మన రాతా? విధి వ్రాతా?
మనము అంత క్రూరులమా అనిపిస్తోంది. ఎందుకు అంటారా, లేకపోతే ఎందుకు మనలో కదలిక లేదు? ఎందుకు ఎటువంటి చర్యలూ లేవు? అధిక జనాభా ఒక కారణం కావచ్చు. అయితే మాత్రం ఇంత నిర్లక్షమా? మన దేశములో వున్నన్ని మరణాలు రోజుకు ఇక ఏ దేశంలోనూ లేవేమొ అనిపిస్తా వుంది. ఈ నిర్లక్షము ఒక ప్రభుత్వాలదే కాకుండా మన వైపు కూడా చాలా వుంది. లేకపోతే రోజుకు ఎన్ని వందలు వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నా కొంచము కూడా చలనము లేదు. మొన్న బి.బి సి చానల్లో చెప్పిన ప్రకారము మన దేశం లోనే అదికంగా సం.కి 90 వేల మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారంట. ఇందులో మన రాష్ట్రానిది ఒకటో ర్యాంకేమొ అనిపిస్తుంది.
లేకపోతే ఎన్ని మరణాలు, ఎన్నెన్ని మరణాలు రోజుకు ? అయ్యో!!! ఇందులో ఎంతమంది వున్న ఒక ఆసరానూ కోల్పోయి రోడ్డున పడుతున్నారో లెక్కే లేదేమొ అనిపిస్తుంది. ఇది అంతా మనము, ఈ చెత్త ప్రభువులు “వారి కర్మ వాళ్ళు అలా చచ్చారు” అని ఊరుకుంటున్నారే తప్ప మరి ఏమి పట్టదా మనకు?
దీనికి సవాలక్ష ఉదాహరణలు.
గత సంవత్సరం మురుగు కాలువలో పడి నాకు తెలిసి నలుగురు ఒక హైదరాబాదులోనె మరణించారు. అది వారి కర్మా??
ఇక బోరు గుంతల్లో పడి మన ఒక రాష్త్రంలోనె ఈపాటికి ఐదుగురుకంటె ఎక్కువే మరణించి వుంటారు. ఇది ఎవరి కర్మ??
ఇక రోడ్డు మరణాలకు వస్తే మరీ దారుణం, ఇందులో ఎంతమంది తమకు వున్న ఒక్క దిక్కును, ఆసరాను కోల్పోయి దిక్కులేని వారిగా తయారు అవుతున్నారో లెక్కేలేదె? దీనికి అడ్డుకట్ట వేయవలసిన ప్రభుత్వాలు అలాచెయ్యకపోగా పరోక్షంగా సహకరిస్తుండటం సిగ్గుచేటు, సహకారం ఏమిటి అంటారా? మన రోడ్ల పక్కగా చూడండి. ఆ చుట్టుపక్కల జనాలు తిరగని ప్రదేశంలో కూడా మందుషాపులు దర్షనం ఇస్తాయి. మరి ఇవి ఎవరిని వుద్దరించడానికో?
ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా పటిస్టం చేయవలిసిన డ్రైవింగ్ లైసెన్సు విధానాన్ని మరి దారుణంగా గాలికొదిలేయడం. ఆపైన దారులపై శ్రద్ద ఇక చెప్పక్కరలేదు.
ఇక్కడ ఒక ఉదహరణ. అది కడప-బెంగుళూరు దారి మీద కడప పట్టణానికి అర కిలోమీటరు కూడా వుండదు. పేరు మూలవంక బ్రిడ్జి. ఇది ఎన్ని ప్రాణాలను బలి తీసుకుందో లెక్కలేదనుకోండి. ఎప్పుడన్నా ఆ దారిన వెళ్ళండి, ఖచ్చితంగా ఒక పడిపోయిన వాహనం మరియు నెత్తుటి మరకలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఒకటి కంటె ఎక్కువా కనిపిస్తాయి. కాని ఏమి చేయలేని నిస్సహాయులు మన నాయకులు…చక్కగా రోడ్డు వేయడానికి ఏ ఆటంకాలు లేవక్కడ! ఇలాంటి రాక్షస మార్గాలెన్నో, ఎన్నెన్నో. ఇందులో బలయిన వారు కొందరు, వారిని కోల్పోయి ఇంకా బలి అవుతున్నవారు చాలామంది. ఇందులొ మావూరిలోనె కొన్ని కుటుంబాలు.
కూతురును చూడడానికని వెళ్ళి మార్గం మధ్యలో అలా వెళ్ళిపోయాడు. వీళ్ళేమొ కూతురు వద్ద వున్నాడు అనుకున్నారు. చనిపోయిన 14 రోజులకు తెలిసింది. తరువాత అతను పోయాక వారి కుటుంబంలో చాలా మార్పులొచ్చాయి. కొన్ని జీవితాలే మారిపోయాయి. ఇంకా ఇలా ఎన్ని జీవితాలు మారిపోతున్నాయొ?????
ఇంతకంటే దారుణంగా బలి అయిన ఇంకో కుటుంబం వుంది. తనకు ఒకరి తరువాత ఒకరు ముగ్గురు పెళ్ళాలు అలా చనిపోతుంటే చేసుకున్నాడు లెండి. చివరికి నాల్గవ పెళ్ళాము బతికుంది. అలాగే ఒక కొడుకు కూడా పుట్టాడు. అల్లారు ముద్దుగా ఒంటికి మట్టి అంటకుండా పెంచాడు. ఇంక తను కూర్చొని కొడుకుపైన ఆధారపడే వయసులో వున్న ఒక్కకొడుకుని పొగొట్టుకున్నాడు. ఇక వారికి అన్నీ కష్టాలె. కూలికెల్తే గాని గడవని బతుకు. ఇంకా ఎన్నాళ్ళు వెల్తారు కూలికి?
ఇందులో మన పాలకుల పాత్రే కాకుండా మనది కూడా చాలానే వుంది. మ్యాన్‌హోలు మూతలు తొలగించడం అయితేనేమి, సిగ్నల్ రెక్కలు తొలగిచడం అయితేనేమి, బోరు గుంతలు పూడ్చక పోవడం అయితేనేమి. ఇక మనవాళ్ళు రోడ్డు దాటుడు చూడాలి, అబ్బో వద్దులెండి.
మొన్న పెళ్ళి అయి కాళ్ళ పారాని ఆరకముందే మరణం! నిన్న పెళ్ళికి వెళుతూ మరణం! ఇంకా ఎన్నో!
వీటిలో రోడ్డుపైనే ఆపిన వాహనాలని గుద్ది చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళు కొంచము రోడ్డు పక్కగా వదలరు. అలా వదిలారు బాగుంది, కనీసము సిగ్నల్సు వేసి వుంచచ్చు కదా అదికూడా వేయరు. ఎప్పుడు మారతారో ఏమొ!
మలేసియాలో పెద్దగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటరు. జీబ్రా క్రాసు వద్దే దాటుతారు. కాని మన వాళ్ళు ఎక్కువగా బ్రిక్ ఫీల్డ్స్ అనే ఏరియాలో వుంటారు. ఇక్కడ మాత్రము మన బుద్ది పోనిచ్చుకోలేదు. అందుకే మొన్న ఆమధ్య పొలీసులు వచ్చి అలాదాటే వాళ్ళకు ఒక్కొక్కరికి 50 మలేసియా రింగెట్లు జరిమానా వేశారు. అంటే దాదాపు 600 రుపాయలు పైనే.
– దిలీప్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








తేది: May 17, 2007 సమయము: 4:28 pm
“వీటిలో రోడ్డుపైనే ఆపిన వాహనాలని గుద్ది చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.” ఈ విషయంల పూర్తి నిజం లేదని నాకు అనిపిస్తుంది… అవసరాన్ని బట్టి పోలీసువాల్లు రిపోర్టులను అట్ల రాసున్నరు. ఈ మధ్యనే నా అన్న ఒకడు ఇట్లనే చనిపోయిండు ( http://japes.wordpress.com/2007/03/08/life_fate_or_just_a_coincidence ఈ చావులో మందు మహత్యం 101% ఉందనుకోండి). రొపోర్టుల “ఆగి ఉన్న DMC ట్రక్కును గుద్దారు” అని FIR ల ఉంది.., కని ప్రత్యక్షంగా చూసిన వాల్లు చెప్పేదాన్ని బట్టి ఆ DMC ట్రక్కును ఆక్సిడెంటు అయినప్పుడు ఆగి లేదు.
ఇంక అసలు విషయానికి వస్తె… అమెరికన్ సిస్టమ్ ల “primary, high school” లకు బడ్జెట్ కేటాయింపులు లేకుండా చేసి “private prison industry”ని fund చేస్తుంది… మన దగ్గెర దానికి బదులు ఈ “బ్రాండీ దుకాణాలు” … (offcourse.. USల ఈ మందు దుకాణాల phase 100 ఏళ్ళ కిందనే దాటిందనుకో). సిగ్గులేని ప్రభుత్వాలు revenue సాకుతోటి ఇంకా లైసెన్సులు ఇస్తుంటె, ఒక పౌరుడిగ మనం చెయ్యగలిగింది ఏమి లేదా?
తాగే అలవాటు తోటి ఉద్యోగం, భుక్తి, ఆరోగ్యం చెడి పోవడమే కాకుండ… వ్యసనం, గృహ హింస, నేరాలు ఇంకా ఎన్నో నష్టాలు వస్తాయి… తాగేవాడు కటిక దరిద్రుడైనా సరే, కోట్లకు పడగలెత్తిన రారాజైనా సరె. 20 ఏల్ల కింద ఇట్లాంటివి గమనించి junior college , graduate students వారానికో సారి వాల్ల పక్కన ఉన్న ఊర్లకు వెల్లి.. ఊర్లకు ఊర్లు తాగుడుకి దూరం చేసింరు. 1984 తరువాత మధ్యనిషేదం అని నాలుగు రోజులైనంక ఎత్తేసి ఒక చేత్తోటి 2రూపాయలకు కిలో బియ్యం ; అయ్యో రెవెన్యూ పోతుందని ఇంకో చేత్తోటి ‘తెలుగు వారణి వాహిని’ పంచె అన్నగారు… ఆ తరువాత వచ్చిన అల్లుడుగారు.. డాక్ట్రరు గారు.. అదే బాటల ఒకరిని మించి ఒకరు లైసెన్సుల పంపిణీ చేయబట్టె. ఊర్లకు పొయి వేరె వాల్లని educate చేసుడు పక్కన పెడితె imported మందును glamourise చేసి మరీ మన మార్కెట్ లకు వదులుతుండె ఇంక పౌరులు పక్కోడిని ఏమి ఉద్ధరించేది…
మార్పు ముందు మనల మొదలయ్యి… మన ఇంట్ల.. మన వాడల.. మన ఊర్ల… వచ్చి అట్ల వ్యాప్తి చెందాలె… i guess i’m asking for too much.