తల్లుల్ని తయారుచెయ్యాలి

తేది: May 18, 2007 వర్గం: నా ఏడుపు, వర్తమానం రచన: చరసాల 959 views

“తల్లుల్ని తయారుచెయ్యాలి” — అన్న ఈ అంభానాధ్ గారి మూల వ్యాసం మీరిక్కడ చదవచ్చు. ఏ విషయమైనా ఈయన కుండ బ్రద్దలు కొట్టినట్లు ఏ సంకోచమూ లేకుండా రాసేస్తారు. నాకు ఈయనలోని ఈ సుగుణాన్ని చూస్తే ముచ్చటేస్తుంది. అయిటే ఈ గుణం వల్ల ఈయనలోని కుళ్ళు, అమాయకత్వం అన్నీ బట్ట బయలు అవుతాయి. ఈ మధ్య ఈయన రాసిన “భీమవరం బిక్కుబిక్కు” అనే కథనం చదవండి. ఈయన ఏ అభూత కల్పనలో నివసిస్తున్నారో అర్థం అవుతుంది. ఇక “ముంచుకొస్తున్న ముప్పు” చదవండి. కంప్యూటర్ విజ్ఞానం, కంప్యూటరీకరణ ఎలా చెడుపు చేస్తుందో చెప్పే శాస్త్రజ్ఞుడి అవతారం ఎత్తుతారు. అలాగే రెండు రోజుల వ్యవధిలో ఈయన రాసిన పరస్పర విరుద్దమైన “తూర్పు తిమోర్ తీరంలో శాంతి సూర్యోదయం” గురించి “మిత్రస్య చక్షుషా సమీక్షా మహే” చూడండి. ఒకచోట తెలుగు వాళ్ళకి ప్రత్యేక దేశం గురించి మాట్లాడుతూనే ఇంకో చోట తెలంగాణావాదుల ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని చెడుగుడు ఆడేస్తారు. ఈయన టపాలనీ క్రమం తప్పకుండా చదివేవారినీ, ఆయనమీద గొప్ప ఆశలు పెట్టుకున్న పాఠకులనీ “గోడల్లోంచీ నడిచేవాన్ని” అని చెప్పి నిర్ఘాతపోయేట్లు చేశారు. ఇక ఇంతకు మించి అంభానాధ్ గురించి పరిచయం లేని వాళ్ళకు చేయక్కరలేదు.

ఇక వీటన్నిటికీ తలమానికం ఈయన తల్లుల దినోత్సవం రోజు రాసిన “తల్లుల్ని తయారు చెయ్యాలి”. ఇది చదివి తండ్రినైన నేనే కుతకుత వుడికిపోతే పాపం తమ సర్వస్వమూ బిడ్డలకప్పగించి వారి అభ్యున్నతిలో తన ఆనందాన్ని చూసుకునే తల్లుల మనో వేదన ఎలా వుంటుందో ఆలోచిస్తే ..మ్మ్.. ఆ బాధ ఆ తల్లులే చెప్పగలరు.

ఆయన వ్యాసం చదివాక ఈయనింతేగా అనిపించింది. కానీ ఆ వెంటనే మగవాళ్ళ నుంచే గాక ఆడవాళ్ళ నుంచీ కూడా ప్రశంసల జల్లు చూస్తే కడుపు మండి పోయింది. ఆయనకొచ్చిన ప్రశంసలను చూసి కాదు… ఈ తల్లుల అమాయకత్వం చూసి. ఆనాడు ద్రౌపదిని పందెంలో ఒడ్డితే ఆ తల్లి కిక్కురుమననందుకు ఆమె మహా సాద్వి అయింది. చూలాలని తెలిసినా అడవులకు పంపిన రాముని దైవత్వాన్ని, ఇంటింటా ఓ పటము పెట్టుకొని, ఊరికొక దేవాలయం కట్టుకొని, ఈయనే మన ఇలవేల్పు దేవుడంటే ఆప్పటి నుండి ఇప్పటి వరకూ అమాయక స్త్రీజనం నమ్మేస్తూనే వుంది. మొగుడు ఏ లంజ గడప దొక్కినా అది రసికత, నీవు మాత్రం వంటింటి గడప దాటకూడదు, అదే పాతివ్రత్యం అంటే నాటినుండీ నేటివరకూ పిచ్చి మహిళ నమ్మేస్తూనే వుంది. పుణ్యం చేసుకున్న పురుషుడికి రంభా, ఊర్వశులు దొరుకుతారు.. పుణ్యం చేసుకున్న స్త్రీ మాత్రం పరలోకంలోను ఈ పురుషుణ్ణే పొందుతుంది అంటే ఇదేమన్యాయం అని ప్రశ్నించక పడి వుంది ఆడది. ఈ పక్షపాత న్యాయాన్ని ఎంతగా కాచి వడపోసి నరనరాల్లోకి ఎక్కించారంటే, ఆ పురాణ గాధలే మనకు గీటురాయి, ఆ సతీ సావిత్రులే మనకు ఆదర్ష పుణ్యస్త్రీలు అని నేటి మహిళలూ నమ్మేస్తున్నారు. ఆచారాల, భూటకపు ఆదర్షాల వలలో చిక్కి నలిగిపోతున్నారు.

అసలు తల్లులని తయారుచెయ్యడమేమిటి? తండ్రిని తయారుచెయ్యాల్సిన అవసరం లేకుండానే తల్లిని మాత్రం “తయారు” చేయాల్సి వచ్చిందా? అజిత్ కుమార్ అన్నట్లు అర్భకురాలైన కోడిపెట్ట దగ్గరికి కూడా అది పొదిగిన తర్వాత వెళ్ళాలంటే కష్టమే! మామూలు సమయంలో సాధువుగా వుండే ఆవు కూడా పుట్టిన బిడ్డను కాచుకోవడానికి పులినైనా ఎదురిస్తుందే…మరి తన పిల్లలను కాపాడుకోవడానికి తల్లికి మాత్రం చేతకాదా? దానికి శిక్షణ కావాలా?

ప్రకృతే తల్లిని తయారుచేస్తున్నపుడు ఇక తల్లిని మనం చేసేదేమిటి? ఒక వేళ తల్లుల దినోత్సవంగా ఒకరోజును గడపడం నచ్చకపోతే ఆ అలవాటు మీద గర్జించాలి గానీ ఇలా ఏకంగా తల్లులమీదా మీ ప్రతాపం?

అంబానాధ్ గారి వ్యాసాన్ని యధాతధంగా ఇక్కడ ఇస్తూ నాకు తోచిన వాఖ్యానాలు అక్కడే రాయాలనిపించింది. నా వాఖ్యలను బ్రాకెట్లో ఇస్తున్నాను.

———————————————————————-

ప్రతిదానికీ ఒక దినాన్ని కేటాయించడం తెల్లవారి ప్రత్యేకత.అలా సంవత్సరానికి ఉన్న 365 రోజుల్లో ప్రతిరోజుకు ఒక విషయాన్ని జోడించారు. ఆ క్రమంలో తల్లులకి సైతం ఒక రోజు కేటాయించారు.దానికి తల్లుల దినోత్సవం(Mother’s Day)అని పేరుపెట్టారు.

మారుతున్న నాగరికత నేపథ్యంలో తల్లితనం పట్ల మన దృక్పథాన్ని కూడా మార్చుకోవలసి ఉందేమో !(మన దృక్పధం ఇప్పటి వరకూ గొప్పగా వున్నట్లు!) ప్రపంచంలో ఎక్కువ మంది స్వయానా కోరుకుని తల్లులు కావట్లేదు. (అవును గదా పాపం, మగవాడు చేసే తప్పును అయిష్టంగానైనా మోయాల్సి వస్తోంది.) వారి ప్రమేయం లేకుండా వారికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి.వారి ప్రమేయం లేకుండానే వారు గర్భధారణ చేస్తున్నారు.ఆ విధంగా వారి ప్రమేయం లేకుండానే వారు తల్లులవుతున్నారు. (ఈమాటైనా మంచి మనసుతో ఒప్పుకున్నారు. వారి ప్రమేయం లేకపోవడం వాళ్ళు కోరుకునేది కాదు కదా?) ఇందువల్ల తల్లులు తమ సంతానాన్ని ప్రేమించాల్సినంతగా ప్రేమించలేకపోతున్న పరిస్థితి తలెత్తుతోంది. (ఇందువల్ల వాళ్ళు ప్రేమించలేకపోతున్నట్లయితే ప్రతి విశయంలోనూ ఆడవారి ప్రమేయం వుండేట్లు చూడాలి) తమ బాధ్యత ఏమిటనేది ఎవరికి వారు నిర్ణయించుకోవలసింది.కాని ప్రేమకి మరో పేరు బాధ్యత.అందుచేత ఎవరినీ ప్రేమించలేని తల్లుల మూలంగా బాధ్యత ప్రమాదంలో పడింది.(ఎవరినీ ప్రేమించని తల్లి, తల్లెలా అవుతుంది? అలాంతివారున్నా వారెంత శాతం?) తల్లులు కావడానికి అవసరమైన పరిణతీ పరిపక్వతా లేకుండానే ఆడవారు తల్లులు కావడం వారి సంతానానికో శాపం. (సంతానం మాటా దేవుడెరుగు. మొదటాది వాళ్ళకే శాపం. పరిణితీ పరిపక్వతా లేకుండా వారిని తల్లులను చేస్తున్న (వారి ప్రమేయం లేదని మీరేగా న్నారు) మగ ప్రభుద్దులను ఏ వురికొయ్యకు వేలాడదియ్యాలి? )వివాహ వయస్సు గురించి నేను మాట్లాడట్లేదు. (మాట్లాడరు. ఎందుకంటే నిన్నమొన్నటిదాకా చేసిన మన పెద్దల బాల్య వివాహాల వ్యవస్థని దిక్కరించాల్సి వస్తుందని మీకు భయం!)ఈ ప్రపంచంలో ప్రతి ఉద్యోగానికీ ఓ అర్హత అవసరమైనట్లే ఆడది తల్లి కావాలన్నా ఆమెకో అర్హత ఉండాలంటున్నాను. (భేషైన మాటన్నారు. కానీ ఆడదాని ప్రమేయమే లేకుండా చివరికి బట్టలు చించుకొనే పిచ్చి ఆడదాన్ని కూడా కామావసరాలకోసం తల్లిని చేస్తున్న ప్రభుద్దుల మధ్య అదెలా సాద్యం?)ప్రతి ఉద్యోగానికీ ఓ బాధ్యత ఉన్నట్లే తల్లితనంలో కూడా ఓ బాధ్యత ఉంది. (భేష్! భేష్! కాదనేది ఎవరు?) అది తలకెత్తుకోవడానికి ఇష్టపడని ఆడవారంతా తల్లులైపోయి సంతానాన్నీ సమాజాన్నీ బాధపెట్టొద్దంటున్నాను. (అయ్యొయ్యో! ఆమె ఇష్ట ప్రకారం ఆమెను చదువుకోనివ్వలేదు! ఆమె ఇష్ట ప్రకారం ఆమెకు పెళ్ళి జరగలేదు! ఆమె ఇష్ట ప్రకారం కనే హక్కు ఆమెకు లేదు! సమాజాన్ని బాధ పెట్టకుండా వుండే బాద్యత మాత్రం ఆమెకుందా? ఇదెక్కడి న్యాయం? బాధితురాలే, భాద్యతరాలవుతుందా? అంభానాధ్ గారూ?)
ప్రపంచం రోజురోజుకీ బాధ్యతలేని ఆడవారితో నిండిపోతోంది. (అవును పాపం అందుకే నిమిషానికో మానభంగం చేస్తున్నారు ఆడవారు!) దానికి స్త్రీవాదమనీ చిలకడదుంప అనీ పేరుపెట్టి భావితరాలకి ఇంకా ఇంకా ద్రోహం చేస్తున్నారు.(అదీ కథ! మీ అక్కసుకు కారణం స్త్రీ వాదం! కుక్కిన పేనులా పడివుండక, ఏ వెధవ్వేషాలు వేసినా ఎదురు మాటాడని పతివ్రతలా, సనాతన నారిలా వుండక ప్రశ్నించడం నేర్చుకుంటోంది కదా! అమ్మా ఇది ద్రోహమే భావితరాల మగవారికి.) అలా ద్రోహం చెయ్యడానికి ఓ రాజకీయ సైద్ధాంతిక భావజాల రూపాన్నీ హోదాని సమకూర్చేందుకు అహోరాత్రాలూ కష్టిస్తున్నారు.(అవును వాళ్ళేం కోల్పోతున్నారో వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మాత్రం సీతనీ, సావిత్రినీ, అనసూయనూ, లేదంటే అవ్వనీ, ముత్తవ్వనీ చూపించి పాతివ్రత్య సిద్దాంతాన్ని ప్రచారం చేయొచ్చు!) స్త్రీలలో స్త్రీత్వానికి సంబంధించిన అన్ని సెంటిమెంట్లనీ చావగొట్టడానికి సిద్ధమైన వీరు స్త్రీలలో మాతృత్వాన్ని గౌరవించమంటూ ఇల్లెక్కుతారు.(స్త్రీలలో స్త్రీత్వం సహజసిద్దమా ఇదికూడా తయారుచెయ్యబడిందా? మాతృత్వాన్ని గౌరవించని స్త్రీ వుంటే ఆమె కనడానికి ఇష్టపడటం లేదు. ఏం మగవాళ్ళు పెళ్ళి చేసుకోకుండా ఆజన్మ బ్రంహచారులుగా వుండటం లేదా? ఇక పిల్లలుండి మాతృత్వం నిరాకరిస్తున్న వారు అంటే కొంపదీసి సౌందర్యాకర్షణ మోజులో పడి పిల్లలకు పాలివ్వని తల్లులా? అయితే వాళ్ళెంత శాతం? మొత్తం ఆడవారిని వాళ్ళ జతన పెట్టెస్తారా?) మనసులో ఆడతనమే లేని ఆడవారికి మాతృత్వం మాత్రం ఎక్కడినుంచి సిద్ధిస్తుంది ? మాతృత్వం ఏమైనా బ్రహ్మపదార్థమా ? ఆడతనంలో అదో భాగం మాత్రమే. (ఇంతకీ ఈ ఆడతనం బ్రహ్మ పదార్థమా?) సరైన కూతుళ్ళుగా ఉండలేనివారు సరైన పెళ్ళాల పాత్ర ఎలా పోషిస్తారు ? (సరైన పెళ్ళాం పాత్ర అంటే “భోజ్యేశు మాతా, శయనేచ రంభా, కార్యేషు దాసీ” అదేనా? అహా! ఆడదాని మీద పెత్తనం చేయడానికి ఎన్నెన్ని పతివ్రతా ధర్మాలు! దాసిగా వుండటం, రంభగా వుండటం ఇలాంటివేనా పెళ్ళాం ధర్మాలు?) సరైన పెళ్ళాలుగా ఉండలేనివారు సరైన తల్లులుగా ఎలా ప్రవర్తించగలరు ? సరైన తల్లులు కాలేనివారు సరైన అమ్మమ్మలుగా నానమ్మలుగా సరైన అత్తలుగా ఎలా కొనసాగగలరు ? పిల్లల్ని ప్రేమించలేని ఆడవారు కోడలి మీది ద్వేషంతో కొడుక్కి అన్యాయం చెయ్యడానికి వెనుదియ్యట్లేదు.అందుచేత అలాంటి ఇళ్ళల్లో ఎలాంటి మదర్స్ డేలూ జరగవు.అలాగే స్త్రీవాదుల మాట చెల్లే కుటుంబాల్లో కూడా మగపిల్లలకి ఉద్దేశపూర్వకంగా అన్యాయం చెయ్యబడుతోంది. (ఒక్క వుదాహరణన్నా చూపించాల్సింది. ప్రతి వర్గంలోనూ సహజత్వానికి వ్యతిరేకంగా కొందరుంటారు. వాళ్ళనే ఆ వర్గానికంతటకూ ప్రతినిధులను చేయలేం! ఏదో ఒక అమ్మ కొడుకును సరిగ్గా చూడకపోతే ఇక స్త్రీ వాదులందరూ అంతేనా? స్త్రీవాదులంటే కూతురిని గొప్పజేసి కొడుకును తక్కువ జేసేది కాదు. ఇద్దరినీ సమాన ప్రేమతో పెంచేది నిజమైన స్త్రీవాది. ఆ లెక్కన ఇన్ని యుగాలూ అన్నింటా కొడుకులే పెత్తనం చెలాయించారు గనుక అప్పటి తల్లులంతా పురుషవాదులా?) పీడితులే కాలక్రమంలో పీడకులవుతారని ఇందుమూలంగా వెల్లడౌతోంది. (తల్లులు పీడకులయితే ఆడపిల్లల నోట్లో వడ్లగింజ వేసేది కాదు పుట్టగానే మగపిల్లల నోట్లో వడ్లగింజ వేసి చంపి వుందురు!) తల్లుల్లో ఆచరణాత్మకంగా మాజీ తల్లులు (functional ex-mothers) అయిన వర్గం కూడా ఒకటుంది.కొడుకులు పెద్దవారయ్యాక వారితో తెగతెంపులు చేసుకుని కూతుళ్ళ దగ్గర ఉంటూ ఉన్నదేదో కూతుళ్ళకి దోచిపెట్టాలనే ధోరణి గల వర్గం ఇది.(ఇక దోచేదేం వుంటుంది.. చిన్నప్పటి నుండి దోచి దోచి కూతుర్ల పొట్టలు కొట్టి మగ పిల్లాడు, మగ మహారాజు అంటూ నెత్తికెత్తి దోచే పెట్టుంటారు కదా!) బంధువులతో చేరి కొడుకు మీద వ్యాజ్యాలు నడిపే తల్లులు కూడా బాగానే ఉన్నారు. (ముసలి వయసులో తల్లిదండ్రులను సరిగా చూడని కొడుకుల మీదా దావా వేస్తే తప్పేంటో!) ఇలాంటి కుటుంబాల్లో కూడా మదర్స్ డేలు జరగవు.( మదర్స్ డే కాదు కదా మదర్‌కి అన్నం కుడా పెట్టరు ఈ దౌర్భాగ్యులు!) కొడుకు బావుంటే చూసి ఓర్వలేని తల్లులు కూడా ఉన్నారు. (కాయకష్టం చేసి తినో తినకో కొడుకును పెంచితే వాడు కాస్తా పెద్దయ్యాక తల్లిదండ్రులను గెంటేసిన వృత్తాంతాలు మీకు కనిపించలేదు గావును. లేకుంటే కావాలని కళ్ళు మూసుకొని వుంటారు) గృహహింసలో అధికభాగం తల్లులు పిల్లలపై చేస్తున్న భౌతిక దాడులే.తమ మానసిక ఒత్తిళ్ళని పిల్లలపై తీర్చుకోవడం మూలంగా ఇది సంభవిస్తోంది. (కళ్ళూ తెరిపించారండీ. పిల్లవాడు సరిగ్గా చదవట్లేదనో, తిండి సరిగ్గా తినట్లేదనో, బట్టలు మురికి చేసుకొని వచ్చాడనో కొట్టిన, తిట్టిన మెజారిటీ తల్లుల నేనెరుగుదు గానీ, అకారణంగా తమ మానసిక సమస్యలతో పిల్లలను భాధించే తల్లుల కేసులెన్ని? ఒకవేళ వుండినా తాగి వచ్చి, పేకాడి, అప్పుల బాధలతో, ఇంకెన్నో బయటి చీకాకులతో ఇంటికి వచ్చి ఆ కోపం ఇంట్లో తన మీదే ఆధారపడిన భార్య మీదా, పిల్లల మీదా చూపించిన సంఘటనలెన్ని? పిల్లల ముందే తల్లిని దూషిస్తున్న, కొదుతున్న, కిరోసిన్ పోసి తగలేస్తున్న, కట్నం తేలేదని పీడిస్తున్న ఘటనలెన్ని?) పిల్లలు తల్లుల సంరక్షణలో తప్ప ఇంకెక్కడా ఉండడం సాధ్యపడదు.కాని అక్కడే వారికి ముప్పు కూడా ఎదురవుతోంది.తల్లులు వారిని ప్రత్యేక మనుషులుగా పరిగణించట్లేదు. (అబ్బా! పిల్లల మానవహక్కులు గురించి కుడా మీకు తెలుసే?! అంతకంటే ముందు స్త్రీ మనిషి అని గుర్తించారా?) తాము చావాలనుకున్నప్పుడు వారిని కూడా హత్య చేస్తున్నారు. (పాపం! తల్లులు పిల్లలెక్కడ దిక్కులేనివారవుతారో అనే పిచ్చి బెంగతో తమతో పాటు పిల్లలనీ చంపుతున్నారు. కట్నం కోసం చంపటం లేదుగా? అయినా తల్లికి చావాలనే కోరిక ఎందుకు వస్తోందో? రైతులకు తినింది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆనక ఎవరో అన్నట్లూ మీరూ అనకండి) తల్లులు పాల్పడుతున్న ఈ child abuse ని నివారించడం మీదనే కుటుంబవ్యవస్థ యొక్క భవిష్యత్ విజయం ఆధారపడి ఉంటుంది.(ముందు పెళ్ళాం abuse గురించి తెలియదు గానీ, తల్లులు పిల్లలని abuse చేస్తున్నారట! అవ్వ!) దీనికంతటికీ కారణం చిన్నప్పటినుంచి తల్లితనంలో శిక్షణ లోపించడమే! (నిజమే! తల్లికి శిక్షణ కావాలి. మరి తండ్రికి వద్దా? వేకువనే లేచి ఇంటిల్లిపాదీ అవసరాలను తీర్చే తల్లి అవసరం ఎవరూ గమనించకపోతే, పిల్లలు విసిగించినపుడు ఆ తల్లికి కోపం వచ్చి ఆ తల్లి ఒకటి తగిలిస్తే అది child abuse! కానీ ఆ తల్లిమీద భర్త, మామ, అత్త, ఆడపడచు చేసే అఘాయిత్యాలు పంటి బిగువుతో భరించాల్సిందేనా?) ఎందుకంటే తల్లితనం పూర్తి స్వాభావికంగా వచ్చేది కాదు.చాలావఱకు అభ్యసించవలసిందే! (ఒక్క మనిషి జాతిలోనే తండ్రి పాత్ర వుంది. తండ్రికి శిక్షణ అవసరం, ఎందుకంటే కుటుంభాన్ని తండ్రి సంరక్షించడం, పోషించడం అనేవి చాలా పక్షి, జంతు జాతుల్లో లేదు! కానీ జన్మనివ్వడంతోనే తల్లికి తల్లిదనం ప్రసాదించిన (అన్ని జాతుల్లోనూ) తల్లికే శిక్షణ అవసరమయితే, ఇక తండ్రికీ, తాతకీ, మామకీ ఇంకెంత అవసరం?) తల్లితనపు శిక్షణలో అనేక అంశాలు (subjects)అంతర్భవిస్తాయి.ఆ విధంగా అది ఒక బహుశాస్త్ర సంగమం.స్త్రీలకి ఇలాంటి శాస్త్రీయమైన సక్రమమైన నిర్మాణాత్మకమైన దిశానిర్దేశం కరువై ఆ సైద్ధాంతిక శూన్యాన్ని (స్వార్థం తప్ప వేరే అజెండా లేని)((ఎంత నిస్సిగ్గుగా అంటున్నారీమాట! తన కన్నవారు నీకిక మొగుడే దిక్కంటూ వదిలేస్తారు. ఆ మొగుడు నేను తన్నినా, చంపినా, తిట్టినా, కొట్టినా నీవు నా ఆస్తి, నా హక్కు అని పెత్తనం చేస్తాడు. చివరికి స్త్రీకి తనకంటూ దాచుకోవడానికి చివరికి తన వంటిమీద కూడా అరంగుళం మీదైనా పెత్తనం లేదు! అలాంటి స్త్రీకి స్వార్థం ఏమి లాభిస్తుంది? స్త్రీవాదంతో స్త్రీ కోరుకునేదల్లా మీతోమాదిరి నన్నూ మనిషిగా చూడండహో అని! అదికూడా మీ కళ్ళకు స్వార్థం అయిపోయిందా?) స్త్రీవాదం లాంటివి భర్తీ చేస్తున్నాయి. ఈ వక్రగతినీ తన్మూలకమైన జాతీయ విషాదాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. (స్త్రీవాదాన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఈ జన్మ సరిపోయేట్లు క్లేదు, బహుశా మీ భాషలో “జాతీయ విషాదం” అంటే “మగ జాతీయ విషాద”మేమొ!)

జీవితం పట్లా తోటి మనుషుల పట్లా ఏర్పడిన అవగాహనాపరమైన లోపాలు ప్రవర్తనా పరమైన లోపాలుగా పరిణమిస్తాయి. (ప్రవర్తనాలోపమా? స్త్రీకి ఎలాంటి ప్రవర్తనను నిర్దేశిస్తున్నారు మీరు? సతీ సావిత్రుల ప్రవర్తనా? సీతా అనసూయల ప్రవర్తనా? కుష్టు రోగైన భర్తను కూడా గంపలో మోసే దుస్తితిలోనే స్త్రీ వుండాలని మీ వుద్దేశ్యమా? తన ఇష్టాయిష్టాల ప్రసక్తి లేకుండానే ఓ దుష్టుడు తనని నిర్భందిస్తే నోరుమూసుకొని అగ్గిలో దూకి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న సిగ్గులేని సీత ప్రవర్తనా?) స్త్రీలలోని ఈ లోపాల్ని వర్తమాన స్త్రీవాదం అనేక విధాలుగా వెనకేసుకొస్తుంది.(ప్రతి అడ్డమైన దారిలో నడవమని స్త్రీ వాదం చెప్పదు. అడ్డమైన దారిలో తిరుగుతూ నీవు మాత్రం పతివ్రతగా వుండు అని చెప్పే మన పాతివ్రత్య ధర్మాన్ని నిలదీస్తుంది ఆధునిక స్త్రీవాదం! మగవాడు మాత్రమే మనిషెలా అయ్యాడో, స్త్రీ మాత్రం మగవాడికి అంట్లు తోమే, బట్టలుతికే, పడగ్గదిలో కోరిక తీర్చే బానిస వస్తువెలా అయ్యిందో నిగ్గదీస్తుంది.) కాబట్టి ఈరోజు బాధ్యత అక్కర్లేని ప్రతి స్త్రీకి తనదంటూ ఒక సొంత స్త్రీవాదం ఉంది.మగవారు వారినుంచి బాధ్యతని ఆశించిన ప్రతి సందర్భంలోను వారు దాన్ని సంచిలోంచి బయటికి తీస్తారు.(ఏమిటా మగవాడు ఆశించే భాద్యత? ఇంటికి రాగానే కాళ్ళు ఒత్తడం, నోటికి రుచిగా వంట చేయడం, కంటికింపుగా తయారవడం, మందూ, విందూ, పొందూ అన్నీ తనే అవడం. ఇదేనా? అసలు మగకో భాద్యతా, ఆడకో బాద్యతా ఎందుకు? ఆదిమకాలంలో మగాడితో పాటు ఆడది సంపాదన చేయలేకపోయేదేమొ గానీ ఇప్పుడు ఆడది కూడా చేస్తున్నది కదా? ఆడదాని బాద్యతలను మగాడు ఎందుకు తీసుకోడు?) అందుకే ఈ లోపాల స్థానంలో స్త్రీలకి మాతృత్వ వాస్తవాల గురించిన సమగ్ర శిక్షణ కావాలని కోరుకుంటున్నాం. ఓ ప్రత్యేక కాలఖండంలో సున్నిత మనస్కులైనవారు అగాధమైన హృదయానుభూతితో గాఢంగా మధనపడి  తలపోసి దర్శించిన భావజాలాన్ని(ముక్కుమూసుకొనో, ఒంటికాలిమీద నిబడే, గాలి మాత్రమే భక్షిస్తేనో వచ్చిన భావజాలమా?) తరువాతి కాలంలో అంతగా సున్నితత్వం లేని తోలుమందం మనుషులు కూడా అందిపుచ్చుకుని వాటిని స్వప్రయోజక వాదాల్లో తురుపు ముక్కలుగా శుష్క నినాదాలుగా ప్రయోగిస్తారు. (ఈ సున్నిత మనస్కులేనా భర్త చనిపోతే ఇక ఆ భార్య జీవితం అంతే గనుక అతనితోనే చనిపోవాలని దర్శించింది? ఈ హృదయమున్న వారేనా భార్య చనిపోతే పదిమందినైనా చేసుకోవచ్చుగానీ ఆడది మాత్రం జీవచ్చవంలా జీవించాలని చెప్పింది? అర్థం చేసుకోలేని తోలుమందం మీదగ్గర పెట్టుకొని స్త్రీవాదులది తోలుమందం అంటే ఎలా?) బాధలు పడేవారిని షోకేసులో ప్రదర్శనకి పెట్టి ఏ బాధలూ ఎరగనివారు హక్కుల్నీ అధికారాల్నీ సౌకర్యాల్నీ చేజిక్కించుకుంటారు.సదరు భావజాలాలు మౌలికంగా ప్రతిస్పందనలే (reactions)తప్ప స్పందనలు కాకపోవడం చేత వాటిని యథాతథంగా నిలబెట్టాలంటే ఆ బాధలూ ఘర్షణలూ ఏదో ఒక రూపంలో ఎంత చిన్న స్థాయిలో నైనా కొనసాగుతూనే ఉండడం ఓ సైద్ధాంతిక ఆవశ్యకత.మనుషుల్లాగానే భావజాలాలు కూడా రాజకీయ కార్యక్షేత్రానికి చేరుకున్నాక కుళ్ళిపోక తప్పదు.సమకాలీన స్త్రీవాదం అలాంటి కీలక చారిత్రిక ఘట్టాన్ని స్పృశించింది. (స్పందించే దశకు చేరాలంటే ముందు ప్రతిస్పందించడం నేర్చుకోవాలి. కాల్చుతున్నవాడినుండి తప్పుకోగలగడం నేర్చుకుంటే కదా తర్వాత కాల్చడం నేర్చుకొనేది.)

ఎక్కువమంది తల్లుల దృష్టిలో పిల్లలు ఇంట్లో ప్రతిపక్షాలు. (మీరున్నది భూలోకంలో కాదా?)వారిని చదువు పేరుతో బయటికి పంపి వారి బాధ్యతని బయటివారి మీద వదిలిపెట్టి తాము స్వేచ్ఛనీ మనశ్శాంతినీ కొనుక్కుంటారు. (తెల్లవారుఝామున మొదలయ్యే ఇంటి చాకిరీ నుండి కాస్తా వెసులుబాటు కోరుకుంటారేమొ గానీ వారినుండి ఏ తల్లీ స్వేఛ్ఛ కోరుకోదు. అలా కోరుకునే తల్లి వుంటే అది మంచి ఆఫిల్ పళ్ళలో ఓ కుళ్ళిన ఆఫిలే తప్ప మరేమీ కాదు) పిల్లలకి వేసవి సెలవులు ఇస్తున్నారంటే తల్లులకి గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి.నీటి సంపులో పడిపోయి చనిపోయిన ప్రతి పిల్లవాడి వెనుకా, ఇంటి ముందు ఆడుకుంటూ ఏ వాహనమో ఢీకొట్టి చనిపోయిన ప్రతి బిడ్డ వెనుకా ఓ బాధ్యతా రహితురాలైన తల్లి ఉంటుంది. ( ఏం తండ్రి వుండడా? సంపునలా తెరిచి వుంచిన దరిద్రుడుండడా? తాగి వాహనం నడిపే వెధవ వుండడా? లేచింది మొదలు విశ్రాంతినివ్వకుండా భార్యను వేధించే మొగుడో, అత్తో వుండదా?) బడికి వెళ్ళే పిల్లలకి సరైన భోజనం ఇచ్చి పంపడానికి బద్ధకించి పసుపూ నిమ్మకాయ కలిపిన పాచికూడు పులిహోర పేరుతో కలిపి ఇచ్చే మిలియన్లాది తల్లులున్నారు ఆంధ్రాలో.”మీ అబ్బాయి రోజూ అన్నం పారేస్తున్నాడు కాబట్టి ఇకపైన సరైన భోజనం కట్టి పంపగలరు”అని తల్లిదండ్రులకి ఏదో ఒక సందర్భంలో ఉత్తరం రాయని HM ఆంధ్రదేశంలో లేదు. (అయ్యబాబోయ్! అయితే ఆంద్రదేశంలో ఏ స్కూలుకెళ్ళినా పాచికూడు వాసనే వస్తుండాలి. ఏ స్కూలు బయట చూసినా పారేసిన అన్నమే కనపడుతుండాలి. ప్రతిరోజూ ఇంటి పని చేసి, మళ్ళీ పొలం పని చేయడానికీ వెళ్ళే మా అమ్మ కుడా పొద్దున్నే అన్నం వండి, పచ్చడైనా చేసి పంపిందేమొ గానీ పాచికూడు ఎప్పుడూ పంపలేదు. నేను చదివిన ప్రభుత్వ పాఠశాలలో ఏ తల్లీ అలా చేయగా నా పదేళ్ళ పాఠశాల అనుభవంలో చూడలేదు. మీరు మిలియన్ల మందిని బహుశా ఆంద్రదేశంలో చూసివుండరు. మరేదో లోకంలో చూసివుంటారు, గాలిలో నడిచి వెళ్ళి.)

బాధ్యతా రహితులైన ఆడవారు తల్లులై కూర్చోవడం వెనుక తరతరాల సంప్రదాయ పాత్ర ఉంది. (అయితే మీరూ తరతరాల సంప్రదాయం చెత్తదే అని అంగీకరిస్తారు) ఏ దేశంలో నయినా మగవాడి నుంచి సమాజం చాలా ఎక్కువ ఆశిస్తుంది.ఆడదాని పట్ల సమాజం ఎలాంటి భ్రమల్నీ ఆశల్నీ పెంచుకోదు.(ఎందుకో మీకు తెలుసు. ఆడది కూతురిగా తండ్రికింద, భార్యగా భర్త కింద, తల్లిగా కొడుకుకింద జీవితాంతం జీవిస్తే ఇక ఆమెంటూ చేయడానికి ఏముంది గనుక? మగాడి కిచ్చే హక్కులూ, భాద్యతలూ, స్వేఛ్ఛా ఆడవారికీ ఇస్తే వారినుండీ ఏమైనా ఆశించవచ్చు. వంటగది నుండి బయటకు రాని, రానివ్వని సమాజంలో కమ్మని వంటలూ, చక్కని ముగ్గులూ తప్ప ఏమి ఆశిస్తాం? ఆడదాన్ని మనిషిగా చూడక ఒక భోగ వస్తువుగా చూసినన్ని రోజులూ ఆ ఆడది సమాజానికి భోగాన్ని తప్ప ఏమి సమకూరుస్తుంది?) అందుచేత స్వయంకృషితో జీవితంలో ఓ స్థాయికి చేరుకున్న దశలో మాత్రమే మగవారు పెళ్ళిచేసుకుంటున్నారు.తండ్రులవుతున్నారు. (మగాడికి స్వేఛ్ఛ వుండి కాదా? మగాడు వద్దన్నా ఆడది కనేస్తుందా పాపం?) ఈ విధమైన ఆంక్ష ఆడవారి మీద లేకపోవడం చేత పొద్దున లేవగానే బాత్‌రూమ్‌కి వెళ్ళడం ఎంత మామూలో పెళ్ళి కాగానే పిల్లల్ని కనడం ఆడవారికి అంత మామూలు విషయమైపోయింది. (ఎంత జుగుప్సాకరంగా చెబుతున్నారంటే నేను పిల్లలని కంటాను అని చీరెత్తుకొని ఆడది మొగాడి వెంటపడుతున్నట్లు చెబుతున్నారు. ఛి నేనూ అసహ్యంగా మాట్లాడక తప్పటం లేదు. నేను ఇంకా చదువుతాను మొర్రో! నాకిప్పుడే పెళ్ళి వద్దు మొర్రో! నాకిప్పుడే పిల్లలొద్దొ మొర్రో అంటే వినేవారెవరు? ఆడదానికా స్వతంత్రత లేదు. పెళ్ళి కాగానే కడుపు రాకుండా వుండటానికి మగాడికి కండోమ్ తొడిగే స్వేఛ్ఛ కానీ, కండోమ్ వాడి తీరాలని మొగవాన్ని నిలదీసే హక్కుగానీ ఆడదానికి లేవే! ఎదిగీ ఎదగ్గానే కూతురుకు పెళ్ళి చేసి బరువు దించుకుంటారు తల్లిదండ్రులు. పెళ్ళీ అయీ అవగానే ఏమమ్మా నాకో మనవన్నివ్వరాదూ అని వెనకపడతారు అమ్మమ్మలూ, నాయనమ్మలూ. ఒకవేళ మగవాడిలో లోపముండి పిల్లలు కలగపోయినా నీదే తప్పు నేను ఇంకో పెళ్ళి చేసుకుంటా అని బెదిరిస్తాడు మొగుడు. నువ్వు గొడ్రాలువి అంటు అమ్మలక్కలంతా మొహం తిప్పుకొని పోతారు. ఇది ఏ బాధా ఎవరికీ చెప్పుకోలేని అమ్మాయికి, తన అంటూ ఎవరూ లేని అమ్మాయికి ఎంత మానసిక క్షోభో గుర్తించారా? పెళ్ళి కాగానే పిల్లలను కనడం భార్య కంటే భర్తే కారణాం. పిల్లలు వద్దనుకుంటే మగాడు ఏదైనా చెయ్యగలడు. వాడి మోచేతి నీళ్ళూ తాగుతూ ఇంకొకరి పంచన పడి వాళ్ళేసేది తిని బతికే ఆడదానికి కనడం, మానడం అనే స్వేఛ్ఛ కూడా వుందా? నాకిప్పుడే పెళ్ళి వద్దన్నందుకు నిన్నగాక మొన్న దేవస్థానం వారి పెళ్ళి పందిరిలో కెమరా కన్నుల సాక్షిగా ఓ ఆడపిల్లను ఆమె తండ్రే కాలితో తన్నడం మీ కళ్ళకు ఆనలేదా? లేక మీరు గుడ్డివాళ్ళా? నాకిప్పుడే పెళ్ళి వద్దు అని ఓ మగాడు తండ్రిని దిక్కరించగలడు. ఓ ఆడది దిక్కరించగలదా? ఇప్పుడే నాకు పిల్లలు వద్దు అని ఓ మగాడు కండోం వాడగలడు లేదా తన భార్యకు మాలా మాత్రలు తినమని ప్రోత్సహించగలడు, కానీ తన శరీరం మీదే తనకు అధికారం లేని ఆడది తన ఇచ్చ ప్రకారం పిల్లలని కనగలదా? ఆధునిక స్త్రీవాదం ఆ హక్కునూ అడుగుతోంది. మీరేమో అది స్వార్థం అంటారు. తోలుమందం అంటారు.) అది వారికి ఒక విధమైన ఉద్యోగ వ్యాసంగం (career)గా కాపురాన్ని నిలబెట్టుకునే సాధనంగా మిగిలిపోయింది.అందులో సెంటిమెంటు లేదు.ప్రేమ లేదు.నిస్వార్థం లేదు.బంధం లేదు.వారిలోనుంచి అనంతర కాలంలో అత్తలనబడే లేడీ విలన్లు తయారుకావడానికి ఇదో కారణం. (నిజమే అత్తలు ఏర్పడడానికి ఇలాంటి అభద్రతా స్థితే కారణం. తనకు తండ్రి తోడు ళేదు, భర్త తోడు లేదు. కాస్తా తన మాట వినే కొడుకు కూడా ఇప్పుడు తనవాడు కాకుండా ఎక్కడ పోతాడోననే బెంగ ప్రతి అత్తకూ వుంటుంది. అదీగాక తనకంటే ఏడాది లేటుగా అదే తరగతిలో చేరిన జూనియర్ విధ్యార్థిపై సీనియర్ విధ్యార్థి అంత అధికారం చెలాయిస్తే, ర్యాగింగ్ చేస్తే అదే ఇంటికి కోడలికంటే 20/30 ఏళ్ళ ముందు కోడలిగా వచ్చిన అత్తకెంత సీనియారిటీ పొగరు వుండాలి. తన హక్కులను ఎవరో కొత్తగా వచ్చిన కోడలి పిల్ల ఎత్తుకుపోతూ వుంటే ఎంత తన్నుకు చావాలి. పురుషులకూ ఇళా పెళ్ళయ్యాక ఇంకో ఇంటికి బానిసగా వేళ్ళే ఆచారముంటే అప్పుడు తెలుస్తుంది ఆ భాధ!)

మనిషికి పుట్టగానే ఏమీ కనపడదు.ఏమీ వినపడదు.కళ్ళూ చెవులూ పనిచెయ్యకపోవడం అందుకు కారణం కాదు.అవి బాగానే పనిచేస్తాయి.కాని అవి చూసినవాటికీ విన్నవాటికీ భాష్యం (interpretation)చెప్పే స్థాయికి అతని మెదడు అప్పటికి ఎదక్కపోవడమే అందుకు కారణం.కాలక్రమంలో కళ్ళ యొక్క చెవుల యొక్క శక్తుల్ని ఉపయోగించుకోవడం మనిషి మెదడు నేర్చుకుంటుంది.అప్పుడు మనకి అన్నీ కనిపిస్తున్నట్లూ వినిపిస్తున్నట్లూ అనిపిస్తుంది.అలాగే బిడ్డ కలిగిన తరువాత అతని/ఆమె మీద ప్రేమ కలగడానికి సమయం తీసుకుంటుంది.సినిమాల్లో చూపించినట్లు ప్రేమ వెనువెంటనే పాలలాగా చిప్పిల్లదు. (భర్తకు భార్య మీదా, భార్యకు భర్తమీదా పెళ్ళవగానే అలాంటి ప్రేమ పుట్టదు. దానికి కలిసి బతకడం, కష్టనష్టాల్లో తోడుగా నిలవడం తోడ్పడతాయి. మీ వుదాహరణ అక్కడ పనిచేస్తుండి గానీ, తల్లికి, బిడ్డకూ మద్య కాదు. పొత్తిళ్ళలో పసిగుడ్డు తనకు తను రక్షించుకోవడం చాతకాదు  గనుక ప్రకృతి తల్లిలో ఆ ప్రేమను సహజంగా ప్రవేశపెట్టింది. ఒకవేళ ఏ జీవిలోనైనా పుట్టగానే బిడ్డమీద ప్రేమ కలగని జీను వుంటే అలాంటి జాతి తన పరిణామ దశలో ఏనాడో అంతర్ధానమయ్యుంటుంది. బిడ్డ పుట్టగానే ఏడవడమెందుకో తెలుసా? బిడ్డను హత్తుకోగానే తల్లికి చనుమొనలు సలిపి పాలెందుకు చిమ్మబడతాయో తెలుసా? మీరు పొరబడుతున్న అంశం ఇంకోటి వుంది. బిడ్డ కలిగాక వాడి బోసినవ్వులను చూసో, అందం చూసో, అమాయకత్వాన్ని చూసో, బుడిబుడి అడుగులు చూసో, లేక పున్నామ నరకం నుంచీ తప్పించే అవసరం చూసో ప్రేమ పుట్టేది తండ్రికి. తండ్రికీ బిడ్డకూ అనుబందం మనిషి కల్పించింది. కానీ బిడ్డతో తల్లికి అనుబందం బిడ్డ కడుపులో పడ్డప్పుడే మొదలవుతుంది. బిడ్డకోసం తను జీవిస్తుంది, తనతో వూసులాడుతుంది, బుజ్జగిస్తుంది, లాలిస్తుంది. లోపలి బిడ్డకు ఎక్కడ అసౌకర్యం కలుగుతుందోనని పడుకునేటప్పుడు కూడా చింతిస్తుంది. బిడ్డమీద మమకారం ఒక్కరోజుతో కలగదు అనుకున్నా తొమ్మిదినెలలపాటు బిడ్డతో పాటు ప్రేమా పెరుగుతుంది. తల్లికి పుట్టిన బిడ్డ మీద ప్రేమ కలగడం కంట్లో నలుసు పడితే నీళ్ళు వచ్చినంత సహజమని నేను మనసారా నమ్ముతాను. ఇందుకు భిన్నంగా అక్కడో, ఇక్కడో, ఎక్కడో ఓ అమ్మ వుంటే అది ఆరో వేలే తప్ప మరోటి కాదు. అది సహజం కాదు. అసహజం. పిల్లలని అజ్ఞాతంగా కనే తల్లులు, కన్న బిడ్డని పారేసి పోయే తల్లులు వారి మీద ప్రేమలేక కాదు అలా చేస్తున్నది. ఈ సమాజపు విచిత్ర పతివ్రతా ధర్మాలకు వెరసి!

కాబట్టి తల్లులకి శిక్షణ అవసరం.అది పూర్వం ఇంట్లో ఉండే ముసలమ్మలు ఇచ్చేవారు.ఇప్పుడు ఆడవారికి మంచి చెప్పేవారే లేరు-వీలైతే ఇంకో నాలుగు స్త్రీవాదపు చెత్తకబుర్లు చెప్పి వారిని పాడుచేసేవారే తప్ప ! వీరు ముందు స్త్రీత్వాన్ని మాతృత్వాన్ని నేర్చుకున్నప్పుడు వీరి మాతృత్వాన్ని మనం గౌరవించడం కూడా నేర్చుకుంటాం.ఎందుకంటే తల్లికైనా సరే గౌరవమివ్వడం బేషరతు (unconditional) కాదు.

(తల్లులకు శిక్షణ అవసరమే అయితే దానికి ముందు మీలాంటి వారికి శిక్షణ అవసరం! పూర్వం ముసలమ్మల శిక్షణ వల్లనేనా పురిట్లోనే చనిపోయే పిల్లలకూ, నానారకాల నాటుమందులతో గర్భవిచ్చిత్తి పద్దతులకూ కారణం! ఈ ముసలమ్మలు ఏం చెప్పేవారు? కాళ్ళకు పసుపు రాసుకోవడం, మొహానికి ముసుగు కప్పుకోవడం, మగనికి కాళ్ళు పట్టడం, కాలితో తన్నినా గడప దాటకుండా పడివుండడం, పతివ్రతల కథలు చెప్పి లేని పుణ్యలోకాల ఆశలు చూపించి, ఆత్మ లేకుండా, సొంత ఆలోచన లేకుండా, మనసులేని మనిషిలా, బ్రతికిన శవంలా జీవించడమా? ఏదీ ఒక్క వుదాహరణ చూపండి ముసలమ్మలు చెప్పిన మంచిమాటేదో? ఇప్పుడు స్త్రీవాదం చెప్పే పాడు మాటలేవో? ముందు మీరు స్త్రీత్వం అంటే మాతృత్వం అంటే తెలుసుకోండి ఆనక అవాకులూ చెవాకులూ పేలుదురు గానీ!
తల్లికి భేషరతుగా గౌరవమిమ్మని ఏ తల్లి యాచించింది? తల్లి బిడ్డలను భేషరుతుగా ప్రేమిస్తుందే గానీ! తప్పు చేసిందని తల్లినే కడతేర్చిన పరుశురాముడు మనకు దశావతారాల్లో ఒకడైన సిగ్గులేని సమాజం మనది. మీరిచ్చే గౌరవంతో తల్లికి అదనంగా రావాల్సిన కొమ్ములేమీ లేవు. ఆమె రక్తం పోసుకొని పుట్టి, ఆ తర్వాతా ఆమె స్తనాలు పీల్చి బతికి, ఆనక ఆమె కొంగు చాటునే ఆమె చేతి ముద్దనే తిని జీవించి.. తనకంటూ సొంత ఆశలు లేక, సొంత ఆస్తులు లేక, పిల్లల అభివృద్దే తన అభివృద్దిగా, వాళ్ళ ఆశలే తన ఆశగా జీవితాంతం మనకు వూడిగం చేసే తల్లిమీద తల్లుల దినమని చెప్పుకొనే రోజునే ఆమెనుంచీ ఇంకా ఏవో ఆశిస్తూ, ఆమెకు శిక్షణ ఇస్తే ఇంకా ఎక్కువ దండుకోవచ్చు పిండుకోవచ్చు అని ఆలోచిస్తున్నారే..పోనీ ఈ వ్యాసం ఇంకో రోజైనా రాయకూడదా?

ఇక వాఖ్యాతలారా? అందమైన భాషను చూసి, పదాల అందాన్ని చూసి, సమాసాల పొందికను చూసి వ్యాసం చదవడం మొదలెట్టిన వెంటనే రచయితకు భావ దాస్యం చేయకండి. మీ బుర్రతో ఆలోచించండి. రచయిత ఏమని చెబుతున్నాడు? ఇదే సత్యమా? మీ అనుభవాల్లోంచీ వెతికి సరిచూసుకోండి. ఏ ఒక్కటో, అరో మనకు వుదాహరణ కాకూడదు అత్యధిక శాతం ఎలా వుందని చూడండి. రచయిత రచనా శైలి మెచ్చుకోవడం వేరు అతని భావాలను మెచ్చుకోవడం వేరు. రచనా శైలి సమ్మోహంలో పడి ఏమి చెబుతున్నాడో చూడకుండా గుడ్డిగా సమర్థించకండి.

రాజేశ్ కనపర్తి గారూ,
తల్లుల సెక్సువల్ అవ్యూజ్ కనపడి తండ్రులది కనపళ్ళేదా మీకు? ఏ వర్గంలోనైనా కొంత అసహజత్వం వుంటుంది. దాన్ని చూపెట్టి అంతా ఇంతే అనే అభిప్రాయానికి రాకూడదు.

వైదేహి గారూ,
ఆడపిల్లలు సొంత బుర్రతో ఆలోచింపజేసే ఏదైనా పుస్తకం రాయండి. మరో ఆధినిక సుమతీ శతకం రాయకండి. ఆడవాళ్ళూ మనుషులే అని సమాజం గుర్తించేదేదైనా రాయండి!
కడుపు మండిన
ప్రసాద్

(విహారి శైలిలో)

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 ఓట్లు, సగటు: 5 కు 3.00)
Loading ... Loading ...

'తల్లుల్ని తయారుచెయ్యాలి' పై 45 అభిప్రాయాలు

'తల్లుల్ని తయారుచెయ్యాలి'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

  1. నాగరాజా అభిప్రాయం,

    తేది: May 18, 2007 సమయము: 8:13 pm

    ప్రసాద్ గారూ, ఏది ఏమైనా ఇలా అంబానాథ్ గారిని అవమానించడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఆయన్ని చూసి నిర్ఘాంతపోవలసిన పని ఏమీ లేదు. “గోడల్లోంచి నడవటం” అనేదాన్ని “ఆస్ర్ర్టల్ ట్రావెల్” అని అంటారు. అది మనకు ఇప్పుడు అనవసరం కానీ, ఇది మరీ ఎక్కువగా వ్యక్తిగతం అయిపోయింది. తెలుగు బ్లాగులకు ఇది మంచి పోకడ కాదు. టపా జారితే వెనక్కి తీసుకోవచ్చు, ఒక్కసారి ఆలోచించండి.

  2. radhika అభిప్రాయం,

    తేది: May 18, 2007 సమయము: 10:02 pm

    కొంచెం వ్యక్తిగతం గా పోయినట్టుంది.అది తప్పించి మిగిలిన మీ వివరణ అంతా నిజం.మీరు చెప్పిన చాలా వాటిలో నా భావాలు వున్నాయి.పూర్తిగా వ్యక్తీకరించలేను అనిపించి నేను అక్కడ కామెంట్ రాయలేదు.నా అభిప్రాయాలను ఇక్కడ చూసి చాలా ఆనందపడ్డాను.ఏదేమయినా మీకు నాకు నా జోహార్లు.

  3. radhika అభిప్రాయం,

    తేది: May 18, 2007 సమయము: 10:05 pm

    మీకు నా జోహార్లు అని రాయబోయి పొరబాటున మీకు నాకు నా జోహార్లు అని రాసాను.గమనించి మన్నించగలరు.

  4. jyothi అభిప్రాయం,

    తేది: May 18, 2007 సమయము: 11:35 pm

    జోహార్లు ప్రసాదు. అంబానాధు గారి టపా చదివి షాక్ అయ్యా. అసలు ఏమనాలో తెలీలా?. కాని నువ్వు ఒక మగాడిలా కాకుండా ఒక తల్లి మనసు అర్ధం చేసుకుని చాలా బాగా చెప్పావు. ఇవి అంబానాధుగారిని అవమానించడం కాదు. ఆయనే తల్లిని అవమానించారు.ఆయన తల్లిని గురించి చెప్పిన విషయాలు ఏ ఆధారంతో చెప్పారు. చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ప్రసాదు చెప్పింది చాలు అనుకుంటున్నాను. థాంక్సు…

  5. సత్యసాయి అభిప్రాయం,

    తేది: May 18, 2007 సమయము: 11:48 pm

    మొదటి పేరా చదవగానే మీరేనా ఇలా వ్రాసింది అని అనిపించింది.
    అంబనాథ్ గారి బ్లాగు, మీబ్లాగు, ఇంకా కొన్ని బ్లాగుల్ని జనం ఇష్టపడతారు, వాళ్ళకి నచ్చని విషయాల మీద వ్రాసినా, లేదా వాళ్ళకి నచ్చని విధంగా వ్రాసినా సరే. అంబానాథ్ గారు మీఉద్దేష్యాలన్నుసరించి, మీకు నచ్చే విధంగా, మీ భావాలకి అనుగుణంగా వ్రాయాలని మీ ఉద్దేష్యం అయితే ఆయన బ్లాగుకూడా మీరే వ్రాయచ్చుగా. నాగరాజా గారి అభిప్రాయమే నాదీని.

  6. సుధాకర్(శోధన) అభిప్రాయం,

    తేది: May 19, 2007 సమయము: 12:34 am

    నాకు అంబానాధ్ గారు కొంచెం ఎక్కువగా రాస్తారనిపిస్తుంది గానీ, ఆ పేరు మీద దానిలోని కొన్ని నిజాలను నిర్లక్ష్యం చెయ్యలేను. నాకు నచ్చినవి, సరిపోయే పదార్ధాన్ని మాత్రం చదివి మిగిలినది వదిలేస్తా (మహా అయితే ఒక వ్యాఖ్యతో). అ.నా టపాలు అర్ధం కావాలంటే కొంత లేటరల్ ఆలోచన చెయ్యాలి.

    ఇక గోడ విషయం..అది అతని నమ్మకం. మనకు నమ్మకం లేక పోతే వదిలెయ్యటమే. నాకూ కొన్ని విషయాలు అస్సలు పడవు, వాస్తు, జ్యోతిష్యంం్ వంటివి.అవాస్తవికత, అభూత కల్పన, నిరూపణ లేని విషయాలు నాకు చెడ్డ చిరాకు. “అది అంతే..మనం ఎవరు అడగటానికి” అనే భావన నాకూ వికారమే. కానీ అది నా వరకే పరిమితం. మహా అయితే మా అమ్మను అంటా “ఏమిటీ చాదస్తాలమ్మా?” అని.

    ఏది ఏమైతేనేం అమ్మతనాన్ని అతడు కించపరచినట్లు నాకు ఎక్కడా అనిపించలేదు. మధర్ తెరీసా కోట్ల మందికి అమ్మ. ఆమె ఎవరికీ జన్మ ఇవ్వలేదు. అలానే జన్మ ఇచ్చినంత మాత్రాన్ అందరూ తల్లులు అయిపోరు. హైదరాబాదు ట్రాఫిక్ కూడల్లలో వాహనాల మధ్య ఆడుకుని, డివైడర్ల మీద ఆడుకోవటానికి వదిలేసిన రెండు, మూడు సంవత్సరాల పిల్లలు ఎంత మందో. నేను ఎన్ని సార్లు అడిగింటానో ఆ తల్లుల్ని వారిని అక్కడ నుంచి తియ్యమని. ఎన్ని సార్లు చెప్పిన మన వైపు ఒక భావం లేని చూపు చూస్తారు. ఇక్కడ “అమ్మతనం” కాదు తప్పు. అమ్మతనం లేని తల్లులది. అసలు వారు తల్లులు కావాలనుకున్నారో లేదో? కుటుంబ నియంత్రణ తెలుసోలేదో? దేవుడి పేరు, మతం పేరు చెప్పి అలా కంటూనే వున్నారో ఎవరికి తెలుసు?

  7. విబా అభిప్రాయం,

    తేది: May 19, 2007 సమయము: 2:06 am

    తల్లిదండ్రులు సన్మానార్హులు.మంచి తల్లులున్నట్లే చెడ్డ తల్లులూ ఉన్నారు. శిక్షణ ద్వారా “తల్లులను” తయారు చేయడం అసాధ్యం.”ప్రేమ” ను బోధించలేం కదా!

  8. sathyavathi అభిప్రాయం,

    తేది: May 19, 2007 సమయము: 3:05 am

    అంబానాథ్ గారి వ్యాసం చదివి ఇంకా పిచ్చాసుపత్రికి పొకుండావుండగలిగినందుకు ఆనందిస్తున్నా

  9. lalitha అభిప్రాయం,

    తేది: May 19, 2007 సమయము: 7:19 am

    ప్రసాద్ గారికి చెప్పిన నీతిలో ఒక్క పాలు కూడా అంబానాథ్ గారికి చెప్పలేదేమి? ఆయన ఆడ వారినీ, తల్లులనీ పట్టుకుని అంత అసహ్యంగా మాట్లాడితేను?

    మరి ఆయన టపాలో ఏ ముక్కనుసమర్థించారో అని ప్రత్యేకంగా అడిగాను కూడా. ఆయన టపాలు ఆయన రాసుకున్నారు. దాన్ని మీలాంటి వారు (మీ మీద సదభిప్రాయం ఉంది గనుకనే) సమర్థిస్తేనే దాని విలువ పెరిగింది. మీరు ఏదో ఒక ముక్కసమర్థించి ఉండొచ్చు కాని, కానీ మొత్తం టపాకే బలం చేకూరింది దాని వలన .

    డివైడర్ల మీద పిల్లలను వదిలేసే తల్లులను తల్లులు చేసిన వారికా పాఠాలు చెప్ప వల్సినది, ఆ తల్లులకా? ఒక పక్క అటువంటి వారు అలా ఎందుకయయుంటారో అని విచక్షణ తో మాట్లాడుతున్నట్టే మాట్లాడి మళ్ళీ తల్లులనూ, తల్లి తనాన్నీ నిల దీస్తారే?

    బిడ్డకు జన్మ ఇచ్చినందుకు తల్లి “దేవత” తో సమానం.

    పిల్లల పెంపకం ఆమె ఒక్క దాని బాధ్యతే కాదు. ఒక్కోసారి సమాజమే బాధ్యత వహించాల్సి వస్తుంది పై ఉదాహరణ లాంటి చోట్ల. నిజంగా దేవతగా తల్లిని భావిస్తే, ఊహిస్తే, ఆ దేవతను మనం పూజించి, స్తుతించి మెప్పించి మన్ననలు పొందాలి, మిగతా దేవుళ్ళను పూజించినట్లు, వారికి ఆగ్రహమ్ కలిగించదడానికి భయపడ్డట్లు. ఆ దేవుళ్ళకు, దేవతలకూ ఏ నిదర్శనాలూ లేకుండానే మొక్కుతాము, మొక్కులు తీర్చుకుంటాము. ఈ తల్లి దేవతకు మాత్రం, దేవతవు కాబట్టి నీకు ఏమీ అవసరమ్ లేదు, ఉండకూడదు, నువ్వే ఇవ్వాలి అంటాము. ఆలోచించండి ఇది ఎంత వరకూ సమంజసమో.

  10. T.Bala Subrahmanyam అభిప్రాయం,

    తేది: May 19, 2007 సమయము: 9:12 am

    నలుగురూ ఏం మాట్లాడితే అంబానాథ్ కూడా అదే మాట్లాడినప్పుడు ఆయన మంచివాడు. ఆయన తన అనుభవంలోంచి పరిశీలనలోంచి రాస్తే ఆయన దుర్మార్గుడు. ఆయన ఒక రకంగా పిచ్చివాడు.(తన గతం గురించి రాసినప్పుడు)! మరొక రకంగా ఇతరుల్ని పిచ్చివాళ్ళని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నవాడు. పరస్పర విరుద్ధత ఉన్నది అంబానాథ్‌లో కాదు ప్రసాద్ గారూ, మీలోనే !

    అంబానాథ్ టపాల్లో వ్యక్తిగతాలు అరుదు. (అసలు వ్యక్తిగత Topics లేనేలేవని చెప్పుకోవచ్చు) పొరపాటున ఒక్కసారి ఆయన రాసుకున్న వ్యక్తిగతం చాలా సంచలనాన్ని రేపింది. ఆయన వ్యక్తిగతం గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని నాబోటి వారికి ఉంది. కాని మీరు చేస్తున్న గలభాతో ఆయన ఇంకేమీ రాయడేమోననే బెంగ కూడా ఉంది. నమ్మకాలు (ఫలానాది ఉందనో లేదనో) అనేవి ఏమీ తెలియనివారికి మాత్రమే ఉంటాయి.అంబానాథ్ ఏ నమ్మకాలూ లేని వ్యక్తి అని నేను విశ్వసిస్తున్నాను.

  11. వెంకట రమణ అభిప్రాయం,

    తేది: May 19, 2007 సమయము: 9:23 am

    మీ నుండి ఇలా వ్యక్తులుకు గురిపెడుతూ టపా వస్తుందని నేనసలు ఊహించలేదు. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి, వాటితో మీరు ఏకీభవించాల్సిన అవసరం కూడా లేదు. కాని, మీరు అంగీకరించలేని విషయాలు వ్రాసిన వారిని ఇలా హేళన చేయడం మాత్రం మీ స్థాయికి తగినది కాదని అభిప్రాయం. ఇక్కడ అతను తల్లులందరినీ ఉద్దేశించి వ్రాయలేదు, కొందరు అలాంటి వారున్నారని మాత్రమే అన్నారు. పైగా ఈ పొష్టులో ఎక్కడా ఆయన తండ్రులంతా మంచివారని కూడా అనలేదు. ఆయన వ్రాసిన దాన్ని చదవడంతోపాటు, వ్రాయనిదాన్ని ఊహించడం మీ ఈ టపాకు కారణమని నాకనిపిస్తోంది. నేనేమైనా ఎక్కువ మాట్లాడినట్లని పిస్తే క్షమించాలి, నాకు అంభానాధుగారి బ్లాగు ఎంత ఇష్టమో, మీ బ్లాగు కూడా అంతే ఇష్టం. మీ ఇద్దరి బ్లాగులలో నాకు నచ్చిన, నచ్చని పోష్టులు ఉన్నా, మీ అభిప్రాయలను నిష్కర్షగా వెళ్లడిస్తారు. మీనుండి ఇలాంటి టపాచూసి ఈ వ్యాఖ్య వ్రాయకుండా ఉండలేక పోయాను.

  12. సత్యసాయి అభిప్రాయం,

    తేది: May 19, 2007 సమయము: 9:24 am

    లలితగారు, ఇక్కడ సమస్య అంబానాధ్ గారు చెప్పింది సరైనదా కాదా అని కాదు- ఆవిషయాలు ఆయన బ్లాగులోనే చర్చిస్తే బాగుంటుందని. మనకి నచ్చిన విషయంరాసినా, రాయకపోయినా సాటి బ్లాగరు మీద ఇలాంటి టపా రాయచ్చా లేదా అని. నాఉద్దేశ్యంలో సాటి బ్లాగరు హక్కుని కాదంటున్నట్టు. పరస్పరగౌరవం ప్రాతిపదికగా ఉంటే బాగుంటుందని మనవి. ఆయన వేరే వాళ్ళని చంపమనో, కొట్టమనో చెప్పట్లేదుగా. మనకిష్టం లేక పోతే ఆబ్లాగుని చూడొద్దు. చదవమని బలవంతం లేదుగా. మనలో ఎవరి నమ్మకాలు వారికున్నాయి. ఒక బ్లాగరు దేవుడిని నమ్మకపోతేనో, ఇంకో బ్లాగరు నమ్మితేనో మన వ్యాపకానికి ఆటంకమా? ఇప్పటిదాకా, మనమంతా ఎన్ని చర్చలు చేసుకొన్నా, వాదించుకొన్నా పరస్పర దూషణలు, కించపరుచుకోవడాలు లేవు- ఒకటి రెండు సందర్బాల్లో తప్ప. ఒకసారి మర్యాదోల్లంఘన మొదలయితే అది అంబానాధ్ గారితో ఆగదు.

  13. lalitha అభిప్రాయం,

    తేది: May 19, 2007 సమయము: 10:06 am

    సత్యసాయి గారు,
    అదేనండి అసలు సమస్య. “సమస్య” ను ప్రక్కన పెట్టేస్తున్నాము. అంబానాథ్ గారి నుండి ఆశించని పొలిటికల్ కరెక్ట్నెస్ మిగిలిన వారి నుండి ఆశిస్తున్నాము.

    నా వరకు నేను నేను చేసిన వ్యాఖ్యలలో పరుషంగా అనిపించిన వాటికి క్షమాపణ చెప్పాను.

    అప్పటికీ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానమ్ లేదు. మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని పాయింట్లు లేవనెత్తాను. వాటికీ స్పందన లేదు.

    “నాకు నచ్చినవి, సరిపోయే పదార్ధాన్ని మాత్రం చదివి మిగిలినది వదిలేస్తా (మహా అయితే ఒక వ్యాఖ్యతో). ” ఇది ఎంత dangerous పనో అనిపించటమ్ లేదా మీకు? మీ లాంటి వారి మీద గౌరవంతో అటువంటి వ్యాఖ్యలకు మా వంటి వారు స్పందిస్తారు. ఎలా ఈ బ్లాగు వేదికలను చర్చలకు వాడుకో గలము ఇలా సగం సగం స్పందిస్తే?

    నేనేమైనా తప్పు అంటే, ఎవరినైనా బాధ పెడితే క్షమించ గలరు.

    దయ చేసి నేను అక్కడా ఇక్కడా చేసిన వ్యాఖ్యలన్నింటినీ మరొక సారి చదవ గలరు, మొత్తం.

    లలిత.

  14. సత్యసాయి అభిప్రాయం,

    తేది: May 19, 2007 సమయము: 6:08 pm

    అంటే, మనం వేరే బ్లాగర్లు వాళ్ళవాళ్ళ బ్లాగుల్లో ఏం రాయాలో రాయకూడదో మనం నిర్ణయించచ్చన్న మాట. స్వేచ్చ అంటే మన్కి కావల్సినదీ, వేరే వాళ్ళకి అవసరంలేనిదీ అని అర్డం అన్న మాట. నా ముందటి వ్యాఖ్యలో చివరి వ్యాక్యం చదవండి. ఈ ట్రెండు ఎవరికీ మంచిదికాదు. అంబానాథ్ గారు చెప్పింది తప్పా ఒప్పా ప్రశ్నకాదు ఇక్కడ కొంతమంది లేవనెత్తినది. మీ ప్రశ్నలకి సమాధానం రాకపోతే, ఒక బ్లాగరుని వ్యక్తిగతంగా హేళన చేసినా పర్వాలేదా? మీవ్యాఖ్యకి ఆలాంటి అర్ధం వచ్చే అవకాశం ఉంది. మీ అభిప్రాయం చెప్పే హక్కు మీకుంది- క్షమించమని అడిగక పోయినా ఎవరూ తప్పు పట్టుకోరు.

  15. lalitha అభిప్రాయం,

    తేది: May 19, 2007 సమయము: 8:04 pm

    నా వ్యాఖ్యకు ఆ అర్థం వస్తే దయ చేసి అది నా ఉద్దేశం కాదని గమనించండి.

    నేను క్షమాపణ చెప్పిన తరవాత కూడా సంభాషణ దారి మళ్ళలేదే అక్కడ అని. ఎవరిని రెచ్చగొట్టిన విషయాలకు వారు స్పందిస్తూ, అసలు టపాలో ఏ విషయాన్ని సమర్థిస్తున్నామో, ఏ విషయాన్ని ఖండిస్తున్నామో అన్నదానికి importance ఇవ్వట్లేదని.

    సత్య సాయి గారు, కొంచెం మీరు “సొరకాయా…” టపాలో చేసిన వ్యాఖ్యా, దానికి నేను ఇచ్చిన సమర్థనా చూడండి. అంబానాథ్ గారు generalise చేసారు ఒక సమస్యని. అది నాకు వ్యక్తిగతంగా తగిలింది. ప్రతి తల్లికీ అది వ్యక్తిగతంగానే తగులుతుంది. ఆయన బాధ్యతా రహితంగా రాశారు ఆ టపాని. ఆయన స్వేచ్చని కాదనటం లేదు. ఆయన బాధ్యతా రాహిత్యాన్ని నేను point out చేశాను.

    ప్రసాద్ గారు కూడా వ్యక్తిగతంగా statements చేశారు అంటే దానికి జవాబు చెప్పుకునే బాధ్యత ఆయనది. ఆయన టపాలో కూడా నాకు కావలిసింది నేను తీసుకుని మిగిలినది వదిలేశాను అంటే ఎలా ఉంటుంది? అందరూ వ్యక్తిగతంగా ఆయన విమర్శించారు అంటుంటే ఇక నేను అసలు విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశాను అంతే. అక్కడా ఇక్కడా కూడా నేను సమస్యకే ప్రాధాన్యత ఇచ్చాను.

    సమస్యను ఈ ఒకటి రెండు టపాలలో తేల్చలేము ఎవరమూ. ఆలోచిద్దామా, ఆవేశపడ్దామా, అసలు ఇక టపాలు రాసుకుందామా, వ్యాఖ్యలు చేసుకుందామా వద్దా? ఏమంటారు?

  16. Thomas Raju Challa అభిప్రాయం,

    తేది: May 19, 2007 సమయము: 11:12 pm

    Human Organ Trade గురించి అంబానాథ్ వ్రాసిన విషయములను చర్చించుటకు జనవరి నెలలో గుంటూరులో ఏర్పాటు చెయ్యబడిన సమావేశమునకు నేను వెళ్ళినప్పుడు నేను ఆయన పేరు తొలిసారిగా వింటిని. ఆ తరువాత మా ప్రక్కయింటి కుఱ్ఱవాడు తెలుగు జాతీయవాది బ్లాగులోని విషయములను చదివి నాకు చెప్పుచుండుట వలన కొంత తెలిసికొంటిని. కాని నాకు రాజకీయ సాంఘిక విషయములపై అంతగా ఆసక్తి లేనందున గొప్పగా శ్రద్ధ పెట్టనైతిని. మారుతున్న సాంఘిక పరిణామములపై ఆయన ఆందోళన అర్థము చేసుకోదగినది. కాని అది హెచ్చు భాగము పాశ్చాత్య దేశములకే తప్ప మన భారత దేశమునకు ప్రస్తుతము వర్తింపదని తలపోయుచున్నవాడను. రానున్న కాలమును గూర్చి చెప్పజాలము.

  17. సుధాకర్(శోధన) అభిప్రాయం,

    తేది: May 19, 2007 సమయము: 11:43 pm

    నాకయితే అంబానాధ్ అమ్మను గానీ, అమ్మతనాన్ని గానీ కించపరచినట్లు కనిపించలేదు. మనిషికి మానవత్వానికి చాలా తేడా వున్నట్లే ఇది కూడా. మనిషిగా పుడితే చాలు, మానవత్వం వుంటుంది అని ఎలా నిర్ణయించరో,ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చినంత మాత్రాన దేవత అయిపోదు. గుడ్డిగా మొక్కెయనక్కరలేదు. ఎక్కడ అమ్మ వుంటుందో అక్కడ దేవతలు పూజింపబడతారు. అందులో సందేహమే లేదు. ఆ దేవత మరెవరో కాదు…అమ్మతనం వున్న ప్రతీ స్త్రీ.

  18. jyothi అభిప్రాయం,

    తేది: May 20, 2007 సమయము: 12:30 am

    ఇక్కడ అంబానాదుగారు అన్న మాటలు చదివిన ప్రసాదు తన తల్లిని అన్నట్టుగా భావించాడు. నేనూ అంతే ..మమ్మల్నే అవమానించాడని ఇప్పటికీ అనుకుంటున్నాము. మాకు కూడా కడుపు మండుతుంది. అంబానాదుగారిని సమర్ధించినవారు అతని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మాట్లాడితే తప్పా> తన బ్లాగులో ఒక వస్తువు గురించి కాదు అమ్మ గురించి అంత నీచంగా మాట్లాడటం సరియేనా??ఈ రోజు ఈనాడు చూసారా? అందులో ఒక నాగుపాము ఒక కోడి పెట్టిన గ్రుడ్లను మ్రింగి కూర్చుంటే ఆ కోడి దాని మీదకు దాడి చేసి, గోలగోల చేసింది అది కాటు వేయాలని ప్రయత్నించినా కూడా. అప్పుడా పాము అది భరించలేక గ్రుడ్లను క్రక్కేసింది సుమారు మూడు గంటల తర్వాత. అది అమ్మతనమంటే. బహుశా అంబానాదుగారు ఇలాంటి అమ్మలను చూసుండరు. అందుకే అలా రాసారు. దానిని కొందరు పెద్దమనుషులు సమర్ధించారు. అది విమర్శించిన వారు చెడ్డవారయ్యారు. భేషుగ్గా ఉంది.

  19. Sarat Krapa అభిప్రాయం,

    తేది: May 20, 2007 సమయము: 1:33 am

    తల్లుల్ని గాని స్త్రీలని గాని అంబానాథ్ కించపఱిచినట్లు నాకెక్కడా కనిపించలేదు-ఆ టపా ఎన్నిసార్లు చదివినా. ఆయనా ఒకమ్మ కన్న బిడ్డేకదా ! అందులోను తెలుగుతల్లిని కన్న తల్లిగా భావించి ఆరాధించే మనిషి. ఆయన కొన్ని negative trends ని ప్రస్తావించాడు. అవి ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆయనా మనలాగే షాకై ఉంటాడు. లేకపోతే ఆ టపా రాయడు. ఆ కేసులు స్త్రీవాద ప్రోద్బలంతో జరుగుతున్నాయని ఆయన అభిప్రాయంలా ఉంది. స్త్రీవాదం ఇపుడొక మతంగా మారింది. స్త్రీవాదాన్ని విమర్శించడమూ స్త్రీలని విమర్శించడమూ ఒకటే నన్నట్లు గొడవ చేస్తున్నారు. టెర్రరిస్టుల్ని విమర్శిస్తే ముస్లిములు ఫీలైపోయినట్లు.

    ఒక చిరు ప్రశ్న : ప్రసాద్ గారూ ! మీకెందుకు అంబానాథ్ గారిమీద అంత కసి ?

  20. Shalini Koushik అభిప్రాయం,

    తేది: May 20, 2007 సమయము: 4:08 am

    Sorry to say. I was disappointed. Your post is in bad taste. Your petulance and emotion are no match to the intellectualism, reasonableness and sobriety of Ambanath. This post will win accolades from a class of immature young women. But the mature women who lived long enough to witness the perverse trends lately creeping into young urban girls for want of good pre-marital upbringing, will certainly vouch for the truth in Ambanath’s words.

    The crux of Mr. Ambanath’s contention, i.e. pre-marital maternity training was deliberately sought to be obscured by intemperate remarks at a personal level and pointed verbal assaults on the most innocuous obbservations by him. You have resorted to giving strained interpretations and applying convoluted logic to mount an attack, whereas Ambanath’s write-up meant no attack, but only a thoughtful reform.

    As a mature woman, I find no wrong in his suggestion. Man is not a puppy or chicken. Similarly his mother is no bitch or hen. Puppies and chicken start fending for themselves almost in very first year of their birth. There is little parental care. But human child is bound to be in the care of his parents for at least a couple of decades. The methods you adopt at age-4 will no longer be valid when he grows to be 15. Similarly, you need to deal with him from a different plane when he marries and sets up his own family. Most mothers find themselves at a loss to cope up with this constant transitional stress. So they need maternity education to prepare themselves for this process.

    As Ambanath says(he aptly calls it BAHU-SAASTRA-SANGAMAM), this maternity education is really an inter-disciplinay science. Prospective mothers should be well aware of 1.Inter-personal relationships psychology with due emphasis on dealing with specific general/known situations 2.House-keeping with its financial/management management 3. Culinary know-how 4.Post-maternity issues including self-care and pediatric care. There may be many more subjects. Thses things do not often come with the moment of delivery itself.

    Considering the importance of the mother, she will do better to equip herself with this scientific approach to post-marital life. What’s wrong in all this ?

    Ambanath has taken the pain to give examples of where the lack of such knowledge is leading to. Any writer should explain his proposal. No other go. Otherwise, as readers, we will more be in the dark. Thank him for doing it.

  21. kottapali అభిప్రాయం,

    తేది: May 20, 2007 సమయము: 6:55 am

    ప్రసాదు గారూ, మీరు అంబానాథ్ గారు చెప్పిన విషయాలతో తీవ్రంగా విభేదిస్తున్నానని చెప్పటానికి వ్యక్తిగత దూషణకి దిగనక్కర్లేదు. వ్యక్తిగత దూషణ సమర్థనీయం కాదూ, మంచి ఫలితాన్నీ ఇవ్వదు. అంబానాథ్ గారి టపాని యధాతథంగా ఉంచి అక్కడికక్కడే ప్రతివాదం చెయ్యటం మన బ్లాగుల్లో ఒక కొత్త ప్రయోగం. కానీ మీరు రాసిన ముందుమాట ఒక చేదు రుచే మిగిల్చింది.

  22. lalitha అభిప్రాయం,

    తేది: May 20, 2007 సమయము: 11:37 am

    Please read every line of this comment:

    Madam Shalini Koushik,
    please re-read my comments on Mr. Ambanath’s post. Please dwell on the topics of child birth preparation classes and parenting classes. How come no repsonse / reaction to that?
    If today I tell that I want to go to parenting classes, there will be a group which would say, that is strivadam too. These days women have to learn even those that should come naturally to them.
    In every generation, generally speaking, moms-in-law would have a proof for their upbringing(their grown up son) while daughters-in-law are struggling in their new experiences and roles. That doesn’t justify judging the daughters-in-law. There is a generation gap. Every parent makes mistakes. Most parents come out allright.

    Shall we try to put an end to this vicious cycle of blame game or shall we contribute to that?

    Coming from an older generation, did you never ever see any parents failing their roles in the earlier generations in joint families? Is it all the fault of the current generation and that too mothers alone?

    Subrahmanyam gaaru,
    I am a product of ill treatment too. I vent out my anguish at those particular persons responsible for that. Not at the society. It is terrible when children have to suffer for the indiscrepancies of parents. It is terible because it is hard to believe that a parent could do wrong to their kids. So, the benefit of doubt goes to the parents. Yes. It is also terrible to live away from the parents, no matter how horrible they are.
    There are even today, many girls who are ill treated by their own parents in some communities, if first, they are allowed to be born.

    Do you understand how difficult the life of every parent is, trying to discipline their kids without being judged of or accused of abuse, just because of a few irresponsible parents?

    If you are a thinker, think solution. If you are a reporter, report cases. Don’t generalise or theorise. If you are a griever, grieve about the specific situation.

    Need I say anything else? I hope not. I believe in the intelligence of people. I believe in the natural sense of right and wrong. Manners and courtesies are cosmetic.

    Regards,
    lalitha.

  23. Shalini Koushik అభిప్రాయం,

    తేది: May 20, 2007 సమయము: 12:13 pm

    If you agree on the point that even the natural things are to be learned these days, then why and what for are you fighting Ambanath ? Personal is political. If only one single person among a million suffers on account of his parents, it is personal. But if hundreds or thousands of persons report abuse, harassment, ill-treatment and injustice, then it is a social evil fit to be tackled with collective effort. As such, the nonchalant mothers, however small their number may be in the overall population, are a social evil, which warrants urgent remedy.

  24. lalitha అభిప్రాయం,

    తేది: May 20, 2007 సమయము: 12:57 pm

    Please read my other comments in detail. You will know what I am against.

  25. నాగరాజా అభిప్రాయం,

    తేది: May 20, 2007 సమయము: 9:28 pm

    శిక్షణ అనేది ప్రతి దానికీ అవసరం. నేను కూడా గతంలో ఈ విషయాన్ని వ్యతిరేకించేవాడిని. ఒక అన్న కావడానికి, చెల్లి కావడానికి, తల్లి కావడానికి, తండ్రి కావడానికి… మనిషి/బుద్ధుడు కావడం వరకు ప్రతి దానికీ శిక్షణ అవసరమే! మానవ జీవితం యొక్క ముఖ్య పరమార్థం శిక్షణే! భగవద్గీత ఒక యోగి కావడానికి శిక్షణ. తల్లుల్ని తయారుచెయ్యాలి అంటే, మంచి తల్లుల్ని తయారుచెయ్యడం అన్నమాట. అందుకే పెద్దలు పెళ్ళిళ్ళలో కుటుంబ వివరాలు కనుక్కుంటారు. మంచి కుటుంబంలోని పిల్ల చక్కటి శిక్షణను కలిగి ఉంటుందని అంతరార్థం, ఆశ. మగవాడి విషయం ఇందుకు అతీతం కాదు. ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోని ఆవేశం తెలివితక్కువ తనం. తండ్రికి కూడా శిక్షణ కావాలని ఎవరయినా అంటే అది తెలివైన (స్త్రీ)వాదం లేదా సరయిన వాదన మిగతాది కాదు అని నా అభిప్రాయం.

  26. సుధాకర్(శోధన) అభిప్రాయం,

    తేది: May 20, 2007 సమయము: 11:04 pm

    ఇక్కడ వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోవటం మొదలయింది. నా వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఎవరినైనా బాధించితే అందులకు పూర్తి బాధ్యత వహిస్తూ క్షమాపణలు కోరుతున్నాను.దీనిపై ఇదే నా చివరి వ్యాఖ్య.

    అమ్మ ఎవరికయినా అమ్మే. అమ్మ ఎలా పిల్లలను ప్రేమిస్తుందో పిల్లలు అలానే ప్రేమిస్తారు. పెద్దయ్యాక పెడ బుద్ధులు వేరే సంగతి. అయితే నాకున్న పరిమిత లోకజ్ఙానం బట్టి అర్ధం అయింది ఏమిటంటే, అందరు అమ్మలు ఒకలా వుండరూ అని.

  27. చైతన్య అభిప్రాయం,

    తేది: May 21, 2007 సమయము: 4:12 am

    వ్యక్తిగత దూషణ మనిషి సంస్కార స్థాయిని సూచిస్తుంది చరసాల గారూ…మీకు అంబానాధ్ గారి వ్యాసం నచ్చకపోతే ‘నేను ఆయన అభిప్రాయాలతో ఏకీభవించట్లేదు ‘ అని మీ ప్రతివాదన వ్రాస్తే సరిపొయేది

  28. ప్రసాద్ అభిప్రాయం,

    తేది: May 21, 2007 సమయము: 8:33 am

    మ్మ్… “తల్లులని తయారు చెయ్యాలి” మీద ఇంత రచ్చ జరగడం..మద్యలో శని, ఆది వారాలు రావడం యాదృచ్చికమా!
    నేను ఆవేశపడి రాసిన మాట వాస్తవం. అయితే ఆవేశంలో రాసినా నేనెక్కడా అంభానాధ్ గారిని దూషించినట్లు నాకు కనిపించలేదు. బహుశా నాకు దూషణకు సరైన అర్థం తెలియదేమొ! ఎక్కడైతే అంభానాధ్ పరుషంగా స్త్రీవాదం గురించో, మిలియన్లాది తల్లుల గురించో వాఖ్యానించారో అక్కడే నేనూ కొంత సంయమనం కోల్పోయాను. మీకందరికీ తెలుసు అంభానాధ్ రాస్తున్న బ్లాగు తన ఆత్మతృప్తి కోసం కాదని. ఆయనకో లక్ష్యం వుంది, ఓ స్వప్నం వుంది. ఆధునికత మీదైనా, స్త్రీల మీదైనా ఓ దృక్పధం వుంది. అది ఆయన తనతోనే వుంచుకోవట్లేదు కదా (వుంచుకోవాలని నేను చెప్పడం లేదు). ఆయన అభిప్రాయాలను, వాదాన్ని బహిరంగంగా పెట్టి చర్చను ఆహ్వానిస్తున్నపుడు, అవి కొందరినైనా ప్రభావితం చేస్తున్నపుడు అది ఆయన వ్యక్తిగతం ఎలా అవుతుంది? ఆయన బహిరంగంగా చర్చకు పెట్టిన అంశాలనే నేను స్పృశించాను గానీ ఆయన స్వవిశయాలను కాదు గదా? “గోడల్లోంచి దూరడం” గురించి చెప్పడం బహుశా ఈ కోవలోకి వస్తుందేమొ! అయితే ఆయన దృక్పధాన్ని, దృక్కోణాన్నీ వివరిద్దామని చేసిన నా ప్రయత్నమది. ఆయన టపా ఎందరికో నచ్చి, నాలాంటి కొందరికి నచ్చలేదంటే మన దృక్కోణాల్లో తేడానే కదా? నేను నా వాదన వినిపించాలంటే ఆయన prismకు ఏ కోణంలో నిలబడి కాంతిని చూస్తున్నారో లేక చూస్తున్నారని నేననుకుంటున్నానో చెప్పాలి కదా? నేను రాసిన మొదటి పేరా అలా ఆయన బ్లాగు మీద నా సమీక్ష లాంటిది.

    ఇక ఆ తర్వాత ఆయన రాసిన ప్రతిముక్కా తీసుకొని నేనది ఎలా అర్థం చేసుకున్నానో లేక అదెలా సాద్యం కాదో లేక ఆయన అభిప్రాయం ఎలా తప్పో చెబుతూ వచ్చాను కదా! అందులో అక్కడక్కడా వ్యంగం, ఆవేశం ఎక్కువయి వుండవచ్చు. అయితే ఇంకొకరిని విమర్శించేటపుడు వ్యంగం వాడకూడదా? అంభానాధ్ గారి టపాలే తీసుకున్నా ఇలాంటి వ్యంగం బోలెడన్ని చోట్ల కనిపిస్తుంది. ఒక్కోసారి వ్యక్తిమీదనే కనిపిస్తుంది. ఒకచోటెక్కడో KCRను “ముక్కాయన” అంటారు. ఇది మరీ వ్యక్తిగతంగా వెళ్ళి రూపాన్ని హేళన చేయడం కాదా? కానీ మీకింతమందికి నా పోస్టులో అంభానాధ్ గారి మీద హేళన కనిపిస్తే నిజమేనేమొ అని మరిన్ని సార్లు చదివా కానీ నాకందులో అంత అభ్యంతరమున్నదేదీ కనిపించలేదు. పోనీ మీరెవరైనా పలానా చోట నీవు అలా అనడం తప్పు అని చూపిస్తే నేను నా తప్పును సరిచేసుకుంటాను, క్షమింప గోరతాను. ప్రస్తుతం నాకు నా ఆవేశం కనిపిస్తుందే తప్ప, తప్పు నాకు కనిపించడం లేదు.

    “తల్లులని తయారు చేయాలి” పేరుతో అంభానాధ్ రాసిన దానికీ, దానికి నేను రాసిన ప్రతుత్తరానికీ ఎవరు రాసినా మెచ్చుకోవడమో, తిట్టడమో జరిగింది తప్ప, ఆవేశం మీద చర్చ జరిగిందే తప్ప అందులోని విశయం మీద ఎవరూ చర్చించటం లేదు. దీనిద్వారా నేను నేర్చుకొన్న గొప్ప గుణపాఠం: అనాలనుకొన్నది, చెప్పాలనుకొన్నది ఎంత గొప్పదైనా ఆవేశంగా చెబితే ఆవేశం అర్థమవుతుందే తప్ప అందులోని విశయం కాదని!

    ఇక మీ దృక్కోణంలో అంబానాధ్ గారి టపాలో కనిపించనిది, నాకు మరి కొందరికి తల్లుల మీదా, స్త్రీ వాదుల మీదా కనిపించిన హేళన ఏదో చెబుతాను. ఇది రెండ్రోజుల వారాంతపు విశ్రాంతి తర్వాత రాస్తున్నా గనుక ఇందులో ఆవేశపు గుళక రాళ్ళు లేవు. నాకు అర్థమయ్యిందే మీకు అర్థం అయిందో లేదో చూద్దాం.

    1)తల్లులు కావడానికి అవసరమైన పరిణతీ పరిపక్వతా లేకుండానే ఆడవారు తల్లులు కావడం వారి సంతానానికో శాపం.
    ఇది నేనెన్ని సార్లు చదివినా పరిణితీ, పరిపక్వతా లేకుండా ఆడవారు తల్లులు కావడం వెనుక ఆడవారి బాద్యతే వుంది అని చెబుతున్నారనిపించింది. పరిణితీ పరిపక్వతా లేకుండా తల్లులవుతున్నారు అని చెప్పినదాంతో నేను ఏకీభావిస్తున్నా అందులో స్త్రీ బాద్యత వుంది అనడంలో నేను పూర్తిగా వ్యతిరేకం.

    2)అది తలకెత్తుకోవడానికి ఇష్టపడని ఆడవారంతా తల్లులైపోయి సంతానాన్నీ సమాజాన్నీ బాధపెట్టొద్దంటున్నాను.
    ఇక్కడ చూడండి. ఇక్కడ ఆయన బాధ పెట్టొద్దనే విజ్ఞప్తి తల్లులకు కాదా? తల్లులకే అని మీరొప్పుకుంటున్నట్లయితే తల్లులవడం కాకపోవడం స్త్రీ చేతిలో వుందా? లేదని నేననుకుంటున్నా!

    3)ప్రపంచం రోజురోజుకీ బాధ్యతలేని ఆడవారితో నిండిపోతోంది.దానికి స్త్రీవాదమనీ చిలకడదుంప అనీ పేరుపెట్టి …
    దీని ద్వారా భాద్యత లేని ఆడవారిదే స్త్రీవాదం, భాద్యత లేని తనమే స్త్రీవాదం..అని అంభానాధ్ గారి వుద్దేశ్యం కాదా? మరయితే ఈయనకంటే ఘాటుగా వున్నాయా నా మాటలు? ఈయన స్త్రీవాదులందరినీ భాద్యతలేని వారని నిందిస్తే తప్పులేదు కానీ ఒకేఒక్క Conservatistను నేనంటే తప్పా?

    4)అలాగే స్త్రీవాదుల మాట చెల్లే కుటుంబాల్లో కూడా మగపిల్లలకి ఉద్దేశపూర్వకంగా అన్యాయం చెయ్యబడుతోంది.
    ఇది కూడా స్త్రీవాదులందరిమీదా ఆయన వేస్తున్న అభాండం కాదా? ఈయన స్త్రీవాదులందరినీ లక్షించి ఇన్నిమాటలన్నా ఈయనకు వ్యతిరేకంగా ఒక్కమాట అంటే అది ఆయనమీద వ్యక్తిగత దాడి ఎలా అవుతుంది?

    5)కొడుకు మీద వ్యాజ్యాలు నడిపే తల్లులు …కొడుకు బావుంటే చూసి ఓర్వలేని తల్లులు …తల్లులు పాల్పడుతున్న ఈ child abuse…దీనికంతటికీ కారణం చిన్నప్పటినుంచి తల్లితనంలో శిక్షణ లోపించడమే !
    ఇన్ని చెప్పి దీనికంతటికీ కారణం తల్లికి శిక్షణ లేకపోవడమే అన్నారు. సరే దానితో ఎవరికీ ఇసుమంత అనుమానముండక్కరలేదు. దీనివల్ల ఈయన అభ్యుదయవాది అనికూడా అనుకోవచ్చు. దీనివల్ల తల్లులకు ఈయన ఆధునిక శిక్షణను లక్షిస్తున్నారనికూడా అందరూ అనుకుంటారు. అయితే నిజానికి ఈయన లక్షిస్తున్నదేమిటో ఆ తరువాత “కాబట్టి తల్లులకి శిక్షణ అవసరం.అది పూర్వం ఇంట్లో ఉండే ముసలమ్మలు ఇచ్చేవారు.” అని తన ముగింపు పేరాలో చెప్పడం ద్వారా తెలుస్తుంది. ఇక్కడే చాలామంది పొరబడుతున్నారని నేననుకుంటున్నాను. శిక్షణ అవసరమే, ఎవరూ కాదనరు స్త్రీవాదులతో సహా. అయితే అది “ఇంతకు ముందు ముసలమ్మలు ఇచ్చేవారు” అనడం ద్వారా ఆయన లక్షిస్తున్న శిక్షణ ఎలాంటిదే తెలిసిపోతోంది. తల్లిదనం శిక్షణ “బహుశాస్త్ర సంగమం” అంటునే ఇంతకు ముందు అది ముసలమ్మలు ఇచ్చేవారు అంటే ఆ ముసలమ్మలు బహుశాస్త్ర కోవిదులా? నిజానికి అంభానాధ్ కోరుకుంటున్నది పాతయుగాల ఆచారవ్యవహారాలు, పతివ్రతా ధర్మాలూ అని ఇందువల్ల నాకు అర్థమయ్యింది.

    6)ఆ సైద్ధాంతిక శూన్యాన్ని (స్వార్థం తప్ప వేరే అజెండా లేని) స్త్రీవాదం లాంటివి భర్తీ చేస్తున్నాయి
    స్త్రీవాదమంటే ఈయనకున్న ఈ అభిప్రాయం మీద ఎవ్వరూ మాట్లాడరే? దోచుకునేవాడు, దోచుకోబడేవాడు వున్నపుడు అక్కడ నిస్వార్థత గురించి చెబితే దానివల్ల ప్రయోజనమేంటి? అందులో ఏ స్వార్థమూ లేకుండానే ఈ నిస్వార్థవాదాన్న్ని తెస్తున్నారని ఎలా అనుకోవాలి.

    7)జీవితం పట్లా తోటి మనుషుల పట్లా ఏర్పడిన అవగాహనాపరమైన లోపాలు ప్రవర్తనా పరమైన లోపాలుగా పరిణమిస్తాయి.స్త్రీలలోని ఈ లోపాల్ని వర్తమాన స్త్రీవాదం అనేక విధాలుగా వెనకేసుకొస్తుంది.కాబట్టి ఈరోజు బాధ్యత అక్కర్లేని ప్రతి స్త్రీకి తనదంటూ ఒక సొంత స్త్రీవాదం ఉంది.
    ఇదీ ఈయనకు స్త్రీవాదం మీదున్న అభిప్రాయం. ఇన్ని విధాలుగా ఈయన స్త్రీవాదాన్ని అవహేళన చేస్తుంటే ఇది తప్పుకాదా?

    ఇక తల్లుల మీద అక్కసు చూడండి. ఈయన “అందరినీ” అనలేదు అంటారు. కానీ మచ్చుకు కూడా “కొందరే ఇలా” అనలేదు. ఇంకా “చాలామంది”, “మిలియన్లాది” పదాలు వాడటం ద్వారా ఎక్కువమంది తల్లులు ఇంతే అని చక్కగా చెబుతుంటే మీరు మాత్రం ఆయన అందరినీ అనటం లేదు అని వెనుకేసుకొస్తున్నారు.

    1)ఎక్కువమంది తల్లుల దృష్టిలో పిల్లలు ఇంట్లో ప్రతిపక్షాలు.
    దీనితో మీరు ఏకీభవిస్తారా?

    2)బడికి వెళ్ళే పిల్లలకి సరైన భోజనం ఇచ్చి పంపడానికి బద్ధకించి పసుపూ నిమ్మకాయ కలిపిన పాచికూడు పులిహోర పేరుతో కలిపి ఇచ్చే మిలియన్లాది తల్లులున్నారు ఆంధ్రాలో.
    అక్కడో ఇక్కడో వున్నారని చెప్పడం వేరు. కానీ మిలియన్లాది వున్నారని చెప్పడం మెజారిటీ ఇంతే అని చెప్పడం కాదా? మెజారిటీ తల్ల్లులు ఇంతే అని చెప్పడం వల్లనే కదా ఏ తల్లికైనా రోషం వచ్చేది.

    3)ఈ విధమైన ఆంక్ష ఆడవారి మీద లేకపోవడం చేత పొద్దున లేవగానే బాత్‌రూమ్‌కి వెళ్ళడం ఎంత మామూలో పెళ్ళి కాగానే పిల్లల్ని కనడం ఆడవారికి అంత మామూలు విషయమైపోయింది.
    పిల్లలని కనడాన్ని పొద్దున్నే బాత్‌రూమ్‌కి పోవడంతో పోల్చడం మీకు చదవడానికి దుర్భరంగా అనిపించడం లేదా? పెళ్ళికాగానే పిల్లలు మగవాడి ప్రమేయం లేకుండానే బాత్‌రూమ్ వెళితే వచ్చినట్లు వచ్చేస్తారా? ఈ పోలికలో ఆడవారి మీద ఏహ్యం, చులకనా నిబిడీకృతమై వున్నాయి అని మనఃపూర్వకంగా నమ్ముతున్నాను. నన్ను అమితంగా భాధించిన చోట నా బాధ కూడా ఎక్కువ ఆవేశంగా ధ్వనించింది.

    4)అది వారికి ఒక విధమైన ఉద్యోగ వ్యాసంగం (career)గా కాపురాన్ని నిలబెట్టుకునే సాధనంగా మిగిలిపోయింది.అందులో సెంటిమెంటు లేదు.ప్రేమ లేదు.నిస్వార్థం లేదు.బంధం లేదు.
    పైన అంతా “చాలామంది”, “మిలియన్లాది” అంటు చెప్పి అదే contextలో పై విధంగా చెబితే అది తల్లులను (అదే చాలామంది లేదా మిలియన్లాది తల్లులను) కించపరచటం కాదా? అసలు ఆడదానికి కాపురం నిలబెట్టుకునే సాధనం ఎందుకు అవసరమయింది? మగవాడిపై ఆధారపడి బ్రతకడం వల్లనే కదా? మగాడిలా తనకూ సంపూర్ణ ఆర్థిక స్వేఛ్ఛ వుంటే అలా కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఓ వేశ్యలా సెంటిమెంటు లేకుండా, నిస్వార్థం, బందం లేకుండా మొగుడికి వళ్ళు అప్పజెప్పి బిడ్డలనీ పొద్దున్నే బాత్‌రూమ్‌కి వెళ్ళినంత ఈజీగా కనే అవసరం వుండేది కాదు కదా? ఇందులోని నీచత్వం తల్లులను కించపరిచేదిగా లేదా? ఈయన ఎక్కడైనా ఎదో కొద్ది మంది గురించి ఈ పేరాలో గానీ పై పేరాలో గానీ ప్రస్తావించారా? ఇంకా అధికులు అనే అర్థం వచ్చేలానే రాసారుకదా?

    5)అలాగే బిడ్డ కలిగిన తరువాత అతని/ఆమె మీద ప్రేమ కలగడానికి సమయం తీసుకుంటుంది.
    బిడ్డమీద తల్లికి ప్రేమ కలగడం ఈయన అందరికీ వర్తించేట్లే కదా చెప్పింది. ఇది మాతృత్వభావనకు అవమానం కాదా? నిజానికి ఇది తండ్రికి వర్తిస్తుంది కానీ ప్రకృతి సహజమైన తల్లి ప్రేమకు ఎలా వర్తిస్తుంది? బహుశా కొన్ని చోట్ల కడుపు ఆకలి, కన్న ప్రేమను జయించి వుండవచ్చు. పుట్టగానే బిడ్డమీద తల్లికి ప్రేమే గనుక పకృతి కల్పించకుండనట్లయితే పుట్టిన తర్వాత 20 ఏళ్ళకు గానీ తన స్వంత కాళ్ళమీద నిలబడలేని మనిషిజాతికి మనుగడ వుండేదా?
    అయితే ఆ ప్రేమను సరైన దారిలో పెట్టి తల్లికి సశాస్త్రీయమైన శిక్షణ ఇచ్చి ఆ బిడ్డ మరింత ప్రయోజకుడుగా మార్చేట్లు చేస్తే అంతకుమించి కావలిసిందేముంది. కానీ పాలు చిప్పిల్లినట్లు ప్రేమ చిప్పిల్లదు అంటే నాకు నమ్మకం లేదు.

    చివరిగా….
    ఆవేశం చర్చను పక్కదారి పట్టిస్తుందని తెలుసుకున్నాను. అయితే దయచేసి ఆవేశం మీద కాక పైన వుదహరించిన పాయింట్లమీద చర్చ చేయమని కోరుతున్నాను. ఇక ఒకరి బావాలు మనకు నచ్చకపోతే మౌనంగా వుండటం అన్నిచోట్లా వర్తించదు. ఆయన తన బట్టలు ఎలా వేసుకున్నా అది ఆయన స్వవిశయం నాకు నచ్చకపోయినా అక్కరలేదు. అలాగే ఆయన ఏ దేవున్ని పూజిస్తాడో అసలు పూజించడో కూడా నాకు అనవసరం నాకు నచ్చకపోయినా కూడా. అయితే ఆయన భావాలను, అభిప్రాయాలని పదిమందితో పంచుకుంటున్నపుడు అదికూడా ఆయన గురించి కాకుండా అందరికీ వర్తించే విషయమ్మీద అయినప్పుడు (ఉ. తల్లులు, స్త్రీ వాదులు) మౌనంగా వుంటే అది అర్ధాంగీకారమే కదా? ఆయనకు భావ ప్రకటన స్వేఛ్ఛ వున్నట్లే అదే విషయం మీద ఆయనను ఖండించడానికీ, విమర్షించడానికీ నాకు హక్కు లేదా? అవతలి వ్యక్తి తోటి బ్లాగరో, తోటి జాతి వాడో అయితే వుపేక్షించాలా? అయితే “గోడల్లోంచి…” విశయాన్ని నేను ప్రస్తావించకుండా వుండాల్సింది. అది తప్ప నేను చెప్పినదాన్ని ఎక్కడా పునఃపరిశిలించాల్సిన అవసరం వున్నట్లు నాకు కనిపించడం లేదు.

    అయితే ఎన్ని వాదవివాదాలున్నా “తిక్క వెధవలు..” లాంటి పదాలు వాడకూడదు. నేను ఆ విధంగా నా పరిధుల్లోనే వున్నాననుకుంటున్నాను. కాదని నన్నెవరు వేలెత్తి చూపినా నేను నా తప్పును భేషరతుగా ఒప్పుకుంటాను.

    –ప్రసాద్

  29. T. Bala Subrahmanyam అభిప్రాయం,

    తేది: May 21, 2007 సమయము: 8:51 pm

    Prasad Gaaru You unnecessarily hastened to write this attack. See what Ambanath Has said in his latest reply to Mr. Raa Naa Re’s comment under “Thallulni thayaaru ceyyaali”

    Also see what he said under “Mitrasya chakshushaa sameekshaamahe” in reply to Rajesh Kanaparti.

  30. Prakasam అభిప్రాయం,

    తేది: May 22, 2007 సమయము: 12:01 am

    అమోఘం! ఏదిపడితే అది రాశేస్తారు జనాలు. దానివల్ల చదివినవారి ఆలోచనాసరళి కంపిస్తుందనే విషయం తెలుసుకోరు.

    ఇవాళ “మదర్స్ డే”, వాళ్లకి సిక్షణ పెట్టి,
    రేపు “మదర్స్ సిక్షణ డే”,
    ఆతరవాత శార్ధం డే

    అందుకే అన్నారు, గుర్రాన్ని చెరువుకి తీస్కెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేమని.

    ప్రేమలేనప్పుడు, తల్లైనా, తండ్రైనా సరిగ్గా పెంచలేరు. తల్లికో న్యాయం, తండ్రికో న్యయం అంటే, ఆ ఇంట్లో పెరిగే పిల్లల సంగతి అంతే!

  31. Prakasam అభిప్రాయం,

    తేది: May 22, 2007 సమయము: 12:11 am

    సింపుల్ గా చెప్పాలంటే, అంబానధుడు GEMINI TV Daily Serials లో ఎక్కువగా జీవిస్తుంటాడు. దానికి నా తోటి బ్లాగర్లు ఎక్కువగా react అయ్యారు.

  32. chaitanya అభిప్రాయం,

    తేది: May 22, 2007 సమయము: 3:21 pm

    హలో ప్రసాద్ గారు,

    అంబానాథ్ గారి వ్యాసం చాలా దారుణంగా, ఆడవాళ్లని కించపరిచేది గా ఉంది. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

  33. జయ ప్రకాశ్ అభిప్రాయం,

    తేది: May 22, 2007 సమయము: 4:31 pm

    “…ఎక్కువ మంది స్వయానా కోరుకుని తల్లులు కావట్లేదు.వారి ప్రమేయం లేకుండా వారికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి.వారి ప్రమేయం లేకుండానే వారు గర్భధారణ చేస్తున్నారు.ఆ విధంగా వారి ప్రమేయం లేకుండానే వారు తల్లులవుతున్నారు.ఇందువల్ల తల్లులు తమ సంతానాన్ని ప్రేమించాల్సినంతగా ప్రేమించలేకపోతున్న పరిస్థితి తలెత్తుతోంది….”

    వారి ప్రమేయం లేకుండా వారికి పెళ్ళిళ్ళు చేస్తున్న తల్లితండ్రులను మార్చాలని తలచుకోరు, వారి ప్రమేయం లేకుండానే (ఏమాత్రం ఇంగిత జ్ఞానంలేకుంట) వారికి గర్భధారణ చేస్తున్న మగవాల్లని మార్చాలని తలచుకోరు, ప్రమేయం లేకుండానే వారు తల్లులవుతున్నారు అని చెప్పుకుంటనే వాల్లని మార్చాలని ప్రబోధించుడు… ఇది ఎక్కడి వితండవాదం?

    అంభానాద్ గారు, ఏవో నాలుగు examples తీసుకొని generalisations చేసి పూర్తి ఆడజాతికే అంటగట్టింరు… ఎన్నో చూసిన, కని ఇంతటి వితండవాదం ఎక్కడా చూడలేదు… ఇందుకు అంభానాద్‌గారికి జోహార్లు అందించక తప్పది (ఆ జోహార్లలో ఓ పదో పరకో తీసి, సై అంటే సై అంటూ వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికి కూడా పంచాలె).

  34. narender అభిప్రాయం,

    తేది: May 23, 2007 సమయము: 6:54 am

    అన్నా జయప్రకాష్,
    బడె చెప్పినవె,
    పాపమ్ ప్రసాద్ గారు, చాలా కష్టపడుతున్నారు వితండవాదులతొతటి,
    Dear Prasad garu,
    Hat’s off to your indifatigable fight against this eccentric lot.
    Please keep it up
    :)

  35. చరసాల అభిప్రాయం,

    తేది: May 23, 2007 సమయము: 7:39 am

    చైతన్యా, జెపి, నరేందర్,
    బాపడు-దూడ-కుక్క కథలో లాగ నేను బాపన్ని అయిపోతున్నానా అనిపించింది. ఇంతమంది ఆయన చెప్పింది రైటు అంటుంటే నేనే తప్పేమో అన్న శంక దూరబోయింది. అమ్మయ్య! ఫర్వాలేదు…నాకు కనపడిన దూడ ఇతరులకూ కనిపిస్తోంది.

    –ప్రసాద్

  36. Ravikiran Timmireddy అభిప్రాయం,

    తేది: May 24, 2007 సమయము: 11:11 am

    ప్రసాదు గారూ,
    అంభానాదు గారి వ్యాసానికి మీ జవాబు చూసేక నా జవాబు అవసరవనిపించింది. తల్లులకి శిక్షణ అవసరవన్న అంభానాదు గారి అబిప్రాయంలో మీకేం తప్పు కనిపించిందో నాకర్థం కాలేదు. మీరు డిసిలో చేసే వుద్యోగానికి ఎంతకాలం శిక్షణ పొందేరు. నాలుగైదేళ్ళ వయసు నుంచి, అమ్మ దగ్గర నుంచి, యూనివర్సిటీ దాకా యెంత కాలం శిక్షణ అవసరవైంది మీ జాబ్ కి? మరలాటప్పుడు, పిల్లలని పెంచి పెద్ద చేసి, వాళ్ళని వొక మొదటి తరగతి పౌరునిగా, వొక నమ్మిన విషయాన్ని అనుసరించే దారిలో పాలు త్రాగిన రొమ్మునైనా గుద్దడానికి వెరువని నిబద్దత కల మనిషిగా తయారు చేయవలసిన అమ్మకి ఎంత శిక్షణ అవసరవో ఆలోచించండి.

    తల్లులకి శిక్షణ అవసరవనే న్యాయవైన, నిజవైన విషయం చెప్పే విధానంలో, అక్కడక్కడా అమ్మల గురించి అవాకులు చవాకులు దొర్లుండొచ్చు, అంత మాత్రం చేత నిజం అబద్దవైపోతుందా? అంత మాత్రం చేత ఆడవాళ్ళందరూ (మీలాటి పురుషులు కొందరు) కలసి స్త్రీవాదం, సింగినాదం అని ఉద్యమిస్తే మన జాతి భవిష్యత్తేంకాను. అలాటి ఉధ్యమాల్ని మొదట్లోనే తుంచకపోవడం చేతనే కదా మనక్రింద అణిగిమణిగి ఉండాల్సిన బానిసలు, దాసులు, పంచములూ, కొందరు స్త్రీలు కూడా మన మీద ఈ రోజు పెత్తనం చేస్తుండేది. అందు వలన ప్రసాదు గారూ, మీరొకటి తెలుసుకోవాలి. న్యాయం, అన్యాయం, మంచి, చెడ్డ అనేవి అందరికీ వొకటిగా వుండవు. వొకరి మంచి, మరొకరికి చెడ్డ కావొచ్చు, వొకరి చెడ్డ మరొకరికి మంచి కావొచ్చు. అందుకని, మంచి చెడ్డలని మీరు అంభానాదు గారిలాగా మనవైపు నుంచి చూడటం నేర్చుకోవాలి. మన అధిక్యతని నిలుపుకోవడం కోసం మనం అబద్దాలని నిజాలని ప్రచారం చేసినా తప్పులేదు. అంభానాదు గారు మంచి మనుషులు, సభ్యత కలిగిన మనుషులు కనుక ఆయన కొంత న్యాయవైన మార్గాన్నే అనుసరించారు. పూర్తి అబద్దాలతో కాకుండా, అక్కడక్కడా జరిగే నిజాలనే తీసుకోని అమ్మలని, ఆడజాతిని మనకోసం చీల్చి చెండాడేరు. వొకటి గుర్తు పెట్టుకోండి, అంభానాదు గారు, పూర్తి అబద్దాలనే తన వ్యాసానికి ఆలంబనగా తీసుకున్నా కూడా అది న్యాయవే నని నేనిందుమూలకంగా మీకు తెలియ చేస్తున్నాను. ఎందవలనంటే, సంఘాన్ని, అమ్మలనబడే ఈ స్త్రీ జాతి నుంచి, వాళ్ళ స్వార్థపూరితవైన, రాక్షసవైన, నీతిభంగవైన ఎజండా నుంచి, మనల్ని కాపాడే ప్రయత్నంలో అంభానాదు గారి లాటి మేధావుల ఆలోచనా విధానం వొక్కటే మార్గవని మీరు తెలుసుకుంటే మంచిది. లేకపోతే ఎప్పుడో వొకప్పుడు ఈ స్తీలు మనల్ని ప్రేమించమని అడగ్గలరు, వాళ్లని మనతో సమానంగా మనుషులుగా చూడమని కూడా అడగగలిగే అవకాశం వుంది.
    చెడ్డ అమ్మలని (అమ్మలలో మంచి వాళ్ళెవరు చెపాండి!) మంచి దారిలోకి, మన దారిలోకి మళ్ళించడానికి అంభానాదు గారు కొన్ని చిట్కాలని మనతో పంచుకున్నారు. దీన్లో మీరు అంభానాదు గారి మంచితనాన్నే చూసేరు. మీకు ఇప్పటికికూడా మన న్యాయం, మన మార్గం, అంభానాదు గారి ఆలోచనా విధానం వొంటబట్టకపోతే, మీ అభ్యంతరకరవైన స్త్రీజాతి విమర్శలని ఇప్పటికైనా కట్టి పెట్టకపోతే మాదగ్గరున్న ఏ శని మంత్రవో చదివి మీ బ్లాగు బాగయ్యేలా చేయడానికికూడా వెనుకాడవని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

    మీరు గమనించరో లేదో, మనదారి తప్పిన మీ అభిప్రాయం, మాకు మరింత ప్రచారాన్ని తెచ్చి మాకుమేలే చేసిందని కూడా ఇందుమూలకంగా తెలెయజేస్తున్నాను.
    లలిత గారూ, ఎందుకండీ యూదుల్ని చంపడవే న్యాయవనే హిట్లరు లాంటి మనుషులకి సున్నితంగా స్త్రీల గురించి, అమ్మల గురించి మంచి చెడ్డలు చెప్పబోతారు, మనసుని కష్టపెట్టుకుంటారూ.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  37. lalitha అభిప్రాయం,

    తేది: May 24, 2007 సమయము: 12:19 pm

    కొన్ని పాఠాలు పొరపాట్లనుండే కదా నేర్చుకుంటాం.


  38. తేది: May 25, 2007 సమయము: 7:19 am

    [...] http://www.charasala.com/blog/?p=167 [...]

  39. అజిత్ కుమార్ అభిప్రాయం,

    తేది: May 26, 2007 సమయము: 12:36 am

    ప్రసాద్ గారూ! మీరు ఇచ్చిన ఈ రెండు వివరణల్లో రెండవ వివరణ వివరణాత్మకంగాఉంది. మీ కష్టం చూస్తే గుండె తరుక్కుపోతూంది. మీరు ఇలాగే మీవ్యాఖ్యానాల్ని సాధ్యమైనంత వివరంగా వ్రాస్తే నాలాంటి చాలామందికి బాగా అర్ధమౌతుంది. ‘నేను ఇంతవివరంగా చెప్పినా ఎవరూ మారడంలేదే ‘ అని మీరు ఆందోళన చెందకండి. మరొకసారి ఇలా కష్టమైన పని చేయబోయేముందు నా మనవి వొకటి ఆలకించండి. మనుషులు వివిధ కారణాల వల్ల వివిధ అభిప్రాయాలు కలిగివుంటారు. ఉదాహరణకు చాలామంది ఉద్యోగులు లంచగొండులు.వారు బాగా చదువుకొని , మంచి దైవభక్తిగలవారై (వివిధ మతగుర్తులు గలిగి -పెద్ద బొట్లు,అరగెడ్డాలు, సిలువలు మొ|| ధరించి ), గొప్పవారిలా మాట్ల్లాడుతూ లంచాలు అడుగుతారు.మీరు ఎన్ని వివరణలు ఇచ్చినా మారరు.లంచగొండితనం, మందుగొట్టడం, దొంగతనం చెయ్యడం, ఇతరుల ఆస్తి కాజేయడం ఇలాంటి గొప్ప గుణాలతో సంపన్నులైనవారికి మీ చర్చ్లలు ,వివరణలు పనిచెయ్యవు. కొందరిలో ఈ దుర్గుణాలు లేకున్నా వారి మతనమ్మకాలకు వ్యతిరేకమని భావిస్తే దాన్ని వ్యతిరేకిస్తారు. వారిని మార్చడం చాలా కష్టం. మీకేమైనా ఆశ ఉందేమోగానీ , అనాధ గారు (’అంబా ‘ అంటే వారికి నచ్చదేమో.)మారుతారని , నాకు లేదు.

  40. Pradeep అభిప్రాయం,

    తేది: May 29, 2007 సమయము: 7:03 am

    బిడ్డలను మంచి పౌరులుగా తీర్చిదిద్దటానికి తల్లిదండ్రులకు శిక్షణ అవసరం అని నా ఉద్దేశం. వంటింట్లో చాకిరీ చెయ్యటానికి మాత్రమే స్త్రీ జాతి కాదు. స్త్రీ, పురుషులకు సమానమైన హక్కులు ఉండాలి. పెళ్ళి చేసుకున్నంత మాత్రాన వాళ్ళను వంటింట్లోనే బతకమనే హక్కు ఎవ్వరికీ లేదు. దీన్ని స్త్రీవాదం అంటారో లేక మానవత అంటారో మీ ఇష్టం.

  41. Vani అభిప్రాయం,

    తేది: May 31, 2007 సమయము: 10:57 pm

    అసలు ‘తల్లుల కే శిక్షణ’ ఎందుకు? అనే ప్రశ్న ఎవరూ వెయ్యడమ్ లేదు.కనడము, పాలు ఇవ్వడమ్ తప్ప, ఇంక ఏ విషయము లో కూడ ఆడదానుకి, మగవాడికి తేడా లేదని నా అభిప్రాయము. I think this point has been completely side lined in this discussion. Mr Ambarnath’s article is extremely condescending, and seems to suggest that the the entire responsibility of raising children is the onus on mothers. If some people are saying that, well he didn’t say anything about the fathers, isn’t that precisely the point.. why did he not say anything about training of fathers? I think most of the fathers are woefully ignorant ( by design in most cases) about raising children, and taking responsibilities ( if this generalization hurts, well you can imagine how the most-modern-women-maybe-bad-mothers generalization can also hurt!!) The job of a father doesn’t end after pulling out, and most men tend to actually behave that way. It would have been much more graceful of that person, if he wrote an article on how fathers should be trained, so that there will not be a need for a single ‘celebrate-the blighted-mother’s day’ in a year, but every single day could be one.

    are there women who are unable to raise their children well? ofcourse. are there men who are not discharging their duties as fathers? you betcha!! it is not the feminism that is ripping the families apart by turning women into bad mothers, it is the inability of men to cope with the changes and expecting their wives to be mothers(of them and their off spring). ofcourse, in this globalized economy, we want wives also to earn, but at the same time be a good mother, good wife ( be trained in all wifely duties), good cook, earn well and be atleast of ‘wheatish complexion’ from a home of ‘traditional values’!!! We are inherently bipolar wanting both modern gizmos and traditional outlook at the same time. we don’t demand that our culture is deteriorating because men are not wearing ‘dhoties’ but it is surely going down the drain because, women shun sarees !!

    If men understand the feminism well, they would actually support it. Feminism is shattering of gender-bound roles. it applies equally to men as well as to women. There are lot of pressures on a man to be ‘a man/macho’ etc, which can be as debilitating as the pressures on women are! why would men still try to create the niche area of motherhood? when do we make the transition from thinking in terms of ‘motherhood’ ‘fatherhood’ to ‘parenthood’?

    Bottom line is: don’t men need training ( first how to talk/treat/behave with women and then how to raise children?).

    -Vani


  42. తేది: June 26, 2007 సమయము: 3:01 pm

    [...] తల్లుల్ని తయారుచెయ్యాలి నా బ్లాగుపై వచ్చిన సమీక్షలు [...]

  43. vasu.B అభిప్రాయం,

    తేది: May 14, 2008 సమయము: 5:59 am

    ప్రసాద్ గారు,
    అంబానాథ్ గారి వ్యాసం చాలా దారుణంగా, ఆడవాళ్లని కించపరిచేది గా ఉంది. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.మూర్కులని వదిలేయండి! అంబానాథ్ వ్రాసిన దిక్కుమాలిన వ్యాసానికి మీరు చాల శ్రమతో వివరణ ఇచ్చారు. టెర్రరిస్టులని కూడా సమర్ధించే వాళ్లు ఉన్న ఈ సమాజములో, స్రీవాదం, మాతృత్వం లాంటి సున్నిత విషయాలు చర్చించాలంటే నిస్పక్షపాతమయిన మంచి మనస్సు వుండాలి.చెత్త పోర్నో సైట్ లలో ఇన్సుస్ట్ కథలు చదివి ఉత్తెజితులయ్యే వారి ప్రవర్తనకి అంబానాథ్ వ్యాసాన్ని సమర్ధించే వారికి పెద్ద తేడాలేదు అనుకుంటున్నాను.ఇక్కడ వ్యక్తిగత స్వేచ్చ,బ్లాగుల స్వేచ్చ లాంటి డొంక తిరుగుడు ముసుగేసుకున్న వారి అడ్డగోలు సమర్ధనలు చూస్తే …. ఏమయింది వీరికందరికి అనిపిస్తుంది.నాకు తెలిసి ఏ అమ్మ స్వార్ధముతో పిల్లలని పెంచలేదు, స్రీకి శిక్షణ కావాలనుకునే ముందు మనకు అవసరము(మగ వాళ్ళకి ) లేదా అని ప్రశ్నించుకోవాలి కదా?
    స్రీకి పిల్లల మీద ప్రేమ,భాద్యత ప్రపంచములో ఏ దేశమువారికి అయిన సహజసిద్దంగా ఉన్నాయి,ఉంటాయి కాబట్టే, విడాకులు తీసుకున్న సంధర్బములో కోర్ట్ వారు స్రీలకే పిల్లల బాద్యత ఇస్తారు.అంటే ఒక రకంగా పిల్లల పట్ల బాద్యతలలో మొగవారు విఫలమయినట్లే కదా.కావున ముందు ఆడవారికి అని కాకుండా స్రీ,పురుషులు ఇద్దరికీ శిక్షణ అవసరం.

  44. ప్రసాద్ అభిప్రాయం,

    తేది: May 17, 2008 సమయము: 1:05 pm

    వాసు గారూ,
    ఇది ఏడాది క్రితం జరిగిన చర్చ!

    నా వుద్దేశ్యం కూడా అదే! తల్లులకి పిల్లలమీద శ్రద్ద, ప్రేమ అన్నవి తండ్రికిలా గాక సహజసిద్దంగా ప్రకృతి నుంచి వచ్చినవి అని.

    ఎక్కడో అక్కడక్కడా కొంత మంది తల్లులు బిడ్డలని ఛుడకపోవచ్చేమో గానీ అధిక శాతం మంది తల్లులకు ప్రేమ సహజసిద్దం అనేది నా వాదన.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  45. కె.మహేష్ కుమార్ అభిప్రాయం,

    తేది: July 16, 2008 సమయము: 1:43 pm

    కూడలిలో ఈ రోజు ఏదో లంకె దొరికితే ఇలా వచ్చి ఈ టపా దానికి సంబంధించిన చర్చ చూసా…హమ్మో! యమా హాట్ గురూ!!

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో