంతం చేశారు.

ఎవ్వరూ వాలైంటైన్స్ రోజు జరుపుకోవద్దని ఓ సేనాధిపతి ఫత్వా జారి చేశారు.

ఇప్పుడేమొ ఓ విద్యార్థి గీసిన చిత్రాలు అభ్యంతరకరంగా వున్నాయంటూ అరెస్టు చేశారు. ఆ విధ్యార్థిని సమర్థించారంటూ డీన్‌ను సస్పెండు చేశారు.

రామాయణ భారతాలతో సహా ఏ గ్రంధమూ స్త్రీని వివస్త్రను చేసి అంగాంగ వర్ణన చేయకుండా వదిలిపెట్టలేదు. దేవాలయ గోపురాల మీదే నగ్న శిల్పాలు పెట్టుకొని ఆనందించిన వారసత్వం మనది. కామానికి ఒక శాస్త్రం మొట్టమొదట పుట్టింది ఇక్కడే నంటారు.

ఇలాంటి పవిత్ర భారత దేశంలో ప్రపంచానికి కామశాస్త్రాన్ని అందించిన వాత్సాయనుడు పుట్టిన దేశంలో ఎందుకనో అదే సంస్కృతికి వారసులమని, కాపాడే సంరక్షకులమనీ చెప్పుకునే దాదాలు అదే కళా సంస్కృతిని నడిరోడ్డుపై తగలేస్తున్నారు. కళను కళగా చూడక మామూలు బూతును చూస్తున్నారు.

–ప్రసాద్
 

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'మన దారెటు' పై 4 అభిప్రాయాలు

'మన దారెటు'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. సత్యసాయి అభిప్రాయం,

  తేది: May 25, 2007 సమయము: 2:07 am

  అవును, అసహనం పాలు చాలా పెరిగిపోయింది. ఇందులో కూడా పోటీ పెరిగిపోయింది. ఇక్కడ ఉన్న ఇండియన్ గ్రూపులో, ఒకసారి పాకిస్తానీ ముస్లిం క్రికెటర్ల మీద జోకు మెయిల్ చేస్తే, ముస్లింలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మొన్న వర్ల్డ్ కప్ లో ఇండియా ఓడిపోయినప్పుడు హనుమంతుడి పేరు గలజోకు ఎవరో మెయిల్ చేస్తే హిందువులు అభ్యంతరం తెలిపారు. ఎక్కడో డెన్మార్క్ లో మహమ్మద్ మీద కార్టూన్ వేస్తే పాతబస్తీలో దుకాణాలు తగలెట్టారు. మన సహన శక్తి రోజురోజుకీ ఏమైపోతోందో!

 2. చదువరి అభిప్రాయం,

  తేది: May 25, 2007 సమయము: 8:53 am

  ఓ విషయం అర్థం కాదు.. ఈ నగ్నచిత్రాలు వేసేవాళ్ళు, దేవుళ్ళూ దేవతలనే ఎందుకు ఎంచుకుంటారో తెలీదు. ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసీ ఎందుకలా వేస్తారో!? గజగామినివో, టాబూవో నగ్నచిత్రాలు వేసుకుని తృప్తి పడొచ్చు గదా! ఏకంగా దేవుళ్ళు, దేవతల చిత్రాలెందుకు గీయడం? ఒకళ్ళ తరవాత ఒకళ్ళు! ఎందుకంతటి మనోభావాల ధిక్కారం. జనం కోప్పడ్డారంటే పడరూ మరి!?

 3. Manjula అభిప్రాయం,

  తేది: May 29, 2007 సమయము: 3:27 pm

  It is a very sad state of affairs. The first censorship I’ve known was against ‘Mee Nathuram Bolte(???)translates to ‘It’s me Nathuram speaking’. I was still in school at that time. Govt should protect artists against these kinds of assualts.

 4. deepakacharya అభిప్రాయం,

  తేది: July 5, 2007 సమయము: 4:39 am

  అయ్యా! మన దేవాలయాలమీద వాత్సాయన శిల్పాలంటే మనకు మక్కువ. దామెర్ల వారి భార్య నగ్న చిత్రాలంటే ప్రీతి. మరి దేవుళ్ల నగ్న చిత్రాలు చూసి మనం ఎందుకు బాధ పడాలి. వాటిని కళా కండాలుగా చూడలేమా!

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో